పాపాలేమోగాని ప్రాణాలు బోతన్నయి- జూపాక సుభద్ర

యీ పదిరోజుల్నించి ఎవర్ని మందలిచ్చినా పుష్కరాలకు బొయిండ్రా, మేం బోతున్నమని, లేకుంటె పొయెచ్చినమని అక్కడి కష్టాలన్ని చెప్పుకునుడే పెద్దముచ్చటైంది. యిగ టీవీలు, పేపర్లనయితే పుష్కరం వార్తలే నిండుతున్నయి. ఓర్నీ పుష్కరస్నానాలకు జనాల్ని వుసిగొలిపితే మొదటిరోజే 29 మంది పుష్కరస్నానాలకు బలైరి. పాపదోషాలు బోతయని మీడియా, ప్రభుత్వాలు వుదరగొడితే ప్రాణాలే పాపాయె.
మొదటి రోజు మొదటి ముహూ ర్తంలోనే స్నానాలు జేన్తే ఎక్కడలేని పుణ్యా లొస్తయని భక్తి చానల్లు, టివి చానల్లు, ప్రభుత్వాలు భక్తి మాఫియాలుగా తయారై జనాల్ని హిన్టీరియా రోగులుగా చేసి మొదటిరోజునే 29 మందిని చంపిండ్రు. ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యాన్ని పాటించకుండా ‘స్వాముల స్వామ్యం’ పాటిస్తూ పుష్కర స్నానాలు, పూజలు, గుళ్లు గోపురాలనీ ప్రజల్ని అమాయక జనాన్ని ఆగంజేస్తూ ప్రజాధనాన్ని వ్యర్థం జేస్తుండ్రు
మొదటిరోజే 29 మంది పుష్కరఘాటు దగ్గర చనిపోయినా ూడా ‘పుణ్యమొస్తదని పోతే సావులొచ్చినయి పోవద్దు’ అనే సహజ మానసిక స్థితిని, పోతే ఏమైతదోననే భయాల్ని ూడా పక్కకు తోసి ఏం జరిగినా లోకం తలకిందులైనా పుష్కరతానాలు జెయ్యాల్సిందేనన్నట్లు ప్రభుత్వాలు, మీడియా, అర్చక స్వాములు అందరు జామిలిగా కల్సి జనాల్ని పుష్కరాల వెంట వురికిస్తుండ్రు. అట్లా జనాల్ని మూఢులుగా, భక్తి హిన్టీరిక్‌గా తయారుచేసిన పాపం యీ మూడు వ్యవస్థలదే.
మీడియా వేలం వెర్రి భక్తిని, మూఢ విశ్వాసాల్ని పెంచుతూ హేతుబద్దతల్ని దూరం చేనే దుర్మార్గానికి పాల్పడ్తుంది. ప్రభుత్వాలు ూడా లౌకికవాదంగా కాక మతసంస్థలకు వెన్నంటి మతాచారాలను కొనసాగిస్తుంది. పర్యావరణాన్ని నీటిని కలుషితం చేస్తూ… ప్రాజెక్టుల నీల్లు పుష్కరస్నానాలకు మల్లిస్తూ… రేపు తాగునీటికి సాగునీటికి కొరతొచ్చే పన్నాగాలు చేస్తుంది.
పుష్కరాల్లో అంతమంది జనం చచ్చిపోయినా ఫర్వాలేదు ”మీరు వెళ్ళండి పుణ్యం పొందండి” అని మీడియా మాటలు ఎందుకు నమ్ముతున్నరు? ఎందుకంటే ప్రజలు కష్టాల్లో వున్నరు, దుక్కాల్లో వున్నరు. తమ దైనందిన సమస్యల్ని ఈతి బాధల్ని పోగొట్టుకోవాలనే తపనలో బతుకు భద్రతలేని పరిస్థితులకు నెట్టబడిన మానసికస్థితిలో వున్నరు.
ఇదివరకు కొద్దిమంది, అదీ స్వాములు, అర్చక వ్యవస్థకు సంబంధించి నోల్లు మాత్రమే పిండం పెట్టనీకి నదుల్ల మునిగి పుష్కర స్నానం జేనేటోల్లట. అది బైట బహుజన కులాలకు సంబంధంలేని అంశంగా వుండేది. తర్వాత్తర్వాత ప్రభుత్వాలు మీడియా ూడబలుక్కొని పుష్కర స్నానాలకు స్నానఘట్టాలు కట్టించినా కొద్దిమంది పట్టణ ఆంధ్ర ఆధిపత్య హిందూ కులాలు మాత్రమే పోతుండిరి. కాని కొత్త తెలుగు రాష్ట్రాల పుణ్యమా అని స్వాములు ప్రభుత్వాలు మీడియా మిలాఖతై పోటాపోటీగా జనాలమీదబడి పుష్కరాలకు బోకుంటే జీవితం దండుగ, పాపదోషాలు బొయి అంతా మంచి జరుగుతదనీ… పల్లెల్ని గూడా పుష్కరాలకు వురికిస్తున్నయి.
స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ సల్లగుండాలన్నా, బంగారు తెలంగాణ బట్టగట్టాలన్నా తెలుగు రాష్ట్రాలు రెండు గోదాట్ల మునగాల్సిందేనని మీడియా చానల్లు, పేపర్లు సెంటిమెంటు రెచ్చగొట్టిస్తూ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పుష్కర ప్రారంభ ముహూర్తాల్లో మునకలేసిండ్రు. స్వర్ణాంధ్ర సీఎం అట్లా మొదటి ముహూర్తపు మునకలు, మొదటి మునకలు మహాపుణ్యమని చానల్లు చానల్లుగా విజృంభించి మొదటినాడే 29 మంది చనిపోడానికి కారణమైంది.
సమస్యల్లో వున్న పేద మధ్యతరగతి బహుజన కులాల జనాన్ని ఫలానా దండ మెడలేస్కుంటే జబ్బులు పోతాయనీ, గుళ్లు గోపురాలు తీర్థయాత్రలు జేన్తే సమస్యలు సాఫ్‌ అవుతయనీ పుష్కర స్నానాలు జేన్తే మానసిక, శారీరక మాలిన్యాలు కొన్ని పోతయని పుణ్యాలు మూటగట్టుకొని వస్తారని మీడియా ప్రభుత్వాలతో ప్రలోభపెడ్తుంది.
ప్రజల బాధలకు కుల ధర్మ రాజకీయ వ్యవస్థ, కుల ధర్మ సాంఘిక వ్యవస్థలు కారణం. యీ వ్యవస్థలకు పునాదులు హిందూ ధర్మ సిద్ధాంతాలని అంబేద్కర్‌ ఏనాడో చెప్పిండు. పుష్కరాల వుచ్చులబడి అప్పుల పాలయితుండ్రు జనం పుష్కరాలకు బోనీకి.
ప్రజల్ని శాస్త్రీయ హేతుబద్ధ దృక్పథాలవైపు, హేతువాద దృష్టిజ్ఞానాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వాలు మూఢ నమ్మకాల్ని భక్తి మాఫియాని పెంచి తమ దోపిడి సజావుగా సాగిపోడానికి వుపయోగిం చుకుంటుంది.
ప్రజలు ముఖ్యంగా బహుజన కులాలు తమ సమస్యలు పరిష్కరించు కోడానికి ప్రభుత్వాల్ని నిలదీయకుండా వుండనీకి వారిని స్పిరిచ్యువల్‌ మూఢులుగా భక్తి హిస్టీరియావైపు మల్లిస్తున్నది. ఈ నేపథ్యంలో పీడితులు వారి ఆర్థిక సామాజిక స్థితినుంచి లేని దేవుడిమీద భారమేసి నాకర్మ నా రాత అనుకొని విపరీతమైన వత్తిడిలో లేమితో తీర్తాలవెంట, పుష్కరాలవెంట పోయి మునిగితే మంచి జరుగుతదనేట్లు జనాల్ని నిర్హేతుకంగా తయారు చేస్తున్నయి ప్రభు త్వాలు, మీడియా కలిసి.
ప్రజలు తమ మీద తిరగబడ కుండా నిరోధించడానికి వారిని నిత్యము రకరకాలుగా వూపిరి సలపని మతవుత్సవాల్లో ముంచుతున్న దుర్మార్గ నేర ప్రభుత్వాల మీద మీడియాల మీద కట్టలు తెగి ఉప్పు పాతరేనే ఉద్యమాలెప్పుడొస్తయో!

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

One Response to పాపాలేమోగాని ప్రాణాలు బోతన్నయి- జూపాక సుభద్ర

  1. Chandrika says:

    బాగా చెప్పారు!! కానీ ఇలాంటి మూఢ భక్తి కి కులానికి సంబంధం లేదు. డబ్బులు చేసుకోవడమే అందరి పని. గంగా నది అలా చేసే ఈ రోజున మురికి కూపం లా తయారయింది. ఇలా గోదారికి హారతి అని, lighting, ghat ఇవన్ని టాక్స్ డబ్బులు నిజంగా దుర్వినియోగమే. ఎవరు చెప్తారు సామాన్య ప్రజానికానికి? ఇంకా కృష్ణ పుష్కరాలు ఉన్నాయి!! కొన్ని చాదస్తాలు సంప్రదాయం, భక్తి అనే పేరు తో విరక్తి కలిగిస్తున్నాయి. ఇంకొకటి చాదస్తానికి పరాకాష్ట. నోములు అనే పేరు చెప్పి చాటలు, పసుపు కుంకుమ, మట్టి గాజులు పంచడం. ఎందుకివన్నీ?అవి ఇచ్చాక ఏం చేయాలో అర్ధం కాదు. నిజం గా చాటలు వాడతామా ? పసుపు అనేది ఒక ఖరీదయిన antispetic ఒకప్పుడు. డబ్బున్న వారు పేదవారికి పంచేవారు. ఇంకొకటి,ఇంటికి వచ్చిన ఆడవారికి పండు ఇవ్వాలి అంటారు . ఎందుకంటే ఆడది తను తినినా తినకపోయినా కుటుంబానికి పెడ్తుంది అని. మన పూర్వికులు అన్నీ ఆలోచించే కొన్ని సంప్రదాయాలు పెట్టారు. దాన్ని మనం అన్వయించుకోడం లో ఉంటుంది. trekking, hiking ,camping కోసం మన గుళ్ళు కొండల మీద కట్టారు. అవి మానేసి హాయిగా కార్లల్లో వీలైతే helicopter లో వెళ్ళడం, అక్కడే హోటల్ లో ఉండటం. ఏదైన ప్రకృతి విలయం జరగగానే దేవుడికి కోపం వచ్చింది అనటం. ఏ పని చేసినా ప్రకృతి ని పరిరక్షించడం అనేది ముఖ్యం అని మన ధర్మం చెప్తుంది. అది తప్పితే అన్నీ చేస్తాం మనం!!

Leave a Reply to Chandrika Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.