విద్యా హక్కు చట్టం కథా కమామిషు

విద్యాహక్కు చట్టం అమల్లో కొన్ని వాస్తవాలు

మన రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 96,280 పాఠశాలలుండగా, వీటిలో 62,162 ప్రాథమిక పాఠశాలలు, 17,823 ప్రాధమికోన్నత పాఠశాలలు, 16,292 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పైన పేర్కొన్న 96,280 ప్రభుత్వ పాఠశాలల్లో 90 లక్షల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇంత మంది పిల్లలకు గాను కేవలం 2,79,615 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. వీరిలో చాలా మంది చెట్లకిందనే చదువుకుంటున్నారు. ఈ సమస్య నివారణకు ఇంకా 97,497 తరగతి గదులను ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది.

తి ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న పిల్లలకు గాను 71,023 ప్రాధమిక పాఠశాలలు, 13,263 ప్రాధమికోన్నత పాఠశాలలు, 13,211 ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది

పాఠశాలల్లో టీచర్లకు సంబంధించిన సమస్యలు విద్యార్ధి/ఉపాధ్యాయ నిష్పత్తి

తి విద్యా హక్కు చట్టం షెడ్యూలులో ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచరు, ప్రతి 60 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉండాలని చెప్తుండగా…

తి పైన పేర్కొన్న పాఠశాలల్లో 5,774 పాఠశాలలు కేవలం ఒక్క టీచర్‌తో మాత్రమే నడపబడుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100కి పైగా పిల్లలున్న 400 పాఠశాలల్లో ఒక్క టీచరు కూడా లేరు. 5 మంది మాత్రమే ఉన్న 251 పాఠశాలల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు. 15,170 ప్రాథమిక పాఠశాలల్లో కేవలం ఒక్క టీచరు మాత్రమే ఉన్నారు. వీటిలో 596 పాఠశాలల్లో 100 మందికి పైగా పిల్లలు ఉన్నారు.

పాఠశాలల్లో టీచర్లకు సంబంధించిన సమస్యలు

తి ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులలో కూడా ఎంతమంది ట్రెయిన్డ్‌ టీచర్స్‌ ఉన్నారనేది మరొక పెద్ద ప్రశ్న?

తి ప్రతి పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులుండాలని విద్యా హక్కు చట్టం చెప్తుండగా చాలా పాఠశాలల్లో విద్యా వాలంటీర్లతో తరగతులు నడుస్తున్న సంఘటనలు కోకొల్లులు.

తి చట్టంలోని మరొక అంశం పాఠశాలల్లో స్నేహపూర్వక వాతావరణం, ఎలాంటి వివక్ష, దండన లేని బోధన పిల్లలకు అందించాలనేది. కానీ పిల్లల పట్ల శిక్షలమలవుతున్న సంఘటనలు మనం నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాం. మధ్యాహ్న భోజన అమలులో కూడా సమస్యలనేకం.

విద్యా హక్కు చట్టం అమల్లో కొన్ని వాస్తవాలు – బడ్జెట్‌ కేటాయింపులు

తి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. విద్యాభివృద్ధికి/చట్టం అమలుకు మన ప్రభుత్వం కేటాయింపులు కనుక చూస్తే 2009-10లో 12,825 ఉండగా అది 2013-14 నాటికి 27,258కి పెరిగింది. అంటే రెట్టింపయింది. గత దశాబ్దంలో 3.5 లక్షల నూతన పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించడం సంతోషకరమైన విషయం.

తి 2009-10 నుండి 2011-12 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 11 మిలియన్‌ మంది పిల్లలను పాఠశాలల్లో చేర్చగా ఇంకా 8 మిలియన్ల మంది పిల్లలు బడి బయట ఉండడం ఆలోచించాల్సిన విషయం. పాఠశాలలో అసలే చేరని పిల్లలను వారి వయసుకు తగిన తరగతుల్లో చేర్చడం మరొక పెద్ద సమస్య.

పాఠశాలల్లో త్రాగునీరు, టాయిలెట్‌ వసతులు

తి 18,000 పాఠశాలల్లో అసలు టాయిలెట్‌ అనేదే లేకపోగా టాయిలెట్‌ వసతి ఉన్న పాఠశాలల్లో 70% పాఠశాలల్లో అవి వినియోగంలో లేవు. ఇందులో బీహార్‌ తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ సమస్య కారణంగా చాలామంది ఆడపిల్లలు విద్యకు దూరమవుతున్నారు.

తి పాఠశాలల్లో పిల్లల డ్రాపౌట్‌ రేటు పెరగడానికి పాఠశాలల్లో త్రాగునీరు, టాయిలెట్‌ వసతి వంటి సదుపాయల కొరత ముఖ్య కారణం.

పాఠశాలల్లో త్రాగునీరు, టాయిలెట్‌ వసతులు-సుప్రీంకోర్టు ఆదేశాలు

తి పాఠశాలల్లో త్రాగునీరు, టాయిలెట్‌ వసతులు వెంటనే కల్పించాలని 2011లో సుప్రీం కోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను అదేశించినప్పటికి ఇప్పటికీ ఆ అదేశాలు అమల్లోకి రాకపోవడం విచారకరం. సుప్రీం కోర్టు విధించిన గడువు ఇప్పటికి రెండుసార్లు పెంచడం జరిగింది.

తి మార్చి 30, 2013 నాటికల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించినప్పటికి పరిస్థితిలో మెరుగుదల లేకపోవడం ఆలోచించాల్సిన విషయం.

శ్రీళిశిలి: ఐళితిజీబీలి ళితీ ఈబిశిబి : జూఖితిబీబిశిరిళిదీ ఈలిచీబిజీశిళీలిదీశి, స్త్రళిఖీశి. ళితీ జు.ఆ.

ఆ రోజు ‘మహిత’ సంస్థ చేసిన ప్రజంటేషన్‌ ఇది. ఆంధ్రప్రదేశ్‌ అలయన్స్‌ ఫర్‌ ఛైల్డ్‌ రైట్స్‌ వారు 21 నవంబర్‌ నాడు హైదరాబాద్‌. ”ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం అమలు – పాఠశాలల్లో మౌలిక సదుపాయాల తీరు తెన్నులు” అనే అంశం మీద ఒక మీటింగ్‌ నిర్వహించారు. ఇంత విభ్రాంతికరమైన వాస్తవాలు వెల్లడించిన ఈ సమావేశంలో నేనూ పాల్గొన్నాను. షాక్‌ తగిలినంత పనైంది. విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్‌ బీహార్‌ కన్నా అధ్వాన్న స్థితిలో వుందన్న నగ్న సత్యం చాలా దుఃఖానికి గురి చేసింది. ఆ రోజు నాతోపాటు సర్వ శిక్షా అభియాన్‌ విభాగానికి చెందిన అధికారి కూడా వేదిక మీద వున్నారు. ఈ గణాంకాల మీద, విద్యా హక్కుచట్టం అమలవుతున్న తీరు మీద స్పందించమని అడిగినప్పుడు ఆయన మాట్లాడిన తీరు ఎవరికైనా తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది.

ఆ రోజు ఆయన మాట్లాడిన అంశాలు- భారతీయ తత్వశాస్త్రం, వర్ణాశ్రమ ధర్మాలు, మనిషి జీవితంలోని ధర్మాలు, కోపాలు తెచ్చుకోకూడదు. శాంతంగా, ప్రశాంతంగా వుంటే బి.పీలు, షుగర్‌లూ రావు. సమస్యలుంటాయి. జుట్టు పీక్కోకూడదు. లాంటి సూక్తి ముక్తావళి వినిపిస్తుంటే… సర్‌… ఇది సత్సంగ్‌ కాదు…. విద్యా హక్కు చట్టం అమలు గురించి మీరు మాట్లాడండి.. . అని నేను గట్టిగా అడిగేసరికి … సత్యవతి గారు! మీరు కోప్పడతారని నాకు తెలుసు. నిజాలు ఎప్పుడూ నిష్ఠురంగానే వుంటాయి. అంటూ ఏమేమో మాట్లాడసాగాడు.

ఇలాంటి అధికారులే ఎక్కువ వున్న ప్రభుత్వ వ్యవస్థల్లో 52% పిల్లలు బడి బయటేవున్నారని చేప్పే (అవి ప్రభుత్వం వారు చెప్పినవే) గణాంకాలు, టాయిలెట్‌లు లేక బాలికలు పాఠశాల కెళ్ళడం మానేస్తున్న వాస్తవాలు మనల్ని దిగ్భ్రమ పరుస్తాయి కానీ బండబారిపోయిన అధికారాల్ని కాదు. కోట్లాది రూపాయలు ఖర్చవుతున్న సర్వ శిక్షా అభియాన్‌ భవిష్యత్తరాల పట్ల విద్య వ్యవహరిస్తున్న తీరు ఇది.

దీని మీద ఏం చెయ్యాలో అందరం సీరియస్‌గా ఆలోచించాలి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.