15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం

కె. వెన్నెల

ఈ మధ్య వచ్చే సినిమాల్లో పిల్లలకు అవసరమైన అంశాలే ఉండడం లేదు. పిల్లలను జోకర్లుగా, రౌడీలుగా చూపిస్తున్నారు. ఒక కుటుంబంలోని వారు సినిమాలకు వెళితే అందులో పిల్లలు ఎక్కువ, పెద్దలు తక్కువ ఉంటారు.

అంటే సినిమా ప్రేక్షకుల్లో పిల్లల సంఖ్యే ఎక్కువ. అయినా పిల్లలకు కావల్సిన సినిమాలు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సినిమాలుమా, సరియైన మార్గం చపించే సినిమాలు రావడమే లేదు. సినిమాల ప్రభావం పిలల మీద చాలా ఉంటుంది. అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు కూడా పిల్లలు. అలాంటప్పుడు మంచి సినిమాలు చాలా అవసరం కదా.
15వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో బాల ప్రతినిధిగా పాల్గొనే అరుదైన అవకాశం మా పాఠశాల నాకు కల్పించింది. దాదాపు వారం రోజులపాటు ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు చూశాం. నేను ఇన్ని సంవత్సరాలుగా చూ సిన సినిమాలకు, ఈ సినిమాలకు ఎంతో తేడా కనిపించింది. ఈ సినిమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటట్లుగా, ఆలోచింపచేసేటట్లుగా ఉన్నాయి. ఈ పిల్లల ఆకాంక్షలు, ఆశలు, ఆలోచనలు తెలియచెప్పే ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తే బాగుండుననిపించింది. పిల్లల మనో వికాసానికి ఉపయెగపడే ఇలాంటి సినిమాలు చూసే అవకాశం కొద్దిమంది పిల్లలకే కాకుండా అందరికీ కల్పించాలి. వమూలుగా వచ్చే సినిమాల్లాగానే ఈ సినిమాలు కూడా థియేటర్లలో ఆడాలి. పాటశాలల్లో కూడా చూ
పించొచ్చు. తెలుగులో కూడా ఇంకా ఎక్కువగా పిల్లల మనోభావాలు గుర్తించి, అందుకు అనుగుణమైన సినిమా
లు తియ్యాలి.
నేను చసిన సినిమా
ల్లో నాకు బాగా నచ్చిన సినిమా
లు ”ఇన్‌విజిబుల్‌ వింగ్సు”, ”ఐ యమ్‌ ఫేమస్‌”, ”నో క్రోకడైల్‌ టియర్స్‌”, ”అమూల్యం”. ”ఇన్‌విజిబుల్‌ వింగ్సు” అనే చైనా చిత్రం నా మనసుకు హత్తుకుంది. భాష అర్థం కాకపోయినా, సబ్‌-టైటిల్స్‌ వేగంగా చదవలేకపోయినా, ఆ చిత్రం నన్నెంతో కదిలించింది. ఒక అమ్మాయి, సాధారణమైన, అందరిలాగా జీవితం గురించి కలలుకనే అమ్మాయి, అనుకోకుండా అగ్నిప్రమా
దానికి గురై చేతులు పోగొట్టుకుంది. డాక్టరై, ప్రజలకు సేవచెయ్యలని తన కోరిక. మనం చేతులుండి కూడా సరిగ్గా చెయ్యలేని పనులు కూడా తను చేతులు లేకుండానే చెయ్యగలుగుతుంది. యూనివర్సిటీ ఎంట్రెన్స్‌లో తప్పుతుంది. ఆమెకెంతో సహాయం చేసే తల్లి ఆ దిగులుతోనే మతిస్థిమితం కోల్పోయి మరణిస్తుంది. చేతులులేని ఆ అమ్మాయి ఎంతో శ్రమించి జాతీయ ఈత పోటీల్లో ప్రథమురాలిగా నిలుస్తుంది. దాంతో యూనివర్సిటీవారు ఆమెకు సీటు ఇస్తున్నట్లుగా ఉత్తరం రాస్తారు. కనిపించే చేతులు పోగొట్టుకున్నా, తన కఠిన పరిశ్రమతో ఆమె కనిపించని రెక్కలతో విజయం వైపుకు ఎగిరివెళ్ళ గలిగింది. ఇలాంటి సినిమా
లు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను.
నాకు నచ్చిన మరో చిత్రం ”ఐయమ్‌ ఫేమస్‌”. ఫేమస్‌ అయిపోయిన ఒక చిన్నపాప గురించి. ఆ అమ్మాయి ఎందుకు ఫేమస్సో తనకూ, మనకూ కూడా చివరిదాకా తెలీదు. చివరికి తెలిసేదే మిటంటే ఆ అమ్మాయి ఒక పాజిటివ్‌. అంత చిన్న అమ్మాయి తన మనసులోనే ఎంతో బాధను దాచుకుంటుంది. ”ప్రసిద్ధి చెందిన వాళ్ళెప్పుడూ ఒంటరివాళ్ళే” అని వాళ్ళ టీచర్‌ చెబుతుంది. అలాగే ఆ అమ్మాయితో ఎవ్వరూ మాట్లాడరు. మనందరం ఇలాంటి సినిమాలు చూడడమే కాకుండా వాటినుండి ఎంతో కొంత నేర్చుకోవాలి.
”నో క్రోకడైల్‌ టియర్స్‌” జంతు ప్రేమికుల గురించి, జంతుకారుణ్యం గురించి. తన కొడుకును గాయపరచిన మొసలిని చంపాలనుకుంటాడు ఒక వ్యక్తి. కానీ, కొంతమంది పిల్లలు, ఆ ఊరిపెద్ద కలిసి దాన్ని రక్షిస్తారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమిటంటే ప్రతి జంతువుకి ఒక సహజగుణం ఉంటుంది. దాన్ని మనం మార్చలేం. కేవలం జూకు వెళ్ళి జంతువులను చూడ్డమే కాదు, మనచుట్ట ఉన్న జంతువుల పట్ల కూడా దయగా ఉండాలి.
నాకు నచ్చిన మరో చిత్రం ”అమూల్యం”. చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. అమ్మమ్మ, తాతయ్య లను మరచిపోవద్దని చాలా బాగా చెప్పారు. అలా చేయడం వలన చిన్నపిల్లల మనస్సులో అమ్మమ్మ, తాతయ్యలకున్న స్థానం సుస్థిరమవుతుంది. పల్లెటూర్లకు, పట్టణాలకు మధ్య తేడాను కూడా చక్కగా చూపించారు. తెలుగులో ఇంకా ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తే బాగుంటుంది కదా! ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్ళేదాకా ఇలాంటి సినిమాల గురించి పిల్లలకు ఎందుకు తెలియడం లేదు!
నేను చూసిన వాటిలో కొన్ని సినిమాలు నాకు నచ్చలేదు. కొన్నయితే అసలు అర్థమే కాలేదు. ”ద గర్ల్‌ ఏజ్డ్‌ 13” అనే సినిమాలో పదమూడేళ్ళ అమ్మాయిని చూపించిన విధానం అస్సలు బాగాలేదు. అసలు బాలల చిత్రోత్సవానికి సినిమాలను ఎలా, ఎందుకు ఎంపిక చేస్తున్నారో, ఏ ప్రాతిపదికనో తెలీదు. బాలల చిత్రాలను ఎంపిక చెయ్యడంలో పిల్లలకు కూడా పాత్ర ఉండాలి, ఒక బాలల చలనచిత్రోత్సవానికి ఏర్పాట్లు చేసేముందు అంతకు పూర్వం బాలల చలన చిత్రోత్సవానికి ఎంపికైన బాలప్రతినిధులను అప్పుడు చూపించిన చిత్రాల మీద అభిప్రాయం అడిగి తెలుసుకోవాలి. వారు చూసిన చిత్రాలు ఎందుకు బాగాలేవో లేదా బాగున్నాయె, బాలల చిత్రాలు ఎలా ఉండాలని పిల్లలు కోరుకుంటారో తెలుసుకుంటే బాగుంటుంది. ఒక్కో దేశం ఒక్కొక్క రకమైన సినిమాలను తీస్తుంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇతర దేశాల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. కానీ ఇలాంటి సినిమాలను ఎంపిక చేసేటప్పుడు మనదేశపు జీవనశైలి, సంప్రదాయలను మనసులో పెట్టుకోవాలి. ఇలాంటి సినిమాల్లోని ఇబ్బందికరమైన అంశాలు పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు కదా.

Share
This entry was posted in Uncategorized, మాక్క ముక్కు పుల్ల గ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.