రెండు కళ్ళూ తెరుచుకున్నట్లే వున్నాయి. కుడికన్ను బాగావాచివుబ్బింది. తాజాటమోటోలాగా కళకళలాడే మొఖం, చివికిపోయినట్లుంది. శరీరపు అందమంతా ఎముకలై గూడుకట్టింది, ఆమెను చూస్తున్న కిషోర్‌కు గత ఇరవై యైదేళ్ళ కాలం కళ్ళముందు కదిలి కన్నీరుగా మారి బొట్లు బొట్లుగా, ఆమెతోనడయాడిన జ్ఞాపకాలు కుమిలి కుమిలి వుబికి వుబికి వెల్లుకొస్తున్నాయి. అతని భార్య శారద, యీమె మరణ దృశ్యపు భయంతో కిషోర్ చేతిని బిగించి, చిన్నగా ఎక్కిళ్ళు పెడుతోంది. ఆసుపత్రి గది లోపలా, బయట కారిడార్లోనూ కొందరు న్నేహితులు విషాదంగా నిల్చున్నారు.
”యీమెవాళ్ళు ఎవరూరాలేదా.. శారదా..” అప్పడేవొచ్చిన అరుణా మేడం అడుగుతోంది.
కారిడార్లో డాక్టర్ దగ్గర నిల్చోని కళ్ళద్దాలకింద నుంచి భయం భయంగ చూస్తున్న, ఓ యాభైనాలుగేండ్ల ఆడమనిషిని వేలితో చూపిస్తూ శారద. ”అదిగో ఆమెనంట అక్క….దూరంగా గ్రిల్‌దగ్గరకు తిరుగుతున్నాడే……… నల్లగల్లషర్టు..బావట”.
”ఆ… ఆ… చూశానులే… యింతకుముందు ఎన్నోసార్లు కొట్లాడిపోయ్యేది.”
”కూతుర్ని దత్తతు యిచ్చినట్టు రాయించుకుందామని నిన్న రాత్రి బాండు పేపర్ల మీద సంతకాలు, గుర్తులూ వేయించకునేకి ట్రై చేనినారట…..”
”ఈ ఆఖరు క్షణాల్లో చూపిన శ్రద్ధను కాస్తా ముందు చూపింటే యీ పిచ్చిది యింత అకస్మాత్‌గా యింతన్యాయంగా చచ్చేది కాదుగదా”. అరుణ మేడం గొంతు దుఃఖంతో పూడిపోయింది.
”శ్రద్ధా, చింతకాయా, డబ్బుకక్కుర్తికాకుంటే, అందు చంద్రక్క వీళ్ళను దూరం పెట్టింది మేడం”.
”అట్లా దూరంపెట్టడం ూడ తప్పే శారదా…. కుటుంబానికి దూరమై వేరే ఎవర్నన్నా దగ్గరదీనిందా……. అదీ లేదు…. పెళ్ళి అనే వూబిని దాటలేక తనలో తాను….. ఒంటరిలోకంలో. అనాధగా మిగిలిపోయింది.”
”నిజమే మేడం మనదే అయిన ఒక వ్యాపకం లేకుండా మనల్ని వ్యక్తీకరించుకునే ఒక లోకం లేకుండా మన ఆడవాళ్ళు తిరుగుతున్నంత కాలం యింతే. ఎంత చదువున్నా మేధస్సున్నా ఏంప్రయోజనం లేదు. చంద్రక్కలాగా అధోగతిపాలవడమే.” శారద, చాలా కఠినంగా మాట్లాడినట్లు అనిపించింది కిషోర్‌కు… అయితే అందులో సత్యంలేదా?!
ఆమె చంద్రకళ. గలగల ెనలయేరులా, తనవాగ్ధాటితో యూనివర్సిటీ కాంపన్ అంతా ప్రవహించేది. లైబ్రరీలో గుట్టలగుట్టల రెఫరెన్సు పుస్తకాలమధ్య పేజీల పేజీలు నోట్సు రాసుకుంటూ, చరిత్రకు పుటం పెడుతూ కనిపించేది. హిస్టరీ కాంగ్రెన్ కాన్ఫెరెన్స్‌లలో ప్రశ్నలు ప్రశ్నలుగా చర్చలు చర్చలుగా తనే ఒక ఆసక్తిగా మెరినేది. యూనివర్సిటీ డిబేట్లలో, తనవాదన పటిమతో మురిపించేది. అలాంటి రోజుల్లో ‘అక్కా, అక్కా’ అంటూ కిషోర్ తన పరిశోధన మీద సందేహాలతో వెంటపడేవాడు. ఆమెకు కిశోర్ జూనియర్. యిద్దరి గైడ్ ఒక్కరే కావడంతో పరిశోధన మీద సందేహాలతో ఆమెవెంట తిరిగేవాడు.
”ఏంది తమ్మయ్యా నీడౌటు. చెప్పూ…. మనసారు చెప్పినట్టు యి టాపిక్ మీద బేనిక్ అండ్ ఫండమెంటల్ పాయింట్స్, అవి చదివావా, అవి చూనిరాపో మొదట” అని అతన్ని గొడకు తగిలిన బంతిని చేనేది. మళ్ళీ యీబంతి వెనక్కు తప్పక వస్తుందిగదా, అప్పుడు వెంటనే ”రాబర్ట్‌నీవెల్ దిఫర్‌గాటన్ ఎంపైర్ చదివేసావా… అయితే డాక్టర్ గోపాల్ ఎడిట్ చేనిన విజయనగర శాసనాల నైన్త్‌వాల్యూవ్‌ు ఇంట్రాడక్షన్ చాలా ముఖ్యం… అందులో నీక్కావాల్సినవి వున్నాయి”. అనేది. అప్పుడు కిషోర్.
‘ఓ అవెప్పుడో చూనేసా లేక్కా…. అదికాదు యీసారి కాన్ఫెరెన్స్‌కు నువ్వు ఏపేపర్ ప్రెజెంట్ చేస్తున్నావు’ అనడిగేవాడు పెద్దపుడుంగి ననిపించుకుందామని.
నీసంగతి నాకు తెలీదారా అన్నట్టు గట్టిగా నవ్వి. ”మరి యేటాపిక్ మీద చేయమంటావబ్బా….” అనడిగేది అమాయకంగా.
”నీ పిహెచ్‌డీ ఎట్లాగూ ఆంధ్రస్త్రీల అలంకరణ సంస్కృతి మీద కదా! జాయపేనాని తన నృత్త రత్నావళిలో తనువర్ణించిన స్త్రీఆభరణాల గురించి సూచించాడట వాటి గురించి పేపర్ ప్రెజెంట్ చేసావనుకో, అదిరిపోతుంది” అననగానే…
‘రేయ్…అంటూ అతన్ని తన్నడానికి వెంటబడేది, ఎందుకంటే అంతకుముందు రోజు మధ్యాహ్నం, ఆ పుస్తకాలు ముందేసుకొని లైబ్రరీ టేబుల్ మీద ఆమె తూగినప్పుడు ఆమె రాసుకున్న నోట్సు చూసాడు గదా…దాన్నే తిరిగి ఆమె మీద ప్రయోగించినందుకు.
ఆరోజులేవేరు. అవి వాళ్ళిద్దరూ చరిత్రలో మునిగి తేలిన రోజులు. కలిని క్యాంటీన్‌లో టీ తాగినా, లంచ్‌తిన్నా, నడిచినా, మాట్లాడినా, జోకులేసుకున్నా, చరిత్రగురించి, కొత్త పరిశోధన గురించీ, పరిశోధనయ్యే అంశాల గురించి చర్చలే చర్చలు, వూహలే వూహలు. ఆమె డేస్కాలర్, అతను వుండేది యూనివర్సిటీ హాస్టల్, ఆమెవుదయం బన్ దిగినప్పటి నుండీ సాయంత్రం బన్ ఎ్కలోపల ఎక్కువ సమయం, చరిత్ర డిపార్ట్‌మెంట్ లోనైనా, లైబ్రరీ లోనైనా, ఆమె వెంటనే కిషోర్. వాళ్ళవెనుక చాలాచాలా ఆశ్చర్యాలు పొంగి ప్రవహించేవని చాలాకాలం అతనికి తెలియదు.
ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీ లోపలి మూలల్లోకి చంద్ర మాయమైతే, ఆమెను వెతుకుతూ కిషోర్, ఎప్పుడూచూడని ర్యాక్‌లవెనుక, చంద్రకళ, చాంద్ ఖలందర్ గుసగుసలను చూనినపుడూ చాంద్, కిషోర్‌ను చూని విసావిసా అక్కడ్నుంచి వెళ్ళిపోయినప్పుడు, చంద్రక్క అతని వైపు కోపంగా వచ్చి, ”ఏరా ఎప్పుడూ నన్నిలా డిస్టర్బ్ చేస్తావు. నీదినువు చూసుకోలేవా”. అనేంతదాకా ఆమె స్త్రీ అనే విషయమూ, ఆమెూ కొన్ని ఏకాంతాలు అవసరమనే విషయమూ కిషోర్‌కు అర్థం కాలేదు, ఆ తర్వాత చాలా రోజులు అమాయకత్వమో, అజ్ఞానమో అయిన నిగ్గుతో ఆమెను తప్పించుకు తిరిగేవాడు.
ఆ తర్వాత యూనివర్సిటీలో లెక్చరర్ పోష్టలు నింపడానికి, ప్రకటన వచ్చింది. చంద్రకళ అప్లయ్ చేనింది. అప్పటిదాకా పోస్టు పడితే ఆమెకు తప్ప యింవెరికి యిస్తారు అనుకున్నది తలకిందులైపోయింది, కులం వున్నవాడో, డబ్బున్నవాడో ఎగరేసుకుపోయారు. అంతటి ప్రతిభా వంతురాలికి మొండిచెయ్యి చూపారని తెల్సినప్పుడూ, అస్సలు ఆమె పి.హెచ్.డి. సమర్పించనీయకుండా అడ్డంకులు కల్పించారని తెల్సినప్పుడు కానీ కిషోర్ యూనివర్సిటీ రాజకీయాలు తెలుసుకోలేకపోయాడు. అక్కడ వృధాగా గడిపే కంటే కష్టపడితే బయట ఏదో ఒక వుద్యోగం తెచ్చుకోవచ్చని గ్రహించడానికి, అతనికది గుణపాఠం అయ్యింది. యూనివర్సిటీ వదిలేనే ముందుటి రోజు, చంద్రక్క కోసం కాపుగాచాడు, చివరిగా పలకరిద్దామని. ఆరోజు, యిప్పుడు చూస్తున్నట్టే ‘ఉబ్బిన ముఖం, వాచినకుడి కన్ను’ అపశకునం లాంటి దృశ్యం, భయావహ దృశ్యం, ”అదేమక్కా” అంటే, ”రాత్రేదో పురుగు కుట్టింది తమ్మయ్య… ఓ ఆల్ దా బెన్ట్ మంచి వుద్యోగం తెచ్చుకో యీ కుళ్ళుకంపులో ఎందుకుంటావ్”, అంది వీడ్కోలుగా. నిజానికి ఆవాచిన కంటికి కారణం వేరేవుందని ఆ తర్వాత కొన్నేళ్ళకు కానీ తెలీలేదు.
ఈ కన్నువాపుతో ఆమెను చూడ్డం అతని జీవితంలో మూడుసార్లు. మొదటి రెండు కన్నువాపులూ జీవితంలో దెబ్బలు తింటూ కోలుకుంటూ ఎదుర్కొన్న వొత్తిడికి చెందినవి. యీ మూడోసారిది యిప్పటి ఆమె నిస్సహాయ మరణంది.
ఒకరోజు కిషోర్ ఆఫీన్ ఛాంబర్‌లోకి వస్తూంటే ………….
”మీసార్ యూనివర్సిటీలో యిద్దరితో తిరిగేవాడబ్బా వాళ్ళలో ఒకామె వాళ్ళ డిపార్ట్‌మెంట్‌లో నీనియర్, రెండో ఆమె మా జూనియర్. ఆఖరికి వాళ్ళ నీనియర్‌ను వదిలేని మా జూనియర్‌ను చేసుకున్నాడు.” అనే మాటవినిపించాయి. ఛాంబర్ వెనుకనే ఆఫీసు సూపరెండెంటు రూవ్‌ు, తలుపు వొక్కటీ అడ్డం. కిషోర్ రాలేదు అనుకొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
”ఏవ్‌ు చాంద్ యేందట్లంటావు, నీనియర్ అంటావు.. ఎట్లా తిరిగాడంటావూ.” ”అవుభాయ్ కర్ట, యిద్దరూ క్లోజ్‌గా తిరిగే
వాళ్ళులే, అది చంద్రా అనిచానా చలాకీ ఛోరి…” చాంద్.. ఎవరీ చాంద్, కొంపదీని ఆకాలంలో ఎకానమిక్స్ స్కాలర్ చాంద్ ఖలందర్ కాదు కదా… అనుకొని, ప్యూన్‌ను పిలిచి అతన్ని పిలుచుకురమ్మన్నాడు. కాన్సేపటికి సూపరెండెంటు లోనికి వచ్చాడేగానీ అసలైన చాంద్ రాలా, యేకారణం వల్లనో కిషోరూ అడగలా, తర్వాత తెలినింది యీ చాంద్ పక్క ఆఫీసులో క్లర్క్ అని. అతను కని్పన్త మాత్రం ఏం అడగ్గలడు? ఏం వివరణ యివ్వగలడు? ‘న్నేహితుడివి గదా ఆమెను గురించి యిలా అభాండాలుప్రచారం చేయవచ్చా’ అని నిలదియ్యగలడా! ఇద్దరు స్త్రీపురుషల మధ్యా ఎంత ఆరోగ్యకరమైన న్నేహమైన ఎవరో కొందరి మాటల్లోనైనా, ఆలోచనల్లోనైనా ఎంతో కొంత వికృతమైన చిగుర్లు వేస్తూనే వుంటుందని కిషోర్‌కు తెలుసు, అది ఎంతో దుర్మార్గమైన మగలోకరీతి!
ఆతర్వాత కొద్ది రోజుల అనూహ్యంగా చంద్రక్క కన్పించింది కిషోర్‌కు. జాయింట్ కలెక్టర్ గారి ఛాంబర్ నుంచీ బయటికొస్తుంటే విజిటర్స్ బ్లాక్‌లో ూర్చొనుంది. అన్నేండ్ల తర్వాత ఆమెను చూస్తుంటే చివరిసారిగా చూనినప్పటి వాచిన కుడికన్ను వడలిన ముఖపు చంద్రక్కనే చూస్తున్నట్టు అనిపించింది. పదేళ్ళలో ఎంతతేడా? వుషారంతా ఎక్కడ పోయినట్టు.
”చంద్రక్కా”…. అన్నాడు.
దిగ్కున లేచి నిల్చుని, ”నమేన్త సార్, రెగ్యులర్ నీ గురించిన న్యూన్ చూస్తుంటానప్పా పెద్ద ఆఫీసర్ అయినావు కంగ్రాట్స్….”
చాలా కృత్రిమంగా, చాలా హర్ట్ చేస్తున్న మాటల్ని వినలేకపోయాడు.
”అంటే యీ వూళ్ళో వున్నానని తెలినీ నన్ను పలకరించాలనిపించ లేదాక్కా…” నిందాపూర్వకంగా అన్నాడు.
”అహా… అలాకాదు… మేమంటే టీచింగ్ ెనౖడ్, లీజర్లీగా వుంటాం, నువ్వూ ఆఫీసర్‌వు చాలా బిజీ బిజీగా కదాప్పా…..”
అని యేదో అందిగానీ, ఆమెకి అర్థమైపోయింది, గొంతులో జీవం లేనేలేదని… అందు మళ్ళీతనే, ”ఏమోలే కిషోర్ నువ్వన్నా హాపీగా వున్నావు, శారద బాగుందా… ఎంత మంది పిల్లలు…”
”చాలా అన్యాయమక్కా… మమ్మల్ని కలవకపోవడం చాలా దారుణం ఎందుకు… ఎందుకు… ఎందుకిట్లా అయినావు…. రా యింటికి రా… కాంటాక్ట్ నెంబరివ్వూ. నా కూతుర్ని చూడ్డానికన్నా రావా…”
”వస్తాలే…. తమ్మునింటికి రానా…. నా కోడల్ను చూడ్డానికిరానా… ఏం” తప్పించుకోవాలని చూస్తోంది అన్పించింది. యిబ్బంది పెట్టడం ఎందుకని, ”జేని గారిని కలవాల్నా…. ఏం..” అని అడిగాడు.
”షీయిజ్ అవర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతీ… రేపు మా కాలేజ్ డే, జేని గారు యంగ్ అండ్ యనర్జిటిక్ కదా చీఫ్‌గెన్ట్‌గా పిలుద్దామనీ” అని వాళ్ళ కాలేజి ప్రిన్సిపాల్‌ను పరిచయం చేనింది.
”నమేస్తే మేడo…”
”నమేస్తే సార్… మీ గురించి చాలాసార్లు చెప్తూంటుంది చంద్ర, నా తమ్ముడు నా తమ్ముడుని, మిమ్మల్నిగూడా పిలుద్దామనుకుంటున్నాం, యూత్‌డే ఫంక్షన్‌కి….”
”తమ్ముడనడమే గానీ కలినింది మాత్రం లేదు మేడవ్‌ు….” నిష్ఠూరం చేసాడు.
”కాదులెండి సార్, చంద్రా హాజ్‌గాట్ హర్‌వోన్ ప్రాబ్లవ్స్‌ు…”
”ఇల్లెక్కడక్కా…”
”ఇంటికొస్తావా…. రాక్షసులున్నారు…”
అంతలో జేనీ గారి నుండీ పిలుపు రావడంతో వాళ్ళు లోనిళ్ళాెరు.
ఆ తర్వాత కొన్నిరోజులకు చంద్రక్క అడ్రన్ కనుక్కొని అతనే వాళ్ళింటి కెళ్ళాడు. తలుపుతట్టేంతలో లోప్నంచీ కర్కశమైన మాటలు వినిపించాయి. చంద్రక్కను అజమాయిషీ చేస్తున్న గొంతులు.
”ఏమ్మా…. పుణ్యానికిస్తావా, మేం నిన్ను కష్టపడి యింత చదివిన్తే గదా నీకు వుద్యోగమొచ్చి సంపాయిస్తాండావు.. దుడినిందంతా మా సంసారానికి పెట్టమంటున్నామా, మీ అమ్మ పెట్టమంటున్నాం గాని, మీయమ్మ మంచాన పడింది. ఆయమ్మను యెవరుసాకి సంతరిచ్చాలా.. నువ్వు పైసలియ్యికుంటే.. ఆయమ్మను తెచ్చి యీడపడేనిపోతాం, నువ్వే చూసుకుందుగానీ”.
”ఈ దబాయింపులేంది వొదినా, నెలా తీసుకుపోతానే వుండావే, యింత నిష్ఠూరం చేస్తావా… నా కష్టసుఖాలు మీమీే పట్టవా…”
”నీ కష్టసుఖాలు పట్టవా అంటే, నీకు పెండ్లి జేయలేదనే గదా నీ బాధ… మేం జూనిన సంబంధాలు నీకు నచ్చుతాండాయా.. చంద్రా. యిబ్బుడు జేసుకుంటావా చెప్పూ నా తమ్ముడే వున్నాడు మహారాజులాగా వ్యాపారం చేసుకుంటాండాడు… నీకు నెలకొక కొత్త పట్టుచీర నేపించి కట్టిస్తాడు చేసుకుంటావా చెప్పూ, చదువైతే లేదు.. చదువేంజేయనూ, నాలుక గీసుకోడానికి పనికిరావు మీ డిగ్రీలు… నీకు డాక్టర్లూ యింజనీర్లూ, ఆఫీసర్లూ కావల్లామ్మా.. నా తమ్ముడు సరిపోతాడా… మన దిక్కుమాలిన కులంలో నీగ్గావాల్సిన ఆఫీసర్లు ఎవరుండారు… వున్నా వయెనౖయిపోయిన నిన్ను చేసుకోవడానికి రావద్దూ. నీకేమో రెయింపగులూ పెండ్లి చేసుకోవాలనే ద్యాస”…
”వదినా…..” గావుకే పెట్టింది. చంద్రకళ.
”ఏమంటాండావ్ .. తల్లీ అట్లరుస్తావ్… నువ్వు ఎవర్నో చూసుకొని పెండ్లిచేసుకోవాలానే గదా మేం జూనే సమ్మందాలు వొద్దంటావు… కులందప్పినోల్లనూ, మతం దప్పినోల్లనూ ఎవరైనా గానీలే చేసుకో, మేం వద్దంటామా…. మీ అన్నొక చేతకానోడై నిన్ను అడగాల్సివస్తోంది మా ద్కిూ ఒక్క కంట చూడమని….”
”మీకు నేను డబ్బులివ్వడం లేదా… ఏమక్కా వదిన యింత అన్యాయంగా మాట్లాడుతున్నా నువ్వూరవుేన్నావు… నేనివ్వకుంటే మీ సంసారం నడుస్తుందా… నా సొమ్ముతింటూనే నన్నిన్ని మాటలు అంటున్నారే…”
”అవునే చంద్రా, యివ్వకుంటే ఎట్లా, అమ్మ మంచమీదపడా… నా ఆరోగ్యమూ అంతంతమాత్రమే… మీ బావచూన్తేనా డబ్బు మనిషి… తమ్ముని ఆదాయం అంతంత మాత్రమే.. యింక నువ్వుగాక యింవెరు యిస్తారు… నీ ఖర్చులంత కావాలా, ఒక ఐదువేలో ఆరువేలో పెట్టుకొని, మిగిలిందంతా యిచ్చెయ్యవే తల్లీ అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమే నీకు…” వాళ్ళక్క అనునయిస్తోంది.
”మీ అక్కకు డాక్టర్ దగ్గర చెక్ అప్ చేయించుకురావల గానీ మమ్మల్ని పంపు…. డబ్బులియ్యి” గదమాయింపు గొంతుతో వాళ్ళ వదిన. కాన్సేపటికి, తలుపు తీసుకుంటూ, దబాదబా నడుచుకుంటూ బయటి కొచ్చారు.
ఎదురు కిషోర్. ”నమేన్త అమ్మా..”
వదిన ఎగాదిగా చూని ”ఎవురయ్యానువ్వు..”
”చంద్రక్క కోసం లేమ్మా…”
మాటవిని బయటికొచ్చిన చంద్రక్క అతన్ని రమ్మనలేకా, పొమ్మనీ అనలేకా సతమతమవుతూ వుంది. విసవిసా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే, లోపలికొచ్చి కూచున్నాడు… ఎదురుగా ఆమె కళ్ళు ధారకడుతున్నాయి.
”చంద్రక్కా….” అనునయంగా అన్నాడు.
”కిషోర్… కథల్రాస్తావుగదా… సమాజం గురించి ఆలోచిస్తావుగదా… ఆధిపత్యంతో ఒకాడపిల్లను యిల్లు ఎట్లా ఆడిస్తుందో, ఎట్లా కంట్రోల్ చేస్తుందో చూడాలంటే నన్ను చూడు… యీ రెండు శాల్తీలు నాకు అక్కా, వదినలేకదా, యింకా వొక అన్న… వీళ్ళవెరికీ నేను సుఖంగా వుండాలని లేదు, ఎంతేనపూ వాళ్ళ అవసరాలుతీర్చే యంత్రం కావాలి. ఆ యంత్రం నోట్లురాల్చుతూ వుండాలి. ఆ యంత్రానికి శరీరముందనీ, మనసుందనీ తెలుసుకొనే అవసరం వాళ్ళకు లేదు, ఎన్ని పెళ్ళి సంబంధాలు చెడగొట్టింటారో.. నిజంగా.. నిజంచెప్తే ఎవరూ నమ్మరు… అన్ని కుటుంబాలు యిట్లా వుండవు నిజమే… నా కుటుంబం మాత్రమే యిట్లా ఎందుకుందో… నా దురదృష్టం… వీళ్ళ నుంచీ పారిపొదామని చూసా, చూస్తున్నారు…. అయినా వీలుపడ్డంలేదు, వాడు తెల్సుగదా… చాంద్‌గాడు…. ఎకానమిక్స్ స్కాలర్…. కంత్రీగాడు… యిద్దరిలోనూ.. చాంద్ వుందని ఎంత కవిత్వం రాసాడూ.. థీెనన్ సబ్మిట్ చేసాకా.. గుట్టుచప్పుడు కాకుండా వాళ్ళమతం పిల్లను నిఖా చేనేసుకున్నాడు… వాణ్ణెంత నమ్మానూ… ఎంతదాన్తే మాత్రం తెలీకుండా వుంటుందా… ఆ నిఖా… నాకింత మోసం చేస్తావా అని అడిగితే, ‘యిప్పటికీ నువ్వంటే ప్రేమే నిన్ను చేసుకుంటా మా మతం వొప్పుకుంటుందీ’ నంటాడా… చెప్పుతో గదా కొట్టానూ… చరిత్రచదివీ సెక్యులర్ జీవితాన్ని ఆచారిద్దామని గదా… వాణ్ణి ప్రేమించానూ… ఆ చెప్పుతోనే నన్నూకొట్టాడు వాడు… ఆలాన్ట్ రోజు అడిగావే ”ఏమక్కా కన్ను వుబ్బిందే” అని, ఆ టెంన్షనే.. వాడు యీవూళ్ళోనేవున్నాడు.. మొన్న మొన్నదాకా సతాయించాడు… నా కొలీగ్ సూరీ కల్పించుకుంటే వెనక్కుతగ్గాడు… ఇవన్నీ వదినావాళ్ళూ తెలుసు… వీళ్ళ ఎత్తులు, వీళ్ళబ్లాక్ మెయిల్ భరించలేనంత… వదినేమో చదువుసంధ్యా లేని తన బండతమ్మునికి అంటగట్టాలని చూస్తుందా, అక్కమో తన సవతిగా వచ్చినా ఫర్వాలేదు అన్నట్లుంటుందా.. నిజంగా ఒక స్థాయి తర్వాత ఒక న్థితికొచ్చాక… తల్లీూతురూ, అక్కాచెల్లెలు, అన్నాచెల్లెలు, లాంటి బంధాలు మాయమై మనుషలూ అవసరాలూ మిగుల్తాయి కిషోర్, దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా…. నరకం…”
యవ్వన వుద్వేగాలుమాయమై ప్రౌఢత్వంలోంచీ జీవితాన్ని చూస్తున్న అనుభవిస్తున్న చంద్రక్క చెబుతున్న మాటలు, కిషోర్‌కు జీవితవాస్తవాలుగా కనిపించాయి. వాలిపోతున్న కళ్ళ కింద నల్లచారలు, పొడిబారిన చెక్కిళ్ళూ, తడారిన పెదవులు, జుట్టు మీదా, బట్టలమీదా శ్రద్ధలేని తనం, ఎం.ఏ.పి.హెచ్.డీ చేని నెలకు వేలకువేలు సంపాదించే యీ స్త్రీ నిజంగా అలా అనిపిస్తుందా?… ఎవర్ని మోహింపజేస్తుందీ శరీరం… అయినా యీ శుష్కశరీరానికి ఒక తోడు కావాలని, తనూ స్వంత కుటుంబం కావాలనీ వుండదా… అది నేరమా… తన స్థాయివాడిని పెళ్ళాడాలనీ, తనంత చదివివుండాలనీ అనుకోూడదా……
తననెవరైనా ప్రేమిస్తారనీ వలచి వెంట వస్తారనీ నమ్మకూడదా.. తన అక్కా బావా, అన్నావదినా తనకోసం ఒక మంచి మనిషిని వెదకాలనీ, అలావెదకడం వాళ్ళ బాధ్యతగా అనుకోవడం దురాశా? వాళ్ళట్లా చేయనందుకు బాధ్యతగా ప్రవర్తించనందుకు, వాళ్ళను దూరం పెట్టడం ఆమె చేనిన తప్పా? కిషోర్ తన భార్య శారదతో యీ విషయాల గురించి చాలాసార్లు వేదనపడేవాడు.
అలాంటి రోజుల్లోనే ఒక మధ్యాహ్నం….
”సార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి గారట లైన్‌లో వున్నారు…” యింటర్ కావ్‌ులో సూపరింటెండెంట్ చెప్తూంటే ఫోన్ తీసాడు కిషోర్. ”సార్… ఒక సారి రండి… చాలానీరియన్… చంద్రను పలకరించండి…” అంతే పెట్టేనింది. వెళ్ళి చూన్తే ఏముందీ… ఉబ్బిన కుడి కన్ను! చివికిపోయిన టమోటో పండులాంటి ముఖం! ఈ రెండు మూడేండ్లలో, నాలుగైదుసార్లు సాహిత్యసభలకు ఆహ్వానించడానిళ్ళిె కలిసాడు, రెండుమూడుసార్లు బయట షాపింగ్ చేస్తూ కని్పన్త, శారదతో మాట్లాడిందట, అట్నుంచీ అటే శారదను యింటికి ూడా ఒకసారి తీనిళ్ళిెంది. ఒకసారి అతని ఆఫీన్ ఛాంబర్ కొచ్చి .నీ.నాెల్ హిస్టరీ అడిగిందీ, కర్నూలూ-కడప నాెల్ బ్రిటిష్ కాలంలో డచ్ కంపెనీ తుంగభద్రా నదిమీద నిర్మించాలనుకున్నప్పుడు, సాగునీటి అవసరాలకంటే రవాణా అవసరాలదృష్ట్యా ముఖ్యమైంది గానూ, లాభసాటిగానూ భావించారట, పదే పదే గండ్లు పడుతుంటే, నష్టాలు భరించలేక, బ్రిటిష్ వాళ్ళకు అమ్మేసారట, తర్వాత సాగునీటి కాల్వగా మారింది. ఆ విషయాన్ని వివరిస్తూ పేపర్ రాస్తున్నా నన్నది. ఫరవాలేదు, దారిలో నేవుందని సంతోషపడ్డాడు. ఆ దారిలో పడ్డ చంద్రక్క ఏమైందీ, పిచ్చిదానిగా ఎవరుమార్చారూ? పిచ్చి పిచ్చిగా నవ్వుతుందీ తనలోతనే అసంబద్ధంగా మాట్లాడుతుందీ, గొణుక్కుం టుందీ… వుండీవుండీ అరుస్తుంది… అతన్ని చూని గట్టిగా నవ్వి.
”వచ్చావా తమ్మయ్యా…. నిె నాెల్ త్రూదీ ఏజెన్, అచ్చయ్యింది తెలుసా” అని వెంటనే, ”ఏం పనికొస్తుందా పేపర్… ఎవరుమెచ్చుకుంటారు మనల్ని… నాలుక గీసుకోవడాని ూడా పనికిరాదు…” అంటు కన్నీళ్ళు పెట్టుకుంది. వెంటనే మామూలుగా అయిపోయి, ఏవోపాత విషయాలు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడింది. రెండు నిమిషాల తర్వాత, అప్పుడే చూనినట్టు ‘అరే కిషోర్ నువ్వెప్పుడొచ్చావ్” అంటుంది… తెరలు తెరలుగా తన పాత జ్ఞాపకాలమీద స్వారీ చేస్తూ… వొక్కొదుటున…. మంచం మీద నుండి లేచి నడవాలని చూనింది.
”చంద్రా పడిపోతావు…” అంటున్నాడు పక్కనున్న ఆమె కొలీగ్స్…
”అ హ్హా హ్హా…..” అని నవ్వి, ”ఎప్పుడో పడ్డాను, లోయల్లోకి దొర్లిపోయాను. యింక కొత్తగా పడేదేముంది మేడవ్‌ు” అంటుంది. నాటకీయంగా….. ఆ తర్వాత మత్తులోళ్ళిెపోయింది. వాడిన ెనడెటివ్స్ కారణంగా.
”విషయం ఏంటి మేడం” ప్రిన్సిపాల్‌ను అనడిగాడు.
”సూరి, సూర్యనారాయణ రెడ్డుని మా కాలేజీ స్టాఫ్, కాంట్రాక్ట్ లెక్చరర్…. నిజానికి విడోవర్… తనతో క్లోజ్‌గా వుండేవాడు…. పెళ్ళి యేర్పాట్లుచేసుకుంటున్నాడని తెలిని, వాళ్ళూరి వెళ్ళి అడిగింది…. తిరస్కరించాడు… వాళ్ళ తల్లిదండ్రులు చూనిన సంబంధం చేసుకుంటునన్నాడు… కులంకావాలన్నాడు… భరించలేక పోయింది….. యింతకుముందే కుటుంబాన్ని దూరం పెట్టేనింది… యీమె న్నేహసంబంధాల గురించి, డబ్బులివ్వనందుకు వాళ్ళు భయంకరంగా ప్రచారం చేస్తున్నారు… పంచాయితీలు పెట్టిస్తున్నారు….. వీడ్ని నమ్మింది… వీడు యిలా చేసాడు… చంద్ర బద్దలైపోయింది సార్….” వినలేకపోయాడు… చందక్క్రను ధైర్యంగా చూడలేకపోయాడు… అపరాధభావం వెంటాడింది, తనూ శారదా, ఆమె కోసం రెండు పెళ్ళి సంబంధాలు చూసారుగానీ అవి కలినిరాలేదు. యిప్పుడిట్లా అయిపోయింది. చంద్రక్క మాననికంగా చాలా దూరం వెళ్ళిపోయింది….. తన్నుతాను ఒంటరితనంలోకి తోనేసుకుంది… ఎవరన్నా పలకరిన్తే… తుంచినట్లు మాట్లాడేదట……. శారదతోపాటు నాలుగైదుసార్లు వెళ్ళి కలిసాడు…. జీవితాన్ని జీవితంగా తీసుకోవాలని చెప్పాలని చూసాడు.
”మీరు గొప్పవాళ్ళబ్బా… మీరు చెప్తే మేం వినాలా…” అంది తిరస్కారంగా, ”పెళ్ళికి బయట చాలా జీవితముందక్కా…. కాస్తా ఆలోచించి చూడండి…” అంది శారద.
”పెళ్ళి చూసుకున్నదానివి, అందునా, కోరుకున్న వాడ్ని చేసుకున్న దానివి నవ్వు చెప్తే నేను నమ్మాలా పాపా…” అంది వైరాగ్యంగా….
”మరి యేంటక్కా పరిష్కారం… యిట్లావుంటే ెుట్లా…” అంటే, గట్టిగా నవ్వి…….. ”యిప్పుడేమైంది నాకు… నా గురించి మీరు వర్రీ అవ్వద్దండి…. వెళ్ళండి మీరు, వచ్చే నవంబర్‌లోనే నా పెళ్ళి అప్పుడొద్దురుగానీ…” అని ”అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తిౖ మనుషలు ఆడుకునే నాటకం…” అనే పాట ఎత్తుకుంది. నిస్సహాయంగా వెనక్కొచ్చారు…. మళ్ళీసారి వెళ్తే యిల్లుఖాలీ…. అనుకోకుండా ట్రాన్సఫర్ అయ్యిందట పత్తికొండకు.
ఆ తర్వాత కొన్నాళ్లకు ”ఒక పేషెంట్ మీతో మాట్లాడాలంటోంది సార్.. హాస్పిటల్ బెడ్ మీద మిమ్మల్ని కలవరిస్తోంది…. వి.ఆర్.ఆర్ హాస్పిటల్‌కు రండి” అని మిత్రుడు, డాక్టర్ మనోహర్ ఫోన్ చేసాడు కిషోర్‌కు.
”పేషెంట్ పేరు ఏంది డాక్టర్…”
అంటే, గుండెలదురుతుండగా ”చంద్రకళ..” అని విన్పించింది. వెళ్ళి చూన్తే ఆసుపత్రి బెడ్ మీద చంద్రకళ, అప్పటి ప్రిన్సిపాల్ జ్యోతి వున్నారు.
”నింహంలాగా తిరిగేది కాలేజీ కాంపన్‌లో… ఆడపిల్లల హాస్టల్‌కు వార్డెన్‌గా ఎంత బాగా పనిచేనేది… క్లాన్‌లో ఆపాఠాలు చెప్పేగొంతు వినాలి… చరిత్ర యింతబాగా చెప్పొచ్చా అనిపించేది. ఎట్లాంటి చంద్రా ఎట్లా అయిపోయింది సార్. నవంబర్ లోనే నాపెళ్ళి అనేది వూతపదం లాగా చేసుకుంది సార్… పిచ్చిదైపోయింది సార్, లోకం దృష్టిలో…” ఆసుపత్రి బెడ్ మీద చంద్రక్కను చూపిస్తూ ప్రిన్సిపాల్ జ్యోతి అంటుంటే, జీవచ్ఛవంగా మారిన ఆ మనిషిని చూస్తుంటే, కిషోర్‌కు కన్నీళ్ళు ఆగలేదు….
”పత్తికొండకు వెళ్ళాక ఆరోగ్యాన్ని బాగా పాడుచేసుకుంది సార్ కిడ్నీ యిన్‌ఫెక్షన్ కాస్తా కిడ్నీ ఫెయిల్యూర్ దాకా వచ్చినా పట్టించుకోక ప్రాణం మీదికి తెచ్చుకుంది చూడండి”
పదహైదు రోజులుగా కాలేజీకి వెళ్ళలేదట…. కొలీగ్స్, సెల్‌కు కాల్ చేన్తే అది న్విచ్ఛాఫ్‌లో వుందట. ఆఖరికి అనుమానంతో యింటికి వెళ్ళి, తలుపులు తట్టి అవి తెరుచుకోక, వాటిని బద్దలుకొట్టి లోపలిళ్తేె, చంద్రక్క మోషన్స్‌తో అసహ్యమైన వాసనతో, ఆ దుర్గంధాలమధ్యా పడుందట. తీసుకొచ్చి కర్నూలు ఆసుపత్రిలో చేరి్పన్త…. కండీషన్ క్రిటికల్ అన్నారు డాక్టర్లు…. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వుంచిన నాలుగు రోజులకు స్పృహలోకొచ్చి మనుషుల్ని కలవరించిందట.
ఆ తర్వాత చాలామంది పరిచయస్తులొచ్చారు, కన్నీటిపర్వంతమవుతున్న వాళ్ళను చూని, బాగవుతుందనే అన్నారు డాక్టర్లు. అయితే డాక్టర్ మనోహర్ మాత్రం కిషోర్‌తో, ”మిత్రమా పరిన్థితి క్రిటికల్‌గా వుంది” అన్నాడు.
సరిగ్గా సాయంత్రానికి వాళ్ళక్క దిగింది.
పదేళ్ళుగా మాట్లాడని అక్క…. ఆర్థికావసరాలు వేరుచేనిన అక్క. చూస్తూనే ‘యీమెనెవరు రమ్మన్నారు.. వెళ్ళమని చెప్పండంది’ చంద్రక్క. అదివిని ”అదెట్లా విడిచి వెళ్తానూ… యిప్పటి విడిచిపెట్టి తప్పుచేశాం……. యిక చేయం” అంది వచ్చినక్క.
నిరసనగా చంద్రక్క మొఖం తిప్పుకుంది.
”లేదు లేదు…. ఇది కూడా మా అమ్మలాగా డిప్రెషన్‌లోకెళుతుంది, కిషోర్, యిప్పుడు గట్టిగా పట్టుకోకపోతే ఎప్పటికీ రానియ్యదు… ఏమన్నాగానీ నా చెల్లెల్తో కొట్లాడైనా సరే వొప్పించుకుంటా…” అంటోంది వచ్చినామె.
వచ్చినామె రాత్రికి అక్కడేవుంది.
ఆరాత్రి గడిచింది.
ఉదయం వచ్చి చూన్తే వచ్చినామె పడి పడి ఏడుస్తోంది. ”…. దగ్గర పెట్టుకొని చూసుకుందామనుకుంటి… ఎంత అన్యాయం చేని పోతివి తల్లీ…. నీం తక్కువుండ్యా…. లక్షలు లక్షలు జీతం సంపాదించేదానివి దిక్కులేనిదానిలాగా వెళ్ళిపోతివే… పెండ్లిమీదబండబడా… అదే నీూ నాూ అగ్గిపెట్టి నిన్నురొమ్మన పెట్టుకున్నే.. ఎంత పనాయసామీ…”
నల్లగల్ల షర్ట్ అతన్ని పట్టుకొని యేడుస్తుంటే, అతను ఆమెను కారిడార్లోకి తీసుళ్ళాెడు.
ఉబ్బిన కన్ను
నలిగిన ముఖం
చివికిపోయిన టమోటో పండులాంటిముఖం, వికృతంగా నవ్వుతోంది, వ్యవస్థముఖమై చంద్రకళ.