నాన్నా… వెరీ సారీ!- పి. రాజ్యలక్ష్మి

ఎంతయినా నీవు పాషానివే. చదువుకొని యింత పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగాని సామాజిక స్పృహ బొత్తిగాలేదు. ఎన్ని చెప్పు మీ ఆడోళ్ళ బుద్ధంతే.
ఏమయింది ఉపోద్ఘాతం లేకుండా విషయం డైరెక్టుగా చెప్పొచ్చుకదా.
కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు ఏం చెప్పాలి.
డొంక తిరుగుడు వద్ద విష్ణు. వున్న విషయం చెబితే నేను ఏం చేయాలో తెలుస్తుంది. ముందరి కాళ్ళకు బంధం వేయడం బాగా నేర్చుకున్నావులే.

సరే అసలు విషయానికే వస్తున్నాను. అందరి కోడళ్ళులాగా మా అమ్మను చూడను అంటావు కదా, అయినా నా ఖర్మలే, నిన్ను పెళ్ళి చేసుకొని నేను సుఖపడిందీ లేదూ, పాడూ లేదూ.

సరేలే నేనూ అంతే నీకేదో విశాలభావాలున్నాయని, ఆదర్శవంతుడవని, ప్రేమించి పెద్దలను ఎదిరించి నిన్ను పెళ్ళి చేసుకొని  నేను మాత్రం ఏం బావుకున్నాను. మొత్తానికి యిద్దరూ సుఖపడలేదనుకుందాములే విష్ణు.

అంటే నన్ను చేసుకొని బోలెడు కష్టాలు పడ్డావన్నమాట.

కాకపోతే నీతో సమానంగా కష్టపడి ఉద్యోగం చేయబట్టి కదా నీ కుటుంబం ఈ రోజు ఒక మంచి స్థానానికి వచ్చింది.

ఏంటీ దెప్పి పొడుపా, నువ్వొక కొవ్వొత్తిలా ఫీలవుతున్నావా ఏమిటి? ఏ పెళ్ళి చేసుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆడది మగాడికి, అతని కుటుంబానికి బానిసే అది గుర్తు పెట్టుకో.

అది వాస్తవమే, తరతరాలుగా నడుస్తున్న చరిత్రేకదా, నేనేమీ చరిత్రను తిరగతీయటంలేదుకదా. కాబట్టే నేను యిన్నాళ్ళు నా గురించి ఆలోచించలేదు.

మరి యింత చేసినదానవు, ఈ విషయంలో ఎందుకు సర్దుకుపోవు. నేను సర్దుకుపోను, కాలం చాలా మారింది, దానికి తగ్గట్లు మనమూ మారాలి.

అయితే మా అమ్మను వృద్ధాశ్రమానికి పంపక తప్పదంటావు. ఎక్కడికి పంపిస్తావో నాకు అనవసరం, నా ఒక్కగానొక్క కొడుకుని ఆరునెలల వయసులో నా పాలు మాన్పించి క్రష్‌లో వేసిన రోజు వాడు చూసిన జాలి చూపులు యిప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి.

కక్ష తీర్చుకుంటున్నావా, ప్రతీకారం వంటికి అంత మంచిది కాదు సుషమ.

యిది ప్రతీకారం అని ఎందుకు అనుకోవాలి. పరిస్థితులకు, కాలానికి అనుగుణంగా ఆలోచిస్తున్నామని అనుకోవచ్చుకదా.

అయితే యిక అసలు విషయం చెప్పు.

చెప్పటానికి ఏముంది, ఉద్యోగానికి సెలవు పెట్టి బాబును చూసుకుంటానంటే ఏమన్నావు?

ఆహా! ఏమన్నాను రెండు మూడు నెలలు కాదు కదా. వాడు స్కూలుకు వెళ్ళేంత వరకు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు సెలవు పెడితే జీతం రాదు, వచ్చే జీతం వెనక్కి పోతుందని అన్నాను. ఆ రోజులు అలాంటివి. మన యిద్దరి జీతాలతో నా కుటుంబాన్ని ఈదటం చాలా కష్టంగా వుండేది. యిప్పుడు పరిస్థితులు అలాంటివి కాదు కదా. బట్టతలకు మోకాలికి లింకు పెట్టకు సుషమ.

అదే నేను అంటున్నాను, కుటుంబం బాధ్యతలు ట్టుబాట్లు అని తెగ మాట్లాడుతున్నావు కదా. అదే పద్ధతి మీ అమ్మ ఎందుకు చేయలేదని? నేను డైరెక్టుగా ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం చెప్పు ముందు.

మా అమ్మకు నేను ఎలా చెబుతాను. పెళ్ళానివి కాబట్టి సర్వ హక్కులు వుంటాయి నీ మీద. యింటికి పెద్ద కొడుకుగా కొన్ని బాధ్యతలు వుంటాయి. నా వాళ్ళ దగ్గర ఏమైనా తప్పులు వున్నా సర్దుకు పోవలసిందే. ఒక్కసారి బయటకు వచ్చి సమాజాన్ని చూడు. ముసలివాళ్ళని పట్టించుకోని యువతరం నడిబజారులో శ్మశానంలో అనాధ శవాలు.. యిలా ఎన్ని కథలు మనము వినటం లేదు. నిన్నగాక మొన్న కోర్టు ఏమంది, పెద్దల బాధ్యత పిల్లలదేనని చీవాట్లు కూడా పెట్టలేదా!

పిల్లల బాధ్యత కరెక్టే! అది అందరి పిల్లల బాధ్యత కూడా కావాలి. నీవు ఒక్కడివే కాదు కదా!

అవునులే నువ్వు చెప్పింది కరెక్టే. నా తమ్ముడు వాడొక వెధవ, వాడు పెళ్ళాం చాటు మొగుడు. చిన్నప్పటినుండి బాధ్యతలు తెలియకుండా పెరిగాడు. యిక వున్నది చెల్లెలు. ఆడపిల్లకు ఎందుకు బాధ్యత వుంటుంది.

ఏం ఎందుకు వుండదు., ఆస్తిలో సమభాగం అయినప్పుడు బాధ్యతలలో సమ భాగం వుండాలి కదా.

పెద్ద సామాజికవేత్తలా ఏం మాట్లాడుతున్నావు. నేనే మీ మాట్లాడడం లేదు. మీరే నాచేత మాట్లాడిస్తున్నారు.

నీ చెల్లెలు ఎప్పుడూ సంవత్సరంలో మూడు వందల అరవై అయిదు రోజులు పుట్టింట్లోనే వుంది. ఒక్కతే కూతురని, అందరూ నెత్తిన పెట్టుకొని చూసారు. చిన్నతనంలోనే తండ్రి లేడు కదా అంటూ గారాబం.

ఓహో! యిదా సంగతి. ఆడదానికి ఆడదే శత్రువని వూరికే అనలేదు. నా చెల్లి మీదే నీ ఏడుపంతా.

అవును, నిజంగానే మీ అమ్మ కూతురుని, కోడలిని ఒక రకంగా చూసిందా, ఆమెకు లేని విశాలత్వం నాకు మాత్రం ఎందుకు? అసలు మీ అమ్మకు ఈ పరిస్థితి రావటానికి కారణం మీ చెల్లెలే.

మా చెల్లెలి మీద పడి టాపిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నావా!

అదేం కాదు, మీ అమ్మ కూతురి మీద ప్రేమతో మన కుటుంబంలో ఎన్ని కలహాలు సృష్టించిందో తెలుసా. నీ చెల్లెలి మొగుడికి సంపాదన లేదు, యిల్లరికపు అల్లుడిలా అత్తగారింటికి అతుక్కుపోయాడు. కూతురి మీద ప్రేమతో పుట్టింట్లోనూ పెట్టుకుంది. వాళ్ళ కుటుంబాన్నీ నీ తమ్ముడినీ చదివించటానికే కదా మన యిద్దరి జీతాలు చాలక నానా యిబ్బంది పడింది.

ప్రేమించి పెళ్ళి చేసుకున్నామని, కానీ కట్నం తేలేదని మీ అమ్మ నాతో ఏనాడన్నా, ఒక్కసారన్నా మనస్సు విప్పి మాట్లాడిందా. సరిగా నా మొహం అన్నా చూసిందా. పైపెచ్చు నీ చెల్లెలు మీ అమ్మకు వత్తాసు పలికి మరింత ఆజ్యం పోసింది. కట్నం తేలేదన్న కారణంతోనే కదా యిప్పటికీ మీ కుటుంబానికి సాయం చేస్తున్నాము.

అయితే ఏంటి నీ కక్ష? యిప్పుడు నా చెల్లెలు మా అమ్మ దగ్గర వుండటం లేదు కదా, యిక నీ బాధేంటి?

అందుకే నా బాధంతా, ఆమె పిల్లలందరూ సెటిల్‌ అయ్యారు. ఇప్పుడు ఏ బాదరబంది లేకుండా స్థిమితంగా వుంది. యిక మీ అమ్మ అవసరమూ లేదు. అంతకన్నా యిక మన అవసరము లేదు. పైగా మీ చెల్లెలు ఏమంటుందో తెలుసా, ఆడపిల్లకు ఏం బాధ్యత వుంటుంది. మగ పిల్లలు వుండగా నిన్ను ఎందుకు చూస్తాను. పోయి నీ కొడుకుల దగ్గరే చావమని మీ అమ్మ మొహాన్నే చెప్పారంట.

నిజమే కదా, లోకం పోకడ అంతే.

ఎంత బాగా చెప్పావు. కూతురికి పెళ్ళిచేసి పంపించిన తరువాత ఏదో నాలుగురోజులు పుట్టింటికి వచ్చి పోతే బాగుంటుంది. మరి అలా చేయలేదు కదా. అయినా మీ అమ్మను అనుకోవాలిలే. కూతురు కూతురు అంటూ మొత్తం దోచి పెట్టింది.

నీ చెల్లెలు నిలువు దోపిడి చేసింది. అయినా మీ అమ్మకు తగిన శాస్తి జరగాలిలే. ఎప్పటికయినా కోడళ్ళే చూడాలి కదా, అన్న జ్ఞానం వుంటే బాగుండేది. యిప్పుడు రెంటికి చెడ్డ రేవడి అయిందిగా.

అయినా కోడళ్ళందరూ మంచోళ్ళా పాడా, అమ్మలాగా అత్తను చూడాలి కదా.

అలాంటి కోడళ్ళు వున్నారు. కానీ నీకు ఆ మాటలు అనే అర్హత లేదు. నేను నీకోసం నావాళ్లందరిని వదిలివచ్చాను. నీ యింట్లో యింత స్థానం దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ మీ అమ్మ నన్ను మనిషిగా చూడకపోయినా, ఈ సాకుతో మన యిద్దరిని బాగా వాడుకుంది. మా వాళ్ళే మేలు, ఒక్కసారే వెలి వేశామని చేతులు దులుపుకున్నారు. కానీ మీ అమ్మ అలా కాకుండా నన్ను మాత్రం దూరంగా వుంచి మన యిద్దరి సంపాదనను, బాధ్యతలు అంటూ నీకు మాయమాటలు చెప్పి మొత్తం స్వాహా చేసింది కదా. యిక్కడా బాగుపడింది ఎవరూ అంటే నీ చెల్లెలి కుటుంబం, నీ తమ్ముడు. ఉద్యోగం వచ్చిన తరువాత ఎవరి ముఖం చూడకుండా భార్య చెప్పుచేతల్లో వుండి అందరికన్నా మంచి పొజిషన్‌లో వున్నాడు.

‘అమ్మా’ నాన్నతో వాదించి లాభం లేదు అంటూ పక్క రూములో నుండి ఋషి బయటకు వచ్చాడు.

ఏంటిరా మీ అమ్మను వెనకేసుకొస్తున్నావు, నాయనమ్మ అంటే గౌరవం లేదూ, పాపం పెద్దావిడ వూరిలో ఒక్కతే ఎంత బాధపడుతుందో. వూరికి పోతే ప్రతి ఒక్కరూ నన్ను దోషిగా చూస్తున్నారు. కన్నతల్లిని చూడలేని కసాయి వాడివి అంటున్నారు. చిన్న పిల్లాడివి నీకు విషయం అర్థం కాదు.

ఒకప్పుడు చిన్న పిల్లాడిని, యిప్పుడు కాదు నాన్నా. ఉద్యోగం చేస్తున్నాను కూడా.

అయితే నన్ను ప్రశ్నిస్తావా?

ప్రశ్నించడం కాదు, విషయాన్ని విడమర్చి చెబుతున్నాను నాన్నా. మొత్తానికి మీ అమ్మ నీకు నాయనమ్మ మీద బాగానే నూరిపోసిందన్న మాట. అయినా తల్లిగా యిలానా కొడుకును పెంచేది.

అమ్మను ఏమన్నా అంటే వూరుకోను నాన్నా, నాలుగు రోజులనుండి చూస్తున్నాను. అమ్మను తెగ సతాయిస్తున్నావు. యింతకీ మీ అమ్మను తీసుకొచ్చి వుంచుకోవాలి, అంతే కదా, మరి ఆమెను ఎవరు చూస్తారు? మీ అమ్మే.

మరి అమ్మ ఉద్యోగం చేయాలి కదా.

యిప్పుడు ఆమె ఉద్యోగం చేయకపోయినా ఫర్వాలేదు.

ఆ పనేదో నేను పుట్టినప్పుడే చేసివుంటే నేను అనాధలా బతికేవాడను కాదు కదా.

ఎన్ని మాటలు నేర్చావురా. నువ్వు అనాధగా బతకడం ఏమిటి? నేను మీ అమ్మ బతికే వున్నాము కదా.

బతికే వున్నారు. ఎలా ప్రాణమున్న శవాలుగా, ఆరు నెలల వాడిని క్రష్‌ సెంటరులో పడేసి అనాధను చేశారు కదా.

నిన్ను పెంచడానికి ఎవరూ లేరు. ఆ రోజుల్లో యిద్దరం సంపాదిస్తే కాని మా యిల్లు గడిచేది కాదు.

అదే నేను అడుగుతున్నాను. ఏం నన్ను మా నాయనమ్మ పెంచవచ్చు కదా. నా చిన్నతనంలో మీ అమ్మ ఖాళీగా వూరిలోవుండి అత్తయ్యను, వారి పిల్లలను దగ్గర వుంచుకొని పెంచింది కదా. అప్పుడు మీ అమ్మకు మన దగ్గర వుండి నన్ను చూసుకోవడానికి ఏ యిబ్బంది లేదు. కాని ఆమె నన్ను మనవడిగా స్వీకరించలేకపోయింది.

చెప్పండి వాడి మాటలకు సమాధానం. వీడు పసి పిల్లవాడుగా వున్నప్పుడు ఆమెను కాళ్ళావేళ్ళా పడి బతిమలాడాను. పిల్లాడిని పెంచుకోలేకపోతే, అనాథ శరణాలయంలో పడేయండి, నేను నీ దగ్గర వుండి నీ మోచేతి నీళ్ళు తాగుతూ నీ కొడుకుని సాకాలా. నేనేమన్నా ఆయానా, పని మనిషినా అని అడిగింది. ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది సుషమ.

నాన్నా యిలా అడుగుతున్నానని, అనుకోవద్దు, నాయనమ్మ ఏరోజన్నా నన్ను తన పక్కలో పడుకోబెట్టుకొని ఒక్క కథన్నా చెప్పిందా, గోరుముద్దలు పెట్టిందా? నా వళ్ళంతా తడిమి తడిమి స్నానం చేయించిందా? నన్ను ఎవరు ప్రేమగా చూసారు. నా జీవితమంతా అమ్మ నాకోసం ఎప్పుడు వస్తుందా నన్ను ఎప్పుడు తీసుకొని వెళుతుందా అని ఎదురుచూస్తూ గడిపాను కదా.

అదే నాయనమ్మ అత్తయ్య పిల్లలను కాలు క్రింద పెట్టకుండా అపురూపంగా చూసుకునేది. ఎప్పుడు చూసినా చంకలో పిల్లలను పెట్టుకొని వూరంతా కలియతిరుగుతూ వుంటుంది. మనం వూరికి పోయినప్పుడు నన్ను నడిపించి వాళ్ళను ఎత్తుకునేది. మనం వాళ్ళకోసం యిక్కడినుండి చాలా తీసుకుని వెళతాము కదా, వాటిని మనకు కనిపించకుండా దాచిపెట్టి అత్తయ్య పిల్లలను చాటుకు పెలిచి పెడుతుంది తెలుసా. ఈ విషయం గురించి పిన్ని ప్రశ్నిస్తే వాడికేం తక్కువ, బాగానే తింటాడు, వాడి అమ్మ, నాన్న ఏది అడిగితే అది తెచ్చిస్తారులే అనేది.

నాయనమ్మ వాళ్ళను కంటికి రెప్పలా చూసుకుంది కదా, యిప్పుడు నాయనమ్మను వాళ్ళే చూడవలసిన బాధ్యత వుంది.

ఒరేయ్‌, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.

లేదు నాన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులను చూడటం లేదు. వాళ్ళను అనాధలుగా చేస్తున్నారని చాలామంది గొంతు చించుకుంటున్నారు. దీనిలో కొంత వాస్తవమూ వుంది కాదనను, కానీ మీ అమ్మలాంటి వాళ్ళ విషయంలో మాత్రం కాదు.

నిజం చెప్పునాన్నా, యిప్పటికిప్పుడు నాయనమ్మ మీద నాకు ప్రేమ ఎలా పుడుతుంది. అత్త పిల్లలయినా నేను అయినా ఒకటే కదా. కుటుంబాలు నిలబడాలంటే ఆప్యాయతలు, మమతానురాగాలు ముఖ్యం నాన్నా. బాధ్యతలు ఒక్కటే కాదు దానితో పాటు పిసరంత ప్రేమ కూడా వుండాలి. అది వుంటే దానంతట అదే బాధ్యతతో కూడిన ప్రేమగా మారుతుంది.

అందరూ వుండి అనాధలా పెరిగాను. నీ కోసం అమ్మమ్మ, తాతయ్య వుండీ లేని వాడినయ్యాను. అత్తయ్య కోసం నాయనమ్మ వుండీ లేని వాడినయ్యాను. నీ వాళ్ళు, నీ కుటుంబం, నీ బాధ్యతలు అంటూ తలకుమించిన భారం పెట్టుకొని అమ్మ వుండీ అమ్మ తనానికి దూరంగా పెరిగాను. జీవితంలో డబ్బు ఒక్కటే కాదు నాన్నా, అమ్మ సంపాదనే ముఖ్యం అనుకున్నావు కానీ, మా యిద్దరిని క్షోభకు గురిచేసి మా యిద్దరిని నీకు దూరం చేసుకున్నావని అనుకోలేదు. అవసరాలు తీరాయి కాబట్టి యిప్పుడు మీ అమ్మకోసం మా అమ్మ ఉద్యోగం మానాలా, ఆడపిల్ల పుట్టింటిని వదిలి అత్తవారింటికి రాగానే ఆమెను ఒక యంత్రంగాను, బానిసగానే అనుకుంటారు. ఆమెకు ప్రేమానురాగాలు ఎందుకు పంచరు నాన్నా?

నీ అమ్మ నీకు ఎంత ముఖ్యమో, నా అమ్మ నాకు అంత ముఖ్యం, యిప్పటికే ఆమె చాలా కోల్పోయింది. జీవితంలో తాను పోగొట్టుకున్న సంతోషాన్ని మనం యిద్దరం యివ్వాలి. యింకా బాధ్యతలు అంటూ ఆమె నడుం విరగగొట్టవద్దు. యిప్పటికే నీ కుటుంబానికి ఆమె చాలా చేసింది కదా.

మేధావిలా మాట్లాడుతున్నావురా, మా అమ్మను తీసుకొచ్చి యిక్కడే వుంచుతాను, ఎవరు, ఎందుకు చూడరో చూస్తాను.

ఒ.కే. యింకా మంచిది, తల్లి ఋణం అనేది తీర్చుకోవటానికి కొడుకయినా కూతురు అయినా ఫర్వాలేదు. మీ అమ్మను నువ్వు చూసుకో, కట్టుకున్నందుకు మా అమ్మే చేయాలని లేదు.

నా పనులే నాకు చేసుకోవడం చాతకాదు, యిక నేనేమి చేస్తాను.

అదీ, దారికి రా తెలిసిందా, అసలు అత్తయ్య, నాయనమ్మను ఎందుకు పంపిందో తెలుసా?

ఏంటి తెలిసేది? తల్లి బాధ్యతను కొడుకు చూసుకోవాలి. కూతురిగా నాకేం బాధ్యత ఉంటుంది అంది. అది నిజమే కదా.

ఏంటీ, ఆస్తిలో సగభాగం పంచుకుంది. తన కుటుంబాన్ని మనం కదా చూసింది, బాధ్యతలు ఎందుకు పంచుకోరు?

నేను చెప్పలేనురా, అదేదో నువ్వు మీ అమ్మ చెప్పండి.

ఓ.కే. నేనే చెబుతాను, నాయనమ్మనే అడుగుతాను, మా  అమ్మను పాడిపశువులా వాడుకొని వట్టిపోయిన తరువాత మా ముఖాన పడేశావని నిలదీస్తాను.

ఆఖరుగా చెబుతున్నాను నాన్నా, మనం మారాలి. మనతోపాటు మన చుట్టూ మనుషులూ మారాలి. యింతకాలం నీవు చేయకుండా వున్నది ఇదే. అత్తయ్యకు, నాయనమ్మ సపోర్టు ఇవ్వకుండా వుంటే మామయ్య, అత్తయ్య కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకునేవారు. పరాన్న జీవుల్లా కష్టం తెలియకుండా నాయనమ్మ యింట్లో పెట్టుకొని మన డబ్బులతో సమస్తం జరిపింది. కాబట్టి వాళ్ళకు కష్టం చేయవలసిన అవసరం రాలేదు. నువ్వు మాత్రం మీ అమ్మకు ఎదురు చెప్పలేవు. కూతురిని, కోడలిని, కూతురు పిల్లలైనా,  కొడుకు పిల్లలయినా, మనుమల సంతానం ఒక్కటేనని ఆవిడకు తెలియజెయ్యాలి.

యిప్పటికయినా నువ్వు పెట్టుకున్న రంగుల కళ్ళద్దాలను తీసి దృష్టి బాగా కనిపించే కళ్ళజోడు పెట్టుకో.

అమ్మా, నీకు చెప్పలేదు కదా, నువ్వు ఎప్పటి నుండో నార్త్‌ ఇండియా చూడాలని అనుకునే దానివి. నెలరోజులు సెలవు పెట్టేసానమ్మా. మన యిద్దరికి టిక్కెట్లు బుక్‌ చేశాను. వచ్చే వారమే ప్రయాణం.

అదేంటిరా,

నీ ప్రపంచంలో నీవు బ్రతుకు, అమ్మకి బయటి ప్రపంచం చూపించాలని అనుకుంటున్నాను. నువ్వు మంచి తండ్రిగా, మంచి భర్తగా మారాలి.

అయితే మా అమ్మ సంగతేంటి?

నాన్నా వెరీ సారీ!

యిప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా. నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంచక్కా మీ వూరు వెళ్ళి మీ అమ్మను చూసుకో. నేను మా అమ్మను చూసుకుంటాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

17 Responses to నాన్నా… వెరీ సారీ!- పి. రాజ్యలక్ష్మి

  1. Hyma srinivas says:

    కధ చాలా బావుంది. సందెఅశాత్మకంగాఉంది

  2. sameer sarma says:

    Madam story was really nice. Manam prati okkari intlo nu e problem chastamu.but pullalu kuda dantlo involve aye parents ni educate chayatam. Paristutalni ni convince chayatam bagundi madam. E kada lo naku Nena kanipinchanu amma….:-)

  3. Saliva Drug Test says:

    Always be thoroughly prepared to pass your drug test

  4. theda1096 says:

    I believe I read a different post similar to this one in the past. It seemed to be the exact same subject matter and was just as well published.

  5. amos5548 says:

    Now i’m actually delighted I found this post. It’s well written and the information is great. I hope to find more like this.

  6. eddy2517 says:

    This really demonstrates that there are still people who care about what they submit on the web. I actually liked reading the comments.

  7. neva5711 says:

    If only I could publish submissions this good. I’ve been working hard at this for about two months now and I’m improving however I can’t wait until I’m just as good as you.

  8. eusebia8951 says:

    This kind of page is pretty interesting. I will definately be coming back to your site.

  9. lawanna3151 says:

    This is what I consider beneficial content. Maintain the nice work.

  10. eneida4431 says:

    Awesome content. If only all information We’ve stumbled on turned out to be just as nice. Keep up the nice job.

  11. rachel5894 says:

    From the amount of responses, this is undeniably an extremely involved topic. Whenever I come back to this post there’s an interesting visitor post better than many of the previous ones.

  12. mitchell8040 says:

    Wonderful entry. The most impressive I’ve come across.

  13. russel909 says:

    This post is what I call a well thought out posting. Distinct as well as the point. I will have to definately keep a look out for additional content such as this.

  14. tambra4819 says:

    I almost didn’t check this website out however I’m just happy I did. It’s actually pretty good in comparison to many others I’ve found. I’m going certainly be back.

  15. joeann9882 says:

    This page is pretty engaging. I am going to certainly be returning your site.

  16. kathleen3698 says:

    There is no doubt that this post is one of the finest I have found today. It’s also obvious the person who’s website this is put a whole lot of work into it. Great job!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.