– దూడల సాలమ్మ (ఖిలాషాపూర్‌) 

బిడ్డకు పెండ్లిజేసిన. సికిందరబాదకిచ్చిన, పట్నం. యిగ ఒక కొడుకేమొ బెల్లంపల్లిలుంటడు. ఆయిన బొగ్గువాయిలకువోతడు. ఆయినకు ముగ్గురు కొడుకులిద్దరు బిడ్డలు. వాల్లబిడ్డల్నేమొ ఆయినే సాదుకునె. నాకేమొ కాలురెక్కలన్నిరిసి కుప్పవెట్టిరి (ఏడుస్తూ) నన్నవరుసాదాలెజెప్పు… ఎవరుంటేంది వాల్లబతుకు వాల్లేబతుకవట్టిరి. నిన్నెవరు వొమ్మన్నరాంటరిప్పుడు సాదమంటె… నిజమా! అబద్ధమా! నువ్వెందుకువోయినవు, యేం సంపాయించుకున్నవు, అంటరు. కొడుకులంటరు, కోడండ్లంటరు. ఎన్నో దరకాస్తులు పెట్టిన్నండీ – ఎన్నో ఫారాలు వచ్చినయి ఇందిరాగాంధి కాడికి గూడవోయినయి. కాని పైకం పంపించటంలేదు. ఎక్కడ వడగొట్టిన్రో, ఎక్కడేసిండ్రో. రజాకర్లకు రెండు సంవత్సరాలముందుగా నా పెనిమిటి జరిగిపోయిండు. ఇంతింత పిల్లలు, రజాకర్లటైమప్పట్నుంచి యింతకాలందాక వుంటిమిగని ఒక్కపైసపంపించటం లేదు. యెవ్వలు జేత్తమంటె వాల్లకే యిచ్చిన పైసలు. గింత యీడుకొత్తి, కట్టెవట్టుకోని లేసెటట్టయితి – మీరింత దూరమొచ్చిన్రెందు కొరకు? అయ్యా! యిటుకెల్లిమస్తుగున్నరు. మన జిల్లాలల్ల యెవరూ పాల్గొనలేదు. యెవరూ ఒక డబ్బెత్తినవాండ్లు గాలేదు – యెమిలేదు యిండ్లూ, ముంగిలీ ఇంక జెప్తున్నది – బాగా చరిత్ర. దోపిడికాన్నుంచి జేసిన్రు, యిండ్లు దోపిడీ జేసుకపోయిన్రుదెల్సా.

నాది నవారుమంచముండె, పట్టెమంచం దానిమీద పరుపు మాసంసారం మాదిరి గుండెనాది – కమ్యూనిస్టోల కన్నంబెడ్తే, అన్నంబెట్టినవు వాండ్లనుజూపెట్ట మన్జెప్పి నన్ను యిన్నింసలువెట్టి, సంకలకింద తాల్లుగట్టి, నీల్లుజల్లి, కిందసుత కట్టెలుగట్టి, పెండ పెండకుదురుగట్టిట్ల వీటిమీద నిలబెట్టిన్రండీ. కాల్లు చెక చెకలు గదనాయి (ఏడుస్తూ). బాగలేకుంటయిపోయిన గన్నింసలువెట్టిన్రు.

బిడ్డకు పెండ్లిజేసిన. సికిందరబాద కిచ్చిన, పట్నం. యిగ ఒక కొడుకేమొ బెల్లంపల్లిలుంటడు. ఆయిన బొగ్గువాయిలకు వోతడు. ఆయినకు ముగ్గురు కొడుకులిద్దరు బిడ్డలు. వాల్లబిడ్డల్నేమొ ఆయినే సాదుకునె. నాకేమొ కాలురెక్కలన్నిరిసి కుప్పవెట్టిరి (ఏడుస్తూ) నన్నవరుసాదాలెజెప్పు… ఎవరుంటేంది వాల్లబతుకు వాల్లేబతుకవట్టిరి. నిన్నెవరు వొమ్మన్నరాంటరిప్పుడు సాదమంటె… నిజమా! అబద్ధమా! నువ్వెందుకువోయినవు, యేం సంపాయించుకున్నవు, అంటరు. కొడుకులంటరు, కోడండ్లంటరు.

ఆయన రజాకర్లకు రెండుసంవత్స రాలముందే సచ్చిండు. నాకీజ్ఞానమెక్క డుండెగప్పుడు. తండ్రి సచ్చినవోతున, యేడునెల్లోడు. యాదగిరన్నాయిన సిన్నాయినె. నన్నింసలువెడ్తె యింతబ్బాయినెత్తుకోని, యిగ ఈ పోరాటం చెరల వడి ఇక్కడసచ్చే బదలు, యిగ ఆటాంకనేయెల్లిపోతమానె అనెల్లిపోయిన. ఒక పిల్లగాన్ని మాయమ్మ గారింటికాడిడిసి పెట్టిన. మాదారం మా తల్లి గారు. పిలగాన్ని సంకలెత్తుకోని, వచ్చినపేరు రానేవస్తది – సంగమంటె సంగంలసాదించి దుమ్ముతోని యెల్లిపోవాలె. పుట్కపుడ్తె మంచిబలంతోని వుండాలె, బుజాబలం.. మనది. వో… అడుగరాదు. వీల్లందర్ని దెల్సుకో బుద్ధి…. బుద్ధి నాకెట్లొచ్చిందో మల్లిండ్లకెల్లి. వీల్ల యీకాంగ్రేసత్మాచారా లెట్లుంటయనుకున్నవు. ఎండ సూర్యుడు మెరిసినట్టు మెరిసె, ఆదాన్లకెల్లి నా జీవితం కాపాడుకుంటవొచ్చిన – యిన్నవా!

ఇదే అమీన్‌కచ్చీర్లున్న, సంమత్సర ముంచుకున్నరు. ఒక్క సమ్మత్సరం అన్నంబెట్టినవని పట్టుకున్నరు. ఎందుకన్నంబెట్టినవంటరా! మీరిప్పుడెందు కెల్లిన్రు. నువ్వెందుకొచ్చిన విప్పుడు – నాకర్థమొత్తది. మహిళాసంగంల ఆడవాల్ల మీదనే నామనసు పెట్టుకొని తిరుగు తననుకున్న, మీకన్న అచ్చరమొచ్చింది, సదువుగని… నేను గీ బర్లుగొట్టుకొని బతికిన్దాన్ని. బుజాబలంతోని కమ్యూనిస్టంటె సాదించితీరాలె! గట్క, గంజి, మంచినీల్లు. పోరాటానికి పిట్టను గొట్టటానికి గూడ అధికారంతోని, బలంతోనున్న నేనప్పుడు. అయిదడుగులు కొలిసిపెడ్తె దుంకిన బద్దం ఎల్లారెడ్డితోని యెల్లిన. నల్ల నర్సిములు, బద్దం యెల్లారెడ్డి, అనంతపురం మాసెర్ల యాదగిరి, శీలం సర్వయ్య, చీటకొండూరు రామిరెడ్డి, ముకుంద రెడ్డి, సిద్దెంకి నర్సిమ్మరెడ్డి – ఏనాయకుడు గింత కంపిని (కంప్లెయింట్‌) వెట్టరా కుంటదిరిగిననేను పార్టీల చేసిననేను సేవ. ఏమేంజేసినవంటె అప్పటి చెరల్ల వుంటది – బీదకు. నాకు గుర్తున్నమందం సాయపడ్డ. కాని నానుంచి ఏమయితది వాల్లకు నేను సాయమిచ్చిన. దోపిడి దొంగలు యెక్కడ పుట్టనిత్తరని ఇయ్యవోయిన.

వాల్లతో పాటు దలసభ్యురాలిగయెల్లిన. అంతే ఇగ నాయిల్లె దోపిడి జేసిన్రు, దీస్కవోయి దొడ్లల్ల వెట్టిన్రు. నాదిమొండిబతుకుగాకపోవు! నాయం పద్దతెంబడి నడుసుకుంటొస్తె మల్ల ఈషాపురం రాగల్గిన. అప్పుడయితె మా మావను, అత్తను సుండు సుండు గుద్దిడిసిపెట్టిన్రు. మా అన్నయితె నన్ను గురించె సచ్చిండాలేద? నిజాంబాదజైలుకు దీస్కపోయిన్రు మా అన్నను. సెల్లెను గిట్టెందుకుజేస్తరంటె… వీడు పక్క కమ్యూనిస్టోడని పట్కపోతనే వున్నరు, వాన్ని మా అన్నను. దానిదెబ్బలవల్లనుంచె మా అన్న గూడ మరణించిండు. ఆయన రికార్డుగూడ జనగామల కప్పివెట్టిన్రు, కడుమదొంగలు. యెల్లనియ్యలే దాన్ని యివుతలకు. యాదారం బల్లెరామలింగమని అనంటరు. ప్రజల దెల్సుకుంటెగూడ జెప్తరు. అన్ని చెరలున్నయి, అప్పటి చరిత్రలు….

అప్పుడు యెక్కడెక్కడిపని, యెక్కడెక్కడిపల్లెలని జెప్పమంటరండీ, ఏంజెప్పమంటరు… యెన్నేండ్లాయె…. అయ్యో…. రామ… యెన్నేండ్లాయె, యేండ్లు గడువలేదండి! అక్కిరాజిపల్లె, బైరాంపల్లె, గోపరాజపల్లె, మద్దూరు, సలాకపురం, అమ్మాపురం, పోతురెడ్డిపల్లె యిగ బచ్చన్నపేట, సిద్దెంకి… ఈ… యివన్ని పల్లెలుసల్లగుండ, ఈ సుట్టుపట్టు ఈ… గొల్లబాగమట్లు అన్ని దిరిగిన. ఇగవాల్లు గద్దలువోయినట్టు వోదురుగద నువ్వేజెప్పు… జెప్పు, గద్దలురికి నట్లురుకుతరుగద దలంల. దలంల్నేనాయె. అయ్యోరామ యిగంతొట్టిదే నా బతుకు! యింత కష్టాలువడుతుంటెవాండ్లు బాదలుతాళలేక నన్ను పట్టుకెళ్ళి పోయిన్రు. ఈ యింసలిక్కడెందుకువడాలె, మనసంగల పోదాంపా అన్జెప్పి… ఈ… వున్న మగవాళ్ళంతగల్సి యెల్లిపోయినం. గుజ్జుల ఈరయ్య, నేను కుద్దుగ షాపురంలకెల్లినోల్లం మేం. ఆడమనిసిని నేనొక్కదాన్నెల్లిన, ఈ సంగంల, మేం గౌండ్లోల్లం – నా పేరు సాలమ్మ – దూడల సాలమ్మంటె గజ్జున ఒంటేలు వడ్డదొక్కొక్కల్లకు. నేనట్ల పోరాటంజేసి తీరినాగని నాకొక్కరాగిపైన మంజూరు లేకపాయె. ఈ పోరాటంజేసేమి, కూలవడ్తన్న గంతేలెక్క, ఏంలేదిగ. మందన ఆవులేదు, బొందన రూపాయల్లేవు. మెడమీదకంటె, రాగిపుత్తెగూడలేదు నా బత్కుకు. నా సీతలకష్టాలు జూడు. ఈ బూమ్మీదవడి యేడ్సుకుంటున్న….

మాదలంల సానపెద్దనాయకులుండె. నేన్జూసిన నల్ల నర్సింలు, బద్ద మెల్లారెడ్డి, చీటకొండూరు రామిరెడ్డి, పిట్టల నారాయణ, పెరుమాండ్ల యాదగిరి, శీలసర్వయ్య, మసి మల్లయ్య, ఇంకా అందరుండె. ఇదే కేశవరావుగడీల్నే కొట్టిన్రండీ. ఆయనకింగ్లీసొస్తదటగని తెలుగురాదు మనమాట రాదన్నమాట. మామాట రాదన్నమాట, అయితే, వాల్లను జూపియ్యకపోతే ‘మాకెలౌడె తొండల్దాడగాలె’ అంటున్నడు. మాటలంటె కొద్దికొద్దిగ అర్థమయితాంది నాకు. నేనేం జెప్పాలె. ఏమొగిట్లంటడు ‘తొండలు’. ఈయనకేం జెప్పాలనేను. నాజిమ్మల వల్కిచ్చుకుంట నేవున్న. కుదార్తమైతనే వున్నది ఏమనాలె వీల్లను. తలదాకొస్తె మొలదాకజేత్తనేవుండాలె. ఈ పటాంల నేను బాగుంటిని. గిట్ల నాలుగుమూర్లు కొలిసిపెడ్తె దునికెటట్లు గుందు. గట్ల ఈడులో ఉన్ననన్నమాట. నాకిద్దరే పిల్లలు. నా సంసారంగూడ మంచిగుండె. ఇంటిలోపల బిందె, బాసన్లు, మంచాలు నానా విదంబులున్నటువంటి సంసారం. నా తలకట్టు బాగింతుండె – నన్ను పట్కపోయిన్నాడేమయ్యింది. పిలగాడు బైలుకొస్తున్నదంటున్నడు. సుట్టు పది పన్నెండు గంటలరాత్రి వరకు…. మిలిట్రి గహరా ఏసుకున్నరంట. ఇదే గ్రామంల. ఒకెయ్యిమందిని కూడగట్టి అన్పిస్త ఈ మాట. ఇట్ల సుట్టుముట్టడేసినమాట తెల్వబట్టె. ఇద్దరుపిల్లలు కూనమ్మగుడ్లె. నేనైతె మంచంపైనవండుకున్న. నెత్తికి మెత్త, పిలగాడు నేను. మెల్లంగ దుప్పటిగప్పిన – ఇప్పుడయితె కరెంటుగని అప్పుడు లేదు. అందరాడ్కలు చెంబట్కపోయేటోల్లు గుసగుసలు గుసగుసలు, ఈమెని పట్కపోతరంట, కమ్యూనిస్టోల్లకన్నం బెట్టిందని తెలిసిందట. అంటె కట్టుబట ్టల్తోనెల్లిపోయిన. నా బాసండ్లెటువోయెనో, నా సంసారమెటువోయిందో. ఈ మిలట్రిఓల్ల చేతుల్లజిక్కిన్నంటె నీకు యమపురి దొరికినట్టె. ఇగ నా కొడుకులకి జల్మాన దొరుకది…

కమ్యూనిస్టుల పేరుదెచ్చుకున్న ట్టాయెనా కొద్దిరోజులయిన నేను అడివి పాలెల్లాలె. నేనెల్లిపోవాలన్న షెర్తువెట్టుకొని ఈ పిలగాన్ని దీస్కున్న ఒక సెంబు దగ్గర వెట్టుకున్న, బైలుకుపోయె సెంబు వట్టుకున్న… బైలు లేదు, బండల్లేదు. దర్వాజులు కుల్లఇడిసిపెట్టిన కతం గంతదూరమున్నది మాదిగోల్లిల్లు. ఒక సేతుల పిలగాన్ని, ఒక సేతుల సెంబవట్టుకున్న ధనాధనా పోతనేవున్న. ఇక్కడొక మేదరోల్లిల్లున్నది. సెంబు ఆ యింట్ల ఇసిరేసిన ఆన్నించి గోడమీది కెల్లి అవుతలవడదుంకిన. శిరిశైలమని ఉన్నడు, ఇప్పటికున్నడు. ఆయనేమన్నడు – ఈ సాలమ్మను వట్టియ్యకపోతె నేను మీసంగొరిగించుకుంట అని షెర్తుగట్టిండట, ఊ… కొడ్క నీకు దొర్కనేను అనుకున్న. ఆడంగవడ దున్కి… మాదిగామెది పిడ్కలగుచ్చుండె. ఆ గుచ్చెసందున గూసున్న. ఆ మదిగోల్లిద్దరున్నరు. ఇద్దరాలుమగలు. ఇగ గుచ్చెలగిట్ల కూసోవెట్టిన్రు. పిడకల్ని పేర్సిన్రు. నెత్తింతదీసి గట్ల మొకంనిండ గిట్లగప్పుకున్న. నాది మంచిచీరనేవుండె. అద్దీసి సాన్పుజల్లేది, అలుకుకుండలవెట్టి ఆమెది ప్యాదరికంలున్నది, పాతగుడ్డొకటిస్తె అది నడుముకు గట్టుకున్న. ఆ కష్టాలన్నిజెప్తె మీకు మనుసుకురావుగని… ఇగ ఎట్లజెప్పనేను… బైలుకు అండ్లనే పోయిన, పొద్దుపొడువంగ గూసుంటె అయిదు అయిపోయి ఆరున్నరకు…. అప్పడిద్దరు, ముగ్గురు పోలీసోల్లని కావలివెట్టి…. ఇగ దొర్కలే లంజముండ ఇగ మాకెన్నడు దొర్కుతది, ఈ రాజకర్లు…. మల్లపొద్దు వాడిశెటెల్లకు నేనూరిబైట మొక్కజొన్న చేనుకాసింది. ఆ చేన్లకి వోయిన. చీకటైనంక మల్ల కాపలాకి నిలబెట్టిన్రు, వాలంటీర్లని నా కొరకు – ఎట్లవోతది బైటికి ఊర్లనేవున్నది, మాదిగిండ్లల్లనే వున్నది, పెట్రోలువోసి కాలబెట్టాలని అంటున్రట. పెట్రోలంటిచ్చి కాలవెడ్తమంటె ఒకాయనుండె మాదిగాయిన పాపం సచ్చి సర్గమందిండు. జంగరిగాని లింగడనుండె, అన్నడు ఆల్లతో, మీరు కాలవెట్టిపోతే మేంబడ్తంగని, ఈ యింట్ల ఆ లంజెముండ లేదు, ఇగ వాల్లు తిట్టుడే, వాల్లనకపోతే కల్వదుగద. ఆ లంజెముండ ఇక్కడ లేనేలేదు, ఈ ఊల్లెనే లేదు. మా ఇంట్లనే లేదు – ఉన్నదే నేను వాల్లయింట్ల. ఇన్నరా….

ఇగ ఈన్నుంచి ఆ యింట్లకెల్లి బాక్కుంట, బాక్కుంట, బాక్కుంట బైటికెల్లిన. గుంజరోల్ల బాయనున్నది గీన్నె, ఈ బోడు కింద. ఆ బాయికాడికి వోయెటాల్లకు నల్ల నర్సిములు ఎప్పుడో ఖబరుపంపిండు. ఈ సాలమ్మ ఎప్పుడో పట్టు వడ్డది. ఎప్పుడో సచ్చిపోయింది, కాల్చేసిన్రని చెప్పిన్రట. ఇగవాల్లు గన్‌ మిసిన్‌, గిన్‌ మిసిన్‌ ఏస్కోని రానేవొచ్చిన్రు, దలంరానేవచ్చిరి. ఇగ వొత్తె వాల్లతోని యెల్లిపోయిన నేను-ఇగ నేనెల్లిపోయినంక పదుహేను రోజులకు బైరాం పల్లి దాడయ్యింది. ఇగ గివన్ని ఇవరాలు సెప్పటానికి నాకు జిమ్మల్నే వుంటయి. మీరేమొ కలంబట్టుకుంటరు. నా గర్భమందుంటయి. మీరు కలంబట్టినగని ఏం పనియ్యది, నా ధైర్నం పెద్దగుంటది. ఇన్ని బాదలకోర్సినగని నేనొకర్ని గొట్టలేదు, తిట్టలేదు. మంచిమార్గంతోనే వచ్చిన. దుడ్డెంకి ఈరెయ్యని అప్పుడుండె. ఆయన భార్య సత్తెమ్మ ‘నా మొగన్ని నువ్వే సంపిచ్చినవని’ పెట్టింది. కమ్యూనిస్టోల్లే సంపిన్రు. అట్ల నన్ను బైటికిదీసిన్రు.

గట్లదలంల యెల్లిపోయిన. తుపాకయితె ఎన్నడు వట్టుకోలేదు. ఆడమనిసిని గద – దలంల గంతగిదే పనుంటదిగద. సంగంపనంటె ఆల్లను గల్సుకోని, ఈల్లను గల్సుకోని, ఈ పన్లెట్లజేసుకోవాలె, బూములెట్లజేసుకోవాలె. ప్యాదవాడున్నడు, పాద్యవానికియ్యాలె అన్నసు వంటివిజెప్పేది. షావుకార్లమీదనే యెల్లిపోయినం.

ఇగ పిలగాన్ని సంకనేసుకొనే తిరిగేది. యా యెంబడి ఇంతమంది వుందురు గద. అందరెత్తుకుందురు. మనం సోపతిగాల్లంగద. పార్టంటె సోపతే నాయె. ఇగ అందరం కల్సియెల్లిపోదుం. ఎవరివంట వాల్లేపెడ్డుర య్యా! వండి తయారు సెయ్యాలంట ఎవరన్నజేసి ఏన్నో, ఏ సెట్లల్లనో, ఏ గుట్టల్లనో…. ఎక్కడో పాడైదుంగద. అక్కడ్నే అన్నంబెడుదురు. మావోల్లంత దుడ్డెలురికినట్టు ఉర్కుదురు. ఏ నేనెక్కడ వంటజేసిన. నీయవ్వ… వంటపాడుగాను – నేన్జెయ్యలే అవ్వ! నేను ఈ డిరసుమీదున్ననా నేను వాల్లోలెనే దోతిగట్టిన, కమీజు దొడిగిన, చెడ్డేసిన, నెత్తికి రుమాలుజుట్టిన, ఈ పచ్చలుగానరాకుండవుందు. నేను మొగరూప్కంతోనె వుంటిని, ఈ చేతులకేం లేకుంట. ప్రజాసేవన్నది సెయ్యాలె, అన్నబలం మీదున్నది. సచ్చిన్నాడు పుట్టిన్నాడు యాజ్జేసుకుంటరు, కర్మ జేసుకుంటయితె మర్చిపోతరు. అయితె రోజుల్లల్లనే మర్సిపోతరు. ఇది జల్మజల్మాల్తోనె – కమ్యూనిష్టంటె జల్మ జల్మాల్తోనె ఎన్నుపొంటి జొరం లెక్కుంటది. ఆ కోర్కెపుట్టెపడ్కనే నేను అడివికెల్లిన.

అందరం కలిసే వుంటిమి, సాపలేసుకొని, గొంగడేసుకొని అందుట్లే వండుకొందుము. బయమన్పించలె వీళ్ళంతలేరు నా బల్గం! (ఏడుస్తూ) సచ్చినా సరే అనిపోయినం. మన పార్టీల కొన్ని ఒప్పందాలుంటాయి. కమ్యూనిజమంటె మర్మమియ్యమంటె ఇయ్యం అన్నరు. మనల్నిట్లసంపి చీలికలు దీసినాగని – కమ్యూనిజం ఇగోగీడున్నడు, గాడున్నడు పట్టియ్యొద్దన్జెప్పి మా దగ్గరొకటి చాల నిబందన్లు దీసుకుంటరు. చెప్పలేక పోతం, చెప్పరు.

నేను అడివిల పన్నెండు నెలలున్న. ఏమయ్యింది గద! మాదారం మా తల్లిగారని చెప్తిగద! దుడ్డెంకి ఈరయ్యన్నాయిన మా అన్న దగ్గరికొచ్చిండు. మా అన్న తాళ్ళపంటుండె. ఆడికొచ్చి ‘రామలింగం నీ చెల్లె పిల్లలుగల్లదయ్యా అడివిలెక్కడుంటది, యెత్కులాడ్కరా, నీకు అయిదువొందల రూపాయలిస్త’ అని వెట్టిండు, మా అన్నను దోలిచ్చిండు. ఓ… నెలరోజులు నడుసుకుంట పచ్చి కష్టాలువడుకుంట వడుకుంట ఒక దగ్గరికొచ్చిండు. వొస్తె ఒక దగ్గర దొరికిన, మా అన్నకు. గీడ పచ్చాపురమని వున్నది పల్లె. ఆడ దొరికిపోయిన. గక్కడి కొచ్చినమన్నమాట దలం. వొత్తె మరి యెట్లన్న మరి అని నేనన్న – చెల్లే…. నీ పానానికి నా పానమిస్త, నీకిద్దరు రామలచ్మనులోలె కొడుకులున్నరు. నీ యింటిలోపల నిన్ను వెట్టేత్త. నీ యింట్ల నువ్వుండు సెల్లె. నీ కర్సులన్ని…. మా అన్నోల్లకు వెవుసాయాలున్నయి. నీ పిల్లలకు, నీ జీవితానికి పంపుత. చెల్ల నీవు ఆడపిల్లవు. ఎన్నాల్లీ వరున్యవాసంలుంటవు (ఏడుస్తూ) నువ్వు ఖచ్చితంగ యింటికి మాత్రం రావాలె అన్నడు. అంటె… దలం ఒప్పుకోలె, అట్లెట్లయితదనన్నడు. అన్నాగని పోతనన్న. నా కొడుకునుజూడకపోతి గద. రెండు సమ్మత్సరాలయుతుంది నా కొడుకును జూడకపోతి, పోతనన్న. నా పానంబోతెపొయ్యింది. సంసారం ఒదులుకుంటి (ఏడుస్తూ) నేనేం సంపాయించుకున్నది లేదు. మీతోని దిరిగిన వున్న, బుక్కెడుకూర, బట్ట అంతే గని, యింకేంలేదుగదన్న అని వొచ్చిన – వొచ్చి…. యింటిలోపలిట్లుంటనే వున్న. మా వొదిన రొట్టెలు జేస్తాంది ఆడగూసొని, ఓ రొట్టిచ్చింది, కాల్జేతులు గడుక్కున్న. గొంగడి, నాచెయిసంచి అక్కడవెట్టిన, సగంచెక్కిట్లవట్టుకోని తింటనేవున్న. వాళ్ళెంతసేపాయెనో కాపలాగాస్కోని (ఏడుస్తూ) పోలీసులు తిరగనే దిరిగిరి, సుట్టుకోనే సుట్టుకొనిరి. మావిడిసెట్టున్నదిగిట్ల, తాటిసెట్టున్నది, మావోల్లింటి దగ్గరికే, చేతులట్ల దీసిన్రు, గిట్లగట్టిన్రు యిండ్లతాళ్ళేసి – ఈ రెండు చేతిలట్ల వట్టిపిచ్చి యిగొ గీడగట్టిన్రు, గీ కడాలకాడ గట్టిన్రు, గోగినారేసి, గీడగట్టి నీళ్ళుజల్లిన్రన్నమాట, మల్ల ముడిరావొద్దిగ, మావిడిచెట్టుకు గట్టిన్రు ఇగిట్ల. ఏ మాదారమున్నది వాల్లునల్గురన్నలు, పిల్లలు, వొదినలు, మా అవ్వ, మా నాయిన – మానాయన సచ్చిపోలె అప్పటికి అందరున్నరు బల్గం. ఓ నిండున్నరు… కోట్ల జనమున్నరు. అయ్యో… అనువసరంగ రమ్మన్జెప్పి ఈ పకారం జేత్తిమని మా అన్న. ఇగ పెయ్యల్ల కొరుడదెబ్బలు. అవి ఈ మాదిగోల్లు వారి… నవారి అల్లినట్లు అల్లించిన్రు. యింతదొడ్డు. పొరంగట్టె దొడ్డంతున్నది కొరడ. ఒక్క దెబ్బ దిప్తె మూడువరుసలు దిరుగుతుంది అది. అన్ని దెబ్బలు గొట్టేసిన్రు…సరెననుకున్న. కొట్టి ఈడికి గడీలకు దీస్కొచ్చిన్రు. మిల్ట్రి యీడదిగింది. అయిదు వందలుండొచ్చు చిక్కు (సిక్కు) పోలీసు, మసూరి పోలీసు. నేను చిక్కువడ్డది ఈ మసూరి నుంచొచ్చినోల్లతోనే అవ్వ…. ఇగ యెన్నిసంవత్సరాలాయెనో నాకు దెల్వది.

ఆ పోలీసాయినండ్ల, ఆయిన… ఆవుల్దారు సారంటారయన్ను, ఈ దెబ్బ గొడ్తె పట్టుకున్నడాయిన… ఆడికీడికిట్ల తిరుగుతుంటడు. ఠంబానికివెట్టి దెబ్బ గొట్టెటల్లకల్ల… చేతులిట్లవెడ్తంగద ఇట్లనేదిగినయన్నమాట. ఇగొ సయ్యినిట్ల లొట్టవట్తదిసూడు, ఈడికి దిగిందన్నమాట… దిగితే ఆడు తిరిగే సంటరుమీదున్నాయిన వుర్కొచ్చి ఈ చెయ్యివట్టుకోని దీన్నిండ ఈరక్తమురుకుతుందిగద, దివాన్కానంత గిర్రున నిండింది రక్తం. ఇగగింతేవున్నడుగద ఈ పిలగాడు నా యెంబడి.. అద్దద్దద్దదా అని గడంత ఆడలెత్తుతుంది దాన్నిండ. ఇగగప్పుడుర్కొచ్చి అయిన అడ్డలుంగిగట్టినపంచె పర్రునజింపి… అప్పుడు బొగ్గు పొయ్యిలుగద రైలువాయిబొగ్గు వాల్లు జేబుల్లల్ల దీస్కొచ్చి యేసుకున్నరు వొంటలకు. బొగ్గు దీసిన్రు యిండ్లవోసిన్రు అందుకే ఈ కాట్లుజూడు పచ్చగట్లున్నయో ఆ బొగ్గు యిండ్లనేవున్నది. ఇగో ఈకట్టు, దీన్నిండబోసి ఈ కట్టు వెట్టిన్రు. వో… యెడుమచేతదిన్న… యెన్నింసాలు వెట్టిన్రు నన్ను! చాన కష్టాలు వెట్టినాగని ఇగ ఆమె ఇంటిలోపట్ల యిగ నన్నుంచిన్రు. ఒగ మూడుమాసాలదాక. యిదే కేశవరావుదొర గడీలున్నంక, మల్ల మా అన్నలు, మాసెల్లె, మా పెద్దనాయిన కొడుకులు అందరు మేం జైలుకొత్తమన్జెప్పి యేడుసంతకాలువెట్టినంక అప్పుడునన్నిడిపిచ్చి, యిగో యింటి లోపలుంచిన్రు. మా యింటకొచ్చినిగ, వొట్టిగోడలు మా అన్నతూమెడన్ని గింజలువోత్తె దీస్కొచ్చుకోని పట్టిచ్చి, దంపిచ్చుకోని, అప్పుడు దంపుకాలె, ఆ దంపుకం బియ్యం దీస్కోని, అప్పుడు ఈ యిద్దరు పిలగాండ్లను దీస్కోనివాచ్చిన. మాదారంకాడున్న పిలగాన్ని వట్టుకోనొచ్చిన. ఈ పిలగాడు నేను మేమిద్దరమండ్లున్నం.

మరి మేమొచ్చి అండ్లున్నంక, యవరొచ్చిసంపిన్రో, యెవరాయినను సంపిరో, మరిగేమున్నది నా కొంపముంచిందే యీమె ఈ సాలమ్మ, నా కొంప ముంచిందే ఈ సాలమ్మ… ఈ సాలమ్మ గుజ్జులీరయ్య కుజెప్తే ఆయన జంపిపోయిండు…. పట్కరాండి లంజెనంటనే వున్నది. పొద్దువొడ్వనేలేదు. ఆమె పెనిమిటినక్కడ జంపిన్రట. నన్ను తెల్లారెటల్లకు పాయె మిల్ట్రి వట్కపోతనే వున్నది. మల్ల…. యిదేగడీల. పీన్గనేసుకొచ్చిన్రు, గడిముందటేసిన్రు. యిగొ లంజె నువ్వే సంపిచ్చినవె. ముసలమ్మ ఈరయ్య పెళ్ళాం. లంజె సంపిచ్చినవు. అగొ సంపిచ్చినవు. నువ్వట్లగావాలె లంజె నిన్నట్లనేపెడ్తపాడెల, నా మొగన్నొకదిక్కువెడ్త, నిన్నొకదిక్కువెడ్త… అని అగొ ఆమెని గురించి నాకీకష్టాలొచ్చినయి.

ఇగ యింట్లనేవున్న. జనగామనించి సారాసీసాలెత్తుకొచ్చిన్నండీ మడ్తమాను సారమోసిన, దంపుడొండ్లుదంచిన, కూలీనాలీ అంతయెదుర్కున్న. ఈ పోరగాండ్లు బుడ్డబుడ్డ పోరగాన్లేగద. ఒగ పిలగాన్ని యేడోద్దాక సదివిచ్చిన. ఈ వూర్లె రామయ్యగారనుండె మందుల్నూరెతందుకు జీతాలుంచిన. కుండెడు జొన్నలు అప్పుడు, (ఏడుస్తూ) ఆకాలంనాడు. బాగ బాధపడ్డ. నేను సంపాయించి యిండ్ల దిర్గలే. నా జీవితం గింతే అనుకున్న. బాదనిపియ్యదామల్ల. నా బుద్ధి పూర్తమంగొచ్చిన. వాండ్లు పొమ్మన్జెప్పి పంపినోల్లుగాదు గద! గింతనుబవించి. యెవరికి సెప్పుకునేటట్లున్నది. గంతవనవాసముండె. ఈ వనవాసం తెల్లార్చుకోని యిగ నిమ్మలంగ సంసారంలకు దిగిన. నేను యిగ గింత సక్కదనంతోని లేద్దామంటె లేవొత్తలేదు…. దేవుడాని వున్న. యిగ యెవరికేంజెప్ప. ఏ కోడన్లకు జెప్ప, ఏ మానవునికి జెప్పనేను….

(మనకి తెలియని మనచరిత్ర

పుస్తకం నుండి) Pokies

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.