లంబాడీల వివాహ వ్యవస్థ ఒక పరిశీలన

గుగులోతు విజయ, నాగారపు వెంకట్రావు

ఆచార సంప్రదాయాలు ప్రతి జాతికి సంస్కృతికి మూలాధారాలు. ఇవి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ సామాజిక జీవితాన్ని నియమ నిబంధనలతో నడిపిస్తూ౦టాయి.

మానవులు నిత్య జీవితంలో అలవాటుగా చేయు పనులు, ఆ పనులలో అంతర్లీనమై ఉన్న నియమములు తరతరాలుగా ఆచరించుట ద్వారా భావితరములకు అందజేయు సంస్కృతికి రీతులు. అందలి విశిష్టతలు, ప్రత్యేకతలు, ఆచారముల క్రిందికి వచ్చును. ఆచారాలు జీవితాన్ని అలుముకొని పరిపుష్టమై జాతి జీవన ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి.
సృష్టిలోని అనేక జీవులు సామాజిక జీవనాన్ని కోరుకొంటాయి. అలాగే మానవుడు సామాజిక జీవి. సమూహంగా బ్రతకాలని, కలిసి మెలిసి వ్యవహరించాలను కొంటాడు. సమాజం సక్రమమైన బాటలో సాగటానికి కొన్ని హద్దులు అదుపుల తూనికలో ఆచారాలను విధించాడు.
సాంఘీకాచారాలు మానవుని సంఘ జీవితానికి సంబంధమైనవి. ఇవి అనేక తరాలనుండి వారసత్వంగా వస్తుంటాయి. ఇవి కొన్ని శాబ్ధిక కళల సహాయాన్ని ఆపేక్షిస్తున్నాయి. మొదట లంబాడీలు ఉత్తర భారతదేశంలో ఉండేవారని తర్వాత దక్ష్షిణ భారతదేశానికి వచ్చారని చరిత్రకారులు వివరిస్తారు. లంబాడీలు పూర్వం రాజపుత్ర వంశీయులని, కారణాంతరాల వల్ల వారి నుండి విడిపోయి వృత్తికి వేషాన్ని, భాషను, ఆచారవ్యవహారాలను కొంతవరకు మానుకొని ప్రత్యేక తెగగా ఏర్పడినారని లంబాడీల వంశచరిత్రలను పరిశీలిస్తే వీరు రాజస్థాన్‌లోని రాజపుత్రులవంశానికి చెందినవారనే అభిప్రాయం బలపడుతుంది. ”ఆంధ్రప్రదేశ్‌ గిరిజనులు” అనే వ్యాసంలో లంబాడీలు ఉత్తర భారతీయులని వీరు రాజస్థాన్‌ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడి కాలానుగతంగా ఎదురైన ఎన్నో ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటూ వచ్చారు అని శ్రీ కళ్యాణ్‌ గారంటున్నారు. వీరు బహుళ ఉత్తర హిందుస్థానం నుండి మొగలాయి దండయాత్రలపుడు దక్షణ హిందూ దేశానికి వలస వచ్చారని అభిప్రాయం. లంబాడీలు తమ మాతృభూమియైన రాజస్థాన్‌ వదిలి వృత్తిరీత్యా మొగలు చక్రవర్తులకాలంలో మొగలు సైన్యంతో ఉత్తరదేశం నుండి దక్ష్షిణదేశానికి వచ్చారని వీరు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ద సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారని మాగంటి బాపినాడు తెల్పాడు.
ఆచారాలు-ఇవి వ్యక్తిగతమైనవి, సామూహికమైనవి ఎన్నో విధాలుగా ఉంటాయి. లంబాడీల ఆచార సంప్రదాయాలు పుట్టుక నుండి గిట్ట్టే వరకు జీవితాన్ని పెనవేసుకొని ఉంటాయి. మానవ జీవనయానంలో మొట్టమెదటి జననం జననానికి సంబంధమైన ఆచారాలు, వివాహ పద్ధతులు ప్రపంచంలోని ప్రతి మానవ సమాజంలో అనేక విధాలుగా గోచరిస్తాయి. లంబాడీల సమాజంలో కూడా ఎన్నో ఆచారాలు ఉన్నాయి.  ఒక ప్రక్కన ‘ఓక్రా’ను పెడతారు. ‘ఓక్రా’ అంటే చిన్న గోనె సంచిలో మెత్తని గడ్డి నింపి కుట్టిన దిండు.
పెళ్ళి: మనిషి జీవిత కాల గమనములో పెళ్ళి ఒక మైలు రాయి. కుటుంబ వ్యవస్థకు ‘పెళ్ళి’ ఒక మహోజ్జ్వల ఘట్టం. ఇదే మానవుని జీవన యాత్రకు నాంది. వంశాభివృద్ధికి మూలం. అంతేకాక కుటుంబ వ్యవస్థను నిర్మిస్తుంది. సామూహిక. వైయక్తిక, నైతిక విలువలను వివాహ వ్యవస్థ సంరక్షిస్తుంది. లంబాడీలు కూడ జీవితంలో పెళ్ళికి ఎక్కువ ప్రాధాన్యతను యిస్తారు.
గోత్రాలు : లంబాడీలు పెళ్ళిలో ప్రప్రధమంగా గోత్రాలను పరిశీలిస్తారు. కొన్ని గోత్రాల వారు మరికొన్ని గోత్రాల వారితో వియ్యమందు కోకూడదనే నిషేధాలున్నాయి.
నిశ్చితార్థం (ఔలిశిజీళిశినీబిజి): పెళ్ళి తంతులో వివాహ నిశ్చయం మొదటి మెట్టు. బంధుమిత్రలు సహాయంతో జాడలు తెలుసుకొని వారి సారధ్యంలో వివాహ నిశ్చయానికి మార్గం ఏర్పడుతుంది.
సగాయి : లంబాడీ భాషలో సగాయి అంటే తాంబూలాదులు పుచ్చుకోవటం. దీన్నే బెల్లం తినడం అని కూడా అంటారు. వధూవరుల పక్షంవారు బెల్లం తిని సంబంధం చేసుకుంటారు. లంబాడీల స్త్రీలు అనేక పాటలను పాడుతారు.
సాడి కార్యం : పెళ్ళికి ముందు వారం రోజుల్లో ఆదివారం రోజు శుభముహూర్తాన ‘సాడి’ కార్యాన్ని ప్రారంభిస్తారు. సాడి అంటే చీర అని అర్థం. కానీ ఇక్కడ సాడికార్యం అంటే పెళ్ళి కుమారుని అలంకరించి వధువు ఇంటికి పెళ్ళికుమారునిగా పంపించడం.
వదాయి: వదాయి అంటే బ్రాహ్మణు లలో వడుగు విధంగా భావించవచ్చు. అయితే జంధ్యానికి వీరిలో ప్రాముఖ్యత లేదు. కొన్ని ఉపతెగలలో జంధ్యాన్ని కూడా ధరిస్తారని తెలుస్తుంది.
బెల్లం పానకం(గోటా): లంబాడీలలో బెల్లపు పానకానికి అధిక ప్రాముఖ్యత వుంది. ఏ కార్యమైనా తండా వారందరూ విందును, వినోదాన్ని సమానంగా అనుభవిస్తారు. తండా అంటే గుంపు. ఈ తండా జనానికి సరిపోయే బెల్లం, గసాలు, మిరియాలు, కొబ్బరి కుడకలు, నీళ్ళ కుండల్లో లేక బిందెలో  వేసి నానబెడతారు. అనేక గానాలు చేసి ఆనంద అనుభూతులలో తేలియాడతారు. పెద్దలకు పెళ్ళి కుమారుడు గోటాను వంగి మర్యాదగా అందిస్తాడు. ఇది వరుడి సహనానికి పరీక్ష అని వీరి ఆచారము. ఈ పానకాన్ని ఒకసారి వరుని ఇంట్లో ఒకసారి వధువు ఇంట్లో జరుపుతారు.
పసుపు బొట్టు : లంబాడీల పెళ్ళిళ్ళలో పసుపు బొట్టుకు ఇతర హిందువులు జీలకర్ర, బెల్లానికి ఇచ్చినంత ప్రాముఖ్యతనిస్తారు. ఓవైపు బాజాభజంత్రీలు మోగుతుండగా వరుని ఇంటినుండి తెచ్చిన పసుపుకొమ్ముల్ని సానరాతిపై పసుపు చందనాన్ని తీస్తారు. ఈ చందనాన్ని కంచు పళ్లెంలో బద్రపరుస్తారు.
దోరా భాందేరో: హైందవ సంస్కృ తిలో మూడుముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం. దీనిని ఏడు జన్మల పవిత్ర బంధంగా భావిస్తారు. దోరా భాందేరో అంటే దారం ముళ్ళు వేసే కార్యాన్ని బ్రహ్మ ముళ్ళుగా పేర్కొనవచ్చును. నాలుగువైపులా నాలుగు పోలు ముంతల క్రింద ధాన్యం పోసి మధ్యలో వధువును పీట మీద కూర్చోబెట్టి పోలు ముంతలకు ఏడు వరుసల దారం చుడతారు. ఏడుముళ్ళు వేసి వధువు మెడలో వేస్తారు. ఆ తరువాత పోలు ముంతలు దగ్గరకు జరిపి వధువు కుడి పార్శ్వాన్ని వాటి మధ్యలో నుండి ఏడు వరుసల దారం చుట్టి ఏడు ముళ్ళు వేసి వరుడు వధువు చేతికి కడ్తాడు. ఆ తరువాత వరునికి కూడా ఇదే విధంగా రెండు మార్లు చేస్తారు. లంబాడీలు మూడు ముళ్ళకంటే ఏడు ముళ్ళను పవిత్రబంధముగా భావిస్తారు. ఈ సమయములో స్త్రీలు గేయాలను గానం చేస్తారు. లంబాడీలలో కన్యాశుల్కం ఇవ్వడం ఆచారం. కన్యకు, ఆమె తల్లిదండ్రులకు వరుడు పశువులను, ధాన్యాన్ని కన్యా శుల్కంగా అర్పించుకుంటాడు. దీనినే లంబాడీలు ‘భరోపురాకరేర్‌’ అంటారు. వధువు తల్లిదండ్రులకు నాల్గు కోడెలు 45 రూపాయలు ఇచ్చుకుంటారు. వధువుకు ఆమె తల్లిదండ్రులు కూడా పరికిణి, కాంచళి (రవిక) మొదలైన దుస్తులను, ముక్కెరను రూపాయల దండను, ఒక తాంగిడిని ఇస్తారు. తాంగిడి అంటే పెళ్ళిలో పుట్టింటివారు పెళ్ళి కూతురికి ఇచ్చే గోనె సంచి. పశువుల రూపంలో కన్యాశుల్కాన్ని సమర్పించి పెళ్ళి చేసుకొనే ఆచారం వుంది. నిమ్న కులాలలో కూడా ఈ ఆచారం వుంది. అదే విధంగా లంబాడీలలో కూడా కన్యాశుల్కం ప్రాచీన కాలం నుండీ సంక్రమించిన సంప్రదాయం. పెళ్ళి మండపాన్ని వాయర్‌హండి అంటారు. తొమ్మిది  మూలలున్న చతురస్ర స్థలాన్ని కొలిచి నాలుగు మూల గుంజల మధ్యన రెండు రోకళ్ళను పాదుతారు. ఈ స్థలాన్నే వాయర్‌హండి అంటారు. ఒక్కొక్క మూలలో ఆరు కుండలను ఒక కంచుడును నాలుగు మూలలలో పెడతారు. వీటి ప్రక్కనే జిల్లేడు, మోదుగ మరియు మామిడి ఆకులను అమరుస్తారు. ఈ ఆకులు దుష్టశక్తులను మంత్రతంత్రాలను నిర్వీర్యం చేస్తాయని వీరి నమ్మకము.
          పెండకుప్పను మొక్కుట (ఒకోల్డి దోకెర్‌) : ఒకోల్డి అంటే ఆవు పేడ, దోకెర్‌ అంటే మొక్కడం అని దీని అర్థం. అక్కడికి వధూవరులను తీసుకెళ్లి స్త్రీలు గేయాలను గానం చేస్తారు. అక్కడ ఒక మట్టి చిప్పలో గాజు మొలలు, పసుపు, కుడకలు మొదలగు పూజా సామాగ్రితో ఆవు పేడను పూజిస్తారు. పూజించడంలో ఓ విశేషముంది. చాలా కాలం నుండి గోసంపదయే వీరి జీవనాధారం. నేటికీ లంబాడీలు వేల సంఖ్యలో గోవులను పెంచుతూనే వున్నారు. ఈ విధంగా పూజించడం వల్ల గోసంపద పెరుగుతుందని వీరి విశ్వాసము.
         వరుని దేహ దారుఢ్య పరీక్ష : వరుని దేహ దారుఢ్యాన్ని, సహనాన్ని పరీక్షించటానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. స్త్రీలు జిలేడు, మోదుగు కర్రెలతో,రోకళ్ళతో కొడుతూ మా కుతురిని బాధిస్తావా? బూతు మాటలు మాట్లాడుతావా? అంటూ ప్రశ్నిస్తారు. బావ మరుదులు చిన్నచిన్న రాళ్ళు చెవి దొప్పలో పెట్టి మా అమ్మ నాన్నని తిడుతావా? మా చెల్లిని బాధిస్తావా అంటూ నలుపుతారు. ఎంత కొట్టినా, ఎంత నలిపినా అ నొప్పి అని నోట మాట రాకూడదు.వీటిని బట్టి వరుని శరీర పటుత్వాన్ని ఓర్చుకొనే శక్తిని పరీక్షిస్తారు. ఈ అవస్థలను భరించినవాడే వధువుకు సరియైన భర్తగా పోషించే సమర్థుడని నమ్ముతారు.
        ‘పెరా’ : పెరా అంటే రోకలి చుట్టూ ప్రదక్షిణము అని అర్థం. లంబాడీలు పెళ్ళిపందిరిలో పాతిన రోకళ్ల చుట్టూ ప్రదక్ష్షిణము చేస్తారు. లంబాడీ బ్రాహ్మణుడు లేనిచో లంబాడీలలో తెలిసిన వారు ఒకరు ఈ కార్యాన్ని జరిపిస్తారు. లంబాడీల వరుని చేతిలో ఒక రూపాయి బిళ్ళ పెట్టి వధువు చేతిని జోడించి ఐదు సార్లు వధువు వదిన గారైనా లేదా మరొకరైనా తోడుగా మొత్తం ఏడుసార్లు ప్రదక్షిణము చేస్తారు. వధూవరులు కలిసి నడవటములో అక్కడ స్థలం తమ వశమై, వారు ఒకరికొకరు తోడై నేను నీవాడిని, నీవు నాదానివి అని వరుడు, వధువు అనే విధంగా వ్యక్తమవుతుంది. పెరుగన్నం తినిపించడం అంటే కోలయకొల్లర్‌ అంటారు. లంబాడి ఇళ్లలో వధువు వదినెగారు చాలా కార్యక్రమాలను నిర్వహించే ఆనవాయితి ఉంది. ఒకే పళ్లెంలో కొంత పెరుగన్నాన్ని ఒక్కో ముద్ద భుజిస్తారు. ఆ తరువాత రెండో రోకలి వద్ద మిగిలిన పెరుగన్నం తింటారు. ఒకే చెంబులోని నీళ్ళను ఇద్దరూ సేవిస్తారు. ఈ సమయంలో ఇతరుల దృష్టి పడకుండా వధూవరులపై దుప్పటి కప్పుతారు.
          చూడోతీపేర్‌ : పెళ్ళి అయిన మరునాడు చూడోతీపేర్‌ చేస్తారు. చూడోతీపేర్‌ అంటే సౌభాగ్యవతిని అలంకరించడం. స్త్రీలందరూ వధువుకు టోపిలీలు, గుగిరీలు, దండగాజులు, వాంకిడీలు, కసే మొదలగు ఆభరణాలను ధరిస్తారు. లంబాడీ స్త్రీల నగలు బరువుగా, మొరటుగా ఉంటాయి.
               ఢావలో : పెళ్ళికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలసి వధువుకు పంపక సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. దీనినే ఢావలో అంటారు. ఈ కార్యక్రమములో మూడు విధానాలుంటాయి. ఏడ్పును నేర్పించే ఆచారాన్ని ఢావలో అని, పంపక సమయంలో అందరినీ కౌగిలించుకొని ఏడ్వటం, మళేరో అని ఎద్దుపై నిల్చొని తన పుట్టింటి వారు సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ పాడేపాటను దావేలి అని అంటారు. ఢావలో ఎంత కఠిన హృదయులనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింటిలో తన బాల్యాన్ని తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలచుకొని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంట నీరు పెట్టిస్తుంది. ఆడపుట్టుక పుట్టిన తరువాత అత్తవారింటికి వెళ్లవలసిందే అని వధువు నిశ్చయించుకొని పుట్టింటివారు క్షేమంగా వుండాలని కోరుకుంటుంది.
                 మళేరో: మళేరో అంటే తల్లిదండ్రు లను, అన్నాదమ్ములను, స్నేహితులను ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకొంటూ దుఃఖించటం. లంబాడీలలో తల్లులే కాకుండా పెళ్ళి కూతురు తోటి వారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాన్ని పాటలో బోధిస్తారు.
               విందు (గోట్‌) : గోట్‌ అంటే విందు అని అర్థం. పెళ్ళి కుమారుడే ఇవ్వాలని ఆచారముంది. తండా జనాన్ని దృష్టిలో పెట్టుకొని మేకల్ని బలి యిస్తారు. రక్తాన్ని పాత్రలో పట్టి ‘సొలోయ్‌’ వండుతారు. సొలోయ్‌ అంటే చింతపండు పులుసు, ఉప్పు, రక్తం కలిపి తయారుచేస్తారు. సరిపోయే కల్లు, సారాయితో సాయంత్రం అందర్నీ బంతిగా కూర్చోబెట్టి సొలోయ్‌ని వడ్డించి మత్తుపానీయాలు సేవిస్తారు, తరువాత భోజనము చేస్తారు.
               కుటుంబీకుల సేవ : కన్యకు పెళ్ళి పూర్తికావడంతో ఓ ఇంటి కోడలవుతుంది. అత్తమామలకు ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించాలి. అన్న పానాదులు క్రమ పద్ధతిలో అందునట్లు జాగ్రత్తపడాలి. రాత్రి సమయంలో అత్తమామలకు కాళ్ళు నొక్కడం వీరి ఆచారము. ప్రస్తుతం లంబాడీల సమాజంలో న్యాయం ఆచరణలో వుంది. అన్న భార్యను, తమ్ముడు భార్యగా స్వీకరించడం తప్పని భావించరు.
                    ముగింపు : వివిధ జాతులు, కులాలు ఉన్న మన సమాజంలో ఏ సమూహానికి ఆ సమూహం తమకంటూ ఒక ప్రత్యేకత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు తరతరాలనుండి కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ నానాటికి పెరుగుతున్న సంస్కృతీకరణ, పట్టణీకరణ మరియు ప్రపంచీకరణ క్రమంలో ఆయా గ్రామీణ సమూహాలు గిరిజన సంస్కృతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కావున ఈ సందర్భంగా వివిధ ప్రజాసమూహాల సంస్కృతి, సాంప్రదాయాలు పునఃపరిశీలించడం ద్వారా వాటిని తిరిగి రక్షించుకొనవచ్చు.
ఉపయుక్త గ్రంథాలు
 నదీం హస్‌నైన్‌-భారతీయ గిరిజనులు ఒరియంట్‌ లాంగుమెన్‌, 1995. భట్టు రమేష్‌-పి.హెచ్‌.డ-ి సిద్ధాంత వ్యాసం 1998. జి.భద్రు-ఎం.ఫిల్‌. సిద్ధాంత వ్యాసం. జనపాల శంకరయ్య -లంబాడీల గేయ సాహిత్యం, నవోదయ బుక్‌ హౌస్‌, 2001.
జనపాల శంకరయ్య-లంబాడీల ఆచార వ్యవహారాలు, ఎంఫిల్‌. సిద్ధాంత వ్యాసం 1995., హన్మా నాయక్‌-బంజార డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌, హన్మకొండ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

4 Responses to లంబాడీల వివాహ వ్యవస్థ ఒక పరిశీలన

 1. Anonymous says:

  కల్చర బాగుంది మూద నమ్మ కాల మాఎమిటి

 2. narsihma naik says:

  చల బగుంది

  మీరు వివరించిన విషయలు బాగున్నయి

  ఇవ్వన్ని నిజమె
  కని ఇప్పుదు చాల మంది ఈ కల్చర ని మరిచిపొతఉన్నరు. అంథ అంతె దదపు 90 పర్సంతెగె
  మరిచిపొయరు

 3. sravan vishlavth says:

  ఆచొచ విజయ కాఇ గాన రతొ లకని

 4. praveen naik says:

  Desavath ramavath ku em avtundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో