స్త్రీ వాదం – చలం – మైదానం

 – డా|| పి. లోకేశ్వరి

ఇరవయ్యవ శతాబ్దానికి కొంత దూరం జరిగి చూస్తే బహుచిత్ర వర్ణక సంశోభితమై కనిపిస్తుంది. ఈ శతాబ్దంలో సాహిత్యంలో అంతకు ముందెన్నడూ రానన్ని ఉద్యమాలు, ధోరణులు కన్పిస్తున్నాయి. ఈ శతాబ్దంలో వచ్చిన సాహిత్య ధోరణులలో దేని విశిష్టత దానిదే అయినా స్త్రీవాద సాహిత్యం ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. స్త్రీవాద సాహిత్యం సాహిత్యంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది, చిరకాలంగా తామేమిటో తమకు తాము తెలుసుకోలేని సగం జనం, తమకు తాము చైతన్య పరచుకునే క్రమంలో వచ్చింది స్త్రీవాద సాహిత్యం, ప్రాచీన సాహిత్యంలో అక్కడక్కడా స్త్రీవాద భావజాలం కన్పిస్తుంది. తర్వాత భారత జాతీయ పునర్వికాస దశలో స్వాతంత్రోద్యమంలో భాగంగా స్త్రీలలో చైతన్యం వచ్చింది. తొలినాటి ఈ చైతన్యానికి గుర్తులుగా సరోజినీనాయుడు తోరుదత్‌ వంటి కవయిత్రులు మనకు కన్పిస్తారు.

తొలి రోజుల్లో మనకు ప్రధానంగా స్త్రీవిద్య కోసం పురుషులూ, స్త్రీలూ కూడా కలిసి ఉద్యమించారు అయితే స్త్రీ చైతన్యం సొంత వ్యక్తిత్వం కోసం కాకుండా కుటుంబ సంక్షేమం కోసమూ, పిల్లల అభివృద్ధి కోసమూ స్త్రీ విద్య ప్రచారం అయింది. విధవా పునర్వివాహం వంటి ఉద్యమాల్లో స్త్రీ పట్ల మానవతా దృక్పథం కన్పించినా అది ‘అయ్యోపాపం’ అనే దృష్టిని మించి పోలేదు. మొత్తం 50 సం||గా తెలుగులో స్త్రీలు రాసిన, రాస్తున్న సాహిత్యాన్ని మూడు దశలుగా విభజించారు. మొదటి దశ చాలా కాలం వునికిలో వుంది. ఇప్పటికీ ఆ ఛాయలు అక్కడక్కడా కన్పిస్తూనే వుంటాయి. ఆ దశలో స్త్రీలు పురుషులు యేర్పరిచిన ఆధిపత్యపు సంప్రదాయ మార్గాలనే అనుసరిస్తూ వాటిని తమలో యింకించుకుని సాహిత్య రూపంలో తిరిగి అందించారు. స్త్రీలు రాయటం అనేది ఇక్కడ ప్రధాన విషయం. భావాలలో ప్రక్రియలలో, అన్నింటిలో పితృస్వామ్యపు ధోరణులను అంగీకరించటం తప్ప యింకొకటి లేని దశ, రెండవ దశలో సమాజంలో వున్న అన్యాయాన్ని తమ పట్ల వున్న వివక్షను ద్వంద్వ విలువలనూ ఎదిరిస్తూ తమ హక్కులకోసం కొత్త విలువల కోసం అడుగుతూ తమకు తమ జీవితాల మీద అధికారం కావాలనే ఆలోచనను ప్రతిపాదిస్తూ సాహిత్యం వచ్చింది. రంగనాయకమ్మ గారి రచనలు కూడా ఈ దశకు తిరుగులేని ప్రతినిధులు, ఈ దశలో యిప్పుడు కూడా బలంగానే కొనసాగుతుంది. ఇక మూడవ దశ యిప్పుడిప్పుడే మొదలై తమను తాము తెలుసుకొనే దశ తమ లోపలికి తాము చూసుకొని, తమను అణచివేసే మార్గాలను వ్యతిరేకించటం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించకుండా దానిమీద మాత్రమే ఆధారపడకుండా, దాన్నించి బైటపడి స్వేచ్ఛ పొంది తన అస్థిత్వాన్ని గురించిన అన్వేషణ ప్రారంభించటం తెలుగు సాహిత్యంలో ఈ మార్గం, ఈ దశ బీజప్రాయంలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధిని సాధించింది.

స్త్రీల జీవితాన్ని చక్కదిద్ది వారి స్వేచ్ఛానందాల్ని ప్రసాదించడానికి ఎందరో సంఘసంస్కర్తలు, రచయితలు ముందుకొచ్చారు. అలాంటి వారిలో ‘చలం చెప్పుకోదగినవాడు ఈయన ఒక సదాచార బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బ్రాహ్మణ కుటుంబంలోని ఆచారాలకు, మూఢనమ్మకాలకు స్త్రీలు ఏవిధంగా బలైపోతున్నారో ప్రత్యక్షంగా చూసి చలించిపోయాడు. వారి సమస్యల పట్ల చైతన్యవంతుడై, సంఘాన్ని కుళ్ల బొడిచి కదిలించి వేసే రచనలు అనేకం చేశాడు. అందులో ఆయన రెండు రచనలు మైదానం, ‘బ్రాహ్మణీకం’ అనే నవలలు ఈ రెండు నవలల్లో చలం స్త్రీ సమస్యల్ని ఏ విధంగా స్పృశించి, సాంఘిక చైతన్యానికి కారకుడయ్యాడు.

స్త్రీ చైతన్యదృష్టి

‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు వుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి, ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి ‘స్త్రీని స్వేచ్ఛగా ఒదలడమొక్కటే పురుషుడామెకు చేయగల సహాయం ఆమె తోవ ఆమెను కాపాడుకోవటానికి, అధమ చరిత కావటానికో ఆమె ఏమైనా సరే తన భాద్యత కాదనుకొని వదిలేస్తే చాలు పదివేల నమస్కారాలు.

ఈ మాటలు చాలు చలం స్త్రీకి ఎంత విలువ ఇచ్చాడో తెలుసుకోవటానికి. చలం సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. తిరస్కరించే వాళ్ళువున్నారు. చలం వివాహాన్ని కుటుంబ వ్యవస్థన్ని ధ్వంసం చేసి ఆడవాళ్ళని లేచి పొమ్మన్నాడన్న వాళ్ళున్నారు. వ్యక్తిగానూ, రచయితగానూ చలం వివాదాస్పదుడయ్యాడు. అందుకే చలం సాహిత్య చర్చలో అతి తీవ్రమైన విమర్శలు, ప్రశంసలు ఖండనలు, సమర్థనలూ చోటు చేసుకున్నాయి. చలం ఎంత సేపు స్త్రీకి లైంగికపరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మాత్రమే కావాలని కోరారు. ఇప్పుడు స్త్రీని భాదిస్తున్న ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్య్రం వంటి సమస్యలు చలం ఆలోచనల్లో లేవు. వ్యక్తి వికాసానికి అవరోధాలుగా మారిన వివాహ కుటుంబ వ్యవస్థలను చలం నిలదీశాడు.

స్త్రీవాద దృక్పధం విస్తరిస్తున్న నేపథ్యంలో చలం చర్చించిన విషయాలు ప్రస్తుత సామాజిక అవసరంను పరిశీలిస్తే ‘పురుషుడు స్త్రీ ఆత్మ గౌరవాన్ని చంపాడు స్త్రీ దాన్ని మళ్లీ సంపాదించుకోవాలి. తన ఇష్టం వచ్చినట్లు తనకి తోచిన మార్గాన ఆమె ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందాలి. అందుకు ముఖ్య సాధనం ఎదిరింపు. అన్నిటికీ గృహానికీ, భర్తకీ పెద్దలకూ, పురాతన ధర్మాలకు బూజు పట్టిన నీతులకూ తన అభివృద్ధికి ఆటంకం కల్గించే ప్రతిసంస్థపై తిరగబడి నలిగి తన జీవితం అర్పిస్తేనే గాని పోయిన ఆత్మను స్త్రీ తిరిగి పొందలేదు’ అని స్త్రీ విముక్తికి చలం మార్గం సూచించాడు. ఆయన రచనల్లోని స్త్రీ పాత్రలన్నీ దాదాపు ఆ లక్ష్యంవైపే నడుస్తాయి.

మైదానం

మైదానం అంటే శరీరాన్ని దానం చేయడం. మై- శరీరం దానం – ఇచ్చుట. ఈ నవలల్లోని ప్రధానపాత్ర రాజేశ్వరి తన శరీరాన్ని ముస్లిమ్‌ మతానికి చెందిన అమీర్‌, మీరా అనే యువకులకు దానం చేసింది. కాబట్టి మైదానం అనే మాటను స్వేచ్ఛకు సంకేతంగా భావించవచ్చు.

ఈ నవలల్లో కథ అత్యల్పం. రాజేశ్వరి తన స్నేహితు రాలికి ఉత్తరం వ్రాస్తూ అందులోని విషయాలను రచయిత ఈ నవలలో చిత్రించాడు ‘జీవితం ఎందుకు అనే ప్రశ్నకు చలం యిచ్చే సమాధానం ఆనందానికి. సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి, స్వేచ్ఛలో సెక్స్‌ ద్వారా కలిగే ఆనందానికి అని మూడంచెలుగా ఉంటుంది. ఈ దృష్టితో సమాజంలో స్త్రీ పరిస్థితుల్ని చలం విమర్శించాడు. భావ విప్లవానికి కారకుడయ్యాడు. స్వేచ్ఛా ప్రియత్వాన్ని పెంపొందించాడు. చలం చేసిన ప్రతి రచన స్థూలంగా పై నినాదాన్ని సమర్థించేదే అని విమర్శకులు తలంచారు.

మైదానంలోని యితివృత్తం – రాజేశ్వరి బ్రాహ్మణ కుటుంబ స్త్రీ. ఆమె భర్త ఛాందసుడు ఆయన తన భార్యకంటే న్యాయవృత్తినే అమితంగా ప్రేమించి రాజేశ్వరిని నిర్లక్ష్యం చేశాడు. తీరని తన వాంఛల్ని ఆమె అణచిపెట్టుకుంటూ వచ్చింది. అమీర్‌ ఒక ముస్లిమ్‌ యువకునితో పరిచయమై అతనితో వెళ్లిపోయింది.

అలా వెళ్లిన ఇద్దరూ ఒక మైదానంలో గుడిసె వేసుకొని నివసిస్తూంటారు రాజేశ్వరికి వచ్చిన గర్భాన్ని వద్దంటాడు అమీర్‌. ఆ విషయంలో రాజేశ్వరిపై కోపంతో మక్కాకు వెళ్లిపోతాడు. ఒంటరిగా వున్న తనకు మీరా అనే వ్యక్తి దగ్గరవుతాడు. అమీర్‌ తిరిగి రావడంతో రాజేశ్వరి మీరాతో ఎక్కువ సమయం గడపలేక పోతుంది. ఒకరోజు మీరా రాజేశ్వరి ఒక్కటిగా వుండడం చూసిన అమీర్‌ ఆత్మాహుతి చేసుకొంటారు. ఇది ఈ మైదానంలో వుండే ఇతివృత్తం.

పురుషుడు స్త్రీ ఆత్మ గౌరవాన్ని చంపాడు. స్త్రీ దాన్ని మళ్లీ సంపాదించుకోవాలి. తన ఇష్టం వచ్చినట్లు తనకి తోచిన మార్గాన ఆమె ఆత్మగౌరవాన్ని తిరిగి పొందాలి. అందుకు ముఖ్యసాధనం ఎదిరింపు అన్నిటికీ గృహానికీ, భర్తకీ, పెద్దలకూ పురాతన ధర్మాలకూ బూజుపట్టిన నీతులకూ తన అభివృద్ధికి ఆటంకం కల్గించే ప్రతి సంస్థపై తిరగబడి, నలిగి తన జీవితం అర్పిస్తేనేగాని పోయిన ఆత్మను తిరిగి పొందలేడు అని స్త్రీ విముక్తికి చలం మార్గం సూచించాడు. ఆయన రచనల్లోని స్త్రీ పాత్రలన్నీ దాదాపు ఆ లక్ష్యంవైపే నడుస్తాయి. స్త్రీ జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను నిరసిస్తూ ఎంతో ఆవేదనతో చిత్తశుద్ధితో రచనలు చేసినవాడు చలం. స్త్రీ, పురుష సంబంధాలపట్ల మొత్తం సమాజాన్ని ఎడ్యుకేట్‌ చెయ్యవలసిన అవసరాన్ని గుర్తించాడు, చలం కలం నుండి జీవం పోసుకున్న స్త్రీ పాత్ర గమ్యం అదే. చలం ఆలోచించే ప్రశ్నలు రేకెత్తించారు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే క్రమంలో తమ ప్రస్థానం సాగించారు. చలం నవలల్లో ఎంతో వివాదాస్పదమైనవిగా చెప్పుకోవచ్చు ఈ మైదానం నవల.

వివాహం పేరుతో నిస్సారమైన స్త్రీ పురుషుల సంబంధాలపట్ల చలం ప్రతిపాదించిన ప్రొటెస్టుగా రాజేశ్వరి అమీర్‌తో వెళ్లిపోవడం, మైదానంలో రాజేశ్వరి ద్వారా చలం మాటలు అర్థం చేసుకోవాలంటే కొత్త దృక్పథం అవసరం. స్త్రీ బానిసత్వం, లైంగిక అణచివేత, పిల్లల్ని కనడంలో స్వేచ్ఛ వంటి అంశాలను రాజేశ్వరి పాత్ర ద్వారా చలం ప్రతిపాదించాడు. ఇద్దరినీ ఒకేసారి ప్రేమించడం వింత కాదంటాడు. చలం మైదానంలో రాజేశ్వరి అమీర్‌, మీరాలను ఏకకాలంలో ప్రేమిస్తుంది. ఈనాడు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల అణచివేతలవైపు మనం దృష్టి సారించి పరిశీలించ గలిగితే రాజేశ్వరిని అర్థం చేసుకోగలుగుతాం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.