29 ఆక్టోబర్ 2014, నాకు చాలా ముఖ్యమైన రోజు. భూమిక ఇంతవరకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. భూమిక హెల్ప్‌లైన్ రెండు రాష్ట్రాల్లోను పనిచేస్తుంది. ఈ కరీంనగర్లో 2టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌లో మహిళల కోసం ఒక సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించాం. ఇంతవరకు ఆ కేంద్రాన్ని కృషి అనే సంస్థ వారు నడిపారు. వారికి నిధులు లేకపోవడం వల్ల 6 నెలలుగా సెంటర్ నడవడం లేదు. 2009లో ఈ సెంటర్‌ని ప్రారంభించడంలో భూమిక పాత్ర ప్రముఖంగా ఉంది. ”మహిళలపై హింస”లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సెంటర్ మూతపడకూడదు. ఏదో విధంగా సెంటర్‌ని నడపాలని నిర్ణయించుకున్నాం మేము. భూమిక ప్రెసిడెంట్ ప్రశాంతి, నేను 29వ తేదిన ఆ స్టేషన్ సి.ఐ.ని కలిసి అన్ని విషయాలు వివరించినప్పుడు ఆయన చాలా సంతోషించారు. మీ సెంటర్ ఇక్కడ చాలా అవసరం.. మీరు మొదలు పెట్టండి, మీకు కావలసిన సహాయం మేమిస్తామని సెంటర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా ఎస్.పి గారిని కలిసాం. మీరు హైదరాబాద్ నుండి వచ్చి స్త్రీల కోసం సపోర్ట్ సెంటర్ నడుపుతామంటే మేమెందుకు కాదంటాం. తప్పక మీకు సహకరిస్తామని ప్రొత్సహించడమే కాదు…. మరో నాలుగు సెంటర్‌లు ప్రారంభిద్దాం మీరు సహకరిస్తారా అని అడిగారు. కరీంనగర్‌లో పని చేస్తున్న ప్రశాంతి వాళ్ళ సంస్థ మహిళా సమత వారు ఎస్పీ గారి ప్రపోజలన్‌ని అంగీకరించారు. భూమిక కూడా సహకరిస్తుందని మేము చెప్పాం.
మంకమ్మతోట మహిళా పోలీస్ స్టేషన్‌లో భూమిక సపోర్ట్ సెంటర్ 29 ఆక్టోబర్ 2014న మొదలైంది.
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags



