మహిళా జర్నలిస్టుల ఆత్మవిశ్వాస ప్రకటన వేదిక

ఎన్‌.డబ్య్లు.ఎం.ఐ (ఎ.పి..చాప్టర్‌)

స్త్రీ, మహిళ, ఔరత్‌, తేజస్విని పేరు ఏదైనా శక్తికి, స్త్రీత్వానికి ప్రతీక.
త్యాగం, తపస్సులకు అర్థం చౌకీదారీతనం కాదు-

 

నాల్గవ ఎస్టేట్‌ అయిన పత్రికారంగంలో అటు ప్రింట్‌, ఇటు ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో మహిళా జర్నలిస్టుల సంఖ్య
గణనీయంగా పెరుగుతోంది.  అయినా…!
బైటి ప్రపంచంలోను, ఇంట్లోను హింసకు గురౌతున్న స్త్రీ వృత్తిపరంగా, ముఖ్యంగా సమాజం వేపు తర్జని చూపిస్తూ
నిజానిజాలు నిగ్గు దీయల్సిన మీడియాలో మహిళగా వుంట కూడా తన పూర్తి సామర్థ్యాన్ని, తెలివితేటలను
నిరూపించుకోలేని ప్రత్యక్ష, పరోక్ష నిర్లక్ష్యానికి, అణచివేతకు గురికావడానికి ఎవరి బాధ్యత ఎంత?-
 ”ఉమెన్‌ ఇన్‌ జర్నలిజం”, ‘మేకింగు న్యూస్‌’ కు సరైన అర్థాలేమిటి?
– ప్రశ్నార్థకమేనా!? 
శతాబ్దాలు దాటి,  దశాబ్దాలు గడిచినా తన వ్యక్తిత్వానికి గుర్తింపు కోసం, చేస్తున్న కృషికి లబ్ధి, లక్ష్య సాధనకు గమ్యం వైపు దూసుకు వెళ్ళే దారిలోని అడ్డంకులు దాటేందుకు ఇంకా ఎదురీతలు తప్పవా?  వివక్షకు గురికావ ల్సిందేనా?

ప్రతిభావ్యుత్పత్తులుండీ పోరాట బాటలో సాగాల్సివస్తున్న పరిస్థితులను, స్థితిగతులను బాహా టంగా చర్చించి, స్వేచ్ఛాయుత వాతావరణం లో మహిళా జర్నలిస్టులు తమ మనోభావా లను ఆత్మ విశ్వాసంతో ప్రకటించగలిగే ఏకైక వేదిక నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ మీడియా ఇండియా (ఎన్‌డబ్ల్యుఎంఐ).  పై ప్రశ్నార్ధ కాలకు సరైన అర్థాలు విశదీకరించే స్థాయికి చేరింది.

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ఏ స్థాయిలో (వర్కింగు, ఫ్రీలాన్సింగు, ఇండిపెండెంట్‌) పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్‌ అయినా NWM నెట్‌వర్క్‌ సభ్యురాలు కావచ్చు.  ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.  స్త్రీలచేత, స్త్రీల కొరకు స్థాపించిన NWMI 2002లో ఢిల్లీలో గళం విప్పింది.  కాశ్మీర్‌ నుండి కన్యాకుయారి వరకు వివిధ రాష్ట్ర, ప్రాంతాలనుండి వచ్చిన మహిళా జర్నలిస్ట్‌లు, జర్నలిజం విద్యార్థినులు 2002 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన మూడురోజుల సదస్సుల్లో పాల్గొన్నారు.  ఆసేతు హిమాచలం ఇంచుమించు ప్రాంతీయ పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న మహిళల కష్టనష్టాలు ఒకేతీరుగా వుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.  ఆలోచింపచేసింది.  ఇంగ్లీష్‌ మీడియా మహిళలు కాస్త మెరుగు.  ఢిల్లీ సదస్సులకు యునెస్కో సహకారం అందించడం గమనార్హం.

ఆ తర్వాత ‘Changing our World’ (COW) అంట మీడియా మహిళలకు మద్దతు నిస్త, సమాచారం, వనరులు, సామాజిక బాధ్యత, మానవీయ విలువలు, జర్నలిజంలోని నైతికత తది తర అంశాల పట్ల అవగాహన కల్పిస్త NWM ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో సదస్సులు నిర్వహిస్తోంది.
ఢిల్లీ తర్వాత బెంగు ళూర్‌, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌లలో జరిగిన సదస్సుల అనంతరం 2008 ఫిబ్రవరి 8,9,10 తేదీల్లో ఆరవ వార్షిక సమావేశ సదస్సులు మహారాష్ట్రలోని పుణెలో జరిగాయి.

ప్రారంభ సమావేశాలు
పుణే మహిళలు స్వతహాగా ధీరవనిత లన్నది చారిత్రక సత్యం.  ఛత్రపతి శివాజీ తల్లి జిజియబాయి, ఝాన్సీలక్ష్మీ బాయి, తొలి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫులే, తొలి వైద్యురాలు ఆనందీబాయి జోషి వంటివారి స్ఫర్తి నేటికీ ఆదర్శంగా నిలబడింది.  ఆ నేపథ్యంలో అక్కడి మహిళా జర్నలిస్ట్‌లు వృత్తితో బాటు సామాజిక నిబద్ధతకు కూడా సమస్థాయినిస్తున్నారు.

అందుకే ‘changing Face of today’s Jounnalism and society’ ని ప్రతిఫలించేలా ప్రజాజీవితం పట్ల, నగర పారిశుద్ధ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల పాత్రికేయులు నిజాయితీతో కూడిన క్రమశిక్షణ కలిగి వుండాలని, ఆ మేరకు విలువలు కాపాడుత వార్తాకథనాలు రూపొందించాలని ఈ సదస్సులో ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారు.
పుణె నగర మేయర్‌ రాజ్యలక్ష్మి బోన్‌స్లే పుణె NWMI చాప్టర్‌కు పూర్తి మద్దతునిచ్చి, తగిన సహాయ సహకారాలు అందించడమేగాక తొలిరోజు సదస్సులోని పబ్లిక్‌ ఫంక్షన్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ఈ సమావేశాన్ని పుణె పత్రకార్‌ సంఘ్‌ నిర్వహించింది.
అంతకుముందు వివిధ రాష్ట్రాల నించి వచ్చిన మహిళా జర్నలిస్టుల పరిచయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళలు అధికసంఖ్యలో పాల్గొనడం అందరి ప్రశంసలందుకుంది.  చిత్తరు జిల్లా ఇందిరా క్రాంతిపథం నిర్వహణలో వెలువడు తున్న గ్రామీణ స్త్రీల పత్రిక ‘నవోదయం’ నుండి 10 మంది మహిళలు వచ్చారు.  ఆ సంచికకు జిల్లా సవఖ్య అధ్యక్షురాలు బి. కాంతమ్మ గౌరవ ఎడిటర్‌, వి. మల్లిక, వి. జయంతి, కె. మంజుల, ఇ. భారతి, డి. చంద్రకళ, ఎం. రత్నమ్మ సంపాదకవర్గంలో వున్నారు.  నవోదయం మహిళలు పదవ తరగతి, అంతకు తక్కువ విద్యార్హతలు కలిగివున్న రిపోర్టింగు, ఎడిటింగు, ఫోటోగ్రఫీ, మార్కెటింగుతో బాటు కార్టనిస్ట్‌గా కూడా మహిళలే వున్నారు.  వారిలో ఇందిరా ప్రియ దర్శిని ”మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతుంది” అని ప్రభోదాత్మక సినీగీతంతో సదస్సుకు శ్రీకారం చుట్టడంతో మహారాష్ట్రలో తెలుగుబావుటా రెపరెప లాడింది.

కీ’నోట్‌’ – ప్రపంచ ప్రఖ్యాత నర్తకి ‘దర్పణ్‌’ సంస్థ అధ్యక్షురాలు కార్యక్రమ నిర్వాహకురాలు, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత, తారా గ్రప్‌ సిఇవొ, ఇంకా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల వ్యవహర్త అయిన డా|| మల్లికా సారాభాయ్‌ ముఖ్యఅతిథిగా వచ్చి కీలక ప్రసంగం చేసి దాదాపు 3, 4 గంటలు మహిళా జర్నలిస్ట్‌లు, ఇతర ప్రముఖులతో కూడిన పబ్లిక్‌ ఫంక్షన్‌లో ముఖాముఖితో పాల్గొన్నారు.  వాళ్లతో కలసి విందుచేశారు.

”ఒక నర్తకిగా గాక ఒక మీడియ పర్సన్‌గా రావడం నాకు ఇష్టం.  ‘Emotion Became the Language’.  అందుకే ‘తధింగిణతోం’ స్పూర్తితో సామాజిక సమస్యకు సమాధానం చెప్పాలని వుంటుంది నాకు.  మహిళల వరకట్న సమస్య గురించి 40 నిమిషాల నృత్యాంశాన్ని 1984లో ప్రదర్శించాను.  అలాగే ఆడపిల్లల భ్రూణహత్యల మీద కూడా చేశాను.  శక్తికి, స్త్రీత్వానికి ప్రతీకలయిన ద్రౌపది, ఝాన్సీ, మీర, సావిత్రి జీవితాల్లోని ముఖ్యఘట్టాలతో వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటించేలా నృత్యరూపకాల్ని రూపొందించి, ఆధునిక కోణంలో నేటి వ్యవస్థకు వర్గదర్శకాలుగా ప్రదర్శించాను.  భ్రూణహత్యల ‘సీతాస్‌ డాటర్స్‌’ ప్రతి ప్రదర్శనా సమాజానికి ఆలోచనాస్ఫోరక సందేశంగా మారింది.  ఇప్పటికి 500 ప్రదర్శనలు పూర్తిచేసు కుందంటే ఇంకా ఆ అంశం సమాజంలో అంత తాజాగానే వుందన్నమాట, ప్చ్‌.  అది చేదుగుళిక.

సమాచార హక్కు వచ్చాకా హెల్ప్‌ లైన్స్‌ పుంజుకున్నాయి.  వాస్తవాలు ఎలా మరుగున పడిపోతాయి అన్నదానికి గుజరాత్‌ సి.యం. నరేంద్ర మోడి వర్సెస్‌ ప్లానింగు కమీషన్‌ వర్సెస్‌ నా (మల్లికా సారాభాయ్‌) అనుభవం నిదర్శనం.  300 శాతం పెరిగిన హెల్ప్‌లైన్లు మీడియశక్తి వల్లనే సాధ్య పడింది.  ‘Can Resposible Media Steer the World?’  ఎస్‌, ఖచ్చితంగా.  బీట్స్‌లో హార్డ్‌, సాఫ్ట్‌ అని వార్తల్ని విడదీయనవసరం లేదు.  అది చక్రం కాదు.  చక్రవ్యూహం, దాన్ని భేదించి, ఛేదించి కొత్త నిర్వచనాన్నివ్వాలి.  ఆ నిర్వచనం మీడియా మహిళలు ఇచ్చే స్థాయిలో ఇపుడున్నాం.  కుండబద్దలు కొట్టినట్లు వాస్తవాలు ప్రజల ముందుకు తేవాలి.  ”నేనా పనిచేశాను, చేస్తున్నాను…” అంట ఉత్తేజకరంగా, కించిత్‌ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

ఆ తర్వాత పురుషాధిక్యత వగైరా ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చారు మల్లిక.  పుణె సదస్సుల్లోని మరో ప్రత్యేకత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ సందర్శన, ‘మీడియ, సెక్యూరిటీ ఫోర్సెస్‌ అండ్‌ డెమక్రసీ’ అన్న అంశం మీద ప్యానల్‌ చర్చ.

రెండవరోజు 9వ తేదీ నాటి ఈ సదస్సులో కాశ్మీరీ పూర్వ ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ రుస్తుం నానావతి, వార్‌ స్టడీ పూర్వ అధిపతి, జాయింట్‌ డైరెక్టర్‌ డా|| అనిల్‌ అథలె, థెరెసా రెహ్మాన్‌, (ఈశాన్య రాష్ట్రాల సీనియర్‌ జర్నలిస్ట్‌లు ప్యానలిస్ట్‌లు) గా ఉన్నారు.  అనుసంధానకర్త ది హింద పత్రిక మాజీ డెప్యూటీ ఎడిటర్‌ కల్పనాశర్మ, NDA డెప్యూటీ కమాండంట్‌ రక్షావర్తీ కూడా పాల్గొన్నారు.

నానావతి మాట్లాడుత పోలీస్‌ రక్షణకు, సైన్యం రక్షణకు ఉన్న తేడాను వివరించారు.  మీడియా సెన్సేషన్‌ వైపు మొగ్గుచపుతుంది.  తీవ్రవాదుల చర్యను రిపోర్ట్‌ చేయడం ద్వారా, ఆ వార్తలకు ప్రచారం కల్పించడం ద్వారా సంచలనం రేకెత్తిస్తుంది.  నిజానికి రాష్ట్రంలో సంక్షోభం, క్లిష్ట సమస్యలు నెలకొన్నపుడు సైన్యం పూనుకుని సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నిస్తుంది.  మీడియా కూడా అదే చేస్తుంది.  కొన్ని సార్లు నిజా నిజాలు బైటికి వెల్లడించడానికి మీడియా తపన పడుతుంది.కానీ రక్షణ బాధ్యతల రీత్యా అన్నిసార్ల వాస్తవాలు వెల్లడించడం సైన్యానికి సాధ్యపడదు. అది మీడియా గ్రహించాలి, అలాగే మీడియా నాడిని సైన్యం గుర్తించాలి.  దేశభద్రత రీత్యా సైన్యానికి, మీడియాకి మధ్య సత్సంబంధాలు, అవ గాహన వుండాల్సిన ఆవశ్యకత వుందని నానావతి విశదీకరించారు. సమాచార సేకరణ క్రమంలో మానవ హక్కుల ఉల్లంఘ నలకు సంబంధిత అంశాల దర్యాప్తులో, వార్తాంశాల్ని అందించడంలో అటు సైన్య, ఇటు తీవ్రవాదులు ఇరుపక్షాల పట్ల సంయమనంతో సమాన న్యాయం పాటించా లన్నారు.

సదస్సులో పాల్గొన్న సోల్జర్స్‌ కొందరు సివిలియన్ల వార్తలకిచ్చిన ప్రాధాన్యత సైనికుల సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల కివ్వడం లేదని మీడియకు గుర్తుచేశారు.
ఎన్‌డిఎ మ్యూజియం, ఫోటోలు, అక్కడి వాతావరణం దేశం కోసం ప్రాణాలర్పించే ఫౌజీ సోదరులపట్ల గౌరవం, దేశభక్తిని ప్రసరింప చేశాయి.

ముఖ్యాంశాలు 
నేపాల్‌ మహిళా జర్నలిస్ట్‌లు ప్రదర్శించిన పోర్టల్‌ నేటి మహిళా జర్నలిస్ట్‌ల లక్ష్యసాధనలకు అద్దం పట్టింది.  నేపాల్‌లో మొత్తం 7120 మంది జర్నలిస్ట్‌లుంటే వారిలో 540 మంది మాత్రమే మహిళా జర్నలిస్ట్‌లున్నారు.  ప్రధాన స్రవంతిలో 50 శాతానికి తక్కువ మందే వున్నారు.  సగానికి పైగా మహిళలు జిల్లాల్లోనే పనిచేస్తున్నారు.  కమ్యూనిటీ లెవెల్లో రిపోర్టర్లు శిక్షణ పొందుతున్నారు ఎక్కువగా.  అదృశ్య వార్తల్ని వెలికితీసి జాతీయస్థాయిలో వినిపించడం ధ్యేయంగా పెట్టుకున్నారు.
మీడియాలో పెరుగుతున్న మహిళల సంఖ్య, అవకాశాలు వగైరాల వల్ల మహిళా జర్నలిస్టుల స్థితి ఆశావహకంగానే వుంది.
అలాగే Beyond and victimhood అన్న అంశంమీద మీనా శేషు పరిశోధనాత్మక ప్రదర్శన పలు ప్రశ్నల్ని రేపింది.  ఈ కార్యక్రమానికి అనుసంధానకర్త లక్ష్మీమూర్తి.
ముక్తాయింపు
10వ తేదీ మూడోరోజు ‘హోలిస్టిక్‌ ఎంపర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌’ అన్న అంశంపై ప్రముఖ వైద్యులు, స్పోర్ట్స్‌ మెడిసన్‌ ప్రవీణులైన డా|| రాజీవ్‌ సారంగపాణి విపులంగా ప్రసంగించారు.
ఎఫ్‌ఎం రేడియెద్వారా గ్రామీణ బాల లకు ఆంగ్ల విద్యాబోధన, వివిధ సమాచార సాధనాల ద్వారా గ్రామీణ స్త్రీలు అభివృద్ధినెలా సాధించుకోగలుగుతున్నారు, కమ్యూనిటీ రేడియె ప్రయెజనాలు, వాటిని ఉపయెగించుకునే మహిళా సంఘాలు తదితర అంశాలపై చర్చలు, ప్రదర్శనలు జరిగాయి.
ఈ మూడు రోజుల సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ నుండి మహిళా జర్నలిస్ట్‌లు కె.బి. లక్ష్మి, మంజరి, సత్యవతి, గాయత్రి, అరుణ, పద్మశ్రీ, సమీర తదితరులు పాల్గొన్నారు.
వినత్న విషయాలు, అభిప్రాయలు కలబోసుకునే అవకాశం, స్నేహ వాతా వరణం సీనియర్‌ జర్నలిస్ట్‌లు అమ్ముజ్‌సఫ్‌, కల్పనాశర్మ, అనన్య, రాజశ్రీ వంటివారి విశ్లేషణలు, వివిధ రాష్ట్రాల మహిళా జర్నలిస్ట్‌ల మనోభావాలు ఈ వేదిక అందరికీ పంచింది.
అన్నింటికీ మించి మానవహక్కులు, సామాజిక న్యాయం, ప్రజాభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టితో కృషి చేసి మరణించిన జర్నలిస్ట్‌ అనుపమ స్మత్యర్ధం తల్లిదండ్రులు నిర్మల, జయరామన్‌లు (అనుపమ జయరామన్‌’ నగదు పురస్కారం 15 వేలను యువ జర్నలిస్టు అజరా రహ్మాన్‌కు అందించి స్పూర్తిదాయకంగా నిలిచారు.
వచ్చే సమావేశం మణిపూర్‌లోని ఇంఫాల్‌లో.   
కె.బి.లక్ష్మి (ఎ.పి. చాప్టర్‌)

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.