రేపటిరోజున… – B. Goverdhan

నువ్వొక మనిషివో – మృగానివో
సాడిస్టువో – సైకోవో
ఎలా అంచనా వెయ్యడం!?
నాటినుండి రేపటి వరకూ.. ఇంకా
నా చుట్టూ వివక్షతలను అల్లుతూ
అగాధాలను త్రవ్వుతూనే వున్నావ్‌!
నీ స్వభావ .. స్వరూపాలను
క్షణాల్లో మారుస్తూ
ఇంటిలోనో – సందులోనో లేక బాహాటంగానో
నన్ను అవమానిస్తూ నా ఉనికిని భగ్నం చేస్తూ
నా మనసును మంటల్లో కాలుస్తూనే వున్నావు !
నా సహచరుడు నాకు చిరకాల శత్రువయ్యాడు –
వాడు ఎక్కడోలేడు
ఎందెందు వెతికినా.. అందందే కలడు !
నన్ను చెరిచి – హతమార్చి – చెట్టుకు ఉరేసి వేలాడ దీసారు –
నరహంతకులు – కామపిశాచులు
మగతోలు కప్పుకున్న మృగాలు
మన కళ్ళెదుటే తిరుగుతున్నారు- యధేచ్ఛగా-
మెడమీద తలకాయ పెట్టుకు తిరిగే మదోన్మాదులారా!
నాలో రగిలే ఆలోచనలనే
ఆయుధంగా మలచుకునే
నా నిలువెత్తు భూమికను… పదునైన ప్రస్థానాన్నీ
రేపటి రోజున మండే సూర్యుణ్ణీ
పరిహసించేదెవరు ! శాసించేదెవరు!? .

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.