ఆశ ప్రోగ్రాం మారు మూల గ్రామాల్లోకి చొచ్చుకు పోవాలి

-రాగిణి (ఇంటర్‌వ్యూ: ప్రసన్న)

నా పేరు రాగిణి. మా గ్రామం పచ్చల తాడిపర్రు. మా అమ్మ నాన్నలకు ముగ్గురం ఆడపిల్లలం. వారిలో చివరి అమ్మాయిని. పెద్దక్కను 10వ తరగతి వరకు చదివించారు. యింక చదివించలేక ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. రెండవ అమ్మాయిని కూడా ఎక్కువ చదివించలేక కట్నం ఇచ్చే స్థోమత లేక రెండో సంబంధం అతనికే ఇచ్చి పెళ్ళి జరిపించారు. కొన్ని రోజుల తరువాత అతని ఆరోగ్యం క్షీణించిపోతే ప్రైవేటు హాస్పిటల్‌కి వెళితే హెచ్ఐవి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. అట్లాగే మా అక్కకు, పిల్లలకు కూడా చేశారు. అపుడు అక్కకు, బాబుకి కూడా పాజిటివ్ అని వచ్చింది. ఆయన మానసికంగా చాలా బాధపడిపోయి చివరికి చనిపోయాడు.

తరువాత నేను 10వ తరగతి వరకు చదివాను. నాకు పెళ్ళి చేయాలని నిర్ణయించారు. కాని మా అమ్మ ముందు ఇద్దరినీ రెండో సంబంధం వారికి ఇచ్చాము. కాని రాగిణిని మాత్రం మొదటి సంబంధానికి ఇవ్వాలని పట్టుపట్టింది. మా బాబాయి విషయం తెలుసుకొని నన్ను హైద్రాబాద్‌లో ఒక స్కూలులో టీచర్‌గా నియమించాడు. అలా నేను రెండున్నర సంవత్సరాలు పని చేశాను. ఆ తరువాత పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అపుడు వెంకటేశ్వరరావుతో పెళ్ళి నిశ్చయం చేశారు. చూడడానికి వచ్చినరోజే ఎంగేజ్‌మెంట్ పెట్టుకున్నారు. ఎవ్వరూ కూడా అదేరోజు ఎంగేజ్‌మెంట్ ఎందుకు అని అడగలేదు. కాస్త ఆలోచిద్దామని కూడా అనుకోలేదు. మా బాబాయి కట్నం కూడా ఇచ్చి పెళ్ళి జరిపించారు. నాకు అస్సలు ఇష్టం లేదు పెళ్ళంటే. కాని వాళ్ళ బరువు తగ్గిపోతుంది పెళ్ళిచేస్తే అనుకొని ఒప్పుకున్నాను.

పెళ్ళయిన నెలరోజుల నుండి వేధించడం మొదలుపెట్టారు ఇంకా కట్నం తీసుకురమ్మని. బాబాయ్ దగ్గరినుండి తెమ్మని, మనం ఏదైనా వ్యాపారం చేద్దామని వేధించేవాడు. అమ్మవాళ్ళ దగ్గరికి కూడా వచ్చి చెప్పినాను. అప్పటికి నేను గర్భిణీని. ఒక నెల తర్వాత నా భర్త, పెద్దమనుషులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. రెండు నెలలు బాగానే వున్నాడు. మళ్ళీ హింసించడం మొదలుపెట్టాడు. నేను అక్కడే వున్నాను. భోజనం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కారు. అయిదవ నెలలో హాస్పిటల్‌కి వెళ్ళితే డాక్టర్ కొన్ని పరీక్షలు చేయాలని అన్నారు. వాటితో పాటు హెచ్ఐవి టెస్ట్ కూడా చేశారు. అందులో పాజిటివ్ అని వచ్చింది. హాస్పిటల్‌లో నా టెస్ట్ రిపోర్ట్ తెలుసుకొని అతను నన్ను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళింటికెళ్ళాను.

తరువాత కొన్ని రోజులకు అతను వచ్చి నాకు డైవర్స్ ఇవ్వు అన్నాడు. మా మామ కూడా వచ్చి నీవు డైవర్స్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు. ఇవన్నీ మనస్సులో పెట్టుకొని నేను మానసికంగా చాలా దెబ్బతిన్నాను. తరువాత డెలివరీ సమయం వస్తే ప్రయివేటు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 25000/- రూపాయలు ఖర్చవుతుందని ఆమె చెప్పింది. నా దగ్గర అంత డబ్బు లేదంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళితే వాళ్ళు తక్కువ ఖర్చుతో చేస్తారు అని చెప్పింది. అక్కడికి వెళితే జూనియర్ డాక్టర్లు చూశారు కాని చాలా చీదరించుకున్నారు. నొప్పులు వచ్చినా వచ్చి చూడలేదు. వాళ్ళకి వెళ్ళి చెప్పితే ఆమెకు డెలివరీ ఎప్పుడు అవుతుందో మాకు తెలుసా, మీకు తెలుసా అని కోపంగా కసిరేవాళ్ళు. నొప్పులు ఎక్కువయ్యాయి. చివరికి ఆ పక్కన వున్న బెడ్ వాళ్ళందరూ చుట్టు చీరలు పట్టుకొని నిలబడ్డారు. నా బెడ్‌మీదే డెలివరీ అయింది. ఆ తరువాత వచ్చింది డాక్టరు. వెంటనే లేబర్ రూంకి తీసుకెళ్ళడం కాని, బట్టలు మార్చడం కాని చేయలేదు. చివరికి అక్కడ వున్న ఆయా నాకు 400 రూ. ఇస్తే నేను ఆ బట్టలు మార్చి కాల్చివేస్తాను అంది. తప్పనిసరి పరిస్థితులలో 400 రూ. ఇచ్చి ఆ బట్టలు కాల్పించినాను. నేనే గ్లౌజులు దగ్గరనుండి అన్నీ మొత్తం బయట నుండి తెప్పించినాను. అవి తీసుకురాకపోతే మేం ముట్టుకోం అని బెదిరించారు. చాలా డిస్క్రిమినేషన్ ఎదుర్కొ న్నాను హాస్పిటల్‌లో.

మా బాబుకి హెచ్ఐవి రాలేదు. తర్వాత మూడు నెలలకు నా భర్త వచ్చి బాబుకి కూడా వుందా అని అడిగి నీకు కోర్టునుండి నోటీస్ వస్తుంది. దానిమీద సంతకం చేసి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కోర్టులో కేసు మొదలయింది. అతను ‘నాకు హెచ్ఐవి లేదు, నా భార్యకే వుంది’ అని కోర్టులో చెప్పాడు. లాయర్‌లని డబ్బులతో అతను కొనేశాడు. కోర్టులో కూడా అతనికి లేదని మెడికల్ రిపోర్ట్ సృష్టించారు.మనోవర్తి ఇవ్వాల్సి వస్తుందని నన్ను, నా బాబును చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కోర్టులో లాయర్స్ అందరూ చాలా వల్గర్‌గా మాట్లాడినారు. పెళ్ళికిముందు నీవు ‘కన్యాత్వం’ పరీక్ష చేయించుకున్నావా? నీకే హెచ్ఐవి వుంది. అతనికి లేదు ఏం సంగతి అని హేళన చేసారు ‘మీ చెల్లెలయితే ఈ ప్రశ్న వేస్తారా’ అని లాయ~ఖని అడిగాన్నేను కూడా. జడ్జి అతన్ని మందలించాడు. ఇంకా చాలా చాలా మాటలతో వేధించేవాళ్ళు. నేను కోర్టు చుట్టూ తిరగాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టులో కేసు వేశాను. ఇంకా కోర్టులో కేసు నడుస్తోంది. నన్ను కోర్టులో వేధించినందుకు కోర్టులో నేను గెలిచి మళ్ళీ వాళ్ళకు బుద్ధి చెప్పాలి. నాకు, బాబుకు ప్రాపర్టీలోవాటా గాని, మెయింటెనెన్స్ గానీ రావాలని, వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. యాక్షన్ ఎయిడ్ లో చేరి ట్రైనింగ్ ద్వారా చాలా నేర్చుకున్నాను. మా అక్కకి, బాబుకి కూడా హెచ్ఐవి వుంది. వాళ్ళ బాబుకు 14 సంవత్సరాలు. స్కూల్‌లో వేశాం. స్కూల్‌లో పిల్లల్ని వీడితో ఆడనివ్వరు. చాలా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. మా రెండో అక్క, నేను మా పేరెంట్స్ దగ్గరే వుంటున్నాం. వాళ్ళ సపోర్ట్ చాలా వుంది. మొట్టమొదట నాకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే చనిపోదామనుకొని మందు త్రాగాను కాని చనిపోలేదు. అమ్మవాళ్ళు నన్ను విసిటిసి దగ్గరికి తీసుకెళ్ళారు. వాళ్ళు హెచ్ఐవి గురించి వివరించి చెప్పారు. యాక్షన్ ఎయిడ్ గురించి నాకు స్టేట్ లెవెల్ పాజిటివ్ నెట్వర్క్ ద్వారా తెలిసింది. యాక్షన్ ఎయిడ్ లో పని చేస్తున్నందుకు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇపుడు నేను ఈ ఆర్గనైజేషన్ తరపున కోర్టులో లాయర్‌ను పెట్టి కేసు వేద్దామనుకుంటున్నాను. మా హస్బెండ్ నన్ను హింసించినందుకైనా నేను ఫైట్ చేస్తాను. ఇన్ని మానసిక బాధలు పడడం వల్ల నేను ఎఆర్‌వి స్థితిలో వున్నాను.

గుంటూరులో హెచ్ఐవి/ఎయిడ్స్ ఎక్కువ వుండడానికి కారణం అక్కడ పేదరికం, అవేర్‌నెస్ లేకపోవడం, చదువులేకపోవడంవల్ల ఒకరినుండి ఒకరికి పాకిపోతోంది. మేము ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళని గుర్తించి న్యూట్రీషన్, మెడిసిన్స్ ఇప్పిస్తున్నాం. గవర్నమెంట్ నుండి రేషన్కోసం ప్రయత్నిస్తున్నాం. చాలామందికి అవేర్‌నెస్ లేక హెచ్ఐవి సోకుతోంది. హెచ్ఐవి వచ్చిందని తెలిసి మానసికంగా బాధపడి చనిపోయిన వాళ్ళు చాలామంది వున్నారు. మా యాక్షన్ ఎయిడ్ లో 30 సంవత్సరాలలోపున్న విడోస్ 90 మందిదాకా వున్నారంటే మీరే అర్ధం చేసుకోండి.. ఆశ ప్రోగ్రాం మా దగ్గర అంతగా సక్సెస్‌గా లేదు. ఆ ప్రోగ్రాం వల్ల దాన్లోవున్న వాళ్ళకు హెచ్ఐవి వున్నదని అందరికి తెలిసిపోయి ఇంకా ఎక్కువగా వాళ్ళను డిస్క్రిమినేషన్ చేస్తున్నారు.

ఆశ ప్రోగ్రాం అందవలసిన వారికి సక్రమంగా అందితే ఇంతగా ఇక్కడ హెచ్ఐవి పాకిపోదు. హెచ్ఐవి సోకింతర్వాత మందులుగాని, ఫుడ్గాని దొరకదు. 2000 రూ. ఇస్తామని అంటారు గాని ఆ డబ్బు కూడా అందడం లేదు.

హెచ్ఐవి వచ్చిందని ఒకపుడు నేను చాలా బాధపడ్డాను. కాని ఇపుడు కోర్టులో కేసుపెట్టి గెలుస్తానని నమ్మకంతో వున్నాను. చాలామంది ఆడవాళ్ళకి ఖచ్చితంగా భర్తల ద్వారానే ఎయిడ్స్ వస్త్తోంది.

కాన్పు జాగ్రత్తలు ఎయిడ్స్ సంక్రమణని నిరోధిస్తాయి

సర్విక్స్‌లోను, యోనిమార్గంలోను హెచ్ఐవి క్రిములు అధికంగా వుంటాయి. ఉమ్మనీరులో తక్కువగా వుంటాయి. దీనికి సమర్ధనగా కవలలకి సంక్రమించే హెచ్ఐవిని పేర్కొంటారు. కవలలు ఇద్దరు గర్భంలో ఒకేసారి ఒకేవిధంగా తల్లి రక్తాన్నే పంచుకుని ఎదిగినప్పటికీ మొదటి కవలకి, హెచ్ఐవి సంక్రమణ అధికంగా వుండి రెండవ కవలకి తక్కువగా వుంటుంది.

జననేంద్రియ మార్గం ద్వారా మామూలుగా జరిగే కాన్పులో హెచ్ఐవి సంక్రమణకి 20 నుంచి 50 శాతం అవకాశం వుంది. సిజేరియన్ డెలివరీ ద్వారా కాన్పు చేసినప్పుడు ఆ శిశువుల్లో పదిశాతంలోపు మందికే హెచ్ఐవి వుంటోంది. హెచ్ఐవి వున్నప్పటికీ తల్లి తగిన జాగ్రత్తలు తీసుకుని సిజేరియన్ డెలివరీ అయినట్లయితే పుట్టే బిడ్డలలో 2-8 శాతం మందికే హెచ్ఐవి వుంటుంది.

(వాసవ్య మహిళా మండలి సౌజన్యంతో)

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.