ఏడదమ్మా నీకు ఈ ఆడతనం??? -కె. సమత జెఎన్‌యు, ఢిల్లీ

హాయ్‌ ఫ్రెండ్స్‌, రోజులాగానే ఉదయం టిఫిన్‌ చేసి కూర్చుని న్యూస్‌ పేపర్‌ తిరగేస్తుంటే రోజు చదివినట్లే మరో రేప్‌ జరిగిన సంఘటన. రకరకాల ఆలోచనలు, అసలు ఏం మారాలి? ఈ సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే? అమ్మ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడన్నా చీకటి పడ్డాక బయటికి వెళితే నేను మళ్ళీ హాస్టల్‌కి సేఫ్‌గా చేరుకున్నాను అనేదాకా అమ్మకి ఆందోళన. ‘ఆటోలో వెళ్ళకు, బస్‌ లేదా మెట్రోలో వెళ్ళు. మరీ లేట్‌ అవముందే వెళ్ళిపో. రోజులు బాలేవు. మన చేతుల్లో ఏం ఉంది? జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా జరిగిపోయాక ఆలోచించి ప్రయోజనం ఉండదు’ అని చెబుతుంది అమ్మ. ఇక్కడ వచ్చింది నాకో సందేహం. అమ్మ! నాకే ఎందుకు ఇన్ని జాగ్రత్తలు? తమ్ముడుకి కూడా చీకటి పడేదాకా తిరగద్దురా, రోజులు బాలేవు అని చెబుతావా? వాడిలో నేనిదేమిటి? నాకు ఉన్నదేమిటి? ఆడతనం కదా అమ్మా! రోజులు బాలేవు. సమాజంలో స్త్రీ స్వేచ్ఛకు అనుగుణమైన పరిస్థితులు లేవు అని ఒక సామాజిక కోణంలో సమస్యని చూసే ముందే ఒక మైక్రో ఏంగిల్‌లోచూద్దామా? కుటుంబ వాతావరణంలో స్త్రీ స్వేచ్ఛ ఎలా ఉంటుందో చూద్దామా?

ఒక వయసు దాటాక ఇంట్లో అమ్మ, నాన్న చెప్పే మాటలు ఇవి. ‘మంచి బట్టలు వేసుకో, మంచి ఫ్రెండ్స్‌తో ఉండు, అబ్బాయిలతో ఎక్కువగా తిరగకు. అంతెందుకు? ఇంట్లో కూడా ఎలాంటి బట్టలేసుకోవాలి? ఎలా పద్ధతిగా ఉండాలి’ అని ఒక అవగాహన కలిగిస్తారు. ముల్లోచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముల్లు మీద పడ్డా చిరిగేది ఆకే. నేను ఆకును కాదు అని గట్టిగా అరిచి, నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా అంటే? బరి తెగించింది, మాట వినే రకం కాదు, చెయ్యి దాటిపోయింది.. అంటారు కదా! అసలు ఎందుకు ఉండాలి ఈ ఆంక్షలు? బయట అయినా ఇంట్లో అయినా అసలు పొట్టి బట్టులేసుకుంటే, అబ్బాయితో తిరిగితే, మీకు నచ్చిన పద్ధతిలో నేను ఉండకపోతే ఏం అవుతుంది?  ఏంటి తప్పు? అరె..ఈ మాత్రం తెలీదా? పొట్టి బట్టలేసుకుంటే నువ్వు సెక్సీగా కనపడతావ్‌, నీతో తిరిగే అబ్బాయికి మూడ్‌ వస్తుంది. నిన్నేమైనా చేస్తారు. నిన్నేమైనా చేస్తే నువ్‌ పవిత్రతను కోల్పోతావ్‌. తర్వాత నువ్వు మానసిక వ్యాధికి గురవుతావ్‌. అంతే కాదండోయ్‌ సమాజం నీపైన ఇంకో ముద్ర వేస్తుంది. తెలుగులో చెప్పలేను కానీ ఇంగ్లీషులో అతి సాధారణంగా వర్ణించగలిగే పదాలు పఱ్‌షష్ట్ర, షష్ట్రశీతీవ. అందుకే అమ్మా…. నువ్‌ పద్ధతిగా ఉండాలి మరి. నీకు కూడా ఒక అబ్బాయికి ఉన్నట్లే కళ్ళు, చేతులు ఉన్నాయి. లుంగీ, షర్టు వేసుకుని వాళ్ళు ఎక్స్‌పోజ్‌ చెయ్యొచ్చు. కానీ నువ్‌ అలా చెయ్యకూడదు. ఎందుకంటే నువ్‌ ఆడదానివి. అలా వేసుకుంటే  నువ్‌ వాళ్ళని రెచ్చగొట్టినదానవవుతావ్‌. ఓ అమ్మా నాన్నల్లారా కూతురుకి ఎలాంటి బట్టలేసుకోవాలో నేర్పించే ముందు కొడుక్కి అమ్మాయిని ఒక సెక్స్‌ బొమ్మలా కాకుండా ఒక మనిషిలా ఎలా చూడాలో నేర్పించండి. ఆడ మగ బేధాలు లేకుండా ఆరోగ్యకర వాతావరణం ఎలా మెయింటెయిన్‌ చెయ్యాలో ఇద్దరికీ సమానంగా నేర్పించండి. జాగ్రత్తలు చెప్పొద్దంటంలేదు. ముల్లు ఆకు అని ఆమ్మాయిని సెన్సిటివ్‌గా అబ్బాయిని పవర్‌ఫుల్‌గా చిత్రించి వాళ్ళ ఆలోచనైనా, ప్రవర్తనైనా మీరే ప్రభావితం చేస్తున్నారని మరచిపోకండి. అందరూ నిన్ను, మగరాయుడిలా ఉన్నావ్‌ అన్నా పర్వాలేదు. నువ్‌ ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌ ఉండాలి. టఫ్‌గా అన్నింటినీ ఎదుర్కోవాలని చిన్నప్పటి నుండి అమ్మాయిని స్వేచ్ఛగా పెంచండి. అప్పుడు మాట్లాడండి సమాజంలో స్త్రీ స్వేచ్ఛ గురించి దానికో అర్థం ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన విషయం:  స్త్రీ అంటే సీత కారెక్టర్‌కే కాదు. సూర్పణఖ కారెక్టర్‌కి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంది. అసలు ఇంకా చెప్పాలంటే సూర్పనఖకి ఉన్న స్వేచ్ఛ, తెగింపు సీతకి లేదు. సీతలో ఉండే అణకువ కంటే సూర్పణఖ కారెక్టర్‌లో ఉన్న తెగింపు మనకు ఆదర్శప్రాయం కావాలి. మరి నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే ఎంత మంది సూర్పణఖలకు మనం గౌరవం ఇస్తున్నాం? ఎంతమంది తెగింపును మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాం? ఫెమినిస్టునే కానీ నేను ఈ తరహా ఫెమినిస్టుని అని కొంతమంది చెబుతుంటారు. మన పోరాటంలోనూ రక రకాల విభజనలు.  అన్నిటినీ మనం అంగీకరించకపోవచ్చు. మన అభ్యుదయానికి కూడా హద్దులు ఉన్నాయండోయ్‌! ఇదే పోరాటంలో ఇంకో భావజాలం ఉన్న వాళ్ళతో మనం సరితూగలేం. మోడరన్‌ ఫెమినిజం, పోస్ట్‌ మోడరన్‌ ఫెమినిజం, పాశ్చాత్య సంస్కృతి అని ముద్ర వేసే ముందు ఎదుటి వారి వాదనల్ని వినాలి, ఒక భిన్న కోణంలో ప్రతి అంశాన్ని పరిశీలించాలి.

ఎంతటి అభ్యుదయవాదులైనా.. కొన్ని విషయాల్లో మౌనం పాటిస్తుంటారు. మౌనాన్ని వీడండి. అభ్యుదయ జ్యోతిని వెలిగించండి. హిందుత్వ మత వాదులు స్త్రీలు ఎలాంటి బట్టలేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఏ టైమ్‌లో బయట తిరగాలో వాఖ్యలు చేస్తుంటే వ్యతిరేకిస్తున్నాం మనం. సహజీవనం, ప్రేమతో ముద్దు  (శ్రీశీఙవ శీట సఱరర)కాంపెయిన్‌ విషయంలో మనం మౌనం పాటిస్తున్నాం. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడేవాళ్ళలో అతివాదులుగా పరిగణిస్తున్నాం. అంత విశాలంగా మనం ఆలోచించలేం అని ఒక సారాంశానికి వస్తాం. నచ్చినట్టు జీవించే హక్కు ప్రతి ఒక్కరిది. మారుతున్న సమాజం ప్రకారం మన ఆలోచనలు మారాలి. ప్రతి అంశంలో మంచి చెడు ఉంటాయి కదా.. ఏంటి ఈ సంస్కృతి? ఎటు పోతుందో ఈ సమాజం? అనుకునే బదులు మార్పుని ఆహ్వానించండి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించండి… ఎటో పోవడం లేదు ఈ సమాజం… నవ కాంతులు విరాజిల్లే  అభ్యుదయం వైపుకి దూసుకుపోతోంది.

దారులు వేరైనా తీరం ఒక్కటే.

భావజాలం వేరైనా పోరాటం ఒక్కటే..

స్త్రీ స్వేచ్ఛ వర్థిల్లాలి!

నవ సమాజం వర్ధిల్లాలి!!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.