నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నావ చాలా పెద్దది. నది దాటి గుజరాత్‌ సీమ నుండి సౌరాష్ట్ర సీమకి వెళ్తోంది. మా దగ్గర కొన్ని తిను బండారాలు మిగిలాయి. మేము నావ ఎక్కాక తిన్నాము. కాని చల్లటి గాలి మా ఆలిని ఇంకా పెంచింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి. మేం మొత్తం పన్నెండు మంది ఉన్నాము. నావలో అన్ని వస్తువుల ఖరీదు ఎక్కువే. మేం టీ, రస్‌కుల్‌ని కొన్నాము కాని అందరికి సరిపోలేదు. మేము కొన్ని ఖాళీ కప్పులు తీసుకుని కొంత టీని వాటిల్లో పోసి అందరం తాగాము. అక్కడ ఒక అతను కఛ్‌ విషయంలో మాతో గొడవ పడ్డాడు. చర్చ తారస్థాయినందుకుంది. నావలో ఉన్న వాళ్ళందరు రెండు గ్రూపులుగా మారతారేమోనని అనిపించింది. రెండు వైపుల నుండి వేడిగా వాడిగా అరుపులు – గొడవలు మొదలయ్యాయి. తర్క వితర్కాలు మొదలయ్యాయి. ఇంతలో ఒక అతను లేచి నిల్చుని అన్నాడు. ”ఈ చర్చలు తరువాత కొనసాగించండి. ముందు వీళ్ళందరి భోజనాల ఏర్పాటు చూడండి. ఒక్క కప్పు టీ ని ముగ్గురు పంచుకుని తాగుతున్నారు. మీకు కనిపించడం లేదు? నిజంగా వీళ్ళ నిష్ఠ, నియమాలకి నమస్కారం చేయాలి.”

అంతే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. వెంటనే ప్రతి వాళ్ళ చేతికి ఒక కప్పు టీ వచ్చింది. తిండి పదార్థాలు పేపర్లమీద పెట్టారు. ఆ గందరగోళం టెన్షన్లు తగ్గాయి. అందరి ముఖాల్లోను ఆనందం కనిపించసాగింది. తరువాత పెద్దగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ”కంజర్‌ కోట్‌ ఛాడ్‌వేట్‌ మాది మాది.”

జార్జ్‌ ఫర్నాండస్‌, కర్పూరీ ఠాకుర్‌, మధులిమియే నినాదాలు చేసారు. నావ గాంధీ ధామ్‌కు వచ్చింది. ఆరోజుల్లో గాంధీధామ్‌ లోక్‌సభలో అద్‌వాణి ఉండేవారు. గాంధీదామ్‌ చేరగానే వందలమంది మాకు స్వాగతం పలికారు. చాలా మంది నాది కుసుమ్‌ది ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. మమ్మల్ని భుజ్‌ బస్సులో కూర్చో పెట్టారు. దారిలో తినడానికి మిఠాయిలు, పళ్ళు ఇచ్చారు. బస్సు ఆగగానే అంతకు ముందు నుండే మాకోసం ఎదురుచూసే వారంతా మా దళానికి జయజయకారాలు చేస్తూ స్వాగతం పలికేవారు. ఇంత దూర ప్రయాణం, ఎగుడు దిగుడు దారుల్లో ప్రయాణం చేసే బస్సు యాత్ర, నినాదాలు చేయడం వలన ఎండిన గొంతులు, మేం అన్నింటినీ మరిచిపోయాం అలుపు, సొలుపు గురించి ఏమీ పట్టించుకోలేదు. మాకు ఏవీ గుర్తుకి కూడా లేవు. కేవలం వాళ్ళలో ఉన్న ప్రేమ, స్నేహం, మాలక్ష్యం పట్ల వాళ్ళకున్న నిష్ఠ, మాకు వాళ్ళు చేసిన సహాయం, మాకు విజయం లభిస్తుంది అన్న వాళ్ళ నమ్మకం మాత్రమే గుర్తున్నాయి. దాదాపు రాత్రి పన్నెండు గంటలకి మేము భుజ్‌కి చేరాము. పార్టీ కార్యాలయంలో స్వాగతం లభించింది. మేం చేరగానే జార్జ్‌ఫర్నాండిస్‌, లాడ్‌లీ మోహన్‌ నిగమ్‌లని కలవాలని చెప్పాను. మేం అక్కడికి చేరకముందు కొన్ని నిమిషాల ముందే సభ ముగిసిందని సభలో జార్జ్‌, ఆటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌, లాడలీ మోహన్‌ నిగమ్‌ మేం అక్కడికి తప్పకుండా చేరుకుంటాం అని వాళ్ళు చెప్పారని అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు. దాదాపు పన్నెండు గంటల దాకా మాకోసం ఎదురు చూసి సభని సమాప్తం చేస్తున్నామని ప్రకటించారు. కఛ్‌ ప్రజలు మమ్మల్ని చూడాలని ఎంతో అత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా నడవడం వలన మా కాళ్ళు వాచాయి ముఖ్యంగా నేనెట్లా ఉంటానో చూడాలని వాళ్ళు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. మాకు ప్రజలు ఇచ్చిన స్వాగత సత్కారాలు చూసి ఎంతో ఆశ్చర్య చకితులయ్యారు. మమ్మల్ని జీపులో కూర్చోపెట్టుకుని కాంప్‌లకి తీసుకు వెళ్ళారు. అక్కడ సత్యాగ్రహం చేసేవాళ్ళు ఉన్నారు. దేశం నలుమూలల నుండి సత్యాగ్రహం చేసేవాళ్ళందరు వచ్చారు. తరువాత రోజు కార్యక్రమం ముందే నిశ్చయం అయిపోయింది. అక్కడ ఊరంతా తిరుగుతూ పక్కన ఉన్న 111 కుగ్రామాలకు వెళ్ళి రాత్రిళ్ళు సభలు – సమావేశాలు ఏర్పాటు చేయాలి.

”కర్పూరీ ఠాకుర్‌ గారు వచ్చారా!” అని అడిగారు.

‘ఆయన ఒక వారం తరువాత వస్తారు’ అని సమాధానం వచ్చింది. మేం మాలో మేము ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నాం. లేఖానంద్‌ చప్పట్లు కొడుతూ అన్నారు. ”అక్కయ్యా! మనం షరతు గెలిచాము.”

రాత్రి రెండున్నర కావస్తోంది. మేం పడుకున్నాము కాని నిద్రపోలేక పోయాము. ఎవరో ఒకరు మమ్మల్ని కుతూహలంతో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. దళం నేత షఫీఫ్‌ ఆలిమ్‌. కాని ఎందుకో మరి తెలియదు కాని బహుశ స్త్రీలం కాబట్టి నన్ను కుసుమ్‌ని ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కుసుమ్‌ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తూ కొన్ని ప్రశ్నలకి జవాబులిమ్మని నా వంక చూసేది. మా తోటి వాళ్ళకి మా మీద ఈర్ష్య కలగసాగింది. ధన్‌బాద్‌నుండి వచ్చిన విద్యార్థి చిన్నవాడు కావడం వలన వీళ్ళందరు మమ్మల్ని పొగుడుతూ ఉంటే చూసి ఆశ్చర్యపోసాగాడు.

ఇక అవదేష్‌ ఉండలేక పోయాడు. ”రమణిక గారు స్త్రీ అయినందున ఎంతో లాభం కలుగుతోంది” అని అన్నాడు.

నేను ఇక ఊరుకోలేక పోయాను. ”నేను దేవుడిని కాను. నాలో మేథోశక్తి ఉంది. దేవుళ్ళను పూజిస్తారు కాని తర్కించే వ్యక్తిని ఎంతో ప్రశంసిస్తారు. ఇక్కడ నన్నెవరు పూజించడం లేదు. మన అందరిని ప్రశంసిస్తున్నారు. నన్ను ఒక ప్రతీకగా మాత్రమే తీసుకుంటున్నారు”.

కాని అవదేష్‌ గారితో తర్కం చేయడం కష్టం. వారిలో స్త్రీల పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆయనలో ఉన్న అహం స్త్రీల గొప్పదనాన్ని స్వీకరించలేక పోతోంది. నా ఉద్దేశ్యంలో ప్రతి పురుషుడిలో ఈ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఉంటుంది. అందుకే వాళ్ళు దీనిని అధిగమించడానికి స్త్రీలపై దాడి చేస్తూ ఉంటారని నా అభిప్రాయం.

రాత్రి దాదాపు ఒంటిగంట రెండు గంటలకు లాడతీ మోహన్‌ నిగమ్‌ వచ్చారు. నా కాళ్ళ దగ్గర కూర్చుని నాకాళ్ళు పడుతూ అన్నారు. ‘చాలా అలసిపోయావు కదూ!’

నన్ను నేను సంబాళించుకున్నాను. కాళ్ళను పక్కకు జరిపాను. ఊహ! పెద్ద అంతగా అలసట లేదు. మీరు నా

కాళ్ళు పట్టుకునేంత అలసిపోలేదు” అని అన్నాను.

అయినా ఆయన నా కాళ్ళను తన వైపు లాక్కుంటూ అన్నారు. ‘ బిహార్‌లో ఈ దళానికి తీసుకురావడానికి నీవెంత కష్టపడాల్సి వచ్చింది. నేను దీని గురించి అంతా విన్నాను మధ్య దారిలో మీకు ఎన్ని ఆటంకాలు, అపాయాలు కలిగాయో నాకు తెలుసు. ఢిల్లీ నుండి నాకు వార్తలు వచ్చాయి. దిన పత్రికలో ప్రతిరోజూ మీ దళం చేస్తున్న కార్యక్రమాల గురించి చదువుతునే ఉన్నాను. నన్ను ఆపకు.”

ఆయన కంఠంలో స్నేహభావాన్ని చూసి నేను కాదనలేకపోయాను. నేను నిద్రపోయాను. మరుసటి రోజు భుజ్‌ వెళ్ళడానికి జీపు వచ్చింది. దానిలో భుజ్‌ నుండి ఆడపిల్లలు వచ్చారు. మధ్యాహ్నం వాళ్ళతో పాటు భుజ్‌కి పోయి సందర్శించాలి.

మా దళం ఉళ్ళల్లో ప్రచారం చేయడానికి వెళ్ళింది. భుజ్‌లో ఉన్న ఒక కుటుంబం వాళ్ళు నేను అక్కడ ఉండటానికి ఏర్పాటు చేసారు. మా దళాన్ని అరెస్టు చేసే సమయం వచ్చింది. మేం అందరం కోర్టుకి వెళ్ళాము. మేము చివరి దళంతో పాటు అరెస్టు కావాలని అనుకున్నాము. కాని కొందరిలో తొందరగా వెనక్కి రావాలన్న ఆలోచన ఉంది. మేం అందరం కలిసి జైలుకి వెళ్ళాలి కాని ఎవరైతే ఆగదలుచుకున్నారో వాళ్ళు, నేను, చివరి దళంతో జార్జ్‌, కర్పూర్‌ గార్లతో రెండోసారి అరెస్టు కావాలన్న నిర్ణయం జరిగింది. బొంబాయి నుండి జార్జ్‌తో పాటు చాలా మంది వచ్చారు. భుజ్‌లో తులసీగారు, సోదరి సుధ సత్యాగ్రహం కోసం దళాలని పంపేవారు. జనసంఘం ఇంకా మరికొన్ని పార్టీలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. మధ్యప్రదేశ్‌ నుండి ఆరిఫ్‌బేగ్‌ వచ్చారు. ఆయన వేడి వాడి ఉపన్యాసాలు విని భుజ్‌, కఛ్‌ల యువకులు ఉత్సాహంతో బయలుదేరాము. లాడలీ ఇచ్చే ఉపన్యాసాల ప్రభావం ఎంతగా ఉండేదంటే స్త్రీలు తమ తమ నగ నట్రా అంతా చందాగా ఊడ్చి ఇచ్చేవారు. మా సంయుక్త సోషలిస్టు పార్టీలో జార్జ్‌ మధులిమియే, రాజ్‌ నారాయణ్‌, కర్పూర్‌ మొదలగువారు ఉండేవారు. వాళ్ళ నేతృత్వంలో ఈ పార్టీ నడిచేది. ఎస్‌.ఎమ్‌.జోషి మా అధ్యక్షుడు. కాని లోహియా వాదులందరి దృష్టిలో ఆయన జయప్రకాశ్‌ గారి సోషలిస్టు పార్టీనే సమర్థిస్తారు. సుధగారు, తులసీగారు గుజరాత్‌లో పార్టీ పనులు చూస్తూ ఉండేవారు. వీళ్ళు సోషలిస్టు పార్టీకి చెందిన గ్రూపు. జార్జ్‌ని, మమ్మల్ని తీవ్రవాదులుగా భావించేవారు. అందులో లాడలీ అగ్రగణ్యులుగా ఉండేవారు. (తరువాత జరిగిన బాంబు కేసులో జార్జ్‌తో పాటు లాడలీ మోహన్‌గారు కూడా అరెస్ట్‌ అయ్యారు. మమ్మల్నందరిని మెజిస్ట్రేట్‌ దగ్గరికి తీసుకువెళ్ళారు. మేము రాత రూపంలో, మౌఖిక రూపంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చాము. ‘మేము భారత్‌ సీమని పాకిస్తాన్‌కి ఎంతమాత్రం ఇవ్వము. సీమని దాటి కంజర్‌కోట్‌కి వెళ్తాము’.

మాకు పది రోజుల శిక్ష పడ్డది. మమ్మల్ని మండవా పంపాలని పైవాళ్ళ ఆదేశం ప్రకారం పోలీసులు అనుకున్నారు. ఎందుకంటే భుజ్‌లోని ఏ జైల్లోనూ చోటులేదు.

మండవీ సముద్ర తీరంలో ఉన్న చిన్న ఊరు. అక్కడ ఒక స్కూల్లో మమ్మల్ని పెట్టారు. అక్కడ అంతకుముందే ఎంతోమంది అరెస్టు అయి వచ్చారు. మాతో పాటు సుందర్‌గఢ్‌కి చెందిన సోషలిస్టు పార్టీ సెక్రెటరీ కూడా అరెస్టు అయ్యారు. వారు జైన మతానికి చెందినవారు. ఒక పెద్ద హాలులో అందరు ఎవరి దుప్పట్లు వాళ్ళు పరుచుకుని కూర్చున్నారు. మాకు తినడానికి ఒక పళ్ళెం, తాగడానికి గ్లాసులు ఇచ్చారు. మా దళం వచ్చాక మాండవీ వాస్తవ్యులు ఎంతో మంది మమ్మల్ని కలవడానికి వచ్చారు. వాళ్ళు కూడా ఏవో తిను బండారాలు మాకోసం తెచ్చారు.

మేం భోజనం చేసాక నియమం ప్రకారం మా ఎంగిలి పళ్ళాలు. గ్లాసులు తోమి పెట్టుకునే వాళ్ళం. కాని అవధేష్‌ మొదటి నుండే పళ్ళాలు కడగనని భీష్మించుకుని కూర్చున్నాడు. బిహారు మాన్యువల్‌ను అనుసరించి గిన్నెలను తోమడానికి ఒక ఖైదీని ఏర్పాటు చేయాలని అధికారులను అడిగాడు. మేం ఆయనకు ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాము. ఇక్కడ అందరు సత్యాగ్రహం చేసేవాళ్ళే ఉన్నారు. ఖైదీ ఎట్లా దొరుకుతాడు? ఇక్కడ మనం సత్యాగ్రహం చేయడానికి వచ్చాం. అంతేకాని సుఖాలు అనుభవించడానికి రాలేదు. తిండిలో ఏదైనా లోపం కనిపిస్తే మనం చెప్పవచ్చు. కాని గిన్నెలు తోమడానికి ఖైదీని ఏర్పాటు చేయమనడం ఎంతమాత్రం ఉచితం కాదు. ఎందుకంటే ఇది రెగ్యులర్‌ జైలు కాదు. ఇక్కడ బొంబాయి ప్రెసిడెంన్సీ చట్టం అమలు పరుస్తారు. సుందర్‌గఢ్‌ సెక్రెటరీ కూడా ఆయనకి తెలియ చెప్పారు. అధికారులు కూడా చెప్పారు కాని ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి నేను అన్నాను. ‘సరే గిన్నెలన్నీ నేను తోముతాను. కాని మీరు ఈ విధంగా అనుచితంగా వ్యవహరిస్తూ బీహారు పేరుని పాడు చేయకండి’.

నేను మాండవీలో ఉన్నంత కాలం ఆయన వాడిన గిన్నెలని తోమిపెట్టాను. ఆయన చివరి ఘడియ వరకు తన పట్టుదల వదలలేదు.

పదిరోజులకి బదులుగా ఏడోరోజే మమ్మల్ని విడుదల చేసారు. బస్సులో కూర్చున్నాము. పోలీసులు కూడా మా వెంట ఉన్నారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఎవరు చెప్పలేదు. నాలుగు వైపుల నుండి అంతా మూసే ఉంది. బాగా వేడిగా ఉంది. దారిలో ఆపారు. ఒక బిల్డింగ్‌ దగ్గర చెట్టుకింద మమ్మల్ని కూర్చోపెట్టారు. అన్నం పెట్టారు. కాని ఎవరి కడుపు నిండలేదు. నీళ్ళకు కూడా కరువయింది. బయట ఏం జరుగుతోందో మేము చూడలేము. మా ముందు జీపులో అధికారులు కూర్చున్నారు. మేం నినాదాలు చేసి అలసిపోయినప్పుడు కొంతసేపు మౌనంగా ఉండి పోయేవాళ్ళం. ఎక్కువ రద్దీగా ఉన్న చోటు నుండి వెళ్తుంటే పెద్ద పెద్ద నినాదాలు చేసే వాళ్ళం- ‘కంజర్‌ కోట్‌ మాది, ఛాడ్‌వేట్‌ మాది. భారత ప్రభుత్వం ఎందుకు పనికిరానిది. మీ జైళ్ళు ఎంత విశాలంగా ఉన్నాయో చూసాము. ఇంకా చూస్తాము’. ఈ విధంగా మేము మూడు రోజుల వరకు బస్సులో ప్రయాణం చేస్తూనే ఉన్నాము.

చివరికి మేము పొద్దున్నే ఐదు గంటలకి భావనగర్‌కి చేరాము. జైల్లో వ్యవహారం చక్క బెట్టడానికి రెండుగంటలు పట్టింది. మేం వార్డులకి వెళ్ళాము. వెంటనే మమ్మల్ని విడుదల చేయాలని ఆదేశం జారీ అయింది. అప్పటికి పదిరోజులు పూర్తయ్యాయి. బహుశ మాండవీలో మరికొందరు అరెస్టు అయ్యారు. చోటు లేకపోవడం వలన మమ్మల్ని మూడు రోజులు బస్సులో తిప్పారు. భావనగర్‌ జైల్‌కి పంపారు. అక్కడ అల్వాహారం ఇచ్చారు. కుసుమ్‌ని, నన్ను మహిళా వార్డుకి పంపించారు. ధన్‌బాద్‌ నుండి వచ్చిన యువకుడు, కుసుమ్‌ తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. ఎవరైతే వెనక్కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికి రైలుపాస్‌ ఇచ్చి కొంత దారి ఖర్చులు ఇచ్చి పంపేసారు. నేను లేఖానంద్‌ ఝూ మరో ఇద్దరు మగ్గురు వెనకకి భుజ్‌కి టికెట్‌ తీసుకున్నాము. మళ్ళీ సత్యాగ్రహంలో పాల్గొనడానికి భుజ్‌ వెళ్ళాము. అవధేష్‌గారు జైల్లో ఏదో విషయంలో అధికారులతో తగదా పడ్డారు. అందువలన ఆయనని తరువాత విడుదల చేసారు. ఆయనపై లాఠీ ఛార్జి అయింది. బాగా కొట్టారు. రెండు మూడు రోజుల తరువాత ఆయన భుజ్‌కి వెనక్కి వెళ్ళిపోయారు. మేం అందరం భుజ్‌లో కర్పూరీ గారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం.

ప్రతి రోజు దళాలను అరెస్టు చేస్తూనే ఉన్నారు. మేమూ చివరిదళంతో వెళ్దామనుకున్నాం ఈ దళంలోనే జార్జ్‌, కర్పూర్‌ ఉన్నారు. ఒకరోజు మేం ప్రచారం చేసి వెనక్కి రాగానే భుజ్‌ రాజమహల్‌ నుండి నన్ను కలవమని ఒక సందేశం వచ్చింది. రాణి, రాజు నన్ను కలవాలనుకున్నారు. భుజ్‌ ఒక చిన్న సంస్థానం. మరుసటి రోజు నేను రాణిని కలవడానికి వెళ్ళాను. అక్కడ నాకు ఎంతో బాగా స్వాగత సత్కారాలు జరిగాయి. మేము మన దేశం ఎల్లలను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నాం. అరెస్టు కావడానికి కూడా వెనకాడటం లేదు, ఇదంతా తెలిసాక వాళ్ళు ఎంతో భావకులయ్యారు. రాణిగారు నేనూ మాట్లాడుతూ కూర్చున్నాము. అవిడ నన్ను అడిగారు – ‘రమణికగారు! మీరు క్షత్రియులని తెలిసింది.’

”అవును. మా అమ్మ- నాన్నగార్లు క్షత్రియులు” నేను అన్నాను.

‘మీరు ఇంటర్‌కాస్ట్‌ వివాహం ,చేసుకున్నారని విన్నాము’, ఆవిడ సంకోచిస్తూ అడిగారు.

‘అవును. ఇంటర్‌కాస్ట్‌ వివాహం చేసుకున్నాను. మా ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా నేను గుప్తాగారిని ప్రేమ వివాహం చేసుకున్నాను’.

‘మరి దీని ప్రభావం మీ సంతానం మీద పడదా!’ ఆవిడ మెల్లగా అడిగారు.

‘మీరు అగ్రవర్ణంవారు, క్షత్రియులు. మీ భర్త కోమటి కులంవారు. క్షత్రియుల వీరత్వం వాళ్ళల్లో రాదుగా! మీ సంతానానికి తండ్రి గుణాలు వస్తే’!

‘మా సంతానానికి నా ధైర్యం రావచ్చు. తండ్రి మేధాశక్తి రావచ్చుగా’! నా మాటలో వ్యంగ్యాన్ని దాచాలని ప్రయత్నం చేస్తూ ఆయన కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

‘అసలు నేతలతో మాట్లాడమే చాలా కష్టం. అందులో మీలాంటి తెలివిగల వాళ్ళతో మాట్లాడటం ఇంకా కష్టం’.

నేను నవ్వాను. వారికి బర్నాడ్‌షా గురించి చెప్పాను. ఒక అందమైన స్త్రీ అతడిని పెళ్ళి చేసుకుంటానని అభిప్రాయం వెలిబుచ్చుతూ మన సంతానికి నా అందం నీ తెలివి వస్తాయి అని అన్నది. బర్నాడ్‌షా మళ్ళీ ప్రశ్న వేసారు. దీనికి వ్యతిరేకంగా అయితే! రాజు కూడా పెద్దగా నవ్వారు. తల్లి తండ్రుల కులాలను బట్టి సంతానం తెలివితేటలను బేరీజు వేసే ూవతీఎశ్‌ీa్‌ఱశీఅ జశీఅఅశ్‌ీa్‌ఱశీఅ ుష్ట్రవశీతీవ ఈ నవ్వులలో ఎక్కడో మాయం అయిపోయింది.

రాజు రాణి మమ్మల్ని సత్యాగ్రహం చేయమని ఎంతో ప్రోత్సహించారు. రాజుగారి తల్లిగారు ‘వెళ్ళు. . . విజేత అయిరా!’ అని అన్నారు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.