ఒకరికి ఒకరు యం. అనిత, 8వ తరగతి, సమత నిలయం

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పేరు రామాపురం. పచ్చని పొదలతో నిండి ఉంటుంది. ఒక రోజు వర్షం పడుతుండగా ఒక ముసలి తాత చెట్టు కింద కూర్చొని మూలుగుతున్నాడు. ఆ తాత పేరు రాజయ్య. అలాగే చెట్టు కింద ఉండిపోయాడు. ప్రొద్దున పిల్లలు బడికి వెళుతుండగా ఆ తాతని చూసారు. పాపం ఎంతో బాధ పడుతున్నాడు. మనము అందరం కలసి హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం అని అనుకున్నారు. తాత దగ్గరికి వెళ్ళి  తాతా ఏమైంది అని అడిగితే మాట్లాడే పరిస్థితిలో లేడు. వెంటనే నీరు తెచ్చి ఇచ్చారు. నీరు తాగాక ఆటోని పిలిచి ఆటోలో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు. డాక్టరు గారు వైద్యం చేస్తారా అని పిల్లలు డాక్టర్‌ని అడిగారు. ఏమైంది అని అతనిని చూశాడు డాక్టర్‌. అతనికి బాగుందా అని పిల్లలు అడిగారు. బాగానే ఉన్నాడు కాని సరిగ్గా నీరు, అన్నం లేక అలా అయ్యాడు. అందుకే అతనికి ఆరోగ్యం బాగోలేదు. సరే డాక్టరు తాతని చూసుకోండి మేము బడికి వెళ్ళి సాయంత్రం వస్తాము అంటూ పిల్లలు చెప్పి వెళ్ళారు. పిల్లలు బడికెళ్ళే సరికి 11 గంటలు అయింది. సార్‌ ఏమయింది ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగారు. సార్‌ దారిలో ఒక ముసలితాత చెట్టుకింద కూర్చుని బాధపడుతుంటే మేము వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి చూపించామండి. ‘ఓ అలాగా సరే పదండి క్లాస్‌కి’.

సాయంత్రం అయింది. పిల్లలు హాస్పిటల్‌కి వెళ్ళారు. ‘తాతగారు ఎలా ఉన్నారు డాక్టర్‌’ అని డాక్టర్‌ని అడిగారు. ‘మీరు వెళ్ళాక కళ్ళు తెరిచారు. అప్పటినుంచి బాగానే ఉన్నారు’. థాంక్స్‌ డాక్టర్‌ గారూ మేము తాత గారిని తీసుకువెళ్ళవచ్చా అని అడిగారు. అలాగే తీసుకు వెళ్ళండి అన్నారు డాక్టర్‌. ఆ మాట విన్న తాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. పద తాత మీ ఇంటికి తీసుకెళ్తాం అన్నారు. నా ఇంటికా అదెక్కడా అన్నాడు తాత. ఎవరూ ఉండరు. మా ఇంట్లో బామ్మ గారు ఉంటారు. మేము కూడా మీలాగే. బామ్మకి మేము. మాకు బామ్మ అంటూ ఒకరికి ఒకరం కలిసి మెలిసి ఉంటాము. మా బామ్మ అడిగింది. ఎవరు ఇతను అని అడిగితే బామ్మ అది చెట్టుకింద కూర్చొని బాధపడుతుంటే హాస్పిటల్‌కి వెళ్ళి చూపించాము అలాగే పిల్లలు అని వాళ్లని ఆ తాతని బాగా చూసుకున్నారు. అతనిని బాగా చూసుకున్నారు. అందరు కలసి అన్నం తిని పడుకున్నారు. ప్రొద్దున లేచి స్నానాలు చేసి అన్నం తిని తాతని బాగా చూసుకో అని బామ్మకి చెప్పి బడికి బయలుదేరారు. స్కూల్లో ప్రార్థన చేసేటప్పుడు పిల్లలందరిని పిలిచి మొత్తం చెప్పారు పిల్లలందరు టీచర్లు, సార్లు ఎంతో బాగా మెచ్చుకున్నారు. పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. సాయంత్రం అయింది. అందరు కలసి ఇంటికి వెళ్ళి పోయారు. పిల్లలందరు కలిసి ఆడుకొని రాసుకొని అన్నం తిని పడుకున్నారు. తెల్లవారింది. అందరు లేచి స్నానాలు చేసి అన్నం తిన్నారు. పిల్లలందరు కలిసి బామ్మ తాత గారు ఇవాళ్ల ఆదివారం కదా ఎక్కడికైనా వెళ్దాం ప్లీజ్‌ అని అడిగారు. ఎండ బాగా ఉన్నది కదరా ఇప్పుడు వద్దు అని బామ్మ అంటే పిల్లలు వినలేరు. ఆ వెళ్దాం తాత అంటే సరే వెళ్దాం అని ఆటోని పిలిపించుకొని అందరు కలిసి వెళ్ళారు. అక్కడ చాలా రకాల పూలమొక్కల తోట చెట్లు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు ఉన్నాయి. అక్కడి నుండి ఒక పెద్ద తోట దగ్గరికి వెళ్ళారు. రకరకాల పక్షులు, జంతువులు జింక నెమలి కుందేలు వంటివి ఎన్నో రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. వాటిని చూసి పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. ప్రక్కన ఒక పెద్ద గుట్ట ఉంది ఆ గుట్ట దగ్గరికి వెళ్దాం అని అన్నారు పిల్లలు. సరే అని అందరు కలిసి వెళ్ళారు. పిల్లలకి ఎంతో బాగా గుట్ట నచ్చేసింది అలాగే పక్కన పెద్ద చెరువు ఉంది దాని చూసి ఎంతో సంతోషపడ్డారు. ఇక సాయంత్రం అయింది. అందరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కలసి ఇంటికి వెళ్ళారు.

మలుపు

నీ మొదటి మలుపు
నిన్ను మేలు కొలుపు
అదేంటో తెలుసా… నీకు
అక్షర జ్ఞానం దార పోయడం
నీ రెండో మలుపు
నిన్ను ఆనంద పరుచు
అదేంటో తెలుసా…
పదిలో పాసవ్వడం
నీ మూడో మలుపు
నిన్ను గర్వ పరుచు
అదేంటో తెలుసా… నీ ఉద్యోగం
గొప్ప సంపద
నీ నాల్గో మలుపు
నిన్ను కించపరుచు
అదేంటంటే నీ దురాలోచన
నీ చెడు ప్రవర్తన
ఇక్కడే అంతా బోల్తా పడుతున్నది
డబ్బెంతున్నా, గొప్ప వాడివైనా
ఉప్పొంగకుండా మంచివైపు
లక్ష్యం వైపు అడుగేస్తూ పోతే
విజయం ఎంత దూరమున్నా
నిన్ను వెతుకుతూ…
నీ వెంటే వస్తుంది.
నిన్ను చేరుకుంటుంది.
లేకపోతే,
నదిలా దాహం తీర్చినప్పటికీ
చివరికి
సముద్రంలో కలవడమే…
ఎవరికీ పనికిరాని వాళ్ళలా….
ఏం చేస్తావో… నీ జీవితం
నీ చేతుల్లోనే….
జి. సాయితేజ, 10వ తరగతి, సమత నిలయం.

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో