ఆడ పంట – మగ పంట- రామచంద్రుడు

మన సమాజంలో (గ్రామాల్లో, పట్టణాలలో) పనులు ఆడ పనులు, మగ పనులుగా విభజించబడ్డాయి. ఇంటి పనులు – వంట వండడం, నీళ్ళు తేవడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లలని పెంచడం – మొదలైన పనులన్నీ ఆడవాళ్ళు చేసే పనులుగా; డబ్బు సంపాదించడం, బయట పనులన్నీ చక్కబెట్టుకురావడం – మొదలైన పనులన్నీ మగవాళ్ళు చేసే పనులుగా సామాన్యంగా భావిస్తూ

ఉంటారు. ఐతే ఈ విభజన, ఈ భావజాలం, సమాజంలో మహిళలని అణచివేయడానికి, వారి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలని, అవకాశాలని, మానసిక వికాసాన్ని అణచడానికే అన్న అంశం స్పష్టమే… ఈ విభజనలో, ఒక ఆర్థిక సూత్రం ఇమిడి ఉంది. ఉదాహరణకి, వంట ఆడవాళ్ళు చేసే పని (ఇంట్లో). అదే పని, బయట (ఏదైనా హోటల్లో) చేసేది సామాన్యంగా మగవాళ్ళే. అంటే, వేతనం/కూలి/ఆదాయం లేని సందర్భంలో ఏదైనా పని ఆడవాళ్ళు చేస్తే, అదే పని ఆదాయాన్ని అందచేసే సందర్భంలో మగవాళ్ళు చేస్తున్నారు. పైకి మాత్రం, ఇది – ఆడవాళ్ళు (ఆడ పని) చేసే పని, మగ వాళ్ళు (మగ పని) చేసే పని అంటాం.

మెదక్‌ జిల్లాలో, కొన్ని గ్రామాలలో పంటలని ఆడ పంటగా, కొన్ని పంటలని మగ పంటగా గుర్తిస్తారు. ఆహారాన్ని అందించే పంటలన్నీ ఆడ పంటలు. ఆదాయాన్ని అందించే పంటలన్నీ మగ పంటలు. చిరుధాన్యాలు – కొర్రలు, రాగులు, జొన్నలు మొదలైనవి ఆడ పంటలు. పత్తి, చెరకు లాంటివి మగ పంటలు. ఈ అవగాహనలో ఒక అంతరార్ధం ఉంది. అది వ్యవసాయాన్ని, ఎవరు ఏ దృష్టి కోణంలో చూస్తారు? అన్న విషయాన్ని సూచిస్తుంది. ఐతే, వ్యవసాయంలో, ఆడ పంట, మగ పంటల విభజన – మహిళలకు ఉపయోగపడుతోందా?

వ్యవసాయం సంక్షోభంలో ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. నిరంతరం కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనం. ఈ సంక్షోభం వెనక, పంటల విషయంలో, మనం చేస్తున్న నిర్లక్ష్యం కనబడుతోందా? వ్యవసాయంపై (ముఖ్యంగా పంటల విషయంలో) ఆడ రైతుల, మగ రైతుల ఆలోచనలో నిజంగా ఏమైనా తేడాలున్నాయా? ఉంటే, వాటిని గ్రహించామా? వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు పథకాలు, ప్రణాళికలు తయారుచేస్తున్నారా? వ్యవసాయంలో, మహిళా రైతుల పరిస్థితి ఎలా ఉంది? మహిళా రైతు కూలీల పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో మహిళా సంఘాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి కదా. వాటి ప్రభావం వ్యవసాయంపై ఏ విధంగా ఉంది? మహిళలకు వ్యవసాయ విధానంలో, పథకాలలో, ప్రణాళికలలో అగ్రతాంబూలం ఇస్తే, ఏవైనా మార్పులు వస్తాయా? ప్రస్తుతం చూస్తున్న సంక్షోభం తగ్గే అవకాశం ఉందా? దీనికి మార్గదర్శకమైన అనుభవాలు ఎక్కడైనా ఉన్నాయా? – ప్రశ్నల పరంపర. జవాబులే, అంతుపట్టటం లేదు…

ఈ వ్యాసంలో, మూడు అంశాలని ప్రస్తావిస్తాను –

1. వ్యవసాయంలో మహిళాపాత్ర ఏమిటి?

2. ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణాలో వ్యవసాయంలో గత దశాబ్దంలో జరిగిన మార్పులు

3. కొన్ని మంచి అనుభవాల నుండి నేర్చుకొనే గుణపాఠాలు

వ్యవసాయంలో మహిళాపాత్ర ఏమిటి?

ఈ విషయంపై పరిశోధన చేస్తున్న అనేక పరిశోధకులు చీa్‌ఱశీఅaశ్రీ జవఅ్‌తీవ టశీతీ ఔశీఎవఅ ఱఅ ూస్త్రతీఱషబశ్ర్‌ీబతీవ, దీష్ట్రబపaఅవరష్ట్రషaతీ వంటి సంస్థలు, ఇతరులు – అనేక పరిశోధనలు చేసి, మనకు తెలియచేసిన అంశాలని క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

1. వ్యవసాయంలో మహిళల పాత్ర గణనీయం. సాగు కోసం నేలని తయారుచేయడంలో 32%; విత్తనాల పరిశుద్ధి/తయారీలో 80%, పంటపోషణ/రక్షణ విషయంలో 86%; కోతలు ఆరపెట్టడం వంటి పనులలో 84% – మహిళల శ్రమే. ఐతే, వ్యవసాయంలో తీసుకొనే నిర్ణయాల విషయంలో పురుషులదే ఎక్కువ చొరవ. వారికే ఎక్కువ అవకాశాలు. (ఏ పంటలు పెట్టాలి, ఏ విత్తనాలు, ఎలాంటి సాధనాలు కొనాలి, ఎక్కడ అమ్మాలి – లాంటి విషయాలలో) మహిళ, పురుషుడు కలిసి తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువ అంశాలలో ఉన్నాయి.

2. సస్యరక్షణ, విత్తనశుద్ధి, నిల్వ : అంతర పంటల యాజమాన్యం, పశుపోషణ, కాయగూరల/తోటల పెంపకం – వంటి విషయాలలో, మహిళల జ్ఞానం, నైపుణ్యం, అనుభవం అపారం. ఐతే, వీటికి ఇంకా సరైన గుర్తింపు రాలేదు. తరతరాలుగా ఈ జ్ఞానం గ్రామాలలో మహిళలవల్లే కొనసాగుతోంది.

3. పశుపోషణ, కాయగూరల పెంపకం వంటి వ్యవసాయ సంబంధిత పనులలో కూడా ఇదే పరిస్థితి. మహిళలది ఎక్కువ శ్రమ, పురుషులది ఎక్కువ నిర్ణయాధికారం.

4. అన్ని పనులలో, వేతనాల విషయంలో మహిళా కూలీలకి ఇంకా పురుషులకన్నా తక్కువ కూలీలే. దీనివల్ల, మహిళలకి వ్యవసాయం నుండి ఆదాయం తక్కువ.

5. మహిళలకి భూమిపై హక్కు ఇంకా, పురుషులతో సమంగా లేదు.

ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణాలో వ్యవసాయంలో గత దశాబ్దంలో జరిగిన మార్పులు

పశ్చిమగోదావరి, కరీంనగర్‌, మెదక్‌, అనంతపూర్‌  జిల్లాలలో 2001 నుండి 2011 వరకు వ్యవసాయంలో జరిగిన మార్పులు క్రింది ుaపశ్రీవ చీశీ.1, 2 లలో ఉన్నాయి.

1. ఈ దశాబ్దంలో, అన్ని జిల్లాలలో వ్యవసాయదారులు తగ్గారు. నీటిపారుదల సదుపాయాలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయదారులు 26% తగ్గారు. కరువుతో పీడింపబడే అనంతపురంలో కూడా వ్యవసాయదారుల శాతం 22% తగ్గింది. కరీంనగర్‌లో కూడా 16% తగ్గింది. వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉన్న మెదక్‌లో అన్నింటికన్నా తక్కువశాతం (9%) తగ్గింది.

2. మహిళా వ్యవసాయదారుల శాతం అన్ని జిల్లాలలో తగ్గింది. పశ్చిమగోదావరి జిల్లాలో 37% తగ్గింది. మెదక్‌లో కేవలం 8% మాత్రమే తగ్గింది.

3. అన్ని జిల్లాలలో వ్యవసాయ కూలీల శాతం పెరిగింది. కరీంనగర్‌ జిల్లాలో అధికశాతం (35%) వ్యవసాయ కూలీలుగా మారారు. మహిళా వ్యవసాయ కూలీలు కూడా ఈ దశాబ్దంలో బాగా పెరిగారు.

4. పంట విస్తీర్ణం అన్ని జిల్లాలలో పెరిగింది. ఆహారపంటల విస్తీర్ణం అనంతపురంలో (23%), కరీంనగర్‌ (7%) జిల్లాలలో పెరిగింది. పశ్చిమగోదావరి (17%), మెదక్‌ (14%)లలో ఆహారపంటల విస్తీర్ణం తగ్గింది. వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

ఈ మార్పుల వల్ల, వ్యవసాయంపై ఆధారపడ్డవారి జీవితం, ముఖ్యంగా మహిళల పరిస్థితి ఏ విధంగా ప్రభావితమై ఉంటుంది? – ఒకసారి ఊహించండి.

మంచి అనుభవాల నుండి నేర్చుకొన్న గుణపాఠాలు

 

ుaపశ్రీవ చీశీ.1: జిల్లాలవారిగా 2001-2011 మధ్యలో జరిగిన మార్పులు (ఎంత శాతం పెరిగింది? ఎంత శాతం తగ్గింది?)

కరీంనగర్‌ మెదక్‌ అనంతపూర్‌ పశ్చిమగోదావరి

జనాభా 8% 14% 12% 4%

మహిళలు 9% 15% 13% 4%

గ్రామాలు 3% 0% 2% 4%

వ్యవసాయదారులు -16% -9% -22% -26%

మహిళా వ్యవసాయదారులు -19% -8% -26% -37%

రైతు కూలీలు 35% 18% 31% 12%

మహిళా రైతు కూలీలు 27% 14% 27% 8%

జవఅరబర 2001-2001, +శీI నుండి సంగ్రహించినది.

ుaపశ్రీవ చీశీ.2: పంటలలో మార్పులు – జిల్లాలలో పరిస్థితి

సంవత్సరం జిల్లా ఆహారపంటల విస్తీర్ణం ఇతర పంటల విస్తీర్ణం మొత్తం పంటల విస్తీర్ణం

2000-01 పశ్చిమగోదావరి 652526 44399 696925

2000-01 అనంతపూర్‌  216418 886438 1102856

2000-01 మెదక్‌ 526456 34109 560565

2000-01 కరీంనగర్‌ 476979 95153 572132

2010-11 పశ్చిమగోదావరి 540095 456000 996095

2010-11 అనంతపూర్‌  266104 4316000 4582104

2010-11 మెదక్‌ 455109 798000 1253109

2010-11 కరీంనగర్‌ 509114 888000 1397114

మార్పు %  పశ్చిమగోదావరి -17% 927% 43%

మార్పు % అనంతపూర్‌  23% 387% 315%

మార్పు % మెదక్‌ -14% 2240% 124%

మార్పు % కరీంనగర్‌ 7% 833% 144%

ూశీబతీషవ: నaఅస దీశీశీస శీట ూస్త్రతీఱషబశ్ర్‌ీబతీవ ూ్‌a్‌ఱర్‌ఱషర, +శీూూ, 2011

మంచి అనుభవాల నుండి నేర్చుకొన్న గుణపాఠాలు

మన దేశంలో, రాష్ట్రాలలో వ్యవసాయానికి సంబంధించి చాలా మంచి అనుభవాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ, డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం – వంటి స్వచ్ఛంద సంస్థలు మహిళలతో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అనేక ప్రయోగాలు, మహిళలతో కలసి, వ్యవసాయంలో చేసారు. ఈ అనుభవాల నుండి నేర్చుకొనే గుణపాఠాలు కొన్ని –

1. మహిళలకు భూమిపై హక్కు కల్పించాలి. మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేయాలి. మహిళల సంఘాలకు తగిన సహకారం అందించాలి. శిక్షణలు, నిధులు, అవకాశాలు ఇందులో ముఖ్యం.

2. పంట విషయంలో ప్రాధాన్యత ఆహారపంటలకే. సహజ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయ విధానం, ప్రకృతితో అనుసంధానం ఇందులో ముఖ్యం.

3. పంటలు, ఆరోగ్యాన్ని, ఆదాయాన్నీ, అధికారాన్నీ రైతులకే, ముఖ్యంగా మహిళా రైతులకే అందచేసే అవకాశం అపారంగా ఉంది. వ్యవసాయంలో సంక్షోభం ఈ రైతుల దరిదాపులకి కూడా రాకుండా చేసిన అనుభవాలివి.

4. ఈ మంచి పనులు, అనుభవాలు ప్రభుత్వ కార్యక్రమంగా రూపొందే అవకాశం కూడా ఉంది. ఐతే, ఈ భాగస్వామ్యం ఎగుడుదిగుడు దారిలో ప్రయాణంలా ఒడిదుడుకులతో కూడి, నిలకడగా బండి సాగదు. ఎప్పుడు దారితప్పుతామో, ఎప్పుడు ప్రయాణం ఆగుతుందో… తెలియదు.

ముగింపు

రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు చైతన్యవంతులు కావాలి. ఈ చైతన్యాన్ని రగిలించే బాధ్యత నిజాయితీ కలిగిన స్వచ్ఛంద సంస్థలే తీసుకోవాలి. చిన్న చిన్న అనుభవాలను విస్తృత స్థాయిలో వ్యాప్తి చేయగలిగిన శక్తిసామర్ధ్యాలు – ఈ స్వచ్ఛంద సంస్థలకి

ఉండాలి. ప్రభుత్వాలు నిజాన్ని నిజాయితీగా గుర్తించాలి. ప్రజలకి, మహిళలకి, వారితో కలసి పనిచేసేవారికి తగిన సహకారాన్ని అందించాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో