వుచ్చదాపిన దొరల్ని వురేయిద్దాము- జూపాక సుభద్ర

అవ్వా ! మహిళా సంగమోల్లారా, అయ్యా ఉద్యమ సంగపోల్లారా, గా నెల్లూర్‌లో ఎస్సీ బూముల్ని కబ్జాకోరులనుంచి విడిపించే భూపోరాటం చేస్తున్న కావలి రాణికి ఆసరాగ పోదామా! మాకు తిరగబడ్తావా అని నగ్నంగా చేసి చెత్తను కొట్టినట్లు కొట్టి మొకమ్మీద, నోట్లె ఉచ్చబోసి పారిపోయిన బలిజ దొరల దౌర్జన్యాలను అరెస్టు చేయించెదానికి పోయి, ఆమెకు ఓదార్పయిదామా!

కావలి రాణి నెల్లూర్‌ ఉలవపాల్లలో మాదిగ పల్లె మహిళ. సర్కారిచ్చిన బూముల్ని ఆక్రమించుకొన్న బలిజ దొరలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ఆమెపట్ల బలిజ దొరల దాడి అమానుషమైంది. యీ ఘటన 6-1-2015న జరిగితే 8-1-15 దాకా కనీసం వార్తగాని మీడియా పాయి దేర్లు. కావలి రాణికి జరిగిన అవమానాల మీద, దాడి మీద ఆ జిల్లా ఎస్సీ సంగాలు కదిలినా పౌర సమాజాల స్పందన లేదు.

ఆ 6-1-15న ఏంం జరిగిందనేది రాణి మాటల్లోనే…. 6-1-15న సాయంత్రం నాలుగున్నరకు మా పొలంలో మా నాయినతో కల్సి పంజేస్కుంటున్న. అధాటుగ ముగ్గురు బలిజ ఆసాములు వచ్చి మా నాయినకు బలంగ డొక్కలో తంతే పడిపోయిండు. నా పెడరెక్కలు యిరిసి ఒకడు పట్టుకుంటే యింకిద్దరు బట్టలిప్పి జామాయిల్‌ కట్టెల్తో బాదుతూ, మాదిగ లంజా అని చెప్పలేని బూతులు తిట్టినారు. నా మీద బలాత్కారం జేసి చంపుదామనుకుంటుండగ కొంచెం దూరంలో గేదెలు, మేకలు కాసుకునే వాల్లంజూసి ఒసే లంజా బతికిపో యిననే యిగో మా వుచ్చ తాగే మాదిగి ముండా! అని మొకమ్మీద ముగ్గురు వుచ్చబోసి తాగిచ్చి పారిపోయారు. ట్రాక్టరు దున్నే డ్రైవరు కూడా వాల్లను చూసిండు. అతను వేరే వూరతను. తెల్లవారి ఆసుపత్రికి తీస్కపోయి జిల్లా ఎస్‌పీకి యీ సంఘటన మీద దండోర సంగం దాడి చేసిన వాల్లని అరెస్టు చేయాలని ఫిర్యాదిస్తే . . సాక్ష్యాలు బలంగా లేవు, గేదేలు, మేకలు కాసుకునే వాల్లు బాదితురాలి కులము. వాల్ల సాక్ష్యం చెల్లదు. ట్రాక్టర్‌ డ్రైవరు వేరే కులము అతని సాక్ష్యం తీసుకోవాలి అతను వేరే వూరు వాడు అతనొచ్చి సాక్ష్యం చెప్పేదాక అరెస్టు చేయమని పోలీసులు చెప్తున్నరు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలె న్యాయం జరగాలంటే … అని దుక్కపడే ఆ మెతుకు యెన్నంటి వుందామా!

కావలి రాణి అసహాయ బాధితుల పట్ల బాధ్యత కనబర్చింది. కావలి రాణి భూమి కబ్జాకాలే. కాని తన చిన్నమ్మ కుటుంబం, కాళ్లులేని వికలాంగుడి కుటుంబం,గుడిసెలేని నిరుపేద కుటుంబాలకిచ్చిన ఆరెకరాల బూమి ఆక్రమణకు గురైతే.. యీ అశక్తుల కోసం అసహాయాల కోసం పోరాడ్తుంది.

అప్పుడెప్పుడొ (1956) సిజెఎఫ్‌సిఎస్‌ (సెంట్రల్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ కోపరేటివ్‌ సొసైటి) నుంచి నెల్లూర్‌ దగదర్తి మండలం ఉలవపాల్ల గ్రామంలోని ఎస్సీలకు (300మంది) 500 ఎకరాల బూమి పంచింది. తర్వాత ఎస్సీల బూముల్ని రకరకాలుగ బలిజలు ఆక్రమించుకున్నరు. 2002లో అనంతవరం బలిజలు 30ఎకరాల ఎస్సీల బూముల్ని బాజాప్తుగ సాగుచేస్కుం టున్నరు. ఆ 30 ఎకరాల్లో పై మూడు కుటుంబాలకు చెందిన ఆరెకరాల బూమి కూడవుంది. యీ మూడు కుటుంబాల నేసుకొని కావలి రాణి పెట్టని అర్జీలేదు. తిరుగని ఆఫీసు లేదు. కోర్టులేదు.

కలెక్టరు, ఆర్టీవో, జాయింట్‌ కలెక్టర్‌, ఎమ్మార్వో, విఆర్వో, హ్యూమన్‌ రైట్స్‌ కోర్టు, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కి, జేసీ కోర్టులు, చివరికి గ్రీవెన్స్‌డేను కూడా వదల కుండా ఎస్సీల బూముల్ని ఆక్రమించుకున్న బలిజల్ని ప్రభుత్వాధికారులందరి ముందు పెట్టింది. ఆ క్రమంలో అనేక అవమానాలు, కష్ట నష్టాలకోర్చింది. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఆర్డీవో, ఎమ్మార్వోలు బలిజలైనందువల్ల తీర్పులు బలిజల తట్టే పలికినయి. బలిజలు ప్రభావితం చేయలేని పరిస్థితులొచ్చి యిరకాటంలో పడి యిక వాల్ల కుల దౌర్జన్యం, కుల అహంకారమంతా ఎస్సీ మహిళ మీద తీర్చుకున్నరు. అయినా బూమిని వదిలిపెట్టేది లేదంటది రాణి.

నిజానికి కావలి రాణి చేస్తున్న బూపోరాటం బూమి చుట్టున్న ఆక్రమణల్ని అన్యాయాల్ని, ఆధిపత్యకులాల మీద ఎస్సీ కులాలు చేస్తున్న బతుకు పోరాటం బతుకు వనరైన బూమి, నీల్లు ప్రకృతి సొంతం, ప్రతి జీవికి సొంతం. యీ బూమి నీల్లను సంపదగా మార్చుకొన్న అగ్రకుల అహంకారంతో, దౌర్జన్యంతో ఎస్సీలకు బతికేందుకు పిడికెడు జాగలేకుండా తాగేందుకు చుక్క నీరు లేకుండా చేస్తున్నయీ అమానుషత్వాలు మాకు కొత్తగాదు, వీటికి వ్యతిరేకంగా మేము తరాలుగా పోరాడుతున్న చరిత్రలు మాయి.

పాత సాలంత రోత బాదలే ఎస్సీ మహిళలకు. గీ కొత్తసాలన్నా.. కడుపు నిండది ని కండ్లార నిద్ర బొయేకతలేక పాయే మా జాతి ఆడోల్లకు. తన జాతి అసహాయాల పక్షాన నిలబడి అలుపెరగని యీ భూపోరా టం చేస్తున్న కావలిరాణి ఆడవాల్లందరికి ఆదర్శనీయురాలు. ఉలవపాల్లలో వందల ఎకరాల ఎస్సీల బూముల్ని బలిజ దొరలు కబ్జా చేస్తే… తిరగబడితే వాల్లకింద బత్కలేమని, కూలినాలికి పిలవరేమోనని, వూర్లె నిలువనీయరేమోనని, టార్గెట్‌ చేస్తారనీ, బతుకుదెరువులు పోతాయనే భయాల్తో రాజీపడి తమ బూముల్ని వదిలేసుకుంటే … అదే పల్లెలో కావలి రాణి రాజీలేని బూపోరా టం చేస్తుంది. ఆమె పోరాటాన్ని అణిచివేసేం దుకు దాడి చేసి అవమానించిన బలిజ రౌడీ దొరల్ని వెంటనే అరెస్టు చెయాలె. కబ్జా బూములన్ని ఎస్సీలకు పంచాలె. అందుకు మనమంత కావలి రాణికి తోడవుదామా! వుచ్చబోసిన దొరల్ని వురేయిద్దామా.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.