వి. హనుమంతరావు
దేశంలో ఫ్యూడలిజం అంతరించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొంది. ఇది మన సామాజిక,
రాజకీయ శాస్త్రవేత్తల అభి ప్రాయం.
కాని పురుషాధిక్య సమాజం చలాయిస్తున్నంతకాలం, మనం ఫ్యూడలిస్టు సమాజంలో
నివసిస్తున్నామని గ్రహించాలి.
కారల్‌మార్క్‌స ఇలా అన్నారు ” స్త్రీలకు విముక్తి జంతుస్థాయి నుంచి మానవ స్థాయికి చేరుకున్నంత
మేరకే జరుగుతుంది”
సామాజికాభివృద్ధి, స్త్రీల విముక్తి సాధించిన మేరకే సాధ్యం. ఇది ఇంగిత జ్ఞానం వున్న వారందరికీ
తెలిసిన విషయమే. కాని నేడు సమాజంలో చూస్తే స్త్రీ విముక్తికి రెండవ స్థానమే లభిస్తుందనేది
కాదనలేని విషయం. సోవియట్ యూనియన్‌లో కూడా, స్త్రీకి సమాన హక్కులు చట్టరీత్యా
కల్పించినా, జనాభాను పెంచాల్సిన ఆవశ్యకతను దృష్టిలో వుంచుకొని స్త్రీలెంత ఎక్కువ మంది పిల్లలకు
జన్మనిస్తే, అంత గౌరవ స్థానాన్ని కలుగచేసారంటే, వాస్తవ జీవితంలో ఆమెను గృహ నిర్భంధంలో
వుంచారనే అనుకోవాలి. ఆమె వంటింటి కుందేలుగానే వుండిపోయింది. అయితే ఈ పరిస్థితి అలా
ఎక్కువమంది బిడ్డలను కన్నవారికే పరిమితం. మొత్తంగా స్త్రీలకు గౌరవప్రద స్థానమే లభించింది.
పారిశ్రామికీకరణ యుగంలో ప్రవేశించిన తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ చేయల్సిన అవసరం
వుండడంతో, అది రాను రాను పురుషులకే ఉత్పత్తి కార్యక్రమంలో పై చేయి అయింది.
అయితే ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో ఆధునికీకరణ, యంత్రీకీకరణ చోటు చేసుకొన్న తర్వాత,
స్త్రీలకు ఉద్యోగ లభ్యత వట అటుంచి, కార్మికుల సంఖ్యే కుదించబడుతుంది. రోబోట్ యుగం వస్తే
ఏమవుతుందో ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇదే పరిస్థితి వ్యవసాయ రంగంలో మనకు
కనిపిస్తుంది. దున్నటం దగ్గరనుంచి పంటకోత వరకూ రకరకాల యంత్రాలొచ్చేస్తున్నాయి.
వ్యవసాయ కార్మికులే వ్యవసాయపనులు చేయటం ప్రస్తుతం ప్రధాన వ్యాపకంగా వుంది. అలా
వున్నంతకాలం స్త్రీ కార్మికుల అవసరం వుంటుంది. ఆ తర్వాత వ్యవసాయంలో స్త్రీకి స్థానం ఎక్కడ?
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో స్త్రీ కూడా పొలానికి వెళ్లి, పనిచేసి సంపాదిస్తుంది. కాబట్టి,
మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలతో పోలిస్తే, వ్యవసాయ కార్మిక స్త్రీకి ఎక్కువ స్వాతంత్య్రం వుంది.
మధ్యతరగతి స్త్రీలు ఈ విషయంలో చాలా దయనీయ స్థితిలో జీవితం వెళ్ళ బుచ్చుతున్నారు. భర్త
తెచ్చే జీతమే మొత్తం కుటుంబానికి ఆధారం కావటంతో, పురుషుడి దయదాక్షిణ్యాల మీద ఆధార
పడడంతో, అతడు పెత్తనం చెలా యిస్తున్నాడు. పువ్వుల దగ్గరనుంచి చీరల వరకూ భర్త మీద
ఆధారపడాలి. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలను కూడా పోల్చి చూస్తే కొంత స్వతంత్య్రం వుంటున్నా ప్రస్తుత
సావజిక వ్యవస్థ ట్టుబాట్ల పరిధిలోనే ఆమె తన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తుంది. కాదని బయటకు
వస్తే స్వతంత్రంగా బతకగలుగు తుంది కాని ప్రతి పురుషుడి రెండు కళ్ళు ఆమె మీదే వుంటాయి.
అయినా ఎక్కువ మంది స్త్రీలు సంపాదన పరులైతే, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే శక్తి
సంపాదించుకొంటే, సమాజం వరుతుంది కాబట్టి పురుషుని దాష్టీకం కాస్త అదుపులో వుంటుంది.
నేడు స్త్రీల పట్ల హింసాత్మక ప్రవృత్తి విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి చూస్తే కారల్‌మార్క్‌స
శతాబ్దాల క్రితమే ఊహించగలిగాడని పైన ఉదహరించిన ఆయన మాటలు తేట తెల్లం చేస్తాయి.
మానభంగాలు, హింసాత్మక ప్రవృత్తి దేశంలో రాజ్యమేలుతున్నాయి. ఇది మనం ఇంకా
జంతుస్థాయిలో ప్రవర్తిస్తున్నామని తెలియచేస్తుంది. ఇళ్ళల్లో చూస్తున్నది కంటికి కనపడని
హింసాత్మకత. వ్యవసాయ కూలీ కుటుంబాల్లో పురుషుడు తప్పతాగి ఇంటికి వచ్చి భార్యను
చావబాదుతాడు. తెల్లవారి నిషా దిగిన తర్వాత పశ్చాత్తాపపడతాడు. ఇంకెపుడూ కొట్టనే అంటాడు.
భార్య శాపనార్థాలు పెడుతుంది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మామూలే. కాని మధ్య తరగతి
ఇళ్లల్లో తాగకుండానే భార్యమీద విరుచుకు పడతాడు, కొడతాడు, ఆమె కాదన్నా తన సెక్స్ ఆకలి
తీర్చుకుంటాడు. ఆఫీసులో చివాట్లు తిని, అక్కడ ఏమీ అనలేక ఇంటికి వచ్చి ఆ కసి అంతా
భార్యమీద చూపిస్తాడు. తాగి వచ్చిన వ్యవసాయకూలీ పశ్చాత్తాప పడతాడుగాని, ఈ మధ్యతరగతి
త్రాష్టుడికి ఆపాటి సంస్కారం కూడా వుండదు. ఇది మన సమాజంలో ఫ్యూడలిజం
కొనసాగుతున్నదనడానికి ప్రత్యక్ష సాక్ష్యం.
కమ్యూనిస్టులు దేశంలో చలామణిలో వున్నది ఫ్యూడలిజమా, అర్థ ఫ్యూడలిజమా, పెట్టుబడిదారి
విధానమా అనే సిద్ధాంత పోరాటం అనంతంగా కొనసాగిస్తున్నారు కాని, స్త్రీలకు సంబంధించినంత
వరకూ, ఫ్యూడలిజమే కొనసాగుతుందని అంశీకరిస్తారనుకొంటాం.
పార్లమెంటులో మూడోవంతు స్థానాలు స్త్రీలకు ఇవ్వక పోవటం ఫ్యూడల్ మనస్తత్వానికి మరో నిదర్శన.
పంచాయతీరాజ్ వ్యవస్థలో వారికి సీట్లు రిజర్వు చేసారు కదా అని అనవచ్చు. కాని స్త్రీలు నామకహా
అధ్యక్షపదవినలంకరిస్తారే గాని, ఆచరణలో, పెత్తనం వారి భర్తలదేననడానికి నిదర్శనలు కోకొల్లలు.
అయితే కంప్యూటర్ యుగంలో విద్యాధికులైన స్త్రీలకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా పెరిగాయి.
పట్టణాల్లో విద్యాధికులైన స్త్రీలు అధిక సంఖ్యలో ఆఫీసులకు పరుగులు తీస్తండడం చూస్తున్నాం.
కంపెనీల్లో సి.ఇ.ఓ. పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్పేస్‌లోకి దూసుకుపోయిన స్త్రీలున్నారు.
అలాంటి వారిని చూసి మనం గర్విస్తాం, గర్వించాలి కూడా. కాని గ్రామాల్లో నివసించే 20 శాతం
మంది ప్రజల్లో సగం మంది స్త్రీలే. ఆవుకు మూడు కన్నులతో బిడ్డ పుట్టిందని విన్న స్త్రీలు దానికి
పూజలు, పునస్కారాలు చేసేటంత అజ్ఞానంలో, మూఢవిశ్వాసాల్లో బతుకుతున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయం విద్యార్ధి యూనియన్ అధ్యక్షుడు సందీప్‌సింగు ఇలా
అంటున్నారు. స్త్రీల మీద హింస ఫ్యూడల్ మనస్తత్వాన్ని తెలియ చేస్తుంది. ”పితృస్వామ్యవ్యవస్థకు
సమాజం తోడ్పాటు ఇస్తుంది” ఢిల్లీలోని సామాజిక అధ్యయన సంస్థ డైరెక్టర్ రంజనాకుమారి ఈ
పరిస్థితికి పర్దాయే కారణమంటున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు స్త్రీ పర్దాలో వుంటుంది. కాని
బయటకు వస్తే సమస్యే. ఎక్కువ మంది పురుషులు స్త్రీ స్థానం నాలుగుగోడల మధ్యనే అనే పాత
చింతకాయ పచ్చడి అభిప్రాయనికి బందీలుగా వున్నాయి. నిజానికి పురాణ కాలపు ఆలోచనలానే
నాలుగు గోడల మధ్య ఉన్నది పురుషులే అని చెప్పాలి. ఆధునిక జీవనం గడుపుత, స్త్రీల విషయం
వచ్చేసరికి పౌరాణిక యుగంలోలా ప్రవర్తిస్తున్నారు. రానురాను ఎక్కువ మంది స్త్రీలు వీధుల్లో
తిరుగాడుతుంటే పురుషుల పౌరుషం పొడుచుకు వస్తంది. స్త్రీలను అదుపులో పెట్టకపోతే, తమ
ఆధిపత్యానికి ముప్పు ఏర్పడుతుందని వారు బహుశా భావిస్తున్నారనుకోవాలి.
పట్టణాల్లో, నగరాల్లో స్త్రీల మీద అక్రమాలు జరిగితే తెల్లవారేసరికి పత్రికల్లో వార్తలు వచ్చేస్తాయి. కాని
గ్రామాల్లో సంపన్న వ్యవసాయదారులు పొలాల్లో కాస్త అందంగా వున్న వ్యవసాయ కూలీ వుంటే
నయన్నో, భయన్నో వనభంగం చేసే సంఘటనలు సర్వ సాధారణం. ఆ సంఘటనలన్నీ పత్రికల్లో
చోటు చేసుకొంటే భారతీయులు ఇంకా ఆటవిక సమాజంలో వున్నారా అని విదేశీయులు
ఆశ్చర్యపోతారు. ఈ సంఘటనలు జరిగినపుడు పత్రికల్లో వార్తలొస్తాయి గాని, ఆ తర్వాత ఏమి
జరిగింది, మానభంగం చేసినవారిని అరెస్టు చేసారా, శిక్షించారా, స్త్రీకి న్యాయం జరిగిందా అనే
ఫాలోఅప్ వార్త రానేరాదు. అలా మానభంగం చేసినవారు తక్కువ కులస్తులైతే, వాడిని జనం అంతా
చావగొడతారు పెద్ద కులం వారయితే గప్‌చుప్. ఇదేమి సమాజం.
ఇక్కడ స్త్రీల గురించి ఓ మాట చెప్పాలి. వారి వస్త్రధారణే వారి శతృవు. ఈ విషయం గురించి ఒక స్త్రీ
వాద పత్రికల్లో ఇంత కన్నా ఎక్కువగా వ్రాయకుండానే స్త్రీలు నా అభిప్రాయం ఏమిటో గ్రహించగలరను
కొంటా. ఈ పరిస్థితినుంచి స్త్రీ బయట పడాలంటే ఏం చెయ్యలి? మనమేమీ చేయలేం, పురుషాధిక్య
సమాజం వున్నంత కాలం మన బతుకులింతేనని అనుకొనే పిరికి ఆలోచనకు స్వస్తి చెప్పాలి. స్వీయ
రక్షణకవసరమైన కరాటే లాంటి విద్యలు నేర్చుకోవాలి. మహిళా సంఘాలు ఉపన్యాసాలు, సభలు,
పత్రికా ప్రకటనలు, ఊరేగింపులతో పాటు పట్టణాలలో ప్రతీ బస్తీలో స్త్రీ స్వీయ రక్షణ కవసరమైన విద్యా
శిక్షణ కేంద్రాలను స్థాపించాలి. ఇది ఎవరి ఇంట్లోనైనా ఏర్పాటు చేయవచ్చు. బాలికల పాఠశాలల్లో
పాఠ్యపుస్తకాల్లో వీర వనితల గురించిన కథలను చేర్చాలి. లేదా ఉపాధ్యాయులు అటువంటి గాథలను
వినిపించాలి. అన్యాయన్ని, అక్రమాన్ని ఎదిరించే భావనను వారి మనస్సులో జొప్పించాలి.
స్త్రీల మీద అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు వస్తే అక్కడకు మహిళా పోలీసులను ఉరికించాలి.
అత్యాచారం జరిగిన ప్రదేశం లో వున్న స్త్రీలు మనకెందుకులే అను కోకుండా వారంతా ఆ ఘటనా
స్థలంలోకి చేరుకొంటే, అన్యాయం జరిగిన స్త్రీకి ధైర్యం వస్తుంది. స్త్రీల రక్షణ గురించిన చట్టాలు న్నాయి
గాని అవి కలవాళ్ళ చుట్టాలే కాబట్టి ఈ చట్టాల గురించి స్త్రీలకు వివరించాలి. స్త్రీలు ఎదిరించి నిలబడి
స్త్రీల కన్యాయం చేసిన వాడికి దేహశుద్ధి జరిపితే, అటువంటి సంఘటనలకు పత్రికలు బహుళ ప్రచారం
చేయలి. స్త్రీ వాద పత్రికలు ఇలాంటి వార్తలను ప్రచురించాలి. అత్యాచారాలకు ఒక పేజి కేటాయించితే,
అవి చదివిన వారిలో కోపాన్ని రగిలించాలి. మానభంగం చేయబోయిన పురుషుడి పురుషాంగాన్ని
కొరికివేసిందని ఒక వార్త ఆమధ్య పత్రికల్లో ఒక వార్త వచ్చింది. తనను తాను రక్షించు కొనే
పెనుగులాటలో అవకాశం చచ్చుకొని వృషణాల మీద వెకాలుతోనో, మరో అవకాశమున్న పద్ధతిలోనో
కోలుకోలేని దెబ్బ తీయలి. హింసకు ప్రతి హింస జరగాలి.
ఇలాంటి ఘటన జరిగినపుడు ఆ వార్త చదివి వాడు నాశనమై పోను అని మనస్సులో వాణ్ణి
తిట్టుకున్నంత మాత్రాన స్త్రీలకు న్యాయం జరగదు. మీ పిల్లలు అల్లరిచేస్తే, విసిగిస్తే ఏం చేస్తారు?
నాలుగు తగిలిస్తారు. అలాంటి మీరు మీకే అన్యాయం జరిగితే ఏం చెయ్యలో మీకు వేరే చెప్పనవసరం
లేదనుకుంటా.