వర్తమాన లేఖ – – శిలాలోలిత

ప్రియమైన హేమంతా!

ఎలా ఉన్నావ్‌? నీ జ్ఞాపకం ఒక మెత్తటి పూల పరిమళలా నన్నలుముకుం టుంది. నీ అందమంతా నీ చిర్నవ్వులోనే ఉంది. ప్రశాంతమైన నీ ముఖం గుర్తుకు రాగానే చాలా రిలాక్స్‌గా ఫీలవుతాను నేను. ఈ ప్రపంచంలో పూలకంటే సున్నితమైనవంటూ ఏవీ ఉండవనుకునే దాన్ని. కానీ నిన్నుచూసాక ఆ అభిప్రాయం మార్చుకున్నాను. నీ మాటల మెత్తదనం నాకెంతో హాయిగా ఉండేది. సత్య నిన్ను పరిచయం చేసిన తొలినాళ్ళలోనే నువ్వంటే ఇష్టం పెరిగింది.

మనం కలుసుకున్న క్షణాల వయస్సు కూడా తక్కువే. కానీ గాఢమైన స్నేహానికి అవే పునాది రాళ్ళయ్యాయి. కూతుళ్ళు ఉన్న తల్లివని నీమీద ఈర్ష్యగా కూడా ఉండేది. వాళ్ళని నువ్వు పెంచే, ప్రేమించే తీరు మురిపెంగా ఉండేది. మీరు బెంగుళూరు వెళ్ళిపోయాక కలవడానికి ఫుల్‌స్టాప్‌ పడిపోయింది. ఆ మధ్యన నువ్వు వచ్చి వెళ్ళావని తెల్సింది. నాకు చెప్పలేదని సత్యతో గొడవపడ్డాను కూడా!

అప్పుడెప్పుడో నువ్వు మొదలుపెట్టిన అనువాద రచన ఎంతవరకూ వచ్చింది? ఏమైందసలు? మళ్ళీ సాహిత్య రంగంలోకి దూరవమ్మా తల్లీ! ధర్మరాజు గారెలా ఉన్నారు? నీ ఆరోగ్య మెలా ఉందా?

అన్నట్లు హేమంతా ఈ మధ్యన ‘సుశీలా నారాయణరెడ్డి అవార్డ్‌’ ‘చాగంటి తులసి’ గారి కిచ్చారు. ఆవిడ రచనల్ని పరిచయం చెయ్యమన్నారు నన్ను. నిజంగా ఒకే ఒక్కమనిషి తన జీవిత కాలంలో ఇంత సాహిత్యాన్ని సృజించగలదా? అన్పించింది. ముఖ్యంగా ఒరియా నుంచి తెలుగు చాలా చేశారు. బాలసాహిత్యమెక్కువగా చేశారు. నీకు తెల్సుకదా తులసిగారి తండ్రి చాగంటి సోమయాజులుగారు. (చాసో) ఆమే హిందీ, ఇంగ్లీష్‌, ఒరియా, తెలుగులో విరివిగా రాశారు. ప్రపందేశాలన్నింటికో గౌరవ అతిధిగా, ప్రసంగకర్తగా, ఆమె పాల్గొన్న సెమినార్లు, మొదలైనవన్నీ చూశాక, ఆమె చేస్తున్న నిరంతర కృషి అర్థమైంది. మన భూమికలోనే పి.సత్యవతి గారు తులసిగారి గురించి పెద్ద ఆర్టికల్‌ రాశారు. నువ్వు కూడా చదివానప్పుడు. విజయనగరంలో ‘చాసో అవార్డ్‌’ పేరిట ఉత్తమ సాహిత్య సృజనాకారులకు అవార్డ్‌ను కూడా ఇస్తున్నారామె. ఆనాటి ఆమె ప్రసంగం కూడా చాలా అద్భుతంగా ఉంది. మిగతా భారతీయ భాషలన్నింటిలోనూ తెలుగే ఎంతో ప్రత్యేకమైంది. ప్రసిద్ధమైంది అన్నారు. తెలుగును ‘మాట్లాడతాం’ మనం. అంటే, మాటల్ని ఆడతాం. అటునించి ఇటు నించి అటు చిత్ర విచిత్రాలుగా ఆటలాడగ గలిగే సామర్థ్యం తెలుగుకే వుంది. హిందీ వాళ్ళు గానీ, ఇతర భాషల వాళ్ళు గానీ ‘బాత్‌ కర్‌ తె’ – అంటే మాటల్ని తయారు చేస్తారు. అంత వరకే గాను ఆటలాడగల, విన్యాసాలు చేయగల సామర్థ్యం లాంటిది లేదు. అని చాలా చమత్కార యుక్తంగా మాట్లాడారు. ఆరోజు ముఖ్య అతిధి కల్వకుంట్ల కవిత (ఎం.పి) కూడా వచ్చారు. తులసి గారు రాసిన ‘యాష్‌ ట్రే’ గురించి మాట్లాడారు (మనంకూడా చదివామా కథ) ఆరోజుల్లోనే ఆమెకున్న అవగాహనను, ఫెమినిస్ట్‌ ఐడియాలు మెచ్చుకున్నారు.

హేమంతా! ఇప్పుడున్న ఇల్లు కూడా పూలతోటలానే ఉందా? మా ఇంట్లో పూచే పారిజాతాన్ని చూసినా నువ్వే గుర్తొస్తావ్‌. ఎందుకంటే వాటికి నీకూ దగ్గరి చుట్టరికం ఉంది. కాడ దృడమైన ఆరెంజ్‌ కలర్‌లో ఉండి నీ ధృడతాన్నీ, చిన్నగాలి పలకరింపుకే మురిసిపోయి, జలజలా రాలే నీ ప్రేమ చిహ్నంగా నిలిచే శ్వేత పూరేకలు వెరసి హేమంత మాసంలో విరబూసే నక్షత్రాలే అవన్నీ, ఔను! హేమంత నాకో డౌట్‌ నువ్వు పుట్టక ముందే నీకు ప్రకృతంటే, పువ్వులంటే ప్రాణమని తెలిసే మీ వాళ్ళు ఆ పేరును పెట్టేసుంటారు కదూ.

మన గీత ఇప్పుడు యాదగిరి గుట్టకు ఈవోగా వచ్చింది. సిటీకి కొంచెం దగ్గరైంది. అప్పుడప్పుడన్నా వినడానికీ, కనబడడానికీ వీలుగా వుంది. తను గుర్తొచ్చినా చాలా గర్వంగా ఉంటుంది నాకు. తన పరిపాలనా దక్షతా, సిన్సియారిటీ, ఆత్మవిశ్వాసం, తమ విషయాల్ని డీల్‌ చేసే విధానం, స్నేహానికి తన హృదయంలో వుండే స్థానం. ఇవన్నీ రోజురోజుకీ గీతను ప్రేమించేట్లు చేస్తాయి.

మొన్న ఫిబ్రవరి తొమ్మిదిన నాన్న పుట్టిన రోజు. నాన్న వెళ్ళి పోయి చాలా సంవత్సరాలై పోయిందికదా! బాగా గుర్తొచ్చారు. ఆరోజు కన్నీళ్ళ తో నాన్నపై ఓ కవిత రాశాను. ‘విదేహలకు నెలవు స్వదేహమే’ అని నాన్న తనిచ్చిన నా శరీరంలోనే జ్ఞాపకమై ఉన్నారన్న భావన వచ్చిన తర్వాత మనస్సు తేరుకుంది. నీకా పోయెం మెయిల్‌ చేస్తాను. పిఒడబ్ల్యు వాళ్ళది ‘మాతృక’ అని శ్రామికవర్గ స్త్రీల కోసం పత్రిక వస్తుండేది కదా గత నాలుగేళ్ళగా రావడం లేదు. మళ్ళీ పత్రిక వస్తోందిప్పుడు. స్త్రీల పత్రికలు మరింతగా పెరగాల్సిన, రావాల్సిన అవసరం వుంది కదా?

మనం కూడా తగినంత చేయూత నివ్వాలి. ఈ కొత్త ఇష్యూ చాలా బాగుంది. ఇఫ్లూలో ఆ మధ్యన జరిగిన దారుణం విన్నావుకదా! ఈ మనుషులెప్పటికీ మారరా హేమంతా! బాధితురాల్నే టార్గెట్‌ చేస్తారెప్పుడు. గుర్తుకొస్తేనే కోపంతో మనసు రగిలిపోతూంటుంది.

హేమంతా! ఉంటాను మరి.

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో