విద్యార్ధుల ఆత్మహత్యలు -కారణాలు, పరిష్కారాలు

పి.రాంనరసింహరెడ్డి

ఆర్ధిక ఇబ్బందులతో చదువులకు దూరం కావడం.

కేరళలో విద్యారంగానికి 40% బడ్జెట్‌ కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 10% బడ్జెట్‌ కేటాయిస్తుండడం దురదృష్టకరం.

కేరళలో మూడు కోట్ల జనాభాకు 1500 ప్రభుత్వ కళాశాలలు ఉండగా మన రాష్ట్రంలో ఎనిమిది కోట్ల జనాభాకు కేవలం 1700 ప్రభుత్వ కళాశాలలు ఉండడం దురదృష్టకరం. అమెరికాలో ముప్పై కోట్ల జనాభాకు 2500 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 300 ప్రభుత్వ విశ్వవిద్యాలయలు మాత్రమే ఉన్నాయి. కేరళ. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో విద్యారంగానికి 40% బడ్జెట్‌ కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థల సంఖ్యను పెంచి విద్యార్ధులందరు ప్రభుత్వ విద్యాసంస్థలలోనే చదివేలా చర్యలు తీసుకోవాలి.
కేరళలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వమే నియంత్రిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రెవేటు విద్యాసంస్థల ఫీజులకు అడ్డ అదుపూ లేకుండా పోతోంది. ప్రతి ఒక్కరు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 21’ ప్రసాదించిన జీవించేహక్కును వ్యతిరేకించడమే. అమెరికా తరహాలో ‘కుటుంబ ఆదాయన్ని’ బట్టి ఫీజును వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలి. అన్ని స్థాయిల్లో ఉచిత విద్యను అందించడం ప్రాధమిక హక్కుగా ప్రభుత్వం గుర్తించాలి. ఈవ్‌టీజింగు, ర్యాగింగు :
విద్య అంటే ‘మంచి అలవాట్లను నేర్పించడమే’ అని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. విద్యాబోధనలో నైతిక విలువలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నైతిక విలువలను పెంపొందించడానికి అన్ని పాఠశాలల్లో, గ్రంధాలయాలు ఏర్పర్చడం అత్యంత ఆవశ్యకం. 2006, ఆగష్టు 14వ తేదీ లోపు అన్ని పాఠశాలల్లో గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు (ఎపి) ఇచ్చిన తీర్పు ఇంతవరకు అమలు కాక పోవడం దురదృష్టకరం. ప్రైవేటు పాఠశాలల్లో గ్రంధాలయాలు లేకపోవడం (జి.వో నంబరు 1’కి విరుద్ధం.
విద్యార్ధుల్లో నైతిక విలువలను పెంపొందించాలంటే, నైతిక విలువలు కలిగిన ఉపాధ్యాయులను నియమించడం అవసరం. అత్యంత నైతిక విలువలు కలిగిన వారినే ఉపాధ్యాయులుగా నియమించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 1986, జాతీయ విద్యావిధానం విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. 2వ తరగతి నుంచి నైతిక విలువల బోధనకు ఒక పీరియడ్‌ను కేటాయించాల్సిన అవసరమున్నది.
పరీక్షల్లో ఫెయిల్‌ కావడం
విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్‌ కావడానికి, చదువులో వెనుకబడడానికి మన విద్యా విధానంలోని లోపాలే కారణం. కేరళ విద్యా సంస్థల్నీ (ప్రభుత్వ మరియు ప్రైవేటు) కూడా 100% ఉతీర్ణత సాధిస్తుంటే మన రాష్ట్రంలో సగటు ఉత్తీర్ణత 50 % మాత్రమే ఉండడం, తద్వారా పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం.
మన రాష్ట్రంలోని విద్యా విధానంలో, పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి.
విద్యారంగంలో సంస్కరణలు
అంతర్గత శక్తికి అనుగుణంగా విద్యా బోధన జరగకపోవడం
విద్య అంటే ‘విద్యార్ధిలోని అంతర్గత శక్తిని వెలికితీసి విద్యార్ధికి దారి చూపడం. విద్యార్ధికి ఆసక్తి ఉన్న రంగంలోనే విద్యా బోధన జరగాలి. ప్రస్తుత విద్యావిధానంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆసక్తులకు అనుగుణంగా విద్యాబోధన జరుగు తుండడంతో  విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురి కావడం, చదువులో వెనుకబడడం జరుగు తోంది.
 అమెరికాలో ప్రతి పాఠశాలలొ ఒక ‘సైకాలజిస్ట్‌’ని నియమిస్తారు. విద్యార్ధి 5 వ తరగతి పూర్తి చేసేంతవరకు అతడు విద్యార్ధిని పూర్తిగా అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత అతడి నివేదికను అనుసరించి విద్యార్ధికి ఆసక్తి ఉన్న రంగంలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంటారు.
పరీక్ష విధానంలో మార్పులు రావాలి.
కర్ణాటక తరహాలో 2 వ తరగతి నుంచి (ట్రైమిష్టర్‌ విధానాన్ని” ప్రవేశపెట్టాలి. ఈ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత  కర్ణాటకలో ఉత్తీర్ణత శాతం, హాజరు శాతం పెరగడం జరిగింది. అమెరికాలో కేవలం నెలవారీ పరీక్షలను మాత్రమే (2వతరగతి నుంచి) నిర్వహిస్తుంటే మన రాష్ట్రలో త్రైమాసిక, అర్ధ, వార్షిక పరీక్షలను నిర్వహిస్తుండడంతో విద్యార్ధులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
‘యశ్‌పాల్‌ కమిటీ’ సూచనలు అమలు చేయాలి.
1992లో విద్యారంగంలో సంస్కరణల కోసం నియమించబడిన ప్రొ.యశ్‌పాల్‌ కమిటీ, పిల్లల పుస్తకాల బరువు విద్యార్ధి బరువులో 10 % మాత్రమే ఉండాలని పేర్కొనగా, ఆ నిబంధన ఇంతవరకు అమలు కావడం లేదు. విద్యార్ధులు తమ బరువులో, సగం బరువున్న పుస్తకాలను మోస్తూ తీవ్రఒత్తిడికి గురవుతున్నారు. ఈ కమిటీ సూచనల మేరకు స్టడీ అవర్స్‌, స్పెషల్‌ క్లాస్‌లను నిషేధించాలి. యశ్‌పాల్‌ కమిటీ సూచనల మేరకు ప్రాధమికవిద్యలో హోంవర్క్‌ను నిషేధించాలి.
శిక్షణ పొందినవారే బోధించాలి.
పాఠశాలల్లో శిక్షణ పొందనివారిని నియమించడం సుప్రీంకోర్టు, అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ( ఎపి) తీర్పులకు విరుద్ధం. జి.ఓ. నెం. 1 ప్రకారం కూడా శిక్షణ పొందినవారే బోధించాల్సి ఉంది. ప్రాధమికవిద్యలో స్కూల్‌అసిస్టెంట్లను నియమించడం జి.ఓ. నెం.45, సుప్రీంకోర్టుతీర్పుకు విరుద్ధం. అదే విధంగా ఉన్నత పాఠశాల విద్యను స్కూల్‌ అసిస్టెంట్లు మాత్రమే బోధించాలని సుప్రీంకోర్టు తీర్పు నివ్వడం జరిగింది. శిక్షణ పొందనివారు బోధించడం వలన విద్యార్ధులు చదువులో వెనుకబడుతున్నారు.
బి.యిడి కళాశాలల్లో నాణ్యత పెంపొందిం చాలి.
బి.ఇడి కళాశాలల్లో, యం.ఇడి చేసినవారే బోధించాలనే నిబంధన ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. తద్వారా బోధనా ప్రమాణాలు కొరవడి నాణ్యతలేని ఉపాధ్యాయులు తయారవుతున్నారు.
మహిళా ఉపాధ్యాయులను నియమించాలి
అన్ని దేశాల్లో పాఠశాల విద్యను మహిళా ఉపాధ్యాయులే బోధిస్తుంటే మనదేశంలో అలాంటి విధానం లేకపోవడం దురదృష్టకరం. మహిళలకు సహజంగా పిల్లల మనస్తత్వంపై అవగాహన ఉండడం, వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉండడం అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని పాఠశాల విద్యలో మహిళా ఉపాధ్యాయులనే నియమించాల్సిన అవసరమున్నది.
ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి.
అన్ని దేశాల్లో ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి 1:20గా ఉంటే, మన దేశంలో 1:40గా ఉండడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల నియమాకాలను చేపట్టాలి. 
కేరళ విద్యావిధానాన్ని అనుసరించాలి.
కేరళలో విద్యారంగానికి 40% బడ్జెట్‌ కేటాయిస్తుంటే, మన రాష్ట్రంలో కేవలం 10% బడ్జెట్‌ మాత్రమే కేటాయిస్తుండడం దురదృష్టకరం. కేరళలో మూడు కోట్ల జనాభాకు 1500 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, మన రాష్ట్రంలో ఎనిమిది కోట్ల జనాభాకు కేవలం 1700 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. కేరళలో విద్యార్ధులందరు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుతుంటే మన రాష్ట్రంలో మాత్రం తగినన్ని ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్ధులు చదువులకు దూరమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కేరళ తరహాలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులను ప్రభుత్వమే నియంత్రించాలి. కేరళలో బాలకార్మికులను గుర్తించడానికి ప్రత్యేకంగా  ఐదు వేలమంది ఉపాధ్యాయు లుండగా మన రాష్ట్రంలో అలాంటి విధానం లేకపోవడం దురదృష్టకరం. కేరళ తరహాలో ఇంటర్‌లో ‘ట్రైమిష్టర్‌ విధానాన్ని’ అమలు చేయలి.
కేరళ విద్యాసంస్థలు 100% ఉత్తీర్ణత సాధిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం సగటు ఉత్తీర్ణత 50% మాత్రమే ఉండడం దురదృష్టకరం. కేరళ విద్యావిధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక కమీషన్‌ను నియమించాల్సిన అవసర మున్నది.
ప్రైవేట్‌ పాఠశాలల నాణ్యత పెంపొందిం చాలి.
జి.ఓ నెం. 1 ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో  శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మౌళిక వసతులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వ స్కేలు ప్రకారం జీతాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు వంటి నిబంధనలు పాటించాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలలు ర్యాంకుల కోసం విద్యార్ధులను ఒత్తిడికి గురిచేస్తుండడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ కళాశాలకకు హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలి.
దక్షిణ భారతదేశంలో కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే ప్రభుత్వ కళాశాలలకు, అనుబంధ వసతి గృహాలు లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి అనుబంధ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి.
మాతృభాషలో విద్యాబోధన జరగాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350 (ఎ) నాల్గవ తరగతి వరకు వతృభాషలోనే విద్యాబోధన జరగాలని పేర్కొన్నది. ఈ నిబంధనను అనుసరించి తమిళనాడులో 5 వ తరగతివరకు, కర్ణాటకలో 6వ తరగతివరకు, మహారాష్ట్రలో 10వ తరగతివరకు విద్యార్ధులందరు మాతృబాషలోనే విద్యాబోధన జరగాలని  సుప్రీంకోర్టు తీర్పు నివ్వడం జరిగింది. ఆ విధంగా జరగక పోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం.
1992లో విద్యారంగంలో సంస్కరణల కోసం నియమించబడిన ప్రొ.యశ్‌పాల్‌ కమిటీ భారతదేశంలో తప్ప అన్ని దేశాల్లో ప్రాధమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే జరుగు తున్నదని పేర్కొన్నది. మనదేశంలో మాత్రం ప్రాధమిక విద్యలో మాతృభాషతో పాటు ‘హిందీ, ఇంగ్లీషు’ బోధిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర వత్తిడికి గురవుతున్నారు.
‘చైనా, రష్యా, జపాన్‌, జర్మనీ’ వంటి దేశాలలో విద్యాబోధన అన్ని స్థాయిలో మాతృభాషలో జరుగుతుంటే, మనదేశంలో మాత్రం ఉన్నతవిద్య పూర్తిగా ఆంగ్లమాద్య మంలో జరుగుతుండడంతో విద్యార్ధులు తీవ్ర వత్తిడికి గురయ్యి, చదువులో వెనుకబడు తున్నారు. తద్వారా ఇంజనీరింగు, ఎం.సి.ఏ, ఎంబి.ఏ విద్యార్ధులు అధిక సంఖ్యలో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు.
ఆంగ్లమాధ్యమం ద్వారానే అభివృద్ధి సాధ్యమని మన ప్రభుత్వాలు భావిస్తుండడం దురదృష్టకరం. మాతృభాషలో విద్యాబోధన జరుపుతున్న (అన్ని స్థాయిల్లో) చైనా, రష్యా వంటి దేశాలు అగ్రరాజ్యాలుగా కొనసాగు తున్నాయి. ‘చైనా’ ప్రపంచంలోనే రెండవ అగ్రరాజ్యంగా కొనసాగుతుంటే, మనదేశం మాత్రం మానవాభివృద్ధి సచికలో 126వ స్థానంలో ఉంది.
 ఆంగ్లమాధ్యవల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత దెబ్బతింటుందని, చదువులో వెనుకబడుతున్నారని, మాతృభాషతోటే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలి.
ఇంటర్‌, పదవ తరగతి విద్యార్ధులపై ఒత్తిడి మార్కుల కోసం, ర్యాంకులకోసం ఇంటర్‌ పదవ తరగతి విద్యార్ధులను తీవ్ర వత్తిడికి గురి చేస్తున్నారు. 2000 సంవత్సరం లో కార్పోరేట్‌ జూనియర్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్ధుల్లో ‘200 మంది’ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఆ నేపధ్యంలో ప్రభుత్వం ‘ప్రొ.నీరదారెడ్డి కమీషన్‌’ ను నియమించడం జరిగింది.
విద్యార్ధులను రోజుకు ‘6గంటలు’ చదివిస్తుండడంతో విద్యార్ధులు ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రతి కళాశాలలో ఒక ‘సైకాలజిస్ట్‌’ను నిమమించాలని ఆ కమీషన్‌ సూచించింది. కమీషన్‌ సూచనల మేరకు విద్యార్ధులు విశ్రాంతి తీసుకునేలా అవకాశం కల్పించాలి.
ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో మౌలిక వసతులు (గాలి, వెలుతురు, మంచినీరు, గ్రంధాలయలు) లేకపోవడం కూడా విద్యార్ధులను వత్తిడికి గురి చేస్తోంది.
కళాశాల అధ్యాపకులకు ఎలాంటి శిక్షణ లేకపోవడం దురదృష్టకరం. కళాశాల విద్యకు సంబంధించి ‘ప్రత్యేక శిక్షణా కోర్సు’ రపొందించాలి. దాన్ని పూర్తిచేసినవారే అధ్యాపకులుగా నియమించబడేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా అధ్యాపకులు విద్యార్ధుల మనస్తత్వానికి అనుగుణంగా విద్యాబోధన చేపట్టగలుగుతారు. ఇతర దేశాల్లో మాదిరిగా అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
ఇంటర్‌ విద్యార్ధినులపై వత్తిడి
‘ఇంటర్‌ విద్యార్ధినులు’ అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుల భారంతో పాటు, ఇంటిపని, గైనిక్‌ సమస్య లతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. కళా శాలల్లో ‘మహిళా అధ్యాపకులు’ తక్కువగా ఉండడంకూడా వారిని ఒత్తిడికి గురి చేస్తోంది. మహిళా అధ్యాపకులను అధిక సంఖ్యలో నియమించాల్సిన అవసర మున్నది. అదే విధంగా వారికి విద్యార్ధినులు తరచుగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల గురించి వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రేమలో విఫలం కావడం
విద్యార్థికి ఇష్టమైన రంగంలో విద్యాబోధన జరగకపోవడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే విద్యాబోధన జరిగితే గా వారికి విద్యార్ధినులు తరచుగా ఎదుర్కొనే అనారోగ్య సమస్యల గురించి వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రేమలో విఫలం కావడం
విద్యార్థికి ఇష్టమైన రంగంలో విద్యాబోధన జరగకపోవడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే విద్యాబోధన జరిగితే వారు చదువులో లీనమై పోతారు. తద్వారా ప్రేమ వ్యవహారాలకు అవకాశం లేని పరిస్థితిని ఏర్పర్చవచ్చు.
సున్నిత మనస్తత్వం
విద్యార్ధుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. అన్ని స్థాయిల్లో విద్యార్ధులందరికీ ‘వ్యక్తిత్వ వికాసాన్ని’ ఒక అంశంగా బోధించేలా చర్యలు తీసుకోవాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to విద్యార్ధుల ఆత్మహత్యలు -కారణాలు, పరిష్కారాలు

  1. మీరు ఉపశీర్షికలుగా (ఆర్ధిక ఇబ్బందులతో చదువులకు దూరం కావడం., పరీక్షల్లో ఫెయిల్‌ కావడం, విద్యారంగంలో సంస్కరణలు, అంతర్గత శక్తికి అనుగుణంగా విద్యా బోధన జరగకపోవడం, పరీక్ష విధానంలో మార్పులు రావాలి., ‘యశ్‌పాల్‌ కమిటీ’ సూచనలు అమలు చేయాలి., శిక్షణ పొందినవారే బోధించాలి……………………………………)
    బి.యిడి కళాశాలల్లో నాణ్యత పెంపొందిం చాలి.) పెట్టిన వాటిని స్పష్టంగా అంటే … Bold చేసి, పైన/కింద ఒక blank line ఇచ్చి ఇఉంటే చదవటానికి ఇంకా బాగా ఉండేదేమో అనిపించింది … Content ఎంత ముఖ్యమో Presentation కూడా అంతే ముఖ్యం (మీకు బాగా తెలిసిన విషయమే ఇది) … మీకు కూడా నచ్చితే మార్చటానికి ప్రయత్నించండి.

  2. ramnarsimha reddy putluri says:

    Author ph no.9505885249

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.