డా. జి.భారతి
ఒక దేశపు సాంఘిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలన్నా, ఆ దేశంలో జీవించే ప్రజల జీవితాలను గురించి తెలుసుకోవాలన్నా నవల చక్కని మాధ్యమంగా అనిపిస్తుంది.
నవల చదువుతున్నప్పుడు ఆ పాత్రలతో, ఆ జీవితాలతో మనం తాదాత్మ్యం చెంది, ఆ దేశంలోనే జీవిస్తున్నట్లు అనుభతి చెందుతాం. అందువల్ల దేశాలమధ్య ఎల్లల, తేడాల, చివరకు తగాదాలు కూడా గుర్తుకు రావు.
ఎన్నో ఉపన్యాసాల, పుస్తకాల, ప్రణాళికల చెయ్యలేని పని ఒక నవల చెయ్యగలుగుతుంది.
ఇప్పుడు పరిచయం చేయబోయే నవల మన పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగింది. ఇది యదార్ధ గాధ కాకపోవచ్చు, కానీ యదార్ధంగా ఆపరిస్థితులు కలిగినాయని అర్థమవుతుంది. ఈ నవల వ్రాసిన రచయిత పేరు ఖలీద్ హుస్సైనీ. ఇతను ఆఘ్ఘనిస్థానీయుడు. అక్కడి పరిస్థితుల్ని చూసి, అనుభవించి వ్రాసాడు. విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు పొందిందీ నవల.
ఈ కథ ఇద్దరు స్త్రీల గురించి. మొదటి స్త్రీ పేరు మరియమ్. ఈమె ఒక ధనవంతుడికి పుట్టిన అక్రమసంతానం. ఆ ధనవంతుడికి ముగ్గురు భార్యలు ఉన్నా, పనిమనిషితో సంబంధం పెట్టుకుని మరియమ్‌కి తండ్రవుతాడు. కానీ ఆయన హోదాకీ, స్థితికీ ఒక పనిమనిషిని పెళ్ళాడటం ఆమోదయెగ్యం కాదు. అందుకని ఊరి చివర ఒక గుట్టమీద ఓ మట్టిగుడిసె కట్టి దాన్లో మరియమ్ తల్లినీ, కూతుర్నీ ఉంచుతాడు. అక్కడికి రావాలంటే కొంతదూరం కార్లో వచ్చి చిన్న ఏరు దాటి, ఎత్తుగా పెరిగిన గడ్డీతుప్పల మధ్య కాలిబాటలో నడిచి రావాలి. నెలనెలా వాళ్ళకి కావలసిన ఆహారపదార్థాలు తన సక్రమ సంతానంలో ఒకరి ద్వారా పంపుతాడు. వాళ్ళు మరియమ్ వంకగానీ, ఆమె తల్లివంకగానీ చూడను కూడా చూడరు. పన్నెత్తి పలకరించరు. చుట్టుపట్ల ఎవర లేకుండా, ఆడుకునే తోటిపిల్లలు లేకుండా, ఎప్పుడూ నిరాశతో ప్రపంచాన్ని ద్వేషిస్త అసంతృప్తితో ఉండే తల్లితో ఒంటరిగా ఆ యింట్లో పదిహేను సంవత్సరాలు వచ్చేవరకూ జీవిస్తుంది మరియమ్. జీవితం పట్లా, మనుషుల పట్లా నిరాదరణా, విశ్వాసరాహిత్యంతో ఉండే తల్లి సణుగుడు మాత్రం తెలుసు మరియమ్‌కి. వారానికోసారి తండ్రి హెరాత్ పట్నం నుంచి చూడ్డానికి వస్తాడు. ఎన్నో కబుర్ల, కథలు చెప్తాడు. బొమ్మలు అవీ తెస్తాడు. మరియమ్‌ని వళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తాడు. మరియమ్ తల్లి రుసరుసలాడ్త అవన్నీ ఆయన సక్రమ సంతానం ఆడి విసుగేసి పారేసిన బొమ్మలనీ, ఆ మాటలన్నీ తేనెపూసిన కపటపు మాటలనీ, ఆయనలో అసలు నమ్మదగినదేం లేదనీ అంట, మరియమ్‌కి కలిగే ఆ కాస్త ఆనందాన్నీ చంపేస్తుంది. కానీ తండ్రి వచ్చే ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు మరియమ్‌కి. దానికోసం ఎదురుతెన్నులు చూడటమే ఆమెకి ఆనందం. మరియమ్ తల్లి అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తుందోనని మనకి ఆమెమీద కోపం, మరియమ్ మీద జాలీ కలుగుతాయి. ఆ పిల్ల కురాన్ చదువు కునేందుకు ఒక ముల్లాని కుదురుస్తుంది. అతనొక్కడు మరియమ్‌కి సంతోషకారణం అవుతాడు. ముల్లా ఫయజుల్లా సాబ్ ఆమె జీవితంలో మరువరాని వ్యక్తి. ఆయన కరుణాహృదయం, జీవితంలో అన్ని కోణాలన చూసిన ఆయన హృదయౌన్న త్యం ఆమెకి ఎడారిలో ఒయసిస్‌లాగా వుంటాయి.
మరియమ్ తండ్రికి హెరాత్‌లో షాపుల, ఒక సినిమాహాలు కూడా వుంటుంది. అందులో వచ్చిన కార్టన్ సినిమా గురించి మరియమ్‌కి చెప్తాడు. ఎంతో ఆసక్తితో వింటుంది. ‘నాకూ చూపిస్తావా?’ అని అడుగుతుంది. ‘అదెంత భాగ్యం!’ అంటాడాయన. ముక్కూ-మూతీ విరుస్తుంది మరియమ్ తల్లి. తరవాత ఆయన కోసం ఎన్నో రోజులు ఎదురుచూసి ఆయన యింటికి వెళ్ళటానికి ప్రయణమౌతుంది. తన్ను తండ్రి ఎంతో ఆదరంతో ప్రేమతో ఇంట్లోకి తీసుకువెళ్ళి, కారులో సినిమాకు పంపి చూపిస్తాడనుకుంటుంది. తల్లి వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోదు. నువ్వు వెళ్తే నేను చచ్చిపోతానంటుంది. అయినా ఆ మాటల్నేం లెక్కచెయ్యక
ఈ వ్యాసం మధ్యలో, అందులోనూ వాక్యం మధ్యలో, ఆగిపోయినట్లుందే? అయినా, వ్యాసంలో కథాసారాంశం
కాకుండా, కథని సమీక్షించి ఉంటే బావుండేది.
ఇ హవె రెఅద థిస బూక. ణొత తూ గ్రత. తూ ముచ విఒలెంచె అంద అంద థె ఎమ్ఫసిస ఇస ఒన హెల్ప్లెస్స నెస్స
అనామకుడు గారూ,
మీరు రాయదల్చుకున్నది..
“I have read this book. Not too great. too much voilence and and the emphasis is on helplessness”
ఇదేనా?
మీరు ఇలా ఆంగ్లం లోనే రాయాలనుకుంటే “shift & 3” button లను ఒకేసారి వాడుతూ తెలుగు / english లిపిని ఎన్నుకోవచ్చు.
లేదా, పైన ఇచ్చిన తెలుగు option బదులు english అన్న చోట క్లిక్ చేయండి.
కధ పూర్తిగా లేదే
శైలజ