శిలాలోలిత‘
‘కళ్ళల్లో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాల్లో కాంతి, జీవితంలో ఔన్నత్యం – నిరాడంబరత నుంచే వస్తాయి.”
– వాల్ట్ విట్‌మన్ అన్నట్లుగానే నిరాడంబరతలోని సౌందర్యమే గీత కవిత్వం.
‘నిశ్శబ్దాన్ని మోయడమూ కష్టమే’నంటున్న ఈ కవయిత్రి ‘మౌనచిత్రాలు’ అనే కవితాసంపుటిని 2005లో ప్రచురించారు. నిశ్శబ్దపు బరువునీ, నిరాడంబరత సొగసును తూచే రాళ్ళున్నందువల్ల ఈమె కవిత్వానికొక గాఢత వచ్చింది. ‘చెట్టు’ నుంచి ‘అద్వైతం’ వరకూ మొత్తం 35 కవితలున్నాయి అనడంకంటే ‘ఒలికిన స్వప్నాలు’న్నాయి అని అనొచ్చు.
‘కాశిపాడ’నే అందమైన పల్లెలో పుట్టిన ఈమె ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. పిహెచ్‌డి చేశారు. పాటలు వినడం, నిరంతరం చదువుతూ వుండటం ఆమె అలవాటన్నారు. సమాజం గురించి ఆలోచించకుండా ఉండలేకపోవడం తన బలహీనత అని చెప్పుకున్నారు.
ఇక, ఆమె కవిత్వపాదాలపై దృష్టిసారిస్తే – పర్యావరణ పరిరక్షకురాలిగా స్త్రీజన్మ పొందే కష్టాలను, ప్రకృతి విధ్వంసక శక్తులు చెట్టునీ, ప్రకృతి విరుద్ధశక్తులు స్త్రీపై చేసే జులుంని ‘చెట్టు’ కవితలో దృశ్యవనం చేశారు.
మనిషిలోని అంతర్గత భావోద్వేగ చెలమను ‘లోయ’ కవితలో కనుగొంది. మానవ వికృత మనస్తత్వాన్నీ, జుగుప్సతో భరించాల్సిన స్థితినీ, శబ్దాలతో మాటలతో సెక్సానందాన్ని వెతుక్కునే కక్కుర్తినీ, లేకితనాన్ని ‘రాంగు నెంబర్’ కవిత ప్రదర్శించింది.
‘వన్ ఈజ్ ఎ సోషల్ ఆనిమల్’ అని ఎప్పుడో సోక్రటీస్ అనేసాడు. సాంఘిక జంతువు ‘అహం’ తొలగనంతవరకూ అతడ పశువే సుమా అని ‘మనిషి’ కవితలో గబుక్కున ఓ నిజాన్ని విప్పేసింది.
ఒక ఆప్టిమిస్ట్‌గా, స్వేచ్ఛను ఎగరేసిన గొంతు, ‘ఎగరడానికో రెక్క’ వుంటే, ప్రశ్న జ్ఞానాన్ని కలిగిస్తుందన్న భయన్ని విడనాడినప్పుడు జీవితపు అంచు అరచేతుల్లో వుంటుందన్న ఆత్మవిశ్వాస ప్రకటనను కవిత్వీకరించింది.
గొంతునుండి చిప్పిల్లిన భావధార ‘నిశ్శబ్దం’ కవిత. శబ్దనిశ్శబ్దాల తక్కెడలో జీవనయనాన్ని గురించి, గడ్డకట్టే స్థితిని ఆవిష్కరించింది.
నడిచే, నర్తించే, ఆలోచింపజేసే అక్షరాలమాల లైబ్రరీని గురించిన సున్నితమైన భావప్రకటన – ‘అక్షర దేవాలయం’ కవిత.
‘ఎదురుచపు’లో సమాంతరరేఖల ప్రయణం గురించి, విశ్వభాష, గ్లోబు, గృహిణి, ఎందుకుపోయరు?’ ఒలికిన స్వప్నం, చీకటి రేఖలు, ఆనువంశిక దుఃఖం, జీవితాలు, ఆశ, హత్య, ఎరుక, మృత్యువు, కాలరేఖ, నాన్న మరణం, నేను, వెంటాడే వేదన, అద్వైతం కవితలన్నింటా కవిత్వం పరివ్యాప్తమై వుంది. ఒక నిరంతర చింతన, ఉద్వేగం కెరటాలై కవిత్వపాదాలై మనముందు నురగలు కక్కుత, తెల్లటి స్వచ్ఛతను ప్రదర్శిస్తుంటాయి.
డా|| వి. గీత సున్నితమనస్కురాలు. ఆ సున్నితత్వ ప్రదర్శనంతా కవిత్వంలో కన్పిస్తూనే వుంటుంది. మౌనంగా వుండే బడబాలనస్తూమె. స్తూటెంత తక్కువో, పొదుపరో కవిత్వంలోన అంతే. కవితాశీర్షికలు కూడా క్లుప్తంగా, గుప్తంగా వుంటాయి. భావ వ్యక్తీకరణంతా సరళమే. భావ స్థిరత్వం స్తూత్రం గాఢానుభతిని, రసానుభతిని కల్గిస్తాయి.
ఇటీవల రాస్తున్న కవయిత్రులలో గీత ఒకరు. మంచి మంచి కవిత్వాలతో ఇకపై కూడా కవిత్వాభివనులకు సాహిత్యా నందాన్ని కలిగిస్తూ, ఆలోచనలను రేకెత్తించే ఈ ధోరణితోనే ఆమె కవిత్వం మరింత లోతైన శైలితో కొనసాగాలని, కొనసాగు తుందని ఆకాంక్షిస్తున్నాను.