నీల పాదాల స్పర్శ అలల్ని సైతం పులకింపచేస్తుంది.

కె. సత్యవతి

”మా అమ్మ నీల ముచ్చట్లూ, జ్ఞాపకాలూ, వంటలూ..”

 పుస్తకం చిన్నదే.

నీలమ్మ గురించి ఉన్నది 22 పేజీలే.
 మిగతా పేజీలన్నీ వంటలే. రమామేల్కొటే గురించి పరిచయం అక్కర్లేదు. తన మాటల్లో కొంత,

నీలమ్మ మాటల్ల్లో కొంత…పుస్తకం అంతా పరుచుకున్న జీవితం. 92 సంవత్సరాల పండుటాకు.

తన చిగురు ప్రాయం నాటి ముచ్చట్లు, జ్ఞాపకాలు. చదువుతుంటే ఒక అనిర్వచనీయమైన

అనుభూతి. అమ్మల గురించి కూతుళ్ళ అనుభవాలన్నీ ఒకేలా వుంటాయేమో.  మా అమ్మ

అన్నపూర్ణ గురించి  అంతే గాఢంగా ‘మా అమ్మా ప్రకృతీ వేరు వేరుకాదు’ అని నేను రాసిన వ్యాసం

గుర్తొచ్చింది. అమ్మ ప్రేమని అన్నం ముద్దలో రంగరించి పెడుతుంది. నీలమ్మ వంటలు, పచ్చళ్ళు,

వెరైటీ కూర లు ఇప్పటికీ వంట పట్ల వ్యామోహం – ఇవన్నీ స్త్రీలని క్రియేటివ్‌గా వుంచడానికే

అన్పిస్తాయి. వంట యిళ్ళకే బందీలైపోయిన స్త్రీలు వంటల్లోనే తమ సృజనాత్మకతని

నింపుకుంటారేమో!
కానీ నీలమ్మ వంటింటికే పరిమితమైన వ్యక్తి కాదు. కానీ వంటలంటే ఇష్టం. వంటలతో పాటు.  ఈ

చిన్ని పుస్తకంలో- తన అనుభూతులు, తన బాల్యం, తన పుట్టి నూరు విశాఖపట్నం, ఆ మహా

సముద్రతీరం నుండి బూర్గులలో గడిపిన రాజకీయ జీవితం అన్నీ వున్నాయి. ”విశాఖపట్నం నుంచి

ఇంత దూరం నిన్నెట్లా పంపించారమ్మా ఆ రోజుల్లో’ అని అడిగితే ‘నిజాం రాష్ట్రంలో, జాగిర్దారులు,

గోలకొండ వ్యాపారులు అని మా  నాన్నకు తెలిసిన వారెవరో చెబితే మా అన్నయ్య హైదరాబాద్‌ వచ్చి

చూసి ‘నీ కంటే పొట్టి వాడే, చేసుకుంటావా” అని అడిగాడు. 1928లో పెళ్ళయింది. అప్పుడు నాకు

పధ్నాలుగేళ్ళే.” అంటూ తన పెళ్ళి కథని చరిత్రతో మూడేసి చక్కగా చెబుతుంది. రమా మేల్కొటే

అంటుంది. ”నాన్న గురించి మాట్లాడేటపుడు అమ్మ కొన్ని సార్లు గర్వంగా, కొన్ని సార్లు కోపం,

బాధతో చెబుతుంది. అమ్మ మాటలు వింటుంటే తన అస్తిత్వం గురించి పెళ్ళయినప్పటి నుంచి

ఇప్పటివరకూ ఆలోచించడానికి కూడా తీరిక లేకపోయిందనిపిస్తుంది. ఎపుడూ, పిల్లలూ, సంసారం

వీటితోనే సరిపోయిందనిపించింది”. అందరు అమ్మల కథ ఇలాగే వుంటుంది కదా! తమ ఉనికిని,

తమ ఆకాంక్షలని పట్టించుకోవడమంటే మన సమాజపు అర్ధంలో స్త్రీలు స్వార్ధపరులు కదా! అందుకే

కొవ్వొత్తుల పోలికలు. తాను కాలిపోతూ,కరిగిపోతూ కూడా తన చు ట్టూ వున్న వాళ్ళకి వెలుగునిచ్చే

త్యాగశీలురకి స్వంత జీవితం స్వంత అస్తిత్వం ఎలా సాధ్యమౌతాయి? నీలమ్మ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే ఈ అమ్మ జ్ఞాపకాల్లో చరిత్ర వుంది. తెలంగాణా సాయుధ పోరాటం, పోలీస్‌ యాక్షన్‌, కమ్యూనిస్ట్‌ కొడుకు అరెస్ట్‌ – ”ఆ రోజులు తల్చుకుంటేనే బాధేస్తుంది. ఇంట్లో అంతా రాజకీయలే. మీ నాన్న, పెదనాన్న జాతీయవాదులు, కాంగ్రెస్‌ పార్టీవాళ్ళు. అన్నయ్య కమ్యూసిస్ట్‌. ఎపుడు ఏమవుతుందోనని భయం.” అమ్మ మాటల్లో ఆనాటి టెన్షన్‌. స్త్రీలు స్వయంగా తాము రాజకీయాల్లో లేకున్నా కుటుంబ రాజకీయాల తాకిడి ఒత్తిడి వీళ్ళనెంత సంఘర్షణకు గురి చేస్తాయో! నీలమ్మ మాటలు చెబుతాయి.
చెట్లతో నీలమ్మ అనుబంధం అపూర్వ మైంది. మామిడి చెట్లు, నేరెడు చెట్లు. ”ఆ నేరెడు చెట్టు కొమ్మలు రెండు కావాలి” అంది. ”కొమ్మలు పెడితే రావమ్మా” అంటే కాదు. నాక్కావాలి. ఊరికే ముట్టుకుని చూస్తాను.” అంటే రెండు కొమ్మలు కోసిచ్చాడు రామయ్య. అవి పట్టుకుని నిమురుత తడికళ్ళతో చేదు జ్ఞాపకాల్లోకి జారిపోయింది నీలమ్మ. ఈ పేరా చదువుతుంటే మన కళ్ళల్లో కూడా నీళ్ళొస్తాయి.
నీలమ్మకి సముద్రమంటే ప్రాణం ”రోజూ సముద్ర తీరం వెళ్ళి కాళ్ళు తడుపుకోందే నిద్ర పట్టేది కాదు.  భీమలి వెళ్ళి పోయే వాళ్ళం. సముద్రంలో అలలు అలా పైకి వస్తూ౦టే సంతోషంతో కేకలేసేది – ఏంటో సముద్రం నుండి దూరం చేసి నన్నీ తెలంగాణలో పడేసారు ఆ మాట విన్న రమామెల్కొటేతో పాటు మనకి గుండెల్లో పొడిచినట్లనిపిస్తుంది. మూలాలను కోల్పోయిన బాధ. అందుకే రమ అంటుంది చివర్లో ”అమ్మా ! సముద్ర తీరంలో కూర్చుని నీ కాళ్ళు తడుపుకుంటూ, నీ చిన్నతనం జ్ఞాపకం చేసుకుంటూ అలలతో ఆడుకుంటూ వుంటే చడాలని వుందమ్మా…”నాకూ అలాగే అన్పిస్త్రు౦ది.  ఈ అమ్మను భుజాలమీద ఎత్తుకుని, సముద్రతీరంలో దింపి నీల పాదస్పర్శతో అలల్ని పులకరింపచేయలని వుంది.
 మా అమ్మ ‘నీల’ : వెల: ర. 25,
ప్రతులకు: లిఖిత ప్రెస్‌, హెచ్‌ఐ 2, బి 12, ఫ్లాట్‌ 1, బాగులింగంపల్లి, హైద్రాబాద్‌ -44, ఫోన్‌ 27660000

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.