ప్రముఖ రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారి కథా సంకలనం….. ”రేలపూలు” గిరిజన తండా వాసుల బతుకుల నేపథ్యంలో వెలువడిన కథలు.
ఇందులో మొత్తం 17 కథలున్నాయి. ప్రతి కథా దేనికదే వైవిధ్యం ఉన్నదే. అయినా అన్నింట్లోను తండా వాసుల సమస్యలే మూల విషయం. ఆర్తి, ఆవేదన, ఆనందం, సుఖం, దుఃఖం, జీవన న్థితిగతులు, నమ్మకాలు లాంటివన్నీ తన కథ ద్వారా ఆవిష్కరించారు. అన్ని కథలు తండా వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పట్టేవే.
రచయిత్రి ఉపాధ్యాయినిగా టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడులో పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా అడవుల్లో ప్రథమ స్థానంలో వున్న ఖమ్మం జిల్లాలోని చాలా మండలాలు తిరగడం వల్ల తండావాసుల జీవితాలను, జీవన విధానాలను దగ్గరగా చూడడం వల్లనే వాళ్ళ సమస్యలను అద్దం పట్టి చూపించ గలిగాను అని రచయిత్రి ముందు మాటలో రాసుకున్నారు. అందు పసుపుపచ్చని యూనిఫాం వేసుకున్న పిల్లలను ప్రతిబింబించే రేలపూలనే శీర్షికగా పెట్టారు.
పుస్తకం అట్టపైన రేలపూలతో పాటుగా, పూవులలాంటి అమాయకమైన తండావాసుల ఫోటోలు కూడా అట్ట వెనుకవైపు కనబడి మనలో వారిపట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి.
ఈ కథా సంకలనానికి ముందు మాట ప్రముఖ నినీ గేయరచయిత శ్రీ భువనచంద్ర గారు మరియు ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రా దేవి గారు రాసారు.
రచయిత్రి గొప్ప భావుకురాలు. అందు కథల్లో సమస్యలే కాదు ప్రకృతి అందాల వర్ణన ఎంతో గొప్పగా వుంది. ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ ఆరాధన అంతా రంగరించి పెన్నులో పోని రానినట్టుంటుంది.
భాషకు శ్వాస యాస అన్నమాట అక్షర సత్యం అని రేలపూల కథల్లో మరోసారి రుజువైంది. కథల్లో అవసరమైన చోటంతా తెలంగాణా భాషలో ఎంతో అందంగా హృద్యంగా రాసారు.
కథలు, కథనం ఎంత గొప్పగా ఉన్నాయంటే మొదటి నుండి చివరి దాకా ఆపకుండా చదివిస్తాయి.
అందమైన ప్రకృతి ఒడిలో పెరిగే అడవి బిడ్డలు ఈ తండావాసులు.
ఆసక్తికరమైన వారి జీవన విధానం, వారు జరుపుకునే పండుగలు, పెళ్ళి వేడుకలు, చివరికి వివిధ సందర్భాల్లో ఏడవడం ూడా ఒక వేడుకగా ఉండడం ఇలా చదువుతున్నంతేనపు మనం కూడా తండాలో ఉండి ఈ విషయాలన్నీ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
అస్తిత్వం కథలో .. పుట్టినప్పుడు పెట్టిన పేర్లను కాదని స్కూల్ రికార్డుల్లో పేరు మార్చుకోవడం వల్ల ఆధార్ కార్డులలో ఒక పేరు రేషన్ కార్డులో ఒక పేరు ఇలా పొంతన లేని పేర్లతో తండావాసులు పడుతున్న కష్టాలను ఎంతో చక్కగా వివరించారు. ఇదే కథలో వాళ్ళు జరుపుకునే పండుగల వివరణ ఎంతో బాగుంది. తండావాసులే ఎక్కువ శాతం ఉన్న బడిలో వాళ్ళు జరుపుకునే పండుగ. రోజు బడికి స్థానిక ెనలవు ప్రకటించాలనే రచయిత్రి ఆలోచన నిజంగా అభినందనీయం.
రాత్రిపూట చదువుకోవడానికి గుడిెనలో ఒక్క కరెంటు బల్బు ఉంటే చాలని కలలు కన్న సాల్కీ కథే ”బిజిలి” కథ. రాత్రి పూట చీకట్లో ఇంట్లో పాముదూరి చిన్నీలాల్ అనే అబ్బాయిని కాటేన్తే చనిపోతాడు. సాల్కీ చిన్న బుర్రలో అన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలే. ఓటు కోసం వచ్చే సర్కారు తండాకు రోడ్లెందుకు వేయదు? బిజిలీ ఎందుకీయదు? తండాలో బిజిలీ ఉంటే చిన్నీలాల్‌ని పాము కాటేనేదా? ఇలా. తండాలకు కరెంటు రాలేదు కాని దొరల చేన్లకు నీళ్ళ కోసం మోటర్లు పెట్టడానికి కరెంటు దొర చేను వరకు వచ్చింది. మూడువందల మంది జనం అవసరం కన్నా ముగ్గురు నలుగురు మోతుబరుల అవసరం పరిన్థితులను ఎలా మారుస్తాయో అని రానిన తీరు చాలా బాగుంది. చదవడం ముగించేటప్పటికి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.
దివిలి కథలో అమాయక గిరిజన బాలికను మోసగించడం గురించి రాసారు.
పూవులో పూవై కొమ్మలో కొమ్మై అడవి తల్లి అందాలను కళ్ళు విప్పుకొని చూనే అమాయకురాలు దివిలిని పశుబలంతో లోబరుచుకొని, తన పేరు బయట పెడితే తల్లిదండ్రులను ప్రాణానికి ప్రాణమైన అన్నను చంపుతానని బెదిరించడం, ఇవన్నీ ఎవరికీ చెప్పుకోలేక నానా హింసలు పడి చివరికి ఏడో నెలలోనే బిడ్డకు జన్మనిచ్చి మరణించడం. శవాన్ని ఊళ్ళోకి రానీయకపోతే అడవిలోనే దివిలి ఎంతో ఇష్టపడే రేలపూల చెట్టుకింద అంతిమ సంస్కారం చేస్తాడు అన్న. ఆ స్థలంలో దివిలీకిష్టమైన పూల తోట పెంచి రేలపూల చెట్టుకింద దీపం వెలిగిస్తాడు.
అందమైన పూలవర్ణన రచయిత్రి భావుకత చదువుతున్నంత నేపు మనల్ని ఏవో లోకాల్లో విహరింపచేస్తాయి. ఇదే కథలో తండా ప్రజల ఆర్థిక అవసరాల కోసమో మరే ఇతర జీవిత అవసరాలకోసమో మత మార్పిడులకు తల వంచడం, తద్వారా కలిగే సంఘర్షణను పార్వతి పాత్ర ద్వారా ఎంతో చక్కగా రాసారు.
చదువు మాత్రమే తమ తండాలకు నాగరిక ప్రపంచానికి ఉన్న దూరాన్ని తగ్గించ గలుగుతుందని తండాలోని పిల్లలందరిని ప్రోత్సహించి, తను ూడా పెళ్లి కోసం వత్తిడి తెచ్చే తల్లిదండ్రులకు ఒప్పించి పై చదువులు చదువుకుంటుంది ‘గిరికాన దీపం’ కథలో జాల. తండాలోని తనవారికి అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తుంది. కుటుంబ సమస్యలను పంచాయితీ వరకు రాకుండా చూసుకోమని చెప్పే అమ్మాయి తనే భర్తతో విడిపోవడానికి పంచాయితీకి ఎక్కుతుంది. పంచాయితీ పెద్దల ముందు విడిపోవడానికి ఆమె చెప్పిన కారణం అతడు మగవాడే కానీ మనవాడు కాదు అనే ఒ వాక్యంతో కథ ముగిస్తారు రచయిత్రి. ఎంత అద్భుతమైన ముగింపు. ఒక వాక్యంలోనే వంద సమాధానాలు.
తావూర్యా కథలో పగలు రాత్రి కష్టపడి మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయానికి, కోతులదండునుంచి రక్షించుకుని ఇంట్లో పిల్లలను సయితం ఒక్క కంకిని కూడా తిననివ్వకుండా చూస్తూ కష్టానికి తగ్గ ఫలితం కోసం ఎదురు చూస్తుంటాడు తావూర్యా. ఇంతలో దొర కూతురు కడుపుతో ఉందని కంకులు కోయించుకొని పోవడమే కాక దొర చుట్టాలను చేను మీద పడి కంకులు కాల్పించుని తిన్నంత తిని కార్ల నిండా నింపుకొని పోతారు. నీరసంతో కూలబడి పోతాడు తావూర్యా. కోతులదండును బెదిరించి వెళ్ళగొడుతున్న పిల్లలను వారించి ”ఇగనించి వాటిని కొట్టకండ్రి, గవ్వి కడుపునిండా తింటయి గని కార్లల్ల గట్కపోవుగదా” అంటాడు.
చదువుకోవాలని తపనతో తొందరగా పత్తి చెలక పని ముగించుకొని కూడా బడికి అందుకోలేని దేవ్లా కథే ‘ఓ పాలబుగ్గలా చిన్నరైతా’. కథ చదవడం పూర్తి అయ్యేసరికి మనసు కరిగి కన్నీరవుతుంది.
అడవులలో చెట్లు నరకడం వలన ఆహారం దొరకక కోతులు జనం వినిరే మొక్కజొన్న గింజలకోసం రోడ్డుమీదకు వచ్చి ఎలా ప్రమాదాలకు గురి అవుతున్నాయో చెప్పే కథ ‘హాథీరాo’.
వాన కథలో పొంగి పొర్లుతున్న వాగు ఒడ్డున చిక్కుకొని వున్న స్కూలు పిల్లలను రక్షించి ఇంటికి తీసుకు వెళ్ళిన సోమ్లా ను అంటరాని వారి పిల్లలను ఇంట్లోకి రానిచ్చాడని తండావాసులు వ్యతిరేకిస్తారు. తండాల్లో ూడా వర్ణ వివక్ష ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ కథ చదివితే.
అందమైన కావ్యంలా సాగిన ప్రేమ కథ ‘ఆల్యా’.
కనీస వైద్యం ూడా అందుబాటులో లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు తెలిపే కమ్లి కథ.
తల్లి చనిపోతే అప్పటి తాగుడుకి బానిెనౖన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయాలనే బంధువులను ధైర్యంగా అడ్డుకున్న అమ్మాయి కథ చాంది.
మానవత్వం పరిమళించే కథ జై జై గణేశా.
బడా బాబులు వారి దర్పం చూపించుకోవడానికి పిల్లలకోసం బూట్లు పంపడం అవి నాణ్యత లేకపోవడం వలన వారి ఆశలపై నీరు చల్లినట్లు కావడం ఆశలు కథ.
భర్త చనిపోయి ఒంటరిగా జీవితాన్ని గడిపే స్త్రీ సమాజంలో ఎదుర్కొనే సమస్యలు, యూనియన్ సహాయం తీసుకొని వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఒక్కొక్క విష వలయంలో నుండి ఎలా బయటపడిందో, తక్కువ చేని కింద పరిచిన కులాన్నే ఆయుధంగా చేసుకొని గెలిచిందో తెలిపే కథే అమ్రు.
ప్రతి చిన్న విషయానికి మైళ్ళకొద్దీ నడవాలని వస్తున్న ఊళ్ళో బస్సు రావల్సిన అవసరం గురించి చెప్పే కథే వారధి. అలా వచ్చిన బస్సులో ప్రయాణం పంతులమ్మలకు అంతరిక్ష యానమంత ఆనందాన్నిచ్చింది అనే ఒక్క వాక్యంలోనే సమస్య తీవ్రత చూపించారు రచయిత్రి.
తండావాసులను సమస్యలలోనుండి బయట పడేయాలన్న తీవ్ర ప్రయత్నాలను కూడా అడ్డుకొనే దుష్ట గ్రహాలు, వారి అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకొని అభివృద్ధిని ఎలా ఆపుతున్నారో కేస్లా కథలో చెప్పారు. ఇది నాణానికి మరోవేపు.
రేలపూలు కాస్త ఆసరా ఇన్తే గుత్తులు గుత్తులుగా విచ్చుకొని అడవి అందాన్ని తెస్తాయి. గిరిజన తండాల్లో ఉన్న వాళ్ళ్కూడా కాస్త ఆసరా చాలు. సరిపడినంత నీరు చాలు. పిల్లల చదువులకు వ్యవసాయ అవసరాలకు సరిపడేంత విద్యుచ్ఛక్తి చాలు. నిత్యావసరాలకు కూడా మైళ్ళకొద్దీ నడిచే నడకను తప్పించే ఒక్క ఆర్.టి.ని. బస్సు చాలు. అడవిలో ఏ పురుగో పుట్రో కరిన్తే చేనే తక్షణ వైద్యం అందుబాటులో ఉంటే చాలు. అయితే ఇవన్నీ వాళ్ళకు గగన కుసుమాలే.
ఈ విషయాలన్నీ ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరించారు సమ్మెట ఉమాదేవి గారు తన రేలపూలు కథాసంకలనంలో. నాకు బాగా నచ్చిన మరో విషయం కథలకు పెట్టిన పేర్లు కొన్ని కథల్లో ఉన్న ముగింపు వాక్యాలు. మూడు నాలుగు పదాలున్న వాక్యంలోనే కొండంత అర్థం వచ్చేటట్లు రాయడం.
మారుమూల పల్లెల్లోనో, కనీస సౌకర్యాలు లేని ప్రాంతాల్లోనో పనిచేయాల్సి వచ్చినప్పుడు, అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయట పడతామా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ. కాని సమ్మెట ఉమాదేవిగారు మాత్రం తండావాసుల కష్టాలను చూని స్పందించారు. చక్కటి కథలుగా రాని పుస్తకరూపంలో పాఠకులకు అందించారు. అందుకు ఉమాదేవి గారికి అభినందనలు.
అన్ని గిరిజన తండావాసుల కథలే అయినా చదవాల్సింది మాత్రం నగర వాసులే. ఇంకా చెప్పాలంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించగల అధికారులు.
ఈ కథల్ని మనం తప్పకుండా చదవాలి. అప్పుడే ఆహారం అడవుల్లో దొరకక రోడ్లమీదికి వస్తున్న కోతులకు మనం వేనే ఆహారాన్ని విలాసంగా రోడ్ల మీద విసరి వాటిని ప్రమాదాలకు గురి చేయకుండా పొందికగా రోడ్డు పక్కన పెట్టి వస్తాము.
వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తాం.
వాళ్ళు కూడా మనలాగే ఈ భూమి మీద తిరిగే మనుషలే వాళ్ళకు కూడా మనలాగే కనీస సౌకర్యాల అవసరం ఉంది అని ఆలోచిస్తాం. అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం.