ఆర్‌.టి.ఐ. చట్టం

సెంట్రల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ (కేంద్ర సమాచార కమిషన్‌) (సిఐసి), రాష్ట్ర సమాచార కమిషన్‌ / స్టేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ (యస్‌ఐసి) లకు సెక్షన్‌ 18 సమాచార హక్కు చట్టంననుసరించి ఫిర్యాదు చేయబడిన అధికారిపై విచారణ జరిపే హక్కును పొందియున్నవి. ఇందులో అధికారులపై అనగా ప్రభుత్వ సంస్థ, పబ్లిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ఆఫీసర్‌ (పిఐఓ), మొదటి అప్పిలేట్‌ అథారిటీలు (ఎఫ్‌.ఎ.ఎ.) సమాచార హక్కు చట్టంననుసరించి తీసుకోదగిన సమాచారాన్ని ఇవ్వడంలో దరఖాస్తుదారుడికి/అప్పీలెంట్‌లకు సమస్యలు సృష్టించినట్లయితే పైన పేర్కొన్న అధికారులపై విచారణ చేసి, చర్య తీసుకోవడం జరుగుతుంది.

ఫిర్యాదు చేయవలసిన పరిస్థితులు :

ప్రభుత్వ సంస్థ ద్వారా పిఐఓ లేదా ఎపిఐఓ లేదా ఎఫ్‌ఎఎలు నియమించబడకపోయినట్లయితే   పిఐఓ/ఎపిఐఓ/ఎఫ్‌ఎఎ లు దరఖాస్తు/ అప్పీలును స్వీకరించడాన్ని తిరస్కరిస్తే

–  చట్టప్రకారం నిర్దేశించిన కాలపరిమితి లోపల పిఐఓ, ఎఫ్‌ఎఎ లు సమాధానాన్ని అందించకపోయినట్లయితే

–  పిఐఓ నుంచి వచ్చిన సమాచారం పట్ల మీరు అసంతృప్తితో ఉన్నా, సంబంధించినది కాదు/అసంబద్ధమైన, చదవడానికి వీలులేని, తప్పుద్రోవ పట్టించేలా ఉన్న, అస్పష్టంగా ఉన్న, తప్పుడు/అబద్దపు సమాచారం, లేదా అసంపూర్తిగా ఉన్న సమాచారం మొదలగునవి సమాచారాన్ని ఇవ్వడానికి తప్పుగా, న్యాయసమ్మతంకాని పద్ధతులలో తిరస్కరించినపుడు

–  దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వడానికి ఈ చట్టంలోని రూల్స్‌నందు ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు నిర్దేశించిన రుసుము కన్నా ఎక్కువ చెల్లించమన్నపుడు

–  పిఐఓ/ఎపిఐఓలు ప్రత్యక్షంగా లేదా పోస్ట్‌ ద్వారా సంప్రదించడానికి/కలవడానికి అందుబాటులో లేకుండా, అతని ఉనికి గుర్తించడం కష్టసాధ్యమైనపుడు ముఖ్యంగా ప్రముఖంగా కన్పించనపుడు

– ఈ చట్టంలోని సెక్షన్‌ 4(1) ననుసరించి సమాచారాన్ని సానుకూలంగా వెల్లడిచేయకపోతే లేదా అది ప్రజలకు సులభంగా అందుబాటులో/తెలుసుకొనేలా ఏర్పాటు చేయనట్లయితే

– పిఐఓ/ఎఫ్‌ఎఎ పబ్లిక్‌ సంస్థకు చెందిన రికార్డుల పరిశీలన నిమిత్తం దరఖాస్తుదారుడు/అప్పిలెంట్‌ చేసిన విజ్ఞప్తిని సరియైన కారణాలు లేకుండా/తప్పుడు పద్ధతులలో తిరస్కరిస్తే లేదా వాటిని పరిశీలించే సమయంలో అవసరమైన సహాయ సహకారాలందించకపోయినట్లయితే

–  ఈ చట్టం నుంచి దరఖాస్తుదారుడు సంక్రమించిన హక్కులను వినియోగించుకోవడాన్ని పిఐఓ, ఎఫ్‌ఏఏ లేదా ఇతరులెవరైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అడ్డుకున్నా, తిరస్కరించినా లేదా అవమానపరచినా, లేదా వాటిని పొందకుండా ఒత్తిడికి గురిచేసినట్లయితే

కేంద్ర/రాష్ట్ర సమాచార కమిషన్‌ల ఉత్తర్వులను పిఐఓ/ఎస్‌ఎఎలు బేఖాతరు చేసినట్లయితే

– ఈ చట్టం ప్రకారం సమాచారం పొందగల హక్కు కలిగియున్న పౌరుడిని ఆ హక్కు వినియోగించుకోనీయకుండా తప్పుడు పద్ధతులలో నిర్భంధించిన/తిరస్కరించిన ఏ విధమైన ఇతర పరిస్థితులలోనైనా

–  ప్రభుత్వ సంస్థ, పిఐఓ లేదా ఎఫ్‌ఎఎలు ఈ చట్టంలోని ప్రోవిజన్స్‌ను అతిక్రమించినట్లయితే వీటిలో ఏది జరిగినా మీరు సిఐసి/ఎస్‌ఐసిలకు ఫిర్యాదు చేయవచ్చు.

రాష్ట్ర సమాచార కమీషన్‌

గ్రౌండ్‌ ఫ్లోర్‌, అసెంబ్లీ ఎదురుగా, హాకా భవన్‌, హైద్రాబాద్‌ – 500 004.

ఫోన్‌. 040 – 23230596/040-27674114/9866773624

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.