ఉన్నత విద్యా సంస్థల్లో స్త్రీలపై లైంగిక దాడులు (స్థితిగతులు)

సర్వం శక్తి మయం. శక్తి స్త్రీ స్వరూపం. ఈ అనంత విశ్వానికి మహిళనే మూలాధారం. ప్రాచీన కాలం అనగా భారత ఇతిహాసాలలో మహిళలకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ మహిళ గర్భంలో పిండ దశ నుండే అడుగడుగునా గండాలు, సామాజిక అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రాణిస్తున్న ధైర్యవంతురాలు.

ఆనాడు గురజాడ అప్పారావుగారు ఆధునిక స్త్రీ చరిత్రని తిరగరాస్తుందన్నాడు. ఇది వంద సం||ల క్రితం మాట. నిజంగానే నేడు మహిళలు నేల నుండి నింగి వరకు సర్వం తానే అంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఒకనాడు ఆడపిల్ల పుట్టింది అంటేనే తల్లిదండ్రులు తమ గుండెల మీద కుంపటిలా భావించే వారు. కాని, అలాంటి పరిస్థితి నేడు లేదు.

భారతంలో ద్రౌపది, రామాయణంలో సీత, మహాభారతంలో యశోద, రాధలను పరిశీలిస్తే స్త్రీల యొక్క సమున్నత శక్తి తెలుస్తుంది. త్యాగానికి, సహనానికి సీత ప్రతీక. ఆత్మగౌరవానికి ద్రౌపది, యశోద పాత్రలో తల్లిపడే ఆరాటం, రాధ పాత్రలో అలౌకిక ప్రేమకు చిహ్నాలుగా నిలుస్తాయి. అలాంటి స్త్రీలు చదువుకోవడానికి వేదకాలం నుండి నేటివరకు కూడా అడుగడుగునా ఎన్నో అవాంతరాలు ఎదురౌతూనే ఉన్నాయి.

వేదకాలం :-

వేదకాలంలో స్త్రీలు వేదాలను చదువకూడదు. చదివినా దానిని ఎక్కడా చెప్పకూడదని ఆంక్షలను విధించినారు. అలా కాకుండా ఎవరైనా మహిళలు బహిరంగంగా వేద పఠనం చేసినా, వేదాలను గూర్చి చెప్పినా, చెప్పిన మహిళలకు కఠినమైన శిక్షలను విధించేవారట. అందువలన వేదాలు తెలిసినా కూడా ఎక్కడా మహిళలు చెప్పుకోలేదు. కాని వారికి తెలిసిన వేదాల సారాన్ని గూర్చి చుట్టుప్రక్కల స్త్రీలతో చర్చించేవారు. ఆ విధంగా ఒకరినుండి మరొకరికి కేవలం మౌఖికంగా ప్రసరించినందువలన మనకే కొన్నివేల కథలు వారి నుండి వెలువడినాయి. ఈ విధంగా స్త్రీ విద్యపై ఆంక్షలను మనం వేదకాలం నుండే గమనించవచ్చు.

నేడూ :-

స్త్రీలకు చదువు అవసరం అన్న పరిస్థితి నేడు లేదు. దాదాపు కొన్ని వందల సంవత్స రాల క్రితమే అనేకమంది స్త్రీలు చదువుకొని అనేక గ్రంథాలను రచించినారు. తాళ్ళపాక తిమ్మక్క, కవయిత్రి మొల్ల, రంగాజమ్మ, ముద్దు పళణి మొదలైనవారు. కానీ ఇటీవల కాలం వరకు స్త్రీల అక్షరాస్యత శాతం చాలావరకు తల్లిదండ్రుల ఆలోచనా విధానం లో మార్పు వచ్చి స్త్రీలకు కూడా విద్య అవస రమా అని భావించి చదివించడానికి ప్రయ త్నిస్తున్నారు. చదువుకోవడానికి ఇన్ని అవాంతరాలు దాటుకొని విద్యాసంస్థలోకి ప్రవేశించే స్త్రీకి దీపం చుట్టూ నీడలా స్త్రీల విద్యలోనూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

విద్యాసంస్థలలో మహిళల పట్ల లైంగిక వేధింపులు :-

ఇటీవలి కాలంలో చదువుకోవ డానికి కళాశాలకు వచ్చిన విద్యార్ధులను ప్రేమ పేరిట వేధింపులు ఎక్కువయ్యాయి. అది వేధింపులు అమ్మాయి చదువుకోవడానికి ఇంటి నుండి బయట కాలుపెట్టినప్పటి నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు దాదాపు అన్ని ప్రదేశాలలో లైంగికంగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు.

అనగా ఇంటి నుండి బయటకు వస్తున్న అమ్మాయి బస్సులో కళాశాలకు వెళ్ళేటప్పుడు దారిలోను, ఇతర వ్యక్తులు, తన శరీరంలోని భాగాలను పరిశీలిస్తూ వీలైతే మహిళల శరీర భాగాలను ఏదో వంకతో చూస్తూ, తాకుతు న్నట్లు ప్రవర్తిస్తారు. అక్కడ నుండి కళాశాలకు వెళ్తే కళాశాలలో అబ్బాయిలు అనునిత్యం ఏదో ఒక అమ్మాయిని కళాశాల ప్రారంభం లో ర్యాగింగ్‌ పేరుతో అనేక లైంగిక వేధింపు లకు గురిచేస్తున్నారు.

మరీ ఇటీవలి కాలంలో అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ అమ్మాయిల వెంటప డుతూ, అమ్మాయి ఇష్టంలేదు అంటే వారిని చంపేస్తానంటూ యాసిడ్‌ పోస్తానంటూ బెదిరిస్తూ నిత్యం లైంగికంగా వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక అనేకమంది చదువుకు దూరమైతే మరికొంతమంది దారుణ హత్యకు గురయ్యారు.

విద్యార్థినులకు ఏదైనా సమస్య వస్తే తీర్చమని తమ లెక్చరర్‌ గారికో, ప్రిన్సిపల్‌ గారిగో తమ సమస్య గూర్చి వివరిస్తే, ఆ సమస్యను తీర్చాలంటే తన కోరిక తీర్చమని వేధించే ప్రబుద్ధులు నేటి ఉన్నత విద్యాసంస్థ లలో అనేక ప్రదేశాలలో కనిపిస్తారు.

తమ తండ్రిలాంటి వారని తమ లెక్చరర్‌కు చెప్తే ఆ లెక్చరర్‌ గారే లైంగికంగా వేధిస్తే వారి సమస్యలు ఎవరికి చెప్పాలి.

లెక్చరర్స్‌ నుండి లైంగిక వేధింపులు, సైన్స్‌ గ్రూప్స్‌లో ప్రాక్టికల్స్‌ మార్క్స్‌ వేసే ప్రదేశాలలో మరీ ఎక్కువగా ఉన్నది.

యవ్వన దశలో ఉండే విద్యార్ధులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కళాశాల లెక్చరర్స్‌ & ప్రిన్సిపాల్‌ పై ఉంటుంది. ఇటీవలి కాలంలో ఉన్నత విద్యాసంస్థలలో ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురై మరణించిన మహిళల గూర్చి ఒకసారి తెలుసుకుందాం.

ఢిల్లీలో నిర్భయపై అత్యాచారం :-

దేశ రాజధాని నడిబొడ్డున తన స్నేహితునితో కలసి వెళ్తున్న వైద్య విద్యార్ధిని అయిన నిర్భయపై ఐదారుమంది దుండగులు కలసి అత్యాచారం చేసి హత్య చేయడానికి పూనుకున్నారు. యావత్‌ దేశం ఆమె చనిపోవడంతో దిగ్భ్రాంతి చెందింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఆందోళనలు జరిగి దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ అత్యాచారం చేసిన వారికి తగిన శిక్ష పడలేదు.

నిన్న జరిగిన నల్లగొండ చిన్నారులపై అత్యాచారం :-

కామాంధుడైన ఉపాధ్యాయుడు (ట్యూటర్‌) అయిన హరీష్‌ అనే వ్యక్తి అభం శుభం తెలియని పదిమందికి పైగా చిన్నారులను దారుణంగా అత్యాచారం చేసిన సంగతిని తలచుకుంటే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిందే. పసిమొగ్గలను ఇలా కనురెప్పలే కాటేస్తుంటే సమాజంలో స్త్రీలు, మహిళలు విద్యార్ధినులు పరిస్థితులు ఏమిటి? ఇలాంటిది మరెంత కాలం?

1. శ్రీలక్ష్మి – నాగరాజు :-

శ్రీలక్ష్మి నాగరాజులు ఇద్దరూ కూడా ఒక పేరొందిన ఎంబీఏ కాలేజీలో చదువుతున్నారు. నాగరాజు శ్రీలక్ష్మిని అనేకసార్లు ప్రేమించమని వేధిస్తూ ఉండేవాడు. అతనిపై చర్య తీసుకొమ్మని ఎన్నిసార్లు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

నాగరాజు నుండి లైంగిక వేధింపులు ఎంత ఎక్కువైనా సహనంతో భరిస్తూనే ఉన్నది శ్రీలక్ష్మి.

ఒకానొక రోజు నాగరాజు తరగతి గదిలోనే అతికిరాతకంగా కత్తితో నరికి చంపేశాడు.

2. అయేషా మీరా :-

విజయవాడలో ఒక నర్సింగ్‌ కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతున్నది అయేషా చదువుకుంటూ స్థానికంగా కాలేజీకి అనుబంధంగా ఉన్న కళాశాల హాస్టల్‌లో ఉండేది. ఆ అమ్మాయిని అతి కిరాతకంగా వివస్త్రను చేసి అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే వున్నది.

3. మాళవిక :-

వరంగల్లు జిల్లాలో ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని తమ స్నేహితురాలితో కలసి బైక్‌పై వెళుతున్న సమయంలో తమ కళాశాలలో చదువుతూ అనేకసార్లు ప్రేమించమని, పెళ్ళిచేసుకోమని బెదిరించిన తన తోటి విద్యార్థి. తన ప్రేమను తిరస్కరిం చినదని బైక్‌పై వెళుతున్న అమ్మాయిలపై యాసిడ్‌ దాడి చేస్తే దాదాపు 60% కాలిన గాయాలతోనే పరీక్షలు రాసి పాసై ఉద్యోగం సంపాదించిన వనిత మాళవిక.

4. మధ్యప్రదేశ్‌ :-

ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక తరగతి గదిలో దాదాపు 40 మంది అబ్బాయిలు, పరీక్ష రాస్తున్న ఒక అమ్మాయిని, ఆ పరీక్ష కేంద్ర ఇన్విజిలేటర్‌ ఆ అమ్మాయి చేత అందరు మగ విద్యార్ధుల ముందు బట్టలు ఊడదీయించాడు. ఆ ఉపాధ్యా యుడు అంతటి నీచులు ఉన్నారు ఈ సమాజంలో.

5. శశికళ – మునిరాజు :-

ఇటీవలి కాలంలో పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శశికళ అనే అమ్మాయి బి.కాం. చదువుతోంది. ఆమెను నిత్యం ప్రేమించమని మునిరాజు అనే అతడు వేధించేవాడు. అతని ప్రేమను శశికళ తిరస్కరించింది. ఆమెపై కోపం పెంచుకున్న మునిరాజు సమయం కోసం వేచి చూసి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒంటరిగా వున్న ఆమెను కత్తితో పొడిచి వచ్చాడు.

అనంతపురంలోని కొత్తచెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక అధ్యాపకుడు తన వద్ద చదువుకుంటున్న ఒక విద్యార్ధికి ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయాలంటే తన కోర్కెను తీర్చమని వేధించడంతో ఆమె గర్భం ధరించి చివరికి ఆత్మహత్యకు దారితీసింది.

ఇలా కంచె చేనుమేసినట్లు చదువుకోవ డానికి కళాశాలకు వచ్చే విద్యార్ధినులను & మహిళలను లైంగికంగా వేధిస్తూ, బెదిరిస్తూ, చంపేస్తూ వుంటే ఏ స్త్రీకి చదవాలన్న ధైర్యం ఉంటుంది. నీకు చదువే వద్దు అనే కుటుంబా లలో నుండి వచ్చి వారి తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులను చదవాలనే కోరికతో కళాశాలలో చేరే యువతులను ఇన్ని విధాలుగా లైంగికంగా వేధిస్తుంటే వారు ఏ ధైర్యంతో చదువగలరు.

ఇలా యువతులను ప్రేమిస్తున్నా నని వెంటబడుతూ, వారు నిరాకరిస్తే తనకు దక్కనిది వేరెవ్వరికీ దక్కకూడదని అనుకునే యువకులలో, అలా వేధించడం తప్పు అని ఎప్పుడు తెలుసుకుంటారో వేచి చూడాలి.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేటి మహిళలు విద్యపై గల మక్కువతో కష్టపడి చదివి ఉన్నతమైన పదవులను ఎందరో నారీమణులు చేరుకున్నారు. వివిధ రంగాలలో నేడు మహిళ విజయ పథంలో సాగుతోంది. అంతరిక్షంలో కాలు మోపుతోంది. శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాలలో మహిళ నేడు తిరుగులేని ఖ్యాతి సముపార్జించింది.

స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపుల పరిష్కార మార్గాలు :-

చదువుకుంటున్న యువతులపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టాలంటే –

పటిష్టమైన చట్టాలు రూపొందించాలి.

యువతులు చైతన్యంతో లైంగిక వేధింపులను త్రిప్పి కొట్టాలి.

ఎక్కడైనా యువతులపై లైంగిక వేధింపులు జరుగుతుంటే ప్రాధేయపడకూ డదు. ధైర్యంగా వారికి ఎదుర్కొనే తెగువ కావాలి.

నేటి మహిళలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.

చదువుల్లో, ఉద్యోగాల్లో, విధి నిర్వహణలో మగవారికి తీసిపోని రీతిలో ప్రయాణించాలి.

కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే మార్గాలను సూచించాలి.

విద్యార్థిని, విద్యార్థులందరూ ఇతర వ్యసనాలకు లోనుకాక తమ జీవితాలను తమకు నచ్చినట్టుగా మలచుకోవాలి.

యువతులు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి.

ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న… ప్రత్యేక చట్టాలను ప్రతి ఒక్క యువతి తమకు ఉన్న హక్కులను గూర్చి తెలిసేలా చేసి ఎక్కడైనా తమకు అన్యాయం జరిగితే ధైర్యంగా ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయాలి.

ఉన్నత విద్యారంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అమ్మాయిలకు ఇతరుల నుండి వస్తున్న వేధింపులను పరిష్కారానికి కళాశాలలో విద్యార్ధినీ సంఘాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

ముగింపు :-

ఎందరో నారీమణులు వారందరూ కూడా కీర్తికిరీటాల మహారాణులు. వివిధ రంగాలలో నేడు మహిళ విజయపథంలో సాగుతోంది. అంతరిక్షంలో కాలుమోపు తోంది. శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాలలో మహిళ నేడు తిరుగులేని ఖ్యాతిని సముపార్జించుకుంది. ఆధునిక భారతదేశం లో రాజకీయ రంగంలో మహిళ నేడూ అత్యంత కీలక స్థానంలో నిలిచింది. రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ విజయకేతనం ఎగురేస్తున్నారు.

ఇలాగే ఎన్నో రంగాలలో అనేకమంది మహిళలు తిరుగులేని విజయాలను సాధించారు. రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ సేతు హిమాచలం స్త్రీ శక్తి సంఘటితం అయితే కేవలం మహిళకే కాకుండా సకల జనులకూ పండుగే. అమెరికా, రష్యా, చైనా, భారతదేశాల్లోని సకల వ్యవస్థల్లో మహిళలే విధాన నిర్ణేతలయితే ప్రపంచం స్వరూపం మారిపోతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.