స్వచ్ఛమైన సమాజంలో నిద్రించు
మానవులు ఇలానే ఉండాలని ఊహించు
కనురెప్ప తెరచే లోపల
ర్యాలీలు, ధర్నాలు, యుద్ధాలు, అరెస్ట్‌లు
నాకు నేనే అదిరి పడ్డా
రోడ్డు మీద కార్యకర్తల ధర్నాలు
ట్రాఫిక్ పోలీస్‌లా
రోడ్డు మీదే యాత్రికులు
రోజుకొక ఆత్మ హత్యలనే హత్యలు
రామ రాజ్యం రాలేదని సూసైడ్‌లు
మహనీయుల అడుగు జాడలు ఏవి?
ఓటు వేయకపోతే
రౌడీయిజం …..
నీతీ, నిజాయితీ, సేచ్ఛా ఏది?
ఓ నాయకులారా !
మోసాలు ద్వేషాలు వదలలేరా!
కత్తులు బాంబులు ఆపలేరా !
మీకోసం
పేద ప్రజలు మర్యాదగా చేతులు కట్టుకు నిలబడటం కాదు
మీరు మాకోసం
ప్రజలను అమ్మలా ఆదుకొండి
మీతో మేం ఉన్నాం అనే ధైర్యం నింపండి
రాష్ట్రాలు వేరైనా మనమంతా
ఒక తల్లి పిల్లలం
అందుకే కొత్త ఇంటిని సరికొత్త సూచనలతో అభివృద్ధి చేయండి
– 10వ తరగతి, సమతా నిలయం