– నర్సమ్మ

నా తల్లి లచ్చమ్మ, తండ్రి పోచయ్య, నాకు ముగ్గురు అన్నలు. గంగయ్య, దుర్గయ్య, నింగయ్య. చెల్లలు – బుజ్జమ్మ. మేము మొత్తం 5 మందిమి. మా ఇంట్లో ఎవరికీ చదువు రాదు. మేము అందరము వ్యవసాయం కూలి పని చేసుకుంటు బతుకుతున్నాము. మా ఇంటిలో నేను మూడవదాన్ని. నేను చిన్నతనం అంటే 7 సంవత్సరాల నుండి గేదలు మేపినాను. తర్వాత 10 సంవత్సరాల నుండి అజ్జిరెడ్డి పటేల్‌ దగ్గర కూలి పని చేసినాను. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనికి 1 రూపాయి కూలి ఇచ్చేది. 10 నుండి 6 వరకు 50 పైసలు కూలి ఇచ్చేవాడు అంజిరెడ్డి. 13 సంవత్సరాలకే పెండ్లి చేసినారు. మాకు గొడవల వల్ల అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. అప్పటి నుండి కల్లు తాగుడు మొదలు పెట్టినాను. రోజుకు 4 సీసాలు తాగుతాను. బాగా పాటలు పాడేదాన్ని. నాకు కల్లు దుకాణం, ఛాయ్‌ హోటల్‌ వున్నాయి. నేను కల్లుకు, ఛాయ్‌కి బాగా బానిసను అయితిని. కల్లు దుకాణం వాళ్ళు నాకు ఉచితంగా కల్లు పోసే వాళ్ళు. మా ఇంట్లో అన్నలు, వదినలు పని చెప్తారని అందరికన్న ముందుగానే బయటపడేదాన్ని. నన్ను అమ్మ మాత్రమే పనిచేయమని తిట్టేది. తిట్టిన వినిపించుకునే దాన్ని కాదు. నా పాటకు కల్లు నా కల్లు నాకు అనుకొని బయటకు వేళ్లేదాణ్ణి. ఇట్లేనే కాలం గడుపుకుంటూ వస్తుండగా ఒకరోజు మా ఊరికి ముగ్గురు కార్యకర్తలు వచ్చినారు. ముందు ఊరు అంత విజిట్‌ చేసినారు. తర్వాత మా ఇండ్ల దిక్కు వచ్చినారు. వారు పిలవడం మొదలు అయ్యింది. అప్పుడు వాడల ఉన్న అందరం ఆడవాళ్లం వచ్చినాము. అందరు వాళ్ళను చూసి ఎవరు మీరు ఎందుకు వచ్చినారు అన్నప్పుడు వాళ్ళు మేము కూడా మీలాంటి ఆడవాళ్లం అని అన్నారు. అప్పుడు మేము మాతోటి మీకు ఏమి పని అని అడిగినాము. వాళ్ళును తిట్టుడు మొదలు పెట్టినాము. బర్రె తోకలోలే జడలు పెట్టుకొని కిందికి సీరలు కట్టుకొని మీరు మాకు సంఘం అని చెప్పడానికి వచ్చినారా. సంఘం వద్ధు ఏమి వద్దు సింగూర్‌ డ్యాంలో పిల్లలను వేయడానికి వచ్చినారు. మాకు సంఘం వద్దు పొండి. పోకుంటే కాల్లు చేతులు విరగకొడతాము అన్నాము. అప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు. మళ్ళ మూడు రోజులకు వచ్చినారు. ఆరోజు కూడా మా ఇష్టము వచ్చినట్టు తిట్టి మీకు మొగళ్ళు లేరా, అని బెదిరించాము. ముప్పుతిప్పులు పెట్టినా రాకడ బందు కాలేదు. రెండుసార్లు వచ్చినా తర్వాత మూడోసారి మేము అందరం మాట్లాడుకొని సంఘం పెట్టుకున్నాము. మా సంఘం పేరు క్రాంతి మహిళా సంఘం అని చెప్పుకున్నాము. 6 మందితో ఉన్నాము. అందులో నేను సభ్యురాలిగా ఉండి ఏ మీటింగ్‌లోనైనా పేరు అడిగితే చెప్పేదాన్ని కాను. మీటింగ్‌లకు పోయినప్పుడు నా నెత్తి బాగ చిక్కులుగా ఉండేది. సీర మీదికి కట్టుకొని నేను రోజు స్నానం చేసిది కాదు. అయి, ఇట్లనే మీటింగ్‌లకు పోయేదాన్ని నన్ను చూసిన కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బ్యాగులో నుండి దువ్వెనతో దూసి జడవేసి వాళ్ళ చేతి నుండి గడ్యారం చేతికి పెట్టి సీర కిందికి కట్టించి. నావంక చూసినారు. ఇప్పుడు నర్సమ్మ సూపర్‌ అయ్యింది అని మురిసే వాళ్ళు. మా మీటింగ్‌లు చూసి లిట్రసి క్యాంపులు పెట్టినారు. యం.ఎస్‌.కెలో చదవడం రాయడం నేర్చుకున్నాను. పాటలు పాడడం వల్ల నాకు డోలక్‌ ట్రైనింగ్‌ నర్సంపూర్‌లో ఇచ్చినారు. డోలక్‌ నేర్చుకుని రేగోడ్‌లో కళాఖాతలు చేసినాను. అదేవిధంగా అప్పుడు నీళ్ళ ఎద్దడి ఉండేది. మంగ బోరింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను. బాగ నేర్చుకుని వేరే జిల్లా నిజామాబాద్‌ సంఘం వారికి ఇచ్చాము. అప్పటి నుండి నాకు ఎవ్వరితో నైనా మాట్లాడే ధైర్యం వచ్చింది. 2000 సంవత్సరంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్నడు ఎక్కనిది రైలు ఎక్కినాను. రైలు పొడవు ఉండడంతో చాల సంతోషం అనిపించింది. మళ్ళీ ఒక్కసారి ఢిల్లీ పోయినప్పుడు అక్కడ పెద్ద మీటింగ్‌లో గవర్నర్‌ భార్య దగ్గర కూర్చొన్నప్పుడు ఇంత పెద్ద ఆమె దగ్గర కూర్చున్నాను అని సంతోషించాను. మీది మోటర్‌ (విమానం) ఎక్కినప్పుడు నేను మహిళ సమతలో వున్నందుకు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి. నేను ఇంత పెద్ద రాష్ట్రంకు వెళుతున్నాను అని అనుకున్నాను. నన్ను చూసి మా పటేల్‌ వాళ్ళు నీవు రైలు ఎక్కినావు, మీది మోటర్‌ ఎక్కినావు అంటే నీదే మంచి అదృష్టం ఇప్పటి వరకు మన ఊరిలో కాని మండలంలో కాని ఎవరు ఢిల్లీ చూడలేదు అని అన్నారు.

అధికారులతో మాట్లాడేదాన్ని. హత్యకేసులలో న్యాయం గురించి మాట్లాడిన, పంచాయితీలో తీర్పులు చెప్పినా! నాలో ఉన్న మంచితనాన్ని గుర్తించి మహిళా సమత స్టేట్‌ ఆఫీసులో కన్సల్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చినారు. ఈ పని చేస్తున్నప్పుడు నాకు చాల సంతోషం అన్పించింది. ఎందుకంటే ఎక్కువగా చదువురాని నాకు మహిళ సమత వారు ఒక దారికి తీసుకువచ్చారు. ఇందులో చేరిన తర్వాత నాకు 11 జిల్లాలలో తిరిగే అవకాశం లభించింది. మొదటి ఫీల్డ్‌ విజిట్‌ నల్గొండ వెళ్ళినాను. అక్కడ నర్సింహుల గూడెంలో సంఘం గురించి మాట్లాడినప్పుడు ఆ సంఘం మెడ్వాక గ్రూప్‌లో సంఘం ఉంది, కాని దాని వల్ల మాకేమో ప్రయోజనంలేదు అని చెప్పింది. అప్పుడు నేను మహిళ సమతకు డ్వాక్రా గ్రూపులకు చాలా తేడా వుంది. దాని ఉద్దేశ్యాలు వేరు మహిళా సమత ఉద్దేశ్యాలు వేరు అని చెప్పినప్పుడు ఏమి రాని నువ్వే ఇన్ని విషయాలు చెప్పినప్పుడు నేను డ్వాక్రాలో లక్షల రూపాయలు తెస్తున్న కాని నాకు నీలాగా చదువురాదు. నేను కూడా బాగా చదువుకొని నీలాగ మాట్లాడుతాను అన్నది సంఘం పేరు కూడా పెట్టుకొని అన్ని సంఘం వాళ్ళకు పాటలు డోలక్‌ ట్రైనింగ్‌ 3 రోజులు ఇచ్చాను. తర్వాత కరీంనగర్‌ జిల్లాకు ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్ళినాను. అక్కడ విజిట్‌లో కోహెడ మండలంలో ఒక్క గ్రామంలో కొత్తగా సంఘం చెయ్యడం జరిగింది. ఇతర సంఘాలకూడా ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసినాము.

తర్వాత నిజామాబాద్‌ జిల్లా విజిట్‌కు వచ్చినప్పుడు గాంధారి మండలంలో సీతాయిపల్లి గ్రామంలో ఒక భార్య భర్తల సమస్యకు తీర్పు చెప్పాము. తర్వాత వరంగల్‌ జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో ఎయిడ్స్‌ ప్రోగ్రామ్‌ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు పాటలు పాడగా వారిలో చాల స్పందన వచ్చింది. మా మెదక్‌ జిల్లాలో కూడా నర్సమ్మ హైదరాబాద్‌ ఆఫీసులో కన్సల్టెంట్‌ అయింది అని కొంతమంది చాలా సంతోషించారు. కొంత మంది ఈర్ష్య పడ్డారు. నన్ను చూసి చాలా సంఘాలు వాళ్ళు చురుకుగా పని చేసినారు. తర్వాత స్టేట్‌ ఆఫీసులో ఫస్ట్‌ఫేజ్‌, సెకెండ్‌ ఫేజ్‌ ట్రైనింగ్‌ అంటే ఏమిటి అని తెలుసుకున్నాను. అంటే మాటలు కలిపి లింక్‌ చేసి మాట్లాడడం ఎలా అని తెలుసుకున్నాను. తర్వాత హెచ్‌ఐవి ఎయిడ్స్‌ గురించి నల్గొండలో ట్రైనింగ్‌ ఇచ్చాను. వరంగల్‌లో ఎయిడ్స్‌ ప్రోగ్రామ్‌ చేసాను. కోర్‌ టీమ్‌ మీటింగ్‌లో కూర్చోవడం వల్ల కోర్‌టీమ్‌లో ఏమి మాట్లాడుతారో జిల్లా రివ్యూ మీటింగ్‌ 11 జిల్లాలకు విజిట్‌కు వెళ్ళుతున్నాను. ప్రతిచోట మాట్లాడే విషయాలు కలిసి ఏవిధంగా ఉండాలి. అసలు అంతేకాకుండా 5 అంశాలపైన చదువు, ఆరోగ్యం, పంచాయితీ, వ్యవసాయం, సామాజిక అంశాలు అన్ని విధాలుగా చెప్పగలుగుతున్నాను. స్టేట్‌ ఆఫీసులో న్యాయ కార్యకర్తల ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఈ ట్రైనింగ్‌ తీసుకోవడం వల్ల నేను సంఘంలో ఏమైన సమస్యలు వస్తే న్యాయంగా పరిష్కరించ గలుగుతున్నాను. ఈ విధంగా మహిళ సమతలో నేను ఒక భాగంగా పనిచేస్తున్నాను. ప్రతి జిల్లాలో మహిళా శిక్షణ కేంద్రంలో ఉన్న పిల్లలకు పాటలు డాన్సులు కంజీర, డోలక్‌ నేర్పింస్తుంటాను.

నేను మహిళ సమతలో చేరి సంవత్సరాలు అవుతున్నయ్‌ మతిమరుపు ఉన్న సంఘాలను కదిలించడం, ఏ విషయాలు అయిన కాని సంఘం గురించి, కలిసి ఉండే దాని గురించి మాట్లాడటం డ్వాక్రా గ్రూప్‌లకు సంఘాలకు తేడాల గురించి పాట పాడి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సంఘాలు గట్టిగా ఉండే విధంగా మాట్లాడడం అసలు సంఘాలు అంటే ఏమిటి ఎవరికోసం ఈ సంఘాలు చదువు రాని పేద మహిళల కోసం మన అందరికోసం అని చెప్పడం జరుగుతుంది. స్వతంత్రంగా సంఘాలు, క్లస్టర్లు, ఫెడరేషన్‌లు పని చేయడం. మహిళ సమత ఉద్దేశ్యాలు విస్తారింప చేయడం రిసోర్స్‌పర్స్‌న్‌గా తయారు కావడం కోసం సంఘాలు ఫెడరేషన్లకు అన్ని విషయాలు తెలియచెప్పడం సంఘంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయటం. సంఘంలో ఉన్న సభ్యులందరిని చదువుకునే విధంగా మాట్లాడడం వారి పిల్లలను గ్రామంలో ఉన్న పిల్లల గురించి స్కూల్‌ కాని హాస్టల్‌ మరి యంయస్‌కెలో చేర్పించే విధంగా సంఘాలు తయారు చేయడం. ఇంతేకాకుండ ఎన్నికలలో పోటి చేయటం కోసం సంఘం స్త్రీలకు ధైర్యం చెప్పడం జరుగుతుంది.

మహిళా సమతలో నా ప్రయాణం ఇలా సాగుతోంది…

Share
This entry was posted in గ్రామీణ మహిళావరణం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో