విస్మయ పరిచే దుస్సంఘటనలు
పెద్ద, చిన్న తారతమ్యాలు లేక
పరస్పర విద్వేషాలతో
కుటుంబ వ్యవస్థ
ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితులు
కనివిని ఎరుగని కథనాలతో
అమాయక జనాన్ని
వక్రమార్గం పట్టించేదెవరు?
పసివారి పాత్రలు సైతం
విపరీత ధోరణులై
పాత్రధారులకే గాక
బాలప్రేక్షకులకూ
విషబీజాలు నాటే ప్రక్రియలు
శాఖోపశాఖలై విస్తరిస్తున్నాయి.
ఇవేవి పట్టని నాయకులు మన దురదృష్టాలు
మనుషుల సర్వశక్తులను నిర్వీర్యం చేసి,
ప్రతిభను హతమార్చే
దుష్ట సంస్కృతికి ఇక చరమగీతం పాడాలి.
మద్యపానంపై తిరగబడ్డ
సాహసమే స్ఫూర్తిగా
చెడును వెదజల్లే టి.వి. సీరియళ్ళ అంతం
మన లక్ష్యం
క్షణం ఆలస్యం చేయక
పదండి ప్రవాహమై పోదాం
ఉప్పెనై ఉరుకుదాం
స్త్రీ శక్తిని నిరూపిద్దాం.