మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయనీ విద్మహే

రాజ్యాంగ యంత్రానికి శాసన శాఖ, న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖ అన్న మూడు అంగాలున్నా వాటిలో కార్యనిర్వా హక శాఖలోని సైనిక పోలీసు వ్యవస్థే రాజ్యమన్నట్లుగా కనబడే పరిస్థితి ఈ దశకంలో మరింత పెరిగింది. ఆ క్రమంలో స్త్రీల మీద ఆత్యాచారాలూ పెరిగాయి. పోలీసు క్యాంపులు ఉన్న చోట మహిళలు, పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళలు సైతం వీటికి గురి కావలసి వచ్చింది. వరం గల్‌లో మామునూరు పోలీసు క్యాంపులో అక్కడ పనిచేసుకునే భారతి అనే మహిళపై జరిగిన ఇలాంటి ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. పలివేల్పుల పోలీసు క్యాంపులోని పోలీసు ఉద్యోగి, పక్కనే ఉన్న ఆనాధ బాలికల ఆశ్రమంలో ఒక గుడ్డి మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన (2011) వరంగల్‌లో ప్రజా సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళా సంఘాలు అందుకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. ధర్నాలు చేసాయి.     నేరస్థులను గుర్తించి శిక్షించవలసిందిగా కలెక్టర్‌కు విజ్ఞప్తులు చేశాయి. ఆ తరువాత జనగాం పోలీసు క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రజని అనుమానస్పద మృతిపై (2012) వరంగల్‌ మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించి పోస్ట్‌మార్టం పారదర్శకం గా జరగాలని డిమాండ్‌ చేసి ఆ కేసును మానవ హక్కుల కమీషన్‌ వరకు తీసుకుని వెళ్లాయి. ఇలాంటి ఘటనలు, వీటికి ప్రతిఘ టనలు రాష్ట్రమంతా జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో మెత్తం భారతదేశా న్ని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ను కదిలించిన ఘటన 2004లో మణిపూర్‌ మహిళల నగ్న ప్రదర్శన. మణిపూర్‌ స్వయం ప్రతిపత్తి ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రభుత్వం దింపిన భద్రతా దళాలు స్త్రీలపై నిత్యం జరుపుతున్న అత్యాచార కాండకు నిరసనగా మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన ప్రదర్శన ఇది. 2004 జూలై 10రాత్రి అస్సాం రైఫిల్స్‌ జవాన్లు ఆమెను ఇంటి నుండి కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు తక్షణ ప్రతిస్పందన ఈ చర్య. పోలీసు సైనిక అత్యాచారాలకు గుండె మండిన మహిళలు ఎన్నుకున్న ఈ కొత్త నిరసన ప్రదర్శన మహిళల పట్ల సమా జంలో ఎంత బీభత్స కాండ కొనసాగుతు న్నదో ఎత్తి చూపింది.

ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల కొరకు వెదికే క్రమంలోనూ ఉద్యమాన్ని అణచివేసే క్రమంలోనూ ఆదివాసీ మహిళలపై అత్యాచా రాలు ఎక్కువయ్యాయి. 2005 జనవరి 20న ప్రకాశం జిల్లా నల్లమల చివర ఉండే చెరువు గూడెంలో ఎర్రక్క అనే చెంచు మహిళపై గ్రెేహౌండ్స్‌ పోలీసు దళాలు చేసిన అత్యాచా రం, 2008 ఆగష్టు 20నాడు విశాఖజిల్లా జిమాడుగుల మండలంలోని పంచాయితి గ్రామం వాకపల్లిపై విరుచుకుపడి 11మంది ఆదివాసీ మహిళలపై జరిపిన అత్యాచారం – 2010 జనవరి 22న విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయితి గ్రామమైన భల్లుగూడాలో దాడి జరిపి నలుగురు స్త్రీలపై జరిపిన అత్యాచారం – తీవ్ర నిరసనకు గురయ్యాయి. మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి నిజ నిర్థారణలకు వెళ్ళాయి – ధర్నాలు, ఊరేగిం పులు చేసాయి. నేరస్థులపై చట్టపరమైన చర్యలకు డిమాండ్‌ చేసాయి. వాకపల్లి ఆది వాసీ బాధితుల పోరాట సంఘీభావ కమిటీ ముందుండి ఈ పోరాటాలను నడిపించింది.

అంతేకాక దండకారణ్యమంతా విస్తరించిన విప్లవోద్యమాన్ని అణచివేయ డానికి 2005లో ప్రభుత్వం రూపొందించి, అమలు చేసిన సల్వాజుడుం పథకం వల్ల కానీ, 2009లో ప్రవేశపెట్టిన గ్రీన్‌హంట్‌ పథకం వల్ల కాని ఆదివాసీ మహిళలు, పురుషులు ఎదుర్కొన్న అన్ని హింసలతో పాటు ప్రత్యేకంగా అత్యాచారం అన్న హింసను ఎదుర్కోవలసి వచ్చింది. నిరంతరం ఆత్యాచారాల గురించిన ఆందోళనలో, అభద్రతతో జీవించవలసి వస్తుంది. ఆదివాసీ మహిళలపై లోతట్టు అడవులలో నిరంతరం కొనసాగుతూ వార్తలకెక్కని అత్యాచారాల హింసాకాండ గురించిన సమాచారం క్షేత్ర పర్యటనల నివేదికల రూపంలో అందుబాటు లోకి వస్తున్నాయి.

ఈ అనుభవాలు, ఈ సమాచారం ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమ అవగాహనకు కొత్త కోణాన్ని ఇచ్చాయి. విప్లవోద్యమ అణచివేత నెపంతో ఆదివాసీ ప్రాంతాలలో జరిపే కూంబింగులు, దాడులు, హింస, అత్యాచారం అన్నీ ఆదివాసీలను భయభ్రాం తులకు లోను చేసి ఆ ప్రాంతాల నుండి తరిమివేయడం కొరకేనని తద్వారా అపార మైన అటవీ సంపదల దోపిడీకి బహుళ జాతి కంపెనీలకు అవకాశాలు సుగమం చేయట మేనని స్పష్టమైంది. అడవి కడుపులోని బాక్సైట్‌ గనుల త్రవ్వకాలకు ఎదురు లేకుండా చేసుకొనడానికేనని స్పష్టమైంది. అందువలన ఈనాడు మహిళా ఉద్యమ మంటే సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని పెంపొందించుకొనటం, ఆదివాసీ మహిళా సమస్యను కలుపుకొని పనిచేయటం అనే విశాల దృక్పధం అభివృద్ధి చెందింది.

వివిధ మహిళా సంఘాలు ఉజ్వల, అంకురం వంటి స్వచ్ఛంద సంస్థలు, మహిళా కమీషన్లు హింసకు గురవుతున్న స్త్రీల కోసం పనిచేస్తున్నాయి. స్త్రీలపై హింసను ఎదుర్కొన డానికి సామాజిక మార్పుతో   సమన్వయం చేసి మహిళా పోరాటాలను నడపటానికి వివిధ మహిళా సంఘాలను ఒక వేదిక మీదికి తీసుకొని రావటానికి 2000 సంవత్సరం నుండే ప్రయత్నాలు మొదలై స్త్రీలపై హింసా వ్యతిరేక కమిటీ ఒకటి తాత్కాలిక ప్రాతిపదికపై  ఒక ఏడాదిపాటు పనిచేసింది. 2003 సెప్టెంబర్‌ 21, 22 తేదీలలో రాజాస్థాన్‌లోని అజ్మీర్‌లో వార్షిక సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి దానిని పూర్తి స్థాయి సంఘంగా ప్రకటించారు. ఊనీలి ్పుళిళీళీరిశిశిలిలి జువీబిరిదీరీశి ఙరిళిజిలిదీబీలి ళిదీ ఇళిళీలిదీ (్పుజుఙంఇ)గా అది స్థిరపడింది. ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘాలు చొరవతో పనిచేసాయి, పనిచేస్తున్నాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.