వర్తమాన లేఖ

పియమైన పద్మజా!

ఎలా ఉన్నావ్‌? మీ ఆఫీస్‌ వర్క్‌ ఇంకా అలా ఒత్తిడిగానే నడుస్తోందా? ఆడిట్లతో బిజీగా ఉన్నానన్నావ్‌? సిటీలో ఉంటూ కూడా ఒకళ్ళనొకళ్ళం కలుసుకోలేకపోతున్నాం. కనీసం ఫోన్‌క్కూడా కుదరడం లేదు. ‘వారు స్పందించుటలేదు. మీ ఫోన్‌ మాకు విలువైంది. దయచేసి వేచి ఉండండి. ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ ఏరియాలో ఉన్నారు’ – ఇలాంటి మధ్యవర్తుల మాటలే విని ఫోన్‌ పెట్టెయ్యాల్సి వస్తోంది. నీకు తీరికున్నప్పుడు నాకుండదు. నాకున్నప్పుడు నీకుండదు. దాంతో తిక్కపుట్టి ఉత్తరాలెందుకు రాసుకోకూడదనిపించి రాస్తున్నాను. ఈ ఉత్తరాన్ని నువ్వు చాలా ప్రేమగా చదువుకుంటావని నాకు తెలుసు.

మొన్నామధ్యన పి. సత్యవతిగారి కథ జ్యోతిలో వచ్చింది. చదివావా? ‘పిల్లాడొచ్చాడా!’ – అనేది కథపేరు. నిజంగా చాలా బాగుంది. చాలా సస్పెన్సు. లాస్ట్‌కి కూడా వచ్చిందీ రానిదీ చెప్పలేదు. తెల్లారి కాలింగ్‌ బెల్‌ మోగింది అనడంతో కధాగిపోతుంది. ఒక రాత్రంతా పిల్లాడు ఇంటికి రాలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ ఐంది. ఆ కుటుంబసభ్యుల భయం, టెన్షన్‌, ప్రయత్నాలు, బాధ, ఎదురుచూపులు ఇవన్నీ చాలా బాగా రాశారు. చెయ్యి తిరిగిన రచయిత్రి కదా! ఇప్పుడున్న సమాజంలో 90% ఇళ్ళల్లో జరుగుతున్న రోజువారీ వ్యవహారమిదే. అందుకే అందరూ ఎవరి జీవితాన్ని వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లుగా ఉంది.

బియాస్‌ నది నీళ్ళల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు కదా! ఆ దృశ్యాల్ని చూస్తుంటే మనసంతా కలిచివేసినట్లయింది. హాయిగా నీళ్ళల్లో ఆడుకుంటున్నవాళ్ళను మృత్యువు తీసికెళ్ళి పోయింది. తీరం వెంబడి తల్లిదండ్రుల దుఃఖప్రవాహాలు ఇంకా కురుస్తునే ఉన్నాయి. మనమంతా టూర్లకు వెళ్ళినప్పుడు, చాపరాయి దగ్గర, సముద్రాల దగ్గర నీళ్ళతో చేసిన స్నేహం గుర్తొచ్చింది. నీళ్ళు దాహం తీర్చి గొంతు తడపనూ గలవు. గొంతు నులమనూ గలవు కదా అన్పించింది.

పద్మజా! నీక్కూడా తెలుసు జాహ్నవి. మా ఇంటి దగ్గర్లోనే ఉంటుంది. నీకోసారి పరిచయం కూడా చేశాను. తనను చూస్తే నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. హాయిగా వుంది. ముద్దమందారంలా నవ్వుతూ, మల్లెపువ్వులా పరిమళిస్తూ సంతోషంగా ఉంది. వేరో చోట ఉద్యోగంలో కూడా చేరిపోయింది. గ్యాంగ్‌రేప్‌కు గురైన తర్వాత ఆమె మానసిక స్థితిని చూసి ఎప్పటికి కోలుకుంటుందో అనుకున్నాను. అదొక చెడు సంఘటన మాత్రమే, శరీరానికైన గాయమే. మనసు మీద తెచ్చుకోవద్దు అని పదేపదే పలురకాలుగా నచ్చచెప్పడం, సైకాలజిస్ట్‌ల దగ్గరకు తీసుకెళ్ళడం, కౌన్సిలింగ్‌ క్లాసుల ద్వారా నెమ్మది నెమ్మదిగా చాలా మార్పు వచ్చింది. జరిగిన నెగిటివ్‌ అంశాన్నుంచి పాజిటివ్‌గా ఎలా తీసుకోవాలో నేర్చుకుంది. నాకింకా ఎందుకింత సంతోషమో తెల్సా. తను మారడమే కాక, తనలాంటి స్థితిలో ఉన్నవాళ్ళకు, ఇతరేతర కష్టాల్లో ఉన్న స్త్రీలకు చేయూతనివ్వడానికి హెల్ప్‌లైన్‌ కూడా మొదలు పెడ్తానంటోంది. మూర్ఖులు, దుర్మార్గులు చిదిమి వేశామను కుంటూ పైశాచిక నృత్యాలు చేస్తుంటే, చిగురు తొడిగి, మహావృక్షమై మరెందరికో నీడనిచ్చే స్థితికి ఎదగడం నిజంగా అభినందించాల్సిన విషయం కదూ! నీనుంచి వచ్చే పొగడపూల ఉత్తరం కోసం నిరీక్షిస్తూ నీ ప్రియసఖి.

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో