రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చే యత్నాన్ని ఆపుదాం!

కె. నవజ్యోత్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు నిర్దేశిత ఆర్ధిక సంస్కరణలు 1990 నుంచీ మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు అప్పులే కాకుండా, సామ్రాజ్యవాద సంస్కృతి కూడా దేశంలోకి దిగుమతి అయింది.

ఈ పరిణామదశలో 1993లో మద్యపానానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఒక మహోద్యమం జరిగింది.

సోకాల్డ్‌ నాగరికత, విద్యలకు దూరంగా ఉండే నిరక్షరాశ్యులైన గ్రామీణ స్త్రీల నాయకత్వంలో పోటెత్తిన ఈ ఉద్యమం ప్రజల మద్దతుతో ప్రభుత్వాల్ని కదిలించింది. ఫలితంగా మద్యనిషేధం అమలయింది.
1994లో ఎన్టీయార్‌ అధికారానికి రాగానే మద్యనిషేధం చట్టం అమలు చేశారు. వెన్నుపోటు రాజకీయంతో రంగప్రవేశం చేసి అధికారపీఠం అధిష్టించిన చంద్రబాబు మద్యనిషేధ స్ఫూర్తికి వెన్నుపోటు పొడిచి, ఆరునెలల్లోనే మద్యం అమ్మకాలకు నడుంబిగించటం జరిగింది. ప్రపంచబ్యాంకు విధానాలు అమలు జరిపే సిఇవోగా పేరుపడ్డ చంద్రబాబు మద్యం అమ్మకాలు పెంచే దిశగా కదిలి, కొత్త మార్గాలు అన్వేషించి అమలు జరపడమయింది. ఫలితంగా 1995లో 951 కోట్లుగా వున్న ఎక్సైజు రాబడి క్రమంగా పెరుగుతూ, 2004 సంవత్సరంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చే సమయానికి వార్షికాదాయం 3,200 కోట్ల రూపాయలకు పెరిగింది.
నేటి ముఖ్యమంత్రి వై.యస్‌. 2003 లో జరిపిన పాదయత్ర, వీధి మీటింగులలో, ”మద్యం తాగి ఎన్నో కుటుంబాలు నాశనమౌతున్నాయని” వగపోయారు. తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నియంత్రించి, రాష్ట్రంలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని కాంగ్రెసు పార్టీ ”ఎన్నికల ప్రణాళిక” లో స్పష్టంగా పేర్కొంది. అందుకు పొంగిపోయిన ప్రజానీకం, ముఖ్యంగా గ్రామీణ మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా మద్దతు ప్రకటించారు. మద్యపానం పట్ల వ్యతిరేక విధానం ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు, మద్యం అమ్మకాలు నియంత్రించే మాట అటుంచి, ప్రభుత్వమే ఒక మద్యం మా
ఫియాను తలపించేట్లు ప్రవర్తించింది. రాష్ట్రంలో మొత్తం 6,500 లైసెన్సు షాపులున్నాయి. ఇవికాక 1,135 లైసెన్స్‌ బార్‌ & రెస్టారెంట్లు ఉండగా, 10,000 పైగా లైసెన్స్‌ లేని డాబాలు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు అనధికారికంగా జరుగుతున్నాయి. 1,50,000 బెల్టుషాపులు గ్రామాలలో అనధికారికంగా నిర్వహిస్తున్నందు వలన రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం విపరీతంగా పెరిగి ఏడువేల కోట్ల రపాయలకు చేరింది. ఇదెలా!
వేల గ్రామాల్లో నాటు సారాని నియంత్రించి, చీప్‌లిక్కర్‌ అమ్మకాలను పెంచటమే తన విధానంగా పెట్టుకున్న ప్రభుత్వం, బ్రాందీ షాపు యజవనులతో కుమ్మక్కై, ప్రభుత్వ సారా అమ్మకాలను ప్రోత్సహిస్తూ, జనాలు త్రాగుబోతులుగా మా

రేందుకు దోహద పడుతున్నది. ఎక్సైజ్‌ ఆదాయం కోట్లకు కోట్ల అవినీతి వలయాలకు కూడా కేంద్రబిందువుగా మారుతున్న నేపధ్యంలో, నిజాయితీగా, ప్రజాపరంగా దేశక్షేమం కోరే వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.
మద్యపానం మనిషికి అవసరమా ? తాగుడు సంస్కృతిని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది? మద్యాన్ని ఆదాయవనరుగా భావించే దృక్పధం సరైందేనా? ప్రజల ఓట్లతో ఎన్నికెన ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం మరచి మద్యపానాన్ని ప్రోత్సహించవచ్చా? ఎక్సైజ్‌ ఉద్యోగులకు టార్గెట్‌లు విధించి, పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే మద్యం అమ్మకాలు ప్రోత్సహించటం నైతికంగా సరైన చర్యేనా? కూడు, గుడ్డ, గూడుకు పూచీ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ పని మాని మారుమూల పల్లెల్లో సైతం మద్యం అమ్మకాలు ప్రోత్సహించడం ఎలాంటిది? ఈ ప్రశ్నల్లోనే మనకు జవాబులు తడతాయి. ఎందరో ప్రముఖులు మద్యపానం వల్ల కలిగే అనర్థాల్ని గురించి చెప్పారు.
భవిష్యత్తులో అణుయుద్ధాలు, అంటువ్యాధుల వలన మానవమరణాలు సంభవించవు. దిగజారిన నైతికవిలువల వల్లనే మరణాలు సంభవిస్తాయి. నైతిక విలువలు కోల్పోయి, విశృంఖల ప్రవర్తనతో మానవాళి నిర్వీర్యమవుతుంది అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్నారు. భారతదేశంలో జాతిపిత గౌరవాన్ని పొందిన గాంధీ మద్యనిషేధం కోసం ఎంతగా కృషి చేసిందీ తెల్సిన ఈ ప్రభుత్వాలు ఆయన ఆశయాల్ని పక్కకు పెడుతున్నాయి. గాంధీ పేరిట బ్రాందీ షాపులు వెలుస్తున్న కాలమిది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు కంటే కూడా అత్యున్నతమైన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు శిరోధార్యాలు, రాజ్యాంగంలోని 47వ అధికరణం మద్యనిషేధాన్ని చేపట్టటం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొని ఆరు దశాబ్దాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం శోచనీయం.
రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలవటానికి మద్యపానం ప్రధాన కారణం. మద్యపానం మనిషి సంస్కారాన్ని దెబ్బతీసి, విచ్చలవిడితనానికి, వ్యభిచారానికి ఆలంబన అవుతుంది. పేద కార్మికులు ఎందరో వారి రెక్కల కష్టాన్ని భార్యాపిల్లల కడుపు నింపేందుకు కాకుండా మద్యానికై తగలేస్తున్నారు. ఒక్కో పేదవాడు వందరూపాయలు మద్యం కోసం తగలేస్తే అందులో డెబ్బై రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. అంతేకాకుండా సమాజసంక్షేమం కోసం చేసే అనేక చట్టాలు మద్యపానం వల్ల అమలుకావటం లేదనేది వాస్తవం.
గృహహింసకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించినందువలన ప్రభుత్వం స్త్రీలకు మేలు చేయాలని గృహహింస చట్టం తెచ్చింది. త్రాగుడును నిషేధించకుండా ఇది అమలవుతుందా? త్రాగి వచ్చి భార్యలను హింసించే భర్తలు మన పల్లెల్లో కోకొల్లలు! బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనం, నిరక్షరాస్యత నిర్మూలనం కూడా మద్యపానం వల్ల నీరుగారుతున్నాయి. బాధ్యతలేని తండ్రులు మద్యానికి బానిసలై పిల్లల్ని నిర్లక్ష్యం చేయడమే కాక, వారి రెక్కల కష్టంపై బ్రతికే దౌర్భాగ్యస్థితులు కూడా ఉన్నాయి. త్రాగుడుకు బానిసైన తండ్రులు నిర్లక్ష్యం చేయడంతో ఆడపిల్లలు వ్యభిచార కూపం పాలవుతున్న ఎన్నో సంఘటనలు సమాజంలో మనకు కనబడుతున్నాయి. ఇక ఎయిడ్స్‌ మహమ్మారిని పారద్రోలాలంటూ కండోమ్‌ల అమ్మకాలు పెంచేందుకు ప్రోత్సహించే ప్రభుత్వానికి మద్యపానంవల్లనే కంట్రోలు తప్పిన మనుషులు నైతిక విలువలకు తిలోదకమిచ్చి, వ్యభిచారానికి పాల్పడుతున్నారనే విషయం తెలియదా! మద్యం మత్తులో ఉచ్చనీచాలు, వావివరసలు, వయసు తారతమ్యం కూడా తెలియని స్థితిలో బలాత్కారాలకు పాల్పడుతోన్న విషయం వార్తాపత్రికలలో చూస్తునే ఉన్నాం. పైగా వ్యభిచారానికి పాల్పడే సమయంలో మద్యం మత్తులో ఉండే వారికి కండోమ్‌ వాడాలనే విచక్షణ కూడా ఉండదు.
ఇక పల్లె ప

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.