మీరు జూన్ 2014 సంచికలో డా||రమా మెల్కోటె గారు 1993లో వ్రాసిన నూతన ఆర్ధిక విధానము వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించడం చాలా ప్రయోజనకరంగా ఉంది. అయితే, 1990 నుంచి ఇప్పటివరకు మారుతూ వస్తున్న ఆర్ధిక పరిస్థితులను సమీక్షిస్తూ ఇంకొక వ్యాసం ఆమె రాసి ఉంటే, దానిని కూడా మరొక సంచికలో ప్రచురిస్తే, మరింత విజ్ఞానదాయకంగా ఉంటుంది. లేకపోతే, ఆమెని రాయమని కోరండి. కృతజ్ఞతలతో…
– అబ్బూరి ఛాయాదేవి, హైదరాబాద్.