గేమ్స్…
సెల్‌ఫోన్ గేమ్స్ రారమ్మని పిలుస్తుంది.
తిండి తిప్పలు, చదువు సంధ్య ఏమోద్దనిపిస్తుంది.
సెల్‌ఫోన్ గేమ్స్ ఉంటే చాలనిపిస్తుంది
అన్నం, గిన్నం, జాన్తా అంటుంది
బడిబందు పెట్టేస్తుంది.
ఎక్కడకెక్కడికో తీసుకుపోతుంది
ఎన్నడూ చూడనివివేవెవో చూపుతుంది
చెడిపోతున్న వంటూ
అమ్మ అరుపులు
నాన్న వేసే దెబ్బలు
అవేవి పట్టవు నాకు
పీకల్లోతుల్లో కూరుక్కుపోయా
సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయా
నా చిటికన వేలి గోరంత లేదు
ఆ మెమొరీ కార్డు
నా మనసుని మాయ చేసేసింది
నాకళ్ళను బిరిపోయ్యో చేసేసింది
ఏమిటీ వింత
అంతగొప్పదా ఇది
ఊహు… కాదు… కాదు
దానికి నన్ను బానిసను చేసుకుంటుంది
వద్దు నాకొద్దు సెల్‌ఫోన్‌తో ఆటలు నాకొద్దు
ఈ దూరాన్ని కలిపే మాటలు చాలు
– జి. సాయి తేజ, 10వ తరగతి.