సహనం సంయమనం కలగలిసిన కదంబానివి
సంస్కృతీ సభ్యతల నిజబింబానివి
మాయని విలువల సంకేతానివి
మానవతకి నిక్కమైన ఊతానివి
ఏ దేశపు గౌరవానికైనా గీటురాయివి నీవు!
ప్రేమకు ప్రియనేస్తానివి
మమకారపు మరో రూపానివి
అన్ని బంధుత్వాలకు కేంద్ర బంధువువి
మనిషికీ మనిషికీ మధ్య మనోహర వారధిని నీవు!
మాడే కడుపుతో పరమాన్నం తినిపిస్తావు
మండే గుండెలతో మధురసాలందిస్తావు
అరిగిపోతూ మాకొక ఆకృతినిస్తావు
అలసటెరుగక మా భవితకు పునాదులేర్పరుస్తావు
లోకమనే నందనవనాన వెలసిన ఆనంద గంధానివి నీవు!
ఆత్మీయ సేవలతో అలరించే అపురూపమైన తల్లివి!
ఆప్యాయతా రాఖీతో బంధించే బంగారు చెల్లివి!
అనుక్షణం జీవితాన్ని రసభరితం జేసే ప్రియ సఖివి!
ఆసరాగా నిలిచి వాత్సల్యం పంచే ముద్దుల పాపవి!
ఎన్నెన్నో రూపాలతో నా చుట్టూ అల్లుకున్న ఆద్యంతానివి నీవు!
ఓ స్త్రీ మూర్తీ!
నిన్నావిష్కరించడంలో యధార్ధానికి నేనశక్తుణ్ణి!
నీవైనా చేయగలవా యథాతథంగా నీ పరిచయాన్ని?
-
Recent Posts
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
- వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు – డా. సమ్మెట విజయ
- వారసుడే కావాలా? – డా. ఆవుల రేణుక
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
