పిల్లల భూమిక స్వప్న, 10వ తరగతి, రవళి- కుక్కపిల్ల సమతా నిలయం, వర్ని, నిజమాబాద్‌

అనగానగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు కోమటి పల్లి. ఆ ఊరిలో నర్సయ్య – నర్సమ్మ అనే ఇద్దరు దంపతులుండే వారు. వారికి ఒక పాప ఉంది. ఆ పాప పేరు రవళి. వారికి ఒక తోట ఉంది. ఆ తోటలో మామిడిపండ్ల చెట్లు ఉన్నాయి. అవి ఎక్కువగా ఎండాకాలంలో కాస్తాయి. కాబట్టి వాటికి సాయంత్రం పూట ప్రతిరోజు నీరు పోసి వాటిని చాలా పెద్దవిగా పెంచారు. ఆ చెట్లు అలాపెద్దయ్యాక వాటికి కాయలు, పండ్లు కాశాయి. నర్సయ్య ప్రతిరోజు ఆ తోటకు వెళ్ళి వాటిని చూసుకుంటాడు. అలా ఒక రోజు నర్సయ్య వెళ్తుండగా నాన్న నీతోపాటు నేను కూడా తోటకు వస్తానని రవళి మారాం చేసింది. అప్పుడు నర్సయ్య ఇలా అన్నాడు. వద్దమ్మ నువ్వు బడికి వెళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నీకు మామిడి పండ్లు తెస్తాను అని చెప్పాడు.

అయినా రవళి వినకుండా చాలా మారాం చేసింది. అప్పుడు రవళికి, నర్సయ్య నచ్చ చెప్పి బడికి పంపించి తోటకు వెళ్ళాడు. తోటకు వెళ్ళే దారిలో ఒక కొండ ఉంది. కొండ దాటిన తర్వాత అడవి ఉంది. నర్సయ్య వెళ్ళేసరికి మామిడి తోట గట్టుపైన ఒక క్కుపిల్ల ఉంది. నర్సయ్య దాని దగ్గరకు వెళ్ళి చూశాడు. అది మామిడి పండు తింటుంది. నర్సయ్య దానిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. అంతలోనే రవళి బడి నుండి వచ్చేసింది. ఆ కుక్క పిల్లను రవళికి చూపించాడు. రవళి చాలా ఆనందించింది. తర్వాత దానికి అన్నం,నీళ్ళు ఇచ్చాడు. అన్నం తిని నీళ్ళు తాగింది. ఆ రోజు నుండి రవళి సాయంత్రం బడినుండి ఇంటికి రాగానే దానితో అడుకునేది. ఒక రోజు రవళి కుక్క పిల్లతో ఇలా అంది. మనం అక్కడున్న మామిడి చెట్టుకు ఒక ఉయ్యాల కట్టుకొని దానిలో ఊగుదాము. అప్పుడు ఆ కుక్క పిల్ల కూడా సరేనంది. వాళ్ళు ఆ చెట్టుకు ఉయ్యాల కట్టుకున్నారు. ముందుగా ఆ కుక్క పిల్లను ఊగించి దానిని కిందికి దింపి రవళి ఊగింది. అంతలో ఆ కుక్క పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక బొమ్మను తెచ్చింది. రవళి దానిని చూసి అది బొమ్మను ఏం చేస్తుందని చూసింది. దానినే గమనిస్తొంది. అప్పుడు ఆ కుక్కపిల్ల చేతిలో ఉన్న బొమ్మను కొరకడానికి ప్రయత్నించింది. అలా అది కొరకడానికి వెళ్తుండగా రవళి వెళ్ళి దాని చేతిలో ఉన్న బొమ్మను తీసేసింది. అప్పుడు రవళి ఇలా అంది. ఓయ్‌ నువ్వు ఇలా ఈ బొమ్మను కొరికేస్తే మనం ఎలా ఆడుకుంటాము అంది. మనతో పాటు దానిని కూడా ఉయ్యాల్లో వేసి ఆడిద్దాము అంది. అప్పుడు కుక్క పిల్ల ఇలా అంది. అయ్యో సారీ నేను ఈ బొమ్మను కొరికేస్తే మనకు ఆడుకోవడానికి ఉండేదికాదు. మనం ఆడుకున్నట్టు దానిని కూడా ఉయ్యాల్లో వేసి ఆడిద్దాము. ఇంకెప్పుడు నేను ఇలా చేయను అంది. అప్పుడు బొమ్మ నన్ను కొరకకుండా వదిలేసినందుకు కుక్క పిల్లకు థాంక్యు అని చెప్పింది. నన్ను కొరకకుండా కాపాడినందుకు నీకు కూడా థాంక్స్‌ అని ఆ బొమ్మ రవళికి థాంక్యూ చెప్పింది. అరే థాంక్యూ ఎందుకు అని రవళి అంది. ఇప్పటి నుండి మనం ముగ్గురం స్నేహితులుగా ఉందాము అని రవళి అంది. సరేనని అవి ఒప్పుకున్నాయి. అప్పటి నుండి ఆ ముగ్గురు కలిసి మెలిసి ఉంటున్నారు. నర్సయ్య తోట నుండి సాయంత్రం ఇంటికి రాగానే రవళి నర్సయ్యకు జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు నర్సయ్య రవళిని మెచ్చుకున్నాడు. తర్వాత నర్సయ్య. నర్సమ్మ, ఇద్దరు కలిసి వారి తోటకు వెళ్ళి మామిడి కాయలు, పండ్లు కోసి బుట్టలో వేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చారు. వారిద్దరు రవళితో ఇలా అన్నారు. మేము అంగడికి వెళ్ళి పండ్లను, కాయలను అమ్ముకొని వస్తాము అన్నారు. అప్పుడు రవళి నేను కూడా వస్తానని మారాం చేసింది. అప్పుడు రవళికి నచ్చచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రవళి కుక్కపిల్లకు అన్నం తినిపించి, నీళ్ళు తాగించిన తర్వాత రవళి కూడా అన్నం తిని నీళ్ళు తాగింది. బొమ్మను కుక్కపిల్లను తీసుకొని ఉయ్యాల దగ్గరకు వెళ్ళి ఆడుకున్నారు. కాసేపటికి నర్సయ్య, నర్సమ్మ ఇంటికి వచ్చారు. నాన్న అనుకుంటూ రవళి వెళ్ళింది. ఆ కుక్కపిల్ల కూడా వెళ్ళి నర్సయ్య భుజం పైనకి ఎగిరి కూర్చుంది. అప్పుడు నీకు ఏం తెచ్చామో చూడు అని రవళితో అన్నాడు నర్సయ్య. ఏం తెచ్చారు అంది రవళి. కొత్త డ్రెస్‌ తీసి చూపించారు. దానిని చూసి రవళి చాలా ఆనందించింది. డ్రెస్‌ బాగుంది నాన్న అంది. అప్పుడు కుక్క పిల్లకు కూడా కుక్క బిస్కెట్లు తెచ్చానని చూపించాడు. వాటిని తీసుకొని కుక్క పిల్లకు ఇచ్చింది. అది కూడా చాలా సంతోషించింది. వాటిని తిన్నది. ఆ బొమ్మకు కూడా ఒక చిన్న బొమ్మను తీసుకొచ్చారు. అది కూడా చాలా సంతోషించింది. తర్వాత అంతలోనే ఒక ఐస్‌క్రీం బండి వచ్చింది. ఐస్‌క్రీం ఐస్‌క్రీం అంటూ అతను ఆగాడు. అప్పుడు నాన్న ఐస్‌క్రీం బండి వచ్చింది. నాకు కొనివ్వు అని రవళి మారాం చేసింది. సరేనని నర్సయ్య ఐస్‌క్రీం బండి దగ్గరకు వెళ్ళి ఐస్‌క్రీం కొనిచ్చాడు. దానిని తీసుకొని రవళి తిన్నది. తర్వాత కుక్క పిల్ల వచ్చి వాళ్ళ వైపు చూస్తుంది. రవళి మరి నాకు ఐస్‌క్రీం అని అడిగింది. అప్పుడు రవళి ఇంట్లోకి వెళ్ళి కుక్క బిస్కెట్లు తీసుకొని వచ్చి దానికి చూపించింది. ఇదిగో ఇవి తిను అని తినిపించింది, తర్వాత బొమ్మతో ఆడుకున్నారు. అలా వారి జీవితం గడిచిపోయింది.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.