– కల్పన. పి
తెలంగాణ జిల్లాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు భూమిక రచయిత్రలతో కలసి వెళ్ళిన వైజాగ్ ట్రిప్ ఎప్పటికీ మరచిపోలేను. అలానే ఈసారి వెళ్ళిన ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించడం. ఒక సోషల్ వర్క్, ఫీల్డ్ వర్క్ లా అనిపించింది. ఈ ట్రిప్‌లో నిజంగా ఎన్నో మధురమైన అనుభవాలు ఉన్నాయి, నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొదటిరోజు అమృతలత మేడమ్ మరియు వారి గ్రూప్ ఇచ్చిన హాస్పిటాలిటి మరచిపోలేము. ప్రతి ఒక్కరిని ప్రేమగా రిసీవ్ చేసుకోవడం, మేము ఒక్కరోజులో కలిసిపోయాము.
మొదటిసారి గిరిజన గ్రామాలకు వెళ్ళటం, అక్కడి పరిస్థితులు, వారి జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, చూడటం, గమనించడం అన్నీ ఒక కొత్త అనుభవం. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన అమృతలత మేడమ్ వారి గ్రూప్‌కి అభినందనలు. ఇంకా నా దృష్టిలో చాలా గొప్పగా చెప్పలనుకునేది పొచ్చర జలపాతం దగ్గర మేము అందరం కలసి చేసిన అల్లరి. భూమిక స్టాఫ్ అక్కడి జలపాతం లోకి మేము దిగకుండ ఆగిపోయినపుడు నెల్లుట్ల రమాదేవి మేడమ్, ప్రశాంతి మేడమ్ మమ్మల్ని ధైర్యంగా తీసుకొనివెళ్లారు. వాళ్ళు అలా ఫోర్స్ చేయకపోతే మేము అంత ఆనందాన్ని మిస్ అయిపోయేవాళ్ళం.
రెండవరోజు ట్రిప్‌ను కో-ఆర్డినేట్ చేసింది ప్రశాంతి మేడమ్. కొమరం భీమ్ సమాధి, అక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వ్యవసాయంలో చేస్తున్న కొత్త మెలకువలు, వారితో ఇంట్రాక్ట్ అవ్వడం వలన చాలా విషయాలు ఆలోచింపచేశాయి. వారు చూపించే ప్రేమ, అభిమానం చాలా కదిలించాయి. అందరిని ఇక సమతా నిలయం పిల్లలు మా కోసం చాలా రాత్రి వరకూ ఎదురుచూస్తు అలసిపోయి మేము వచ్చిన వెంటనే అలసట అంతా మరచి, మమ్మల్ని చక్కగా పలకరించి, మాకు వారి ఇంటిని పరిచయం చేస్తూ, మా కోసం ఆ టైంలో ప్రోగ్రామ్స్‌ని చేసారు. అంతేకాకుండా వారు మా అందరికోసం బహుమానాలు సిద్దం చేసి ఇవ్వడం. అన్నీ చాలా బాగున్నాయి. ఇంత మంచి పనులు చేస్తున్న ప్రశాంతి మేడమ్ దగ్గర నుంచి మాలాంటి సోషల్ వర్క్ చేసిన వారు చాలా నేర్చుకోవాలి. ఇంత మంచి పని చేస్తున్న తను పేరుకోసం, పరుగులు పెట్టడం, తపించడం మచ్చుకైనా కనిపించవు. నిజంగా అనిపిస్తుంది. ఒక మనిషికి నిజమైన అందం, తను సాధించిన, విజయం, సంస్కారాల ద్వారానే.
ఇలాంటి అనేక ప్రాంతాలను చూడటం నేర్చుకోవడం ఇవన్నీ కేవలం భూమికలో ఉన్నందుకే సాధ్యం. ఇంత మంచి అవకాశాలను మాకు ఇస్తున్న సత్యవతి మేడమ్‌కి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూన్నాను. థ్యాంక్స్ మేడమ్ …