ఎదగడానికి ఎందుకురా తొందరా
ఎదర బ్రతుకంతా చిందర వందరా అన్నాడో కవి
నిన్ను చూసేనేమో
నీలాంటి ఎందరో చిట్టి తల్లులకి జీవితమంతా వెతలేనని
బ్రతుకు బండి పసితనంనుంచే లాగమని
చదువుల తల్లి మీకు అందని ద్రాక్షేనని !
పొట్టకూటికోసం ఎక్కడినుంచో వస్తారు
ఊరిచివరో, ఏ బస్తీలలోనో గుడారాల మాటున
జనం మధ్యలోనే జనాభా లెక్కలకి దూరంగా
బ్రతుకు పోరాటం చేస్తూ !
అమ్మ నాన్న సంపాయించేది రోజు గడవడం కోసమే
అందులో నాన్న తాగుబోతు అయితే ఆ తిండి గింజలు కూడా కష్టమే
ఇంకెవరు నీ గోడు వింటారు
నీ పసి ప్రాయానికి అక్షరం ఆలంబన అవుతుందని
ఈ మట్టిలో మాణిక్యాలకి చదువుకునే హక్కు వుందని
ఎవరు గుర్తిస్తారు !
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలకు
కోట్లల్లో విరాళాలు ఇచ్చే కార్పోరేట్ సంస్థలకు
నల్ల ధనాన్ని గుప్తంగా దాచే ఆశ్రమాలకు
మీ కోసమే మేమున్నామనే సేవా సంస్థలకు
ఏ హోటళ్ళలోనో, చిత్తు కాగితాలు ఏరుకుంటూనో
నలిగిపోయే వీరి బ్రతుకులు కనపడవా
ఎప్పుడు పుట్టారో కూడా తెలియని వీరికి
చదువు చెప్పాలంటే ఆధార్ కార్డులు కావాలా !
నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులు
ఓ సంఘ విద్రోహి, ఓ మేధావి తయారయ్యేది ఈ వయస్సులోనే
చేసే అక్షర దానమే వారి బ్రతుకుల్లో వెలుగని తెలియదా !
మీ చట్టాలు ఎలాగూ కొందరికి చుట్టాలు
కనీసం విద్యకోసం చేసే చట్టాలైనా కఠినంగా ఉంచండి
ప్రతి చిన్నారిని చదివించండి
అన్ని దానాలలోకెల్లా విద్యాదానం మహాదానమని
తర తరాలకు తెలియ చెప్పండి !…..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
అవును అన్నీ దానాల కంటె విద్యా దానం గొప్పది. కాని ఇలా నిలదీసె వారు లెరు కదా ప్రభుత్వాన్ని. చలా చక్కగా వ్రాసారు.