సాకేత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

– వేములపల్లి సత్యవతి

దామిని, నిర్భయ కల్పిత నామధేయంతో దేశప్రజలందరిని వేదనతో కుదించివేసి విదేశాలలో కూడా చర్చనీయాంశమైన జ్యోతిసింగ్‌ పాండే అత్యాచారకేసులో నేరగాళ్లకు ఉరి శిక్ష విధిస్తూ సాకేత్‌ ఫాస్ట్‌ కోర్టు న్యాయాధీశులు యోగేశ్‌ ఖన్నా 13-9-2013న తీర్పు చెప్పారు. 20 పేజీల నేరగాళ్ల నేర చరితను చదివి వినిపించారు. చరిత్రాత్మకమైన ఈ తీర్పు వెలువడగానే దేశమంతటా హర్షాతిరేకాలు వెల్లవిరిసినవి. బాధితురాల తల్లి-తండ్రులు తమ కూతురుకు న్యాయం జరిగిందన్నారు. నిందితులలో ఒకతను రామసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నేరగాడు మైనరైనందువలన జువైనెల్‌ కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. మిగిలిన నలుగురికి అప్పీలు చేసుకోవటానికి 30 రోజుల గడువు న్యాయాధీశులు యిచ్చారు. తీర్పు తదనంతరం దోషుల తరపు డిఫెన్స్‌ న్యాయవాది బాధితురాలినే దోషిగా భావించారు. విలేఖరులవద్ద నిర్భయలాగ తనకూతురే రాత్రివేళ ఒంటరిగా బయటకు వెళ్లివుంటే తానే తన కూతురును తగలబెట్టి చంపేవాడినని అన్నారు. న్యాయవాది నోట ఆలాంటి మాటలు చదివి దిగ్రాంతి చెందుతారు. ఉన్మాది నోటనో, మతోన్మాదినోటనో వెలువడవలసిన మాటలు న్యాయవాది నోట వెలువడటం బాధాకరం. న్యాయవాదులకు శోభ చేకూర్చవు. అంతేగాదు, మరో మూడు నెలలలో దేశంలో రేప్‌ జరగకుండా వుంటే తానే ఉరివేసుకొని చచ్చిపోతానని, అప్పీలకు వెళ్లనని తెల్పారు. ఇది ఒక సవాల్‌గా తేల్చారు. మనదేశంలో ఈనాడు ఉన్న పరిస్థితుల్లో దేశంలో ఎక్కడో ఒకచోట రేప్‌ జరగని రోజంటూ లేదన్నది నగ్నసత్యం. 2012లో దేశరాజధాని ఢిల్లీలో 600 రేప్‌లు జరిగాయని అధికారిక గణాంకాలు తెల్పినవి. వెలుగు చూడనివే అంతకన్న ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే.

న్యాయవాది గారికి మూడు మాసాల గడువు ఎందుకు కావలసివచ్చిందో అర్ధం కావటం లేదు, నిర్భయ 16-12-2012 ఆదివారం రోజున రాత్రి 9-10 గంటల మధ్య అత్యాచారానికి గురయింది. తెల్లవారి సోమవారం 17-12-2012న పగటి వేళలో ఆదే రాజధాని ఢిల్లిలో రెండు రేప్‌ కేసులు జరిగినవి. పాఠశాల కొచ్చిన ముక్కు పచ్చరారని మూడేళ్ల చిన్నారిపై ఆ పాఠశాల నిర్వాహ కురాలి భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన మీద జరిగిన ఘోరకలిని తల్లితండ్రులకు మాటలలో చెప్పుకోవటం పాపం ఆ చిన్నారికి చేతకాలేదు. అనారోగ్యానికి గురైయింది. చికిత్సకు ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షతో చిన్నారిపై ఆత్యాచారం జరిగిందని తేలింది. మిట్టమధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ వార్తలు వెలువడినవి. మరి న్యాయవాదుల వారు విసిరిన సవాలులో చిత్తశుద్ధిని శంకించ వలసి వస్తున్నది.

ముంబయిలో మహిళా ఫోటో జర్నలిస్టుపై సాయం కాలం ఆరు గంటలవేళ అయిదుగురు దుండగులు అత్యాచారం చేశారు. ఆమె వెంటవున్న తోటి జర్నలిస్టును కొట్టి, గాయ పరచి, బంధించి తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వింతగొల్పే విషయమేమిటంటే నిర్భయ కేసులోలాగానే ఈ అయిదుగురిలో ఒక మైనరున్నాడు. వైన్‌ల్‌లా (బాలల హక్కుల పరిరక్షణ చట్టం) ప్రకారం శిక్షల నుండి తప్పించుకునే వీలున్నందున మైనర్‌లు ఈ దుశ్చర్యలకు పాలుపడే అవకాశం లేకపోలేదని భయం వేస్తుంది. భగవంతునికి భక్తులకు మధ్య అనుసంధానకర్త పూజారి. పవిత్రమైన దేవాలయంలో ఫల-పుష్పాలతో నిత్యం దేవుని పూజించే పూజారి స్నేహితుని సహకారంతో ఒక వివాహిత మహిళను అపహరించాడు. ఇద్దరు ఆమెపై కొన్నాళ్లు అత్యాచారం చేసారు. తదనంతరం ముగ్గురు అన్నదమ్ములకు ఉమ్మడిగా 40 వేల రూపాయలకు ఆమెను అమ్మివేశాడు. కనిపించకుండపోయిన నాటి నుంచి ఆమె సోదరుడు అన్వేషణ మొదలు పెట్టాడు. జనవరి 2013లో తప్పింపోయిన సొదరిని నాలుగు మాసాల నిరంతరాన్వేషణతో ఏప్రియల్‌లో 4 మాసాలకు కనుక్కున్నాడు. ఆ కిరాత కీచకులనుంచి విడిపించి స్వగ్రామం తీసుకొచ్చాడు. ఆమెకు అయిదు సంవత్సరాల కొడుకున్నాడు. నేపాల్‌ యువతి బెంగుళూరులో న్యాయశాస్త్రం చదువుతున్నది. యూనివర్శిటి కాంపస్‌లోని వరండాలో కారులో కూర్చుని స్నేహితునితో మాట్లాడుతున్నది. ముగ్గురు ముష్కరులు మారణాయుధాలతో వారిరువురిపై దాడి చేశారు. ఆ విద్యార్ధినిని ఆగం జేశారు. కర్నాటక హైకోర్టు ఆ మానవ మృగాలకు జీవితఖైదు విధిస్తూ సెప్టెంబర్‌ 2013లో తీర్పు చెప్పింది.

ఇది 1995 నాటి ఘటన. రాజధాని ఢిల్లోలోనే జరిగింది. నైనాను, ఆమె భర్త సునీల్‌శర్మ భీతిగొల్పె భయంకరమైన పద్ధతిలో హతమార్చాడు. నైనా వివాహేతర సంబంధం కల్గివున్నదని అనుమానించాడు. శర్మకు ఒక హోటల్‌ యజమాని స్నేహితుడు. ఒకనాడు హోటల్‌ పని వాళ్లందరూ వెళ్ళిన తర్వాత శర్మ నైనాను ఆ హోటల్‌కు తీసుకొచ్చాడు. తండూరు రోటి బట్టి (వేరే రకం పొయ్యి)లో నిలబెట్టాడు. నైనా పొడవరి పొడుగు ఎక్కువ యింది. ఆమెను మోకాళ్లవరకు నరికి పొయ్యిలో నిలబెట్టి మంటలలో కాల్చి చంపాడు. అది రాత్రి 2 గంటల సమయం హోటల్‌ వెనుకవైపు ఉన్న రోడ్డులో విధి నిర్వహణలో ఒక పోలీసు గస్తీ తిరుగుతున్నాడు. హోటల్‌ నుంచి మంటలు ఎగసి పడుతూ బయటకు కనిపిస్తున్నవి. పోలీసు ప్రహరీగోడ ఎక్కి చూచాడు. గదిలోని కిటికిలో నుంచి నిలబడి కాలుతున్న మహిళ కంటబడింది. విషయం తెల్లవారి బయటపడింది. తండూరు రోటీ కేసుగా ప్రసిద్ధికెక్కింది. 18 సంవత్సరాలకు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివన్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేసు విచారణను ముగిస్తూ తీర్పు రిజర్వు చేసింది. ట్రైల్‌ కోర్టు, ఢిల్లీ కోర్టు హంతకునికి మరణ శిక్ష విధించింది. ధర్మాసనం 14-8-2013న తీర్పును వాయిదా వేసింది.

ఒక మహిళ విడాకులు కోరుతూ న్యాయస్థానంలో కేసు వేసింది. కేసు నిమిత్తం ఆ రోజు ఆమె న్యాయస్థానానికి వచ్చింది. అంతకు ముందే ఆమె భర్త అక్కడకు చేరాడు. విడాకులు కోరిందన్న కసితో స్నేహితునితో కలసి ఆమెను కోర్టులోని తన న్యాయవాది గదిలోనికి లాక్కెళ్లి స్నేహితునితో పాటు తాను ఆమెపై అత్యాచారం జరిపాడు. న్యాయం జరగవలసిన న్యాయస్థానాలలోనే మహిళలకు రక్షణ కరువయింది.

కిరాత కీచకులు మనదేశానికి పర్యటన కొరకు వచ్చిన విదేశీ యువతులపై కూడ తెగబడ్డారు. బ్రిటన్‌కు చేందిన యువతి ఆగ్రాలోని ఒక హోటల్‌లో పై అంతస్థు గదిలో బస చేసింది. మసాజ్‌ చేయటానికి వచ్చిన అతను ఆమెను బలాత్కరించటానికి ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పై నుంచి దూకింది. ఆమె కాలు విరిగింది. సారా ఎలిజబెత్‌ 24 ఏండ్ల యువతి కూడా బ్రిటన్‌ నుంచి భూలోక స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీరును చూడటానికి వచ్చింది. సుందరమైన డాల్‌ సరస్సులో విహారానికి హౌజ్‌బోటులో విహారానికి బయలుదేరింది. అదే బోటులో నెదర్లాండుకు చెందిన పర్యాటకుడు డాలిట్‌ రిచర్డు వున్నాడు. హౌజ్‌ బోటులోనే ఆమెపై అత్యాచారం చేసి తర్వాత ఆమెను హత్యచేశాడు. బ్రిటన్‌ ప్రభుత్వం వెన్వెంటనే స్పందించింది. అతనిని ఆరెస్టు చేశారు. సారా కుటుంబాన్ని అన్ని విధాల అదుకుంటారాని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. రష్యా నుంచి లార్మసోవా, ఆమె భర్త ఆర్సెన్‌ దంపతులు మనదేశానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని గోవర్ధనగిరిని చూడటానికి బయలుదేరారు. దారిలో దోపిడీకి గురయ్యారు. వారి బ్యాగులలో వున్న ఏడువేల రూపాయల నగదు, పాస్‌పోర్టులు, డాక్యుమెంట్లు, విలువైన యితర వస్తువులు దొంగిలించబడ్డాయి. లైంగిక వేధింపుల అంటురోగం భూమిమీదనే కాకుండా ఆకాశ మార్గాన పయనించే విమానయానంలోనికి ప్రవేశించింది. 17-8-2013న బ్యాంకాగ్‌ – కలకత్తా మధ్య ప్రయాణించే థాయ్‌ విమానంలోనికి ఒక జపాన్‌ మహిళ ఎక్కింది. ఆమె ప్రక్క సీటులో నారాయణ సింగ్‌ (50 ఏండ్లు) కూర్చున్నాడు. కూర్చున్నప్పటి నుంచి ఆమెను వేదించటం మొదలుపెట్టాడు. నారాయణసింగ్‌ హరియానాకు చెందినవాడు. విమానం ఎస్‌ఎస్‌సిబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వెంటనే జపాన్‌ మహిళ విమానాశ్రయ అధికారులకు నారాయణ సింగ్‌పై ఫిర్యాదు చేసింది. అతనిని ఆరెస్టు చేశారు. భారత్‌ ప్రతిష్ట విదేశాలలో దిగజారిపోయింది. అనేకదేశాలు తమ దేశ మహిళలు ఒంటరిగా భారత్‌కు వెళ్లకుండ వుండటం క్షేమదాయకమని ప్రకటించినవి. సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితులు మనదేశంలో జరుగుతున్నవనటానికి ఇంతకన్నా వేరే రుజువు అవసరం లేదు.

మనదేశ సర్వోన్నత న్యాయస్థానం రోజురోజుకు మహిళలపై పెచ్చరిల్లుతున్న అనేక నేరాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. చట్ట సవరణలతోనే బాధితులకు సత్వర న్యాయం కలగటానికి చట్టంలో సమూల మార్పులు చేయాలని అభిప్రాయపడింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు దేశంలో చాలినన్ని లేవని, ఉన్న వాటిలో అత్యాచార బాధితులకు సత్వర న్యాయం జరిగే విధివిధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని తెల్పింది. పోలీసుల రికార్డులకు బదులుగా బాధితుల, సాక్షుల వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ఎందుకు నమోదు చేయటంలేదని ప్రశ్నించింది. బాధితుల, సాక్షుల వాంగ్మూలాలను అనేకసార్లు నమోదు చేయటంవల్లనే కేసుల విచారణలో ఆలస్యానికి కారణమని పేర్కొంది. సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన చట్ట సవరణలు తీసుకురావటంలో భారత ప్రభుత్వం తగు శ్రద్ధ చూపటంలేదని, ఇందుకోసం దర్యాప్తు సంస్థల సహాయం ఎందుకు తీసుకోవటంలేదని ప్రశ్నించింది.

ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండ మహిళలే సరిదిద్దటానికి ఇంటి నుంచి శ్రీకారం చుట్టాలి. ఒక అవ్వ తన మనువడు ఆఘాయిత్వానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత తానే స్వయంగా మనుమడిని పోలీసులకు అప్పగించింది. తమిళనాడులోని ఒక తల్లి కొడుకు బాలికపై అత్యాచారం చేశాడని తెలిసిన తదనం తరం నలుగురిలో తలెత్తుకొని తిరగలేనన్న అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంది. అలా కాకుండ ఆ తల్లి అటువంటి కొడుకులను ఇండ్ల నుండి గెంటివేయాలని తోటి మహిళలలో స్ఫూర్తి కలిగించటా నికి పూనుకుంటే బాగుండేది. నిర్భయ నిందితులతో ఒకతని భార్య తన భర్త నిజంగా దోషి అని తేలితే తప్పక శిక్షించాలసిందేనని విలేఖరులకు చెప్పింది. వేధింపులకు అత్యాచారాలకు పాల్పడేవారిని, ఇంటి నుంచి, వూరి నుంచి, పట్టణాల నుంచి బహిష్కరించే చైతన్యం ప్రజలలో కలగజేయనంతవరకు ‘నిర్భయ’ లాంటి చట్టాలు ఎన్నిచేసిన అవి నిద్రపోతూనే వుంటవి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.