కంచె వెయ్యాలని వుంది

– మాధవీలత

కంచె వెయ్యాలని వుంది

కానీ ఎక్కడ?

అన్నివేళలా, అన్ని చోట్లా

అత్యాచారానికి గురవుతున్న

”ఆడతనానికి”

కంచె వెయ్యాలని వుంది

పాలబుగ్గల పసిదాన్ని

పక్కింటికి కూడా వెళ్ళకుండా

గడపలో కంచె వెయ్యాలా?

బుడి బుడి నడకలతో

బడి కెళ్లే బుడ్డదానికి

సందు చివరన కంచె వెయ్యనా!

ఉన్నతంగా ఎదగాలని

కాలేజీ కెళ్ళే కన్నెతనానికి

ఎక్కడ వెయ్యాలి కంచె?

కాలేజీ గేటుగకా? క్లాసు రూమ్‌కా?

ఉద్యోగం చేస్తానని ఉత్సాహంగా

వెళ్ళిన నా చిన్న తల్లికి

ఎక్కడ వెయ్యాలి కంచె?

బస్‌ స్టాప్‌కా? ఆఫీస్‌ గేటుకా?

ఎక్కడ, ఎలాంటి కంచె వేసినా

పంజావిసిరి, వేటాడే

మృగాళ్ళు తిరుగుతున్న దుస్థితి

మనసున్న మగాళ్ళు

తలెత్తుకోలేని పరిస్థితి,

నిజానికి సభ్య సమాజమంతా

ఆందోళన చెందుతున్న విషయం

అందుకే కంచెవెయ్యాలనుంది

అనివార్యంగా….

”అమ్మతనానికి”

వేదనతో ఆవేదనతో

నివేదిస్తున్నాను మీకు

మృగాళ్లుగా కాకుండా

మనషుల్లా బతకండి

ఆడతనాన్ని, అమ్మతనాన్ని

బతకనివ్వండి!

 

దేశం సిగ్గు పడుతుంది

– బుచ్చిరెడ్డి గంగుల

నిన్న నిర్భయ

నేడు అభయపై సామూహిక అత్యాచారం

ఏది

ఎక్కడ ఉందీ లోపం

ఎన్ని రకాల చట్టాలు

క్రియేట్‌ చేసినా

రోజు రోజుకి

దేశంలో, రాష్ట్రంలో

అర్బన్‌ – రూరల్‌ ఏరియాలలో

అత్యాచారాలు – హత్యలు – కేసులు??

రూరల్‌ ఏరియా కేసులు సమిసిపోతూ

అర్బన్‌ ఏరియా కేసులు వెలుగులోకి వస్తూ

ఇక

దళిత యువతిపై అత్యాచారం

జరుగుతె

అది బయటికిరాక

ఏమిటి వింత

ఎందుకు ఈ బేధాలు – తేడాలు

స్వాతంత్రం వచ్చింది

మగవాళ్ళకు మాత్రమే – స్త్రీలకు కాదా??

ఎక్కడున్నాం – దేశం సిగ్గు పడుతుంది

ఏది రక్షణ

ఎక్కడ ఉందీ ప్రభుత్వం – ప్రభుత్వాలు??

ప్రజల్లో చైతన్యం రావాలి

తల్లిదండ్రుల పెంపకంలో

మగ – ఆడ మధ్య బేధం లేకుండా – చూపకుండా

ఒక తీరుగా చూస్తూ

మంచి – చెడు

నీతి – నియమాలు

కట్టుబాట్లు – పద్దతులను – వివరిస్తూ

ఇక

ఈ దోపిడీ వ్యవస్థలో

నిజమయిన మార్పు

నేటి విద్యా విధానంలో

సమాజంలో మార్పు రావాలి

సిగ్గుపడవలసిందీ

తలదింగుచకోవలసిందీ – బాధితులు కాదూ

నింధితులు

వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే

మరొకరిలో భయం పుట్టుకు వస్తుంది

ఏ నేరం చేసినా తప్పించుకోగలమన్న ధీమా

ఉన్నంత కాలం

ఈ సిస్టమ్‌లో మార్పు రాదు – రాబోదు

నేటి సినిమాలలో – టివి. షోలలో

రేప్‌ను గ్లామార్‌గా చూపిస్తూ

ఐటమ్‌ సాంగ్‌ పేరుతో

సినిమా సక్సెస్‌ కోసం – డబ్బు కోసం

అమ్మాయిలను అన్ని రకాలుగా

ఎక్స్‌పోస్‌ చేసి చూపిస్తూ

అమ్మాయిలను వస్తువులాగా భావిస్తూ

వ్యాపార ప్రకటనలలో – అన్ని రకాల

ఫోస్‌లతో ఆడ్స్‌ – చూస్తూ

నేరస్థు పోకడలు పెంచుతున్న

సాంస్కృతిక వాతావరణంపై

సమరం జరగాలి – జరపాలి

అశ్లీల చిత్రాలు – టివి పోగ్రాముల

పట్ల నిబంధనలు విధించాలి.

చట్టాలు చేయడంతో సరిపోదు

ఆ చట్టాలపై ప్రజల్లో అవగాహన కలిపించాలి

సమాజంలో మార్పు తేవాలి

నాకెందుకులే అని అనుకోకుండా

కలిసికట్టుగా

చూసిన సంఘటనలకు స్పందిస్తూ

వ్యతిరేకిస్తూ

ప్రశ్నించాలి

నిలదీయాలి

తీరగబడాలి

ఉద్యమించాలి

కాలం మారింది

జీవిత విధానం మారింది

పెరుగుతున్న వేగం – స్పీడ్‌ – స్పీడ్‌

ఈ వాతావరణంలో

పోలీస్‌ యంత్రాంగం

ప్రభుత్వాలు

సమాజం – అప్రమత్తంగా ఉంటూ

మహిళలలో నెలకొన్న

అభద్రతాభావాన్ని తొలిగెంచేలా

సత్వర చర్యలు

తీసుకొంటూ

మార్పును చూపాలి

అందరూ బాధ్యత వహించాలి

ఎదురుకోవాలి

మార్పు – అదే మన ఆశ

మన అజెండా కావాలి

 

సీత

– హిందీ మూలం: కవితా గుప్తా

అనువాదం: డా. వెన్నా వల్లభరావు

సీతా!

నీపై కవిత రాయమంటున్నారు

ఏదో ఒక కవిత

కానీ ఏం రాయను?

భూమి సుతవని

రాముని పత్నివని

వనవాసం చేశావని

పాతివ్రత్య నిరూపణకు

అగ్నిలో దూకావని రాయనా?

అయినా రాముని ద్వారానే

మోసంతో అడవికి పంపివెయ్య బడ్డావని అందునా

నిండు గర్భవతిగా ఉన్న నువ్వు!

సీతా!

నీపై ఏమని రాయను కవిత?

పాత్రివ్రత్య ధర్మాన్ని పాటించావని

అయినా

ఒకానొక రోజున నువ్వు కూడా

మరల భూమాత ఒడినే చేరావని రాయనా?

సీతా!

ఇదంతా కవితవుతుందా…?

 

సీతా!

నువ్వు కూడా పిండంగా రూపుదాల్చి జన్మించి ఉంటే

అల్ట్రా సౌండ్‌ నుండి తప్పించుకుని

అమ్మా నాన్నల తృణీకారపు పెంపకంలో

బిక్కు బిక్కుమంటూ పెరిగి ఉంటే

మిసిమి వయసులోనే

ఎవరో షేక్‌కు అమ్మివేయబడి ఉంటేనో

లేక

వరకట్నపు వద్యశిలపై నీ శిరస్సు ఉంచబడి ఉంటేనో

నీపై కవిత రాయగలిగి ఉండేదాన్ని.

సీతా!

నీపై ఎలా రాయను కవిత?

ఏమని రాయమంటావో నువ్వే చెప్పు!

ఉద్యోగం చేస్తూ

కుటుంబాన్ని పోషించే సంఘర్షణ

నువ్వు అనుభవించలేదే!

అయినవాళ్ళ ద్వారానే

తిరగలి రాళ్ళమధ్యకి నువ్వు నెట్టివెయ్యబడలేదే!

వాస్తవం ఏమిటంటే

‘భూమిలోపల’ నీకు

ఆత్మాభిమానపు పోరు సల్పాల్సిరాలేదు!

నువ్వు పక్షిగా మారి

ఆకాశంలోకి ఎగిరిపోయుంటే ఎంత బాగుండేది!

సీతా!

అప్పుడు నేను

నీపై కవిత తప్పకుండా రాసుండేదాన్ని

నువ్వు నేటి యుగంలో పుట్టి ఉంటే

తప్పకుండా రాసుండేదాన్ని నీపై కవిత!

 

నాడూ – నేడూ

– ఆదూరి హైమావతి

మాల్స్‌లో మెరిసే ‘వస్త్ర సౌందర్యం’ మతులుపోగొట్టే

మగువల మనసులను, మనీపర్స్‌లనూ దోచేస్తోంది.!

కలియుగ కౌరవగణం ‘విలువల’ వలువలూడగొట్టి,

మానవ సంస్కారాన్ని ‘వివస్త్రను’ చేసేస్తోంది.!

 

దేశ సంపద ఎంతగానో పైపైకి పెరుగుతోంది.!

దేశాభివృద్ధి రేటూ స్కేల్‌పై ఎదుగుతోంది.!?!

ఐతే ఆధనమంత విదేశీ బ్యాంకుల్లో ‘నల్లగా’ మురుగుతోంది.

దాని సొంతదారు (దహన) సంస్కారం కోసం అది ఎదురుచూస్తోంది.!?

 

భారతీయ సంస్కృతి ప్రపంచం మొత్తానికే ఆదర్శం

‘మహిళను’ మాతగా చూచి గౌరవించే మహోన్నత తత్వమట

‘ప్రపంచ సుందరి’ పోటీల కోసం పడతులు నేడు పడే ఆరాటం!

పరుగులు తీయిస్తున్నది పతనంవైపు ‘మగువతనపు’ ఈ పోరాటం.

 

యువజనమంతా ఐ.టీ. ఉద్యోగాలకై ఉరకలు వేయగా,!

దేశం దేశం పర దేశాలకు పూర్తిగా ‘కొల్లబో’యింది.!?!

ముసలీముతకా కదల్లేక కాళ్ళు చేతులూ చాపుక్కూచోగా,

ఒకనాటి యువ ఉత్సాహ భారతం ‘నేడు’ వృద్ధ భారతమైంది.!

 

కాలానికి ‘నిదానమే ప్రధానంగా’ ఉండే అమాయక పురాతన కాలంలో

పలకరింపులు, చిలకరింపులు, స్నేహాలూ ‘ప్రేమ ప్రవాహాల’య్యేవి!

కాలం ఉరకలూ పరుగులూ వేసినదిలా పొంగిపొరలుతున్న ఈ ‘నవీనత’లో,

గంటలే సెకన్లూ, రోజులే నిమిషాలై మనసులపై ‘నల్లమబ్బులు’ కమ్మేశాయి.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to కంచె వెయ్యాలని వుంది

  1. deviram. says:

    నాడూ నేడూ కవిత బావుంది.విలువలవలువలు,వృధ్ధభారతం,ప్రేమప్రవాహాలూ పద ప్రయోగాలు అందించిన సారాంశం అమోఘం.
    దేవీరాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.