అలరించిన ఆదిలాబాద్‌ యాత్ర

– ఇందిర

నేను నర్సంపేట ఆంధ్రాబ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్‌ (2006) అయినప్పుడు గీతతో పరిచయం. తను, నేను అక్కడ రూమ్‌మేట్స్‌ తరువాత మంచి స్నేహితులుగా మారాం. అప్పుడే తన ద్వారా సత్యగారి గురించి వారి బిబీశిరిఖీరిశిరిలిరీ గురించి విని చాలా రిదీరీచీరిజీలి అయ్యాను. వీలయినప్పుడు వాళ్ళతో కలసి గడపాలని గీతని జీలివితిలిరీశి చేసాను. ఇన్నాళ్ళకు అది వీలయింది. పదిహేను మందికి పైగా, మధ్యవయసు దాటిన ఆడవాళ్ళం, అనుకున్న సమయానికి బయలుదేరడమే ఒక గొప్ప విషయంగా అనిపించింది. 20 ఫిబ్రవరి సాయంత్రం బయలుదేరి భూమిక ఆఫీస్‌ నుండి రీశిబిజీశి అయ్యాము.

నా డిగ్రీ క్లాస్‌మేట్‌ ఇంకా స్నేహితురాలైన ఉష కూడా మాతో వచ్చింది. చాలాకాలంగా మేము కలుసుకోలేకపోయాం. అప్పటినుండి ఇప్పటివరకు జరిగిన విషయాలు మాట్లాడుతుండగానే నిజామాబాద్‌ వచ్చేసింది. ఎనిమిదింటికల్లా నిజామాబాద్‌ చేరుకున్నాం. అక్కడ అమృతలత గారు వారి టీంతో కలసి మాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎంతో ఆత్మీయంగా పలకరించారు. వారి టీంలోని రమ కూడా మా బ్యాంక్‌లోనే చేస్తున్నారు. నాకు 2007 నుంచి మంచి మిత్రురాలు. అమృతలత గారు కట్టించిన అపురూప దేవాలయానికి వెళ్ళాం. ప్రశాంత వాతావరణంలో కట్టిన ఆ గుడి, దాని ప్రక్కనే ఎంతో కళాత్మకంగా కట్టిన ఒక గెస్ట్‌హౌస్‌. అక్కడే వుండాలనిపించేలా చేసాయి.

మాటల సందర్భంలో రమ చెప్పిన ఒక విషయం అమృతలత గారి మీద గౌరవభావానికి అంకురార్పణ వేసింది. అక్కడి పూజారి గారి క్వార్టర్‌ డిజైన్‌ చేసినప్పుడు పోర్టికో కూడా వేస్తే, అది ఎందుకు అని ఎవరో ప్రశ్నించారట. ”ఏం పూజారి గారికి కారు ఉండకూడదా?” అన్నారట ఆవిడ. ఆ తరువాత వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఒక వృద్ధాశ్రమం చూసాము. 45 మందికిపైగా వృద్ధులకు ఆ ఆశ్రమం నీడ కల్పిస్తోంది. అమృతలతగారి మంచి మనసుకు అది ఇంకొక నిదర్శనం అనిపించింది.

ఆ రాత్రి ఆర్మూర్‌లోని అమృతలత గారింటిలో బస అని చెప్పారు. వెళ్ళగానే ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఆవిడ భోజనానికి పిలిచారు. చాలా ప్రేమతో వడ్డించారు అక్కడివారు. అమృతలత గారిది చాలా పెద్ద ఇల్లు. అందరికి సౌకర్యవంతంగా పడక ఏర్పాట్లు చేయబడ్డాయి.

ఉదయాన్నే ఆరున్నరకల్లా మళ్ళీ అందరం బస్సులో వున్నాము. ఆ గ్రూప్‌ క్రమశిక్షణకు సత్య, గీత లీడర్‌షిప్‌కు అది నిదర్శనం. తరువాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అని తెలియగానే ఎగిరి గంతేసాను. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటినుండి అంటే మూడేళ్ళనుండి 13 సం||ల వరకు అక్కడే పెరిగాను. నాన్న ఆ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా చేసేవారు. నా బాల్యం అంటేనే పోచంపాడ్‌. (అప్పుడు అలా అని పిలిచేవాళ్ళం.)

నా స్కూల్‌ మీదుగా బస్‌ వెళ్తుంటే అందరినీ పిలిచి పిలిచి చూపించాను. మేము ఉన్న ఇల్లు కూడా కనపడింది. ఒక్కక్షణం బాల్యంలోకి వెళ్ళిపోయాను. ప్రాజెక్ట్‌ ఎక్కగానే ఒక అద్భుత అనుభూతి. దాని ప్రారంభంనుండీ నేను చూసాను. నాన్నకోసం అప్పుడప్పుడూ వెళ్తూ ఉండేవాళ్ళం. గోదారి మధ్యలో ఎన్నోసార్లు స్నానాలు చేసాం. దసరారోజు పాలపిట్టను చూడడానికి గోదారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. రామాలయ నిర్మాణం కూడా అప్పుడే జరిగింది. రోజూ భజనలు జరిగేవి. ఆ జ్ఞాపకాల ఝరిలో రాముని పాట అందుకున్నారు. చిన్నవే కాని ఎంతో ఆర్తిగా పాడుకున్నాను.

పూర్తిగా నవ ఉత్సాహంతో, జీలితీజీలిరీనీ అయి బయలుదేరాను.

పొచ్చెర : జలపాతం చేరుకోగానే మళ్ళీ అమృతలత గారు & టీం అమృతంలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్‌తో వెయిటింగ్‌. సుబ్బరంగా లాగించేసి జలపాతం క్రిందికి చేరిపోయాం. గంటన్నరకు పైగా ప్రపంచాన్ని మరచి ఆడుకున్నాం. తరువాత మళ్ళీ ఒక చిన్న గేమ్‌ ఆడించారు. అక్కడ నుండి కుంతల వాటర్‌ఫాల్స్‌. పూర్తిగా దిగలేకపోయాం. సమయాభావం. అక్కడనుండి మొండిగుట్ట అన్న ప్లేస్‌కు వచ్చాం.

అక్కడ ఒక ఫ్యామిలీ అందమైన ఫాంహౌస్‌లో నివసిస్తోంది. వెళ్ళగానే అమృతలత గారి టీం మెంబర్స్‌ (ఖిలిరీబీజీరిలీలిజీరీ, నీలిఖిళీరిరీశిజీలిరీరీ లిశిబీ.) ఒక సందేశాత్మకమైన నాటకం ప్రదర్శించారు. వారి టాలెంట్‌ చాలా గ్రేట్‌ అనిపించింది. మద్యపానంపై లీబిరీలి చేసిన నృత్యనాటకం అది. కడుపారా నవ్వుకుంటూనే ఆ సందేశం అందరికీ చేరేలా నావంతు కృషి చేయాలనిపించింది. మళ్ళీ విందుభోజనం. డయిటింగ్‌ గియిటింగ్‌ ఛోడ్‌దో అంటూ కుమ్మేసాం. వాళ్ళు పెంచుకుంటున్న ఎలుగుబంట్లను చూసాం. మంచెలాంటి దానిపై కాసేపు విశ్రాంతి.

మూడున్నర ప్రాంతంలో రెండు ట్రాక్టర్లలో బుర్కరేగడి అనే మారుమూల శిజీరిలీబిజి ఖీరిజిజిబివీలి కు ప్రయాణం. ట్రాక్టర్‌ తప్ప కారు వెళ్ళలేని దారి. చిక్కటి అడవి. ఉత్సాహం ఉప్పొంగే బ్యాచ్‌. గంటన్నర ప్రయాణం తరువాత చేరుకున్నాం.

అక్కడ ఆదరణతో కూడిన వెల్‌కం. ట్రైబల్‌ డాన్స్‌. మేము కూడా కలిసాము. సత్యగారు అక్కడివారితో సంభాషించి వారి గురించి తెలుసుకున్నారు. అక్కడి ప్రజలు వారికి ఉన్న పరిమితుల్లో చక్కటి జీవనం సాగిస్తున్నారనిపించింది. మా నీళిరీశి మళ్ళీ ప్రత్యక్షం. వేడివేడి గారెలు, ఇంకా టీ. తిరుగు ప్రయాణం మళ్ళీ ట్రాక్టర్‌లో. అరుపులు, గోలలు, అంత్యాక్షరి, కేరింతలు, జోకులు, పాటలు ఒకటేమిటి చేయగలిగినవన్నీ చేసాం. (జీన్‌ పాంట్‌ చిన్నది (నేనే) కానీ ట్రాక్టర్‌ ఎక్కలేదు అని సత్యగారి హాస్యం నీబిచీచీగి ళీలిళీళిజీగి)

తిరిగి రాగానే మళ్ళీ ఒక సందేశాత్మకమైన నాటకం. ఈసారి బంద్‌ల వల్ల జరుగుతున్న నష్టం గురించి ష్ట్రబిళీబి కూడా చీబిజీశిరిబీరిచీబిశిలి చేసారు. ష్ట్రబిళీబి ఒక మంచి రచయిత్రి. ఆవిడ కథలు, కవితలు, జోక్స్‌ అన్నీ నాకిష్టం కాని ఆవిడలోని ఈ కొత్త ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచింది. భోజనం తరువాత అమృతలత గార్కి వీడ్కోలు చెప్పాం. ఆవిడ అందరినీ పేరుపేరునా మళ్ళీ మళ్ళీ రండి అని ఆహ్వానించారు. ఆవిడ ఆతిథ్యం, సేవాభావం, లీతిరీరిదీలిరీరీ బీబిచీబిలీరిజిరిశిరిలిరీ అన్నీ నచ్చాయి.

రాత్రి ఏశిదీళిళిజీ శిళి స్త్రళిళిశి స్త్రతిలిరీశి కళితిరీలి లో బస. ఉదయాన్నే బయలుదేరడం, ష్ట్రఈం ఏశిదీళిళిజీ గారి బంగళాలో తేనీరు సేవించి నూతనోత్సాహంతో ప్రయాణం సాగించాం. ఆజీళివీజీబిళీ గీబిరీ శిబిదిలిదీ ళిఖీలిజీ లీగి ఆజీబిరీనీబిదీశినీరి ప్రశాంతి! ఆవిడ పేరు ఆజీబిరీనీబిదీశినీరి అయినందుకు అలా ఉన్నారా లేక దేవుడే ఆమెకు ఆ పేరు పెట్టారా అన్నట్టు ఉన్నారు ఆవిడ. నాకంటే చాలా చిన్నవయసు. ఉబిశిలి శిగీలిదీశిరిలిరీ అనుకుంటా. జు.ఆ. ఖబినీరిజిబి ఐబిళీబిదినీగిబి పెద్ద బాధ్యతతో నిర్వహిస్తున్నారు.

వాళ్ళ బిబీశిరిఖీరిశిరిలిరీ రీచీబిదీ చాలా ఎక్కువ. నాకు పూర్తి ఖిలిశిబిరిజిరీ తెలియవు. కాకపోతే శిజీరిలీబిజిరీ గీలిజితీబిజీలి కు పాటుపడ్తున్నార నిపించింది. కొమరం భీం గారి స్మారక చిహ్నం ఒక అద్భుత అనుభవం. రిశిరిదీబిజీగి లో ఇది చేర్చిన నిర్వాహకులకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ఎందుకంటే నాకై నేను ఎప్పటికీ ప్లాన్‌ చేసి వెళ్ళలేని ప్లేస్‌. ష్ట్రలిశితిజీదీ లో ఒక దగ్గర బస్‌ టైర్‌ పంక్చర్‌ అయినా మా ఎంజాయ్‌మెంట్‌కు అది సహకరించింది. చింతకాయల దండతో సత్యగారిని సత్కరించి ఆనందించాం.

అక్కడనుండి కెరెమొరి, మోడి, ఝరి అను ఖీరిజిజిబివీలిరీ కు వెళ్ళాం. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి మంచి బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టారు. అక్కడి పెద్దలతో ఒక మీటింగ్‌. ఆధునిక వ్యవసాయం గురించి వివరించారు. గ్రూప్‌లోని రచయిత్రులందరూ వారితో సంభాషించారు. ఒక పొలం కూడా చూసాం.

ంజీనీబిలీబిళిదీ లకే ఖీరిజిజిబివీలి కు చేరుకున్నాం. వారి ఆహ్వానం ఎంతో ఆత్మీయంగా ఉంది. అందరికీ పూలదండలు వేసి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. ఒక కమ్యూనిటీ హాల్‌లో వారు తయారుచేసే వస్తువుల ప్రదర్శన జరిగింది. వారి హస్తకళ నైపుణ్యం అబ్బురపరిచింది. వాటి మార్కెటింగ్‌లో, పనితీరులోని వారి కష్టనష్టాలు విచారించాం.

ట్రైబల్స్‌ తయారుచేసిన భోజనం ఎంతో రుచికరం. మళ్ళీ డాన్స్‌లు, పాటలు, ఆటలు. చివరి మజిలీ ఙలిజీదీరి. ప్రయాణం సాగుతుంది. బస్సులో కొంతమంది స్థానిక అమ్మాయిలు ఆడి పాడారు. ఙలిజీదీరి లో ఒక ఆశ్రమం చూడాలని. అది అనాథాశ్రమం అని చెప్పారు. చేరుకునేసరికి రాత్రి 9 దాటింది. పిల్లలంతా నిద్రపోకుండా ఎదురుచూస్తున్నారు.

ఆ ఆశ్రమం నడిపే పద్ధతి నాకు కొత్త. అక్కడివాళ్ళను కొన్ని గ్రూప్స్‌లో అంటే ఒక అమ్మ, అన్న, చెల్లి ఇలా వేరువేరు వయసువాళ్ళను కూర్చి ఒక ఇంట్లో ఉంచుతున్నారు. వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతారు. పిల్లలంతా దగ్గరిలోని స్కూల్స్‌కి వెళతారు.

పిల్లలు మాకోసం ఒక ప్రోగ్రామ్‌ ఎరేంజ్‌ చేసారు. వారిలోని ప్రతిభ చూసి ముచ్చటేసింది. పాటలు పాడారు. జోక్స్‌ చెప్పారు. డాన్స్‌లు చేసారు. వారి గురించి చెప్పారు. మాగురించి అడిగారు. అన్నీ వాళ్ళే ప్లాన్‌ చేసుకున్నారు. పిల్లలందరూ ఎంతో ఆత్మీయంగా కనిపించారు. ప్రేమగా భోజనం పెట్టారు. మాలోని ప్రతి ఒక్కరికీ, స్వయంగా తయారుచేసిన గ్రీటింగ్‌ కార్డ్స్‌ని ఇచ్చారు. మేం వస్తామని వాళ్ళు ఎదురుచూసి, శ్రమపడి ప్రోగ్రామ్‌ తయారీకి వెచ్చించిన సమయంలో పదోవంతు కూడా మేమక్కడ గడపలేకపోయాం. ఎందుకంటే అప్పటికే రాత్రి 12 దాటింది. తెల్లవారితే ఎవరి బాధ్యతలు వారివి. తప్పదు. తిరిగి రావాలి.

ఆ పిల్లలకు మా ఆర్థికసాయం అక్కర్లేదనిపించింది. వాళ్ళకు కావలసింది మేము వాళ్ళతో గడపడం. ప్రేమ కావాలి. ప్రేమతో గడిపే సమయం కావాలి. కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పారు. రవి (అక్కడి పిల్లలలో పెద్దవాడు) అయితే ఏడుస్తూ తనింట్లోనే ఉండిపోయాడు. ఎంతో బరువుగా మారింది హృదయం. ప్రతి సంవత్సరం నీలిజిచీబివీలి కో, ఇంకా ఏదైనా సందర్భానికో సంవత్సరానికి ఒక పదివేలు విరాళం ఇచ్చి నాకు నేనే వెన్ను చరుచుకుంటాను గొప్ప పనిచేసానని. ఎంతసేపు నేను, నా భర్త, మా అమ్మ, నా కొడుకు, నా ఆఫీస్‌, నా షాపింగ్‌ అంటూ సమయాన్ని గడుపుతాను.

కనీసం సంవత్సరంలో ఒకరోజన్నా వీళ్ళతో గడపాలని బలంగా నిర్ణయించుకున్నాను. ఉష కూడా సరే అంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ ట్రిప్‌ ఒక రిదీతీళిజీళీబిశిరిఖీలి బిదీఖి లిదీశిలిజీశిబిరిదీళీలిదీశి శిజీరిచీ.

ఊజీరిలీబిజి ఙరిజిజిబివీలిరీ, చళిళీబిజీబిళీ ఔనీరిళీ ఆజిబిబీలి, ఙలిజీదీరి, ఇవన్నీ ఆలోచింపచేసే ప్లేస్‌లు. ఆళిబీనీలిజీజిబి, చతిదీశిబిజిబి అపురూప దేవాలయాలు మనసుకు విశ్రాంతినిచ్చే ప్లేస్‌లు. ఇక పోచంపాడు నాకు బోనస్‌. సత్య, అమృతలతగార్లు రిదీరీచీరిజీలి చేసే వ్యక్తులు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.