రేణుక అయోల
సాహిత్య లోకంలో
ఆమె పరిచయం
కొద్ది నెలలు కావచ్చు…..
స్నేహ హృదయాన్ని
అందిపుచ్చుకొన్నాను
ఎప్పుడు ఎదురొచ్చినా
నిండుగా నవ్వుల పువ్వులు వెదజల్లే
ఆ ఆత్మీతయను పదిలపరచుకొన్నాను
అందరితోపాటూ కలసీ
తలకోన అడవుల్లోనైనా
భూమిక ఆఫీసులోనైనా
మనతో పాటూ ఎన్నోసార్లు
కలసి నడచిన
ఆమె…
మన మధ్య లేదనుకుంటే
సన్నని కోత
ఆమె మనకు కనిపించకపోయినా
మనతో ఇమిడిన గతం
పదే పదే తలచుకొనేలా చేస్తుంది
స్నేహం విలువ చాలా గొప్పది
అది ఎప్పుడూ గతించదు
మన పరిచయాలు అక్షరాలే
మనమెంత తొందరగా
కలసిపోయి విడిపోయినా
దూరాలు పెంచుకొన్నా
మిగిలిపోయిన జ్ఞాపకాలు
పుస్తకాల మధ్య
పేజీల కొమ్మల చివర్న
సజీవంగా గుర్తుండిపోయే
ఆమెకో అక్షర నివాళి
(భార్గవీరావుగారి స్మృతిలో)
భార్గవీ రావు గారి సాహిత్య కృషి, వన్నెకెక్కినది.కన్నడ సాహిత్యాన్ని, తెలుగువారికి,
పరిచయము చేసారు. అటువంటి సాహితీ దీక్షా పరులుకు, నివాళి!!!
భూమిక ,,, అడ్రసు, ఇప్పుడే,దొరికినది.
థాంక్యూ!