పరశురామ్‌రాయ్
అనువాదం : శ్రీపాదస్వాతి
”340 మిలియన్లను మించి భారతీయులు రాత్రి నిద్రపోయేది ఆహారం లేకుండానే. 10,000 భారతీయులు ప్రతిదినం ఆకలితో మరణిస్తున్నారు – 40 లక్షలు ప్రతి సంవత్సరం – మరో విధంగా చెప్పాలంటే ప్రతి 18 నెలలకీ ‘కనిపించని హంతకి’ని మనదేశ
సహవాసులపైకి మనమే ఉసిగొల్పుతున్నాం.”
పేదల్ని దుంప
నాశనం చేసే కుట్ర
దాదాపు 24,000 మంది ప్రతిరోజూ ఆకలితో మరణిస్తారనీ, వాళ్ళలో 78% మంది స్త్రీలు, పిల్లలనీ తెలుసా మీకు?
ప్రపంచంలో ఆకలి బాధితులు 1.4 బిలియన్లు. ప్రతీ సంవత్సరం ఆకలితో మరణించేవారి సంఖ్య 13 మిలియన్లు.
ప్రపంచంలో ఆహారధాన్యాల కొరత వల్ల కాదీ మరణాలు. నిర్లక్ష్యం, అజ్ఞానం – వ్యాపారలాభాలే లక్ష్యంగా సాగే మానవ దౌర్బ్బ్యం – ఇవీ కారణాలు. హిట్లర్ మానసిక రుగ్మతకు బలైనవారు ఆరు మిలియన్లే కాగా ”ఆకలి నిశ్శబ్ద ఆక్రమణ”కు బలైనవారు పదమూడు మిలియన్లు. అదీ ప్రతి ఏడాదీ సంఖ్య – దాదాపు నాజీల కొలబద్దకు రెండురెట్లు. తేడా మాత్రం ఒక్కటే వీళ్ళ మరణం వాయువు నింపిన గదుల్లోలా కాదు.
ఆకలి మృతులు నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా ఏడ్పుల రాద్ధాంతాల లేకుండా ప్రజాస్వామ్యం పెరటిలో నిష్క్రమిస్తారు.
గాంధీగారి ప్రవచనాల్ని విశ్వసిస్తే – దారిద్య్రం అనేది అతినీచమైన హింస – ఈ హింసకు ఇప్పటికీ 1.4 బిలియన్ల ప్రజల గురి అవుతున్నారు. కేవలం ఒక్క అమెరికా సంవత్సరానికి 80 బిలియన్ల డాలర్లు ఇరాక్‌పై ఖర్చుపెడుతుంటే, పూర్తి ప్రపంచం దయదాక్షిణ్యాలు – సంపద 13 బిలియన్ల డాలర్లకు సరితగకపోవడం – దానివల్ల ఆకలి మరణాలు లేదా హత్యలు ఆపలేకపోవడం – విషాదకరం.
ప్రపంచంలో ఆకలి బాధితుల్లో ప్రతి మూడో వ్యక్తీ భారతీయుడు. భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి ఆకలితోనే నిద్రిస్తాడు. అధికారిక దారిద్య్రరేఖ పరిగణనలోకి తీసుకుంటే ఆకలి బాధితుల సంఖ్య – దారిద్య్రరేఖ క్రింద వచ్చే జనసంఖ్య కంటే అధికం.
93-94లో గ్రామసీమల్లో 37% మాత్రం దారిద్య్రరేఖ దిగువ లెక్కల్లో చేరితే 80% జనావళి పౌషికాహారలేమి బాధితులు.
పౌష్ఠికత, కాలొరీల గ్రహణం, ఆహార విహారాలు మొదలైన వివరాల సాక్ష్యం సంపాదిస్తే భారతదేశంలో నిరంతరం ఆకలి రాజ్యమేలడం సువిదితం.
వీటిని మనం ‘ఆకలి చావులు’ అందావ లేదా ”బీద భారతీయుల ఆకలి హత్యలు” అందావ? ఇంత ఎత్తున ఆకలి, దారిద్య్రం – విపరీత వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక విధానంలో – డాలర్ మిలియనీర్ల సంఖ్యలో – పెద్దగా లెక్కలోకి రాదు. అమానవీయతను చాటే ఈ దారిద్య్రానికి కారణాలేమిటి? 15 సంవత్సరాల నా సుదీర్ఘ పరిశోధన – పరితపన వల్ల తెలిసిందేమిటంటే దారిద్య్రానికి – ఆకలికి సాంప్రదాయిక నిర్వచనం. ఆర్థిక దారిద్య్రానికి – బీద ఆర్థిక వ్యవస్థకూ ఏ రకమైన సంబంధం లేకపోవడం.
మేఘనాథ్ దేశాయ్ వివరణ ప్రకారం – ఆర్థిక దారిద్య్రం, రాజకీయ దారిద్య్రం భారతదేశంలో విడదీయరానంతగా అల్లుకుపోయయి – కాదనగలమా?
ప్రతి పౌరుడికీ ఆహారం అందించ డానికి ఎంత అవసరం అనేది లెక్కేస్తే అదేం పెద్దమొత్తం కాదు. నిజానికి ప్రస్తుత ఆర్థికవిధానంలో కూడా ఆహారలోపానికి తావేలేదు, దారిద్య్రనిర్మలనకు కేటా యించిన నిధులు సక్రమంగా అందవలసిన వారికే వినియెగిస్తే.
‘ఆకలి-ఆహార అభద్రత’లపై పోరాటానికి నాలుగు పెద్ద విధానాలు ఆచరణలో ఉన్నాయి.
అవి1. ప్రజాపంపిణీ విధానం(Public Distribution System)
2. మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal Scheme)
3. జాతీయ గ్రామీణ ఉద్యోగ నమ్మక పథకం (National Rural Employment Guarantee Scheme)
4. సమీకృత శిశుసంక్షేమ పథకం (Integrated Child Development Scheme)
ఈ నాలుగు పథకాల్ని అవినీతి కోరల్నించి పరిరక్షించుకుంటే ఆకలి అనే పదానికి భారతదేశ చరిత్రలో తావే దొరకదు. మిలియన్ల కొద్దీ భారతీయుల్ని పొట్టన పెట్టుకునేది అవినీతి రాచపుండేకాని ఆకలి హంతకి కాదు. దారిద్య్రం అంటురోగం ప్రబలడానికి కారణం భారత బూర్జువా విధానం తప్ప మరో కారణం కానరాదు. ప్రజాపంపిణీ విధానం, జాతీయ గ్రామీణ నమ్మక పథకం. ఈ రెండ ఆకలి – ఆహారకొరతలు తీర్చగలిగే అతిముఖ్యమైన పథకాలు-కాని నిజానికి జరుగుతున్న దేమిటి? మినిస్ట్రీ ఆఫ్ కన్సమర్ అఫైర్స్ – ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యషన్ రిపోర్ట్ ప్రకారం – ”గత మూడు సంవత్సరాల్లో ర.31,585.98 కోట్ల విలువైన ఆహారధాన్యాలు, గోధుమ, బియ్యం – బీదలకని కేటాయించబడినవి ప్రజాపంపిణీి విధానం నుంచి పక్కదారి పట్టాయి. ఒక్క గత సంవత్సరమే ర.11,336.98 కోట్ల విలువైన ఆహారధాన్యాలు – సబ్సిడైజ్‌డ్ రేట్లలో అతిబీదవారికి ప్రభుత్వం అందించవలసినవి – న్యాయ వ్యతిరేకంగా ర్కెట్లకు చేరాయి. ప్రతి సంవత్సరం బీద భారతీయులు 53.3% గోధుమ 39% వరి వారికై కేటాయించిన దానిలోంచి కొల్లగొట్టబడి కోల్పోతున్నారు. జాతీయ పంపిణీ విధానంలో పెద్దఎత్తున ప్రక్కదారిపడ్తున్న ధాన్యం వల్ల బీదా బిక్కీ ప్రభుత్వం తమకు ఆహారధాన్యాలు సరఫరా చేస్తుందని నమ్మలేకపోతున్నారు. (టైమ్స్ ఆఫ్ ఇండియ, సెప్టెంబర్ 17, 2007)
గత రెండు నెలలుగా రాయగడ్, కోరాపుట్, కలహండి జిల్లాలలో (ఒరిస్సాలో) ఆదివాసీ బీదలు వందల సంఖ్యలో మరణించారు. కారణం కలుషితమైన నీరు – ఆహారం తీసుకోడం వల్ల – అదీ ఆకలి తీవ్రమైన ఆహారపదార్థాల అభద్రత వల్ల.
దీని ఆధారంగా వంద గ్రా ల్లో నా పరిశోధన వల్ల నేను తేల్చుకున్నది – నమ్మేది – ”ఒరిస్సాలో వందలాది మంది ఆదివాసీల్ను హతమార్చినది కలరా కాదు – అవినీతి రాచపుండు”.
కలరా ఒక వ్యాధి లక్షణం – ఒక ఫలితం – కాని అసలు కారణం అవినీతనే కాన్సర్ – అది ఒరిస్సా అతిముఖ్యమైన అధికార విభాగాల్లో ప్రతి ముఖ్యమైన అవయవానికీ శాఖలుశాఖలుగా విస్తరించి ఆయ విభాగాల్ని కుంటివిగా మార్చింది.
బూర్జువా వ్యవస్థ అధిగమించలేని దారిద్య్రం – తీరని ఆకలిని సృష్టించి – ఈ ఆదివాసీల విషాద మరణాలకు కారణమైంది. ప్రజాపంపిణీ విధానం చితికి ముక్కలైంది. సమైక్య శిశుసంక్షేమ పథకం ఒరిస్సాలో నిర్వీర్యమైంది. మిగతా పథకాలు ‘హైజాక్’కి గురయ్యాయి – ఒరిస్సా సర్కారు బాబులకవి డబ్బు యంత్రాలుగా మారిపోయయి.
చాలామటుకు ఈ ఆదివాసీలు – ఆకలితో వడిపోత, శరీరాన్ని, ఆరోగ్య వ్యవస్థను రోగగ్రస్తం చేసుకుంట, జీవనం సాగిస్తున్నారు.
వర్షాకాలం – ఒరిస్సాలో ముఖ్యంగా (కెబికె భాగంలో) తీవ్ర ఆహార కొరత వల్ల – మామిడిటెంకలతో, ఆకులు అలమలతో ఆకలి తీర్చుకుంటారు. ఈ విషాదం ప్రతి సంవత్సరం పునరావృతమవుతనే ఉంటుంది. దీన్ని ఆపేందుకే చరిత్రాత్మక మైన ‘జాతీయ గ్రామీణ ఉద్యోగ నమ్మక పథకం’ ఆరంభమైనది. దురదృష్టవశాత్త ఒరిస్సా సర్కారు బాబులు దీన్ని వాళ్ళ ఆర్థిక ప్రాయెజిత పథకంగా మార్చుకున్నారు.
సెంటర్ ఫర్ ఎన్‌విరాన్‌మెంట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ సంస్థ ఢిల్లీ ఒక సర్వే 100 గ్రావల్లో నిర్వహించి, 2006-07లో NREGS 733 కోట్ల రూపాయల్ను ఖర్చుచేసినట్టు, అందులో 500 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వాధికారులు దుర్వినియెగపరచినట్టు గమనించింది.
ఒరిస్సా ప్రభుత్వం చెప్పినట్టుగా 19 ఎన్‌ఆర్‌ఇజిఎస్ జిల్లాల్లో అవసరం ఉన్న ఏ ఒక్కరికీ – భత్యం ఇచ్చే పని నిరాకరించలేదని, ప్రతి ఇంటికి 57 రోజుల భత్యం ఇచ్చే పని కల్పించామనీ అన్నా అది పూర్తిగా వ్యతిరేకం. చాలామటుకు అవసరం ఉన్న ఇళ్ళకు ఉద్యోగ నిరాకరణే కాకుండా కనీసం ఉద్యోగ కార్డులను కూడా సరఫరా చెయ్యలేదు. ఈ 19 జిల్లాల్లో ఎవరికీ 5 రోజులకు మించి పనిని కల్పించలేదు. 75% ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు దుర్వినియెగమయ్యయి. ఒరిస్సాలో వేలకొద్దీ గ్రావలు 80-90% నిధులు దుర్వినియెగమవడం నమ్మి తీరవలసిన సత్యం.
ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు ఇలా బహిరంగంగా దోచుకోబడటం విచారించవలసిన విషయం పూర్తిగా ఒరిస్సా రాష్ట్ర పాలనే ఒక దోపిడీ వ్యవస్థ అని నమ్మడానికి కారణాలనేకం.
ఈ 500 కోట్ల నిధుల దుర్వినియెగానికీ, ఆదివాసీల కలరా మరణాలకూ ఏదైనా సంబంధం ఉందా – పైపైన చస్తే అసంబద్ధంగా అనిపించినా – లోనికి వెళ్ళేకొద్దీ బలపడుతుందా సంబంధం. ఈ 500 కోట్లు దుర్వినియెగ పరచబడకపోతే, పదిలక్షల బీద కుటుంబా లకు 90 రోజుల జీతాలుగా సమకూరి ఉండేవి. ఒక్కొక్క కుటుంబానికి ర.5000 భత్యంగా దొరికి ఉండేది. ఈ అయిదువేలు – ఈ ఆకలి కుటుంబాలకు కనీసం 4-6 నెలలపాటు ఆహారాన్ని అందించగలిగేవి లేదా ఓ ఏడాదిపాటు ఒక్కపూట ఆహారాన్నివ్వ గలిగేవి. ఇది ఆర్థికపరమైన స్కామ్ మాత్రమే కాదు. ఒరిస్సా బూర్జువా వ్యవస్థ పదిలక్షల ఆకలి కుటుంబాల ఏడాది ఆహారాన్ని నిర్లజ్జగా దోచుకుంది. ఒరిస్సా ఆదివాసీల హంతకు లెవరు?కలుషితాహారం, నీరు తిని త్రాగ డంవల్ల వ్యాధిగ్రస్తులయరని అనుమానించారు (బిబిసి ఆగస్ట్ 27 2007) నవ్‌గాం గ్రామానికి చెందిన చింతామణి నాయక్ తండ్రయే కలలు ముక్కలై జీవితమే చితికిపోయింది – అతని భార్య – గర్భవతి – డయేరియతో మరణించింది.
”ఆహారలేమి వల్లే నా భార్యను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను అశక్తుడ్ని” చింతామణి దైన్యం ఇది.
ఎంతోమంది – ఆహార కొరత – కాలుష్యం – దారిద్రానికి బలి అయేవారిలో చింతామణి ఒకడు. ఓ పక్కన పెరుగుతున్న ఆకలిచావులకి తోడు ఈ ప్రబలుతున్న వ్యాధి – ఒరిస్సా ప్రభుత్వం చేస్తున్నదేమిటి?
ప్రస్తుతం ఒరిస్సాలో (కెబికె రీజియన్‌లో) పెరుగుతున్న ఆకలి, దారిద్య్రం – కొరత – అతితీవ్రంగా, అమానుషంగా చెలరేగుతున్నా ఎన్‌ఆర్‌ఇజిఎస్ విజయ వంతంగా ఆచరింపబడుతోందనడం నిధుల్ను సక్రమంగా వినియెగిస్తున్నారనడం హాస్యాస్పదం.
ఒరిస్సా గ్రామీణ జీవితాల మీద గ్రామీణ ఉద్యోగపథకం ప్రభావం శూన్యం. ఒరిస్సా కెబికె ప్రాంతంనించి ఆదివాసీలు మిగతా ప్రాంతాలకు వలసపోవడం – దాని తీవ్రత గురించి ప్రస్తావనే లేదు.
హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో చాలామటుకు సహారా ప్రాంత గ్రామాలు కెబికె గ్రామాలకన్న మంచి అభివృద్ధిని చపిస్తున్నాయి. 100 కెబికె గ్రామాల్లో విస్తరించింది ఆకలి దారిద్య్రం వత్రమే. చాలామంది పిల్లలు ఈ గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు. లోపలికి పోయిన బుగ్గలు, గుంటలు పడిన కళ్ళు, పొడుచుకు వచ్చిన పొట్టలు సన్నని రూపాలే దీనికి సాక్ష్యం.
కాశీపూర్ గ్రామపంచాయతీలో పనసగడ, గొట్టిగుడా, బిలామల్ దర్శించాము. 2001లో ఎన్నో ఆకలిచావులు రికార్డయయిక్కడ – ముఖ్యమంత్రి స్వయంగా దర్శించి రిలీఫ్ అందించారు. అయినా ఇప్పటికీ చాలా ఇళ్ళలో ఆకలి-పస్తులే దర్శనమిస్తాయి. ఇప్పటికీ వర్షాకాలంలో – వాళ్ళకి మిగిలినది ఐతే మామిడి టెంకలో జీడి లేదా ఉపవాసం. పనసగడ గొట్టిగడా ప్రజలెవరికీ జాబ్ కార్డ్స్ రాలేదు. బిలామల్‌లో కొందరికి వచ్చినా 2-3 రోజులపని మాత్రమే. ఈ గ్రామంలో ఒక కుటుంబంలో 2001లో నలుగురు ఆకలిచావుకు గురయరు. అయినా వారికి జాబ్‌కార్డ్ రాలేదు. గత రెండు వసాలుగా 8 మందికి మించి మరణించారిక్కడ. అవన్నీ ఆకలిచావులే. కాని బూర్జువాలు వీటిని ‘కలరా మర ణాలు’గా చపడం వారికి లాభదాయకం.
ఒరిస్సా ప్రభుత్వం ర.733 కోట్లు ఎక్కడ ఖర్చుపెట్టింది? అరవై వసంతాల స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుపుకొనే దేశం ఆదివాసీలకు కనీసం ఈ ప్రశ్నకు జవాబివ్వాలి. రాయగడ, కాశీపూర్ బ్లాక్‌లో ‘కలరా మరణాలు’ అత్యధికంగా రికార్డయయి. 30 గ్రావల్లో పర్యటించి నుక్కున్నది ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు దోచుకోబడ్డాయని – కోరాపుట్‌లోని లక్ష్మిపూర్, నంద్‌పూర్‌లో కలహండిలోని తమల రాంపూర్‌లో ఇదే కథ. ఇక్కడంతా మృత్యువు నగ్నంగా నర్తించిన దానికి నిదర్శనం – మృత్యుగీతికకు – నర్తనకు మూలం ఒరిస్సా అవినీతి బర్జువా వ్యవస్థ. సిఇఆర్‌ఎఫ్ సర్వే రిపోర్ట్ 17 ఆగస్టు 2007 అన్ని పత్రికల్లో హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఒరిస్సా ప్రభుత్వం మాత్రం పెదవి కదపలేదు. బదులుగా 2007 ఆగస్టు 20న చీఫ్ మినిస్టర్ ఒక పెద్ద మీటింగు ఏర్పరచి ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనితీరు సర్వేను -ఎన్ ఐఆర్‌డి, హైద్రాబాద్‌కి అప్పగించాడు. కంటితుడుపు తీరుకిది నిదర్శనం.
ఇంకా షాకింగు ఏమిటంటే ఒరిస్సా ప్రతిపక్షాల – కాంగ్రెస్ నిశ్శబ్ద వైఖరి. మిగతా ప్రతిపక్షాలు డివండ్ చేసినా ఫలితం శూన్యం. ఇప్పుడా పార్టీ ఆదివాసీ శవాలను లెక్కించడం ఆశ్చర్యకరం. మనం అగ్నియెధు లం – నిప్పురాజు కున్నాకే బావి తవ్వకం ఆరంభిస్తాం. నిధుల దుర్వినియెగం కన్న రాజకీయనిశ్శబ్దమే గొప్ప షాక్.
రాజకీయ ఉపన్యాసాల్లో ప్రస్తావన కొచ్చేది ముందుగా దళితులు – ఆదివాసీలే, కాని నిజానికి వాళ్ళను దోషుల్ను చేసేది ప్రభుత్వమే.
నిధులు ముఖ్యంగా చేరేది అధికారులకు – మిగులో తగులో పొందేది ఆదివాసీలు.
ఈ బీదలకు దళితులకు ఆదివాసీలకు ఆకలి నించి విముక్తి ఎప్పుడు?
అవినీతినించి విముక్తి లేనిదే ఆకలినించి విముక్తి ఎలా సాధ్యం?
బాధ్యతాయుతమైన పౌరులే కలుషితమైన అవినీతి అధికారుల్ను అదలించగలరు. ప్రభుత్వాధికారులు విచారణను ఎదుర్కొని – శిక్షకు భయపడితే తప్ప వాళ్ళలో వర్పురాదు. అవినీతికి తెరపడదు. ఆదివాసీల ఆకలిచావులకు అదుపు ఉండదు. ఈగల్లా మరణించే వీరి మృత్యువుకు ‘ఎదుగుతున్న భారతదేశం’ గుర్తింపూ, విచారం కూడా అందవు.
ఇది నిజంగా మన దౌర్భాఘ్యము. మన దెషమ లొని ప్రతి చదువుకున్న వ్యక్థీ దీనికి భాధ్యథ వహించాలి. ముఖంగా మన రాజకీయలని. థప్పు నయకులది కాదు. అలాంతి వారిని ఎన్నుకున్న మనది. సిగ్గుపదాల్సిన విషయమె.