ప్రపంచ మానవ హక్కుల ప్రకటన

1948 డిసెంబర్‌ 10 తేదీ సర్వ పత్రినిధి సభ తీర్మానం 217-ఎ/(3) ద్వారా ఆమోదించి, అధికారికంగా పక్రటించినట్టిది. మానవ జాతి అంతా ఒకే కుటుంబం. ఈ కుటుంబంలోని వారందరికీ స్వతస్సిద్ధమైన గౌరవం వుంటుంది. వీరికి సమాన హక్కులుంటాయి.  ఈ హక్కులను అన్యాకాంతం చేయడానికి వీలులేదు. ఈ అంశాల గుర్తింపు పప్రంచంలో స్వేచ్ఛకూ, న్యాయానికీ, శాంతికీ పునాది వంటిది.

మానవ హక్కుల ఉపేక్ష, ధిక్కారం ఆటవిక చర్యలకు దారి తీస్తాయి. ఈ చర్యలు మానవాళి ఆత్మగౌరవాన్ని తీవ్ర సంక్షోభానికి గురి చేస్తాయి. ప్రజలు వాక్స్వాతంత్య్రాన్నీ, మత స్వేచ్ఛనూ అనుభవిస్తూ నిర్భయంగా లేమి బాధ లేకుండా మనుగడ సాధించగలగాలి. అటువంటి నూతన ప్రపంచం ఆవిర్భవించాలనేది జనసామాన్యం ఆకాంక్షించే వాటిలోకెల్లా అత్యున్నతమైనదిగా రూఢి అయింది.

ప్రజలు మార్గాంతరం లేనప్పుడు నిరంకుశత్వం మీదా, అణిచివేత మీదా తిరుగుబాటు చేయడం తప్పనిసరి అయ్యే పరిస్థితి ఏర్పడకుండా నివారించాలంటే, మానవ హక్కులను న్యాయశాస్త్ర నియమాల ద్వారా పరిరక్షించడం ఎంతైనా అవసరం.

వివిధ దేశాల మధ్య మైత్రీ సంబంధాల పెంపుదల ఎంతో ముఖ్యం. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల ప్రజలు తాము రూపొందిం చుకున్న పత్రం (చార్టర్‌) లో ప్రాథమిక మానవ హక్కుల పట్ల, ఆత్మగౌరవం పట్ల, స్త్రీ పురుషుల సమాన హక్కుల పట్ల తమకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. విస్తృత స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాజిక ప్రగతినీ, ఉత్తమ జీవన ప్రమాణాలనూ పెంపొందించడానికి కృతనిశ్చయులయ్యారు.

ఐక్యరాజ్యసమితి సహకారంతో సభ్యదేశాలు మానవ హక్కులనూ, ప్రాథమిక స్వేచ్ఛలనూ సార్వత్రికంగా గౌరవించి పాటించేటట్లు చేయడానికి ప్రతిజ్ఞ తీసుకున్నాము.

ఈ ప్రతిజ్ఞ పూర్తిగా కార్యరూపం ధరించాలంటే ఈ హక్కుల గురించీ, స్వేచ్ఛల గురించీ అందరికీ అవగాహన వుండడం అత్యంత ప్రధానం.

అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ ప్రపంచ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. అన్ని దేశాల ప్రజలందరూ సాధించాల్సిన లక్ష్యాలను ఇది తెలియజేస్తుంది.

ఈ ప్రకటనను దృష్టిలో వుంచుకొని ప్రతి వ్యక్తీ, ప్రతి సంస్థా ఈ హక్కుల పట్ల, స్వేచ్ఛల పట్ల గౌరవ భావం పెంపొందించాలి. ఇందుకు తగిన విధ్యాబోధనలను సాధనంగా చేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రగతిశీల చర్యల ద్వారా సభ్య దేశాల ప్రజలు వీటిని సార్వత్రికంగా, పటిష్టంగా గుర్తించేటట్లూ, పాటించేటట్లూ చేయాలి.

ఆర్టికల్‌ 1 :  మానవులందరూ జన్మతః స్వతంత్రులు. గౌరవ రీత్యా, హక్కుల రీత్యా సమానులు. హేతువు మరియు అంతఃకరణము కలిగి ఉండి ఒకరితో ఒకరు సౌభ్రాతృత్వ భావనతో మెలగాలి.

ఆర్టికల్‌ 2 :  ప్రతీ మనిషీ ఈ ప్రకటనలో చేర్చబడ్డ అన్ని హక్కులూ, స్వేచ్ఛలు కలిగి ఉంటాడు. అలా కలిగి ఉంటానికి – జాతి, రంగు, లింగభేదం, భాష, మతం, రాజకీయ లేక ఏ ఇతరమైన స్వంత  ఉద్దేశ్యాలు కలిగి ఉండటం, జాతీయ లేదా సామాజిక మూలాలు, ఆస్తులు, పుట్టుక లేదా స్థితి – ఇలాంటివి ఏవీ కూడా అడ్డు రాగూడదు. భేద భావము చూపకూడదు.

ఇంకా, ఆ వ్యక్తి ఉంటున్న (నివసిస్తున్న) లేదా, తాను ఏ దేశం లేక ప్రదేశానికి చెందుతాడో ఆ ప్రదేశం యొక్క రాజకీయ, అధికార, అంతర్జాతీయ స్థితిని బట్టి ఆదేశం లేదా ప్రదేశం స్వాతంత్య్రమున్న దేశామా, అస్వతంత్రమా, ట్రస్టుచే నడపబడుతుందా, లేక సార్వభౌమాధికారం లేకుండా ఉన్నదా అనే భేదభావం లేకుండా చూడబడాలి.

ఆర్టికల్‌ 3 :  ప్రతీ ఒక్క వ్యక్తికీ, స్వేచ్ఛతో భద్రంగా జీవించటానికి హక్కు ఉన్నది.

ఆర్టికల్‌ 4 :  ఏ మనిషీ బానిసలా లేదా దాస్యంలో ఉండగూడదు. బానిసత్వం, బానిస వర్తకం అన్ని రూపాలలోనూ నిషేధించబడాలి.

ఆర్టికల్‌ 5 :  ఏ మనిషీ – హింసాయుతమైన, కౄరమైన, అమానవీయమైన, హీనమైన ప్రవర్తనకు లేదా శిక్షకు గురికాకూడదు.

ఆర్టికల్‌ 6 :  చట్ట ప్రకారం ప్రతి ఒక్కరికీ, మనిషిగా (వ్యక్తిగా) గుర్తింపబడటానికి హక్కు ఉంది.

ఆర్టికల్‌ 7 :  చట్టం ముందు అందరూ సమానులే. ఏ భేదభావం లేకుండా చట్టం చేత రక్షింపబడటానికి అందరూ అర్హులే. ఈ ప్రకటన ఉల్లంఘించబడినప్పుడు భేదభావం లేకుండా రక్షణకు, భేదభావం చూపటానికి ప్రేరేపణకు వ్యతిరేకంగా రక్షణకూ అందరూ అర్హులే.

ఆర్టికల్‌ 8 :  రాజ్యాంగం ద్వారా గాని, చట్టం ద్వారా గాని ఇవ్వబడిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు చేసే చర్యలకు, యోగ్యమైన జాతీయ న్యాయ స్థానాల ద్వారా సరైన న్యాయం పొందటానికి ప్రతీ వ్యక్తికీ హక్కు ఉంది.

ఆర్టికల్‌ 9 :  ఎవరినైనా యధేచ్ఛగా ఖైదు చేయటానికి, నిర్భంధించటానికి, దేశ బహిష్కరణ చేయటానికి హక్కు లేదు.

ఆర్టికల్‌ 10 :  ఒక వ్యక్తి యొక్క హక్కులు మరియూ విధులూ నిర్ణయించటంలో మరియూ అతనికి వ్యతిరేకంగా నేరారోపణలను నిర్ణయించటంలో – ఒక స్వతంత్రమైన, నిష్పాక్షికమైన న్యాయసభ (ట్రిబ్యునల్‌) చే న్యాయ, బహిరంగ విచారణ జరిపించటానికి ప్రతీ వ్యక్తీ సమానమైన హక్కు కలిగి ఉంటాడు.

ఆర్టికల్‌ 11 :  తన రక్షణ కోసం అన్ని గ్యారంటీలు ఉన్న బహిరంగ విచారణలో చట్టం ద్వారా నేరస్థుడని నిరూపించబడేంతవరకు, శిక్షింపదగ్గ నేరం చేసాడని ఆరోపణ చేయబడిన ప్రతీ వ్యక్తీ నిరపరాధిగా తలచబడటానికి హక్కు కలిగి ఉన్నాడు.

ఏదో ఒక చర్య చేయటం వల్ల లేదా చేయకపోవటం వల్ల నేరం జరిగినప్పుడు – జాతీయ అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ సమయంలో అది శిక్షార్హమైన నేరం కానప్పుడు – ఎవరూ నేరస్థునిగా పరిగణింపబడగూడదు. ఆ నేరం జరిగిన సమయములో అమలులో ఉన్న పెనాల్టీ కంటే ఎక్కువ వేయగూడదు.

ఆర్టికల్‌ 12 :  ఎవరూ కూడ ఇంకొక వ్యక్తి యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఇంటి, ఉత్తర ప్రత్యుత్తరాలలో యధేచ్ఛగా జోక్యం కలగజేసుకోకూడదు. ఇంకొక వ్యక్తి గౌరవ మర్యాదల మీద దాడి చేయకూడదు. ఇటువంటి జోక్యాలలో లేదా దాడులలో చట్ట రక్షణ కలిగి ఉండటం ప్రతి ఒక్కరి హక్కు.

ఆర్టికల్‌ 13 :  1) ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల స్వేచ్ఛగా తిరిగే హక్కు, నివాసముండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. (2) ఏ దేశమైనా (స్వంత దేశంతోపాటు) వదిలి వెళ్ళే హక్కు తిరిగి తన దేశానికి మరలి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

ఆర్టికల్‌ 14 :  1. మతహింసకు, పీడనకు దూరంగా మిగిలిన దేశాలలో ఆశ్రయం పొందే హక్కు అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

2. రాజకీయేతర నేరాలలో వచ్చే అభియోగాలకు (దోషారోపణలకు), లేదా ఐక్యరాజ్యసమితి యొక్క సూత్రాలకు, ప్రయోజనాలకూ విరుద్ధమైన చర్యలకూ పై హక్కు వినియోగించబడగూడదు.

ఆర్టికల్‌ 15 :  1. ఒక జాతీయత కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.

2. ఎవరూ కూడ వారి జాతీయతకు మిగిలిన వారి ఇష్టానుసారంగా – దూరం చేయబడకూడదు. లేక వారి జాతీయతను మార్చుకొనే హక్కు నుండి ఎవరూ దూరం చేయబడకూడదు.

ఆర్టికల్‌ 16 : 1. జాతి, జాతీయత, మతం యొక్క పరిమితులు లేకుండా, వివాహ వయస్సులో ఉన్న స్త్రీ, పురుషులు పెళ్ళి చేసుకోటానికి, కుటుంబం ఏర్పరచుకోటానికి హక్కు కలిగి ఉంటారు.

2. స్వేచ్ఛ మరియూ పూర్తి సమ్మతితో ఉన్న, పెళ్ళి చేసుకోవాలనుకునే జంటల మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది.

3. కుటుంబం అనేది – సమాజానికి ఒక స్వాభావికమైన మరియూ మౌలికమైన యూనిట్‌. సమాజం చేత, మరియూ రాజ్యం చేత రక్షించబడే హక్కు కుటుంబానికి ఉంటుంది.

ఆర్టికల్‌ 17 : 1. ఒంటరిగా గాని, ఇతరులతో కలిసి గాని, ఆస్తి కలిగి ఉంటానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.

2. ఎవరైనా గాని యథేచ్చగా వారి ఆస్తి నుండి దూరం చేయబడగూడదు.

ఆర్టికల్‌ 18 : ప్రతి ఒక్కరికీ, భావ, అంతఃకరణ మరియూ మత స్వేచ్ఛలను కలిగి ఉండే హక్కు ఉంటుంది. ఈ హక్కులో భాగంగా – మతాన్ని, విశ్వాసాన్ని మార్చుకునే హక్కు

ఒంటరిగా గాని, సమూహంతో కలిసి గాని, బహిరంగంగా గాని, అంతర్గతంగా గాని, తన మతాన్ని లేక విశ్వాసాన్ని బోధించే, పాటించే, పూజించే, ఆచరించే హక్కు ఉంటుంది.

ఆర్టికల్‌ 19 : ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. ఈ హక్కులో భాగంగా – ఎవరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండటం, సరిహద్దులకు సంబంధం లేకుండా, సమాచారం మరియూ భావాలు మీడియా ద్వారా ఇచ్చి పుచ్చుకోవటం (హక్కుగా) ఉంటాయి.

ఆర్టికల్‌ 20 : 1. స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశమవటానికి, కలవటానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.

2. ఒక సంఘానికి సంబంధించిన వానిగా ఉండమని ఎవరూ బలవంతపెట్టగూడదు.

ఆర్టికల్‌ 21 : 1. ప్రత్యక్షంగా గాని, స్వేచ్ఛగా ఎన్నుకోబడ్డ ప్రతినిధుల ద్వారా గాని, తన దేశం యొక్క ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

2. తన దేశం యొక్క ప్రభుత్వ సర్వీస్‌ల్లో సమానావకాశాలు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

3. ప్రభుత్వాధికారానికి ప్రజాభీష్టమే ఆధారంగా ఉంటుంది. సార్వజనీన ఓటు హక్కుచే జరిగే నియమిత కాల మరియు నిఖార్సయిన ఎన్నికల ద్వారా ఇది వెల్లడవుతుంది. ఈ ఎన్నికలు రహస్య ఓటింగ్‌ లేదా దానికి సమానమైన స్వేచ్ఛా ఓటింగ్‌ విధానం ద్వారా జరుగుతాయి.

ఆర్టికల్‌ 22 : సమాజ సభ్యునిగా ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత అనే హక్కు ఉంటుంది. జాతీయ కృషి మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా ఈ హక్కు అనుభవించే అర్హత ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. అంతేగాక ప్రతి దేశం దాని వ్యవస్థ, వనరుల స్థితిని బట్టి, ఆ వ్యక్తి గౌరవ మర్యాదలను కాపాడే మరియు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు అనుభవించటానికి, అతని వ్యక్తిత్వం స్వేచ్ఛగా వికసించటానికి వీలుగానూ, ఉండే హక్కుకు అర్హుడు.

ఆర్టికల్‌ 23 : 1. ప్రతి ఒక్కరూ పని చేయటానికి, పని ఎన్నుకునే స్వేచ్ఛ, న్యాయమైన, అనుకూలమైన పని పరిస్థితులు మరియు ఉద్యోగ భద్రత  కలిగి ఉంటారు.

2. ‘సమాన పనికి, సమాన వేతనం’ అనే హక్కు ప్రతి ఒక్కరూ, వివక్ష లేకుండా కలిగి ఉంటారు.

3. ప్రతి ఒక్కరూ, తాను మరియూ తన కుటుంబం గౌరవ మర్యాదలతో జీవించటానికి సరిపడా, న్యాయమైన, అనుకూలమైన ప్రతిఫలం పొందే హక్కు కలిగి ఉంటారు. (అవసరమైతే, సామాజిక రక్షణకై ఉన్న ఇతర పద్ధతుల ద్వారా దీనిని సమకూర్చాల్సి ఉంటుంది).

4. తన స్వప్రయోజనాల రక్షణకు ప్రతి వ్యక్తీ సంఘాన్ని స్థాపించే మరియూ సంఘంలో చేరే హక్కు కలిగి ఉంటారు.

ఆర్టికల్‌ 24 : ప్రతి ఒక్కరూ విశ్రాంతికి, ఖాళీ సమయానికి, పని గంటల పరిమితికి (సహేతుక) జీతంతో కూడిన సెలవులకూ (నియమిత కాలంలో) హక్కు కలిగి ఉంటారు.

ఆర్టికల్‌ 25 : 1. తనకూ, తన కుటుంబానికీ ఆరోగ్యం, ఆనందమూ కలిగేలా జీవన ప్రమాణాలు ఉండే హక్కు ప్రతీ ఒక్కరూ కలిగి ఉంటారు. ఈ హక్కులో భాగంగా ఆహారం, వస్త్రాలు, గృహము, వైద్య సదుపాయము, అవసరమైన సామాజిక సేవలు ఉంటాయి. అంతేగాక, నిరుద్యోగంలో, జబ్బులో, చేతకానప్పుడు వైధవ్యం ప్రాప్తించినపుడు, పెద్ద వయస్సులో – ఇంకా తన అదుపులో లేని పరిస్థితుల వలన బతుకుతెరువు లేనప్పుడు, సామాజిక భద్రతా హక్కు ఉంటుంది.

2. మాతృత్వము మరియు బాల్యము: ప్రత్యేక జాగ్రత్త, సహాయం పొందటానికి అర్హులు. పిల్లలందరూ – వివాహ సంబంధంలో లేదా వివాహం లేకుండా జన్మించినా గాని, ఒకే విధమైన సామాజిక రక్షణ కలిగి ఉంటారు.

ఆర్టికల్‌ 26 : 1. విద్యాహక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రాథమిక, మౌలిక స్థాయిలలో విద్య ఉచితంగా ఇవ్వబడాలి. ప్రాథమిక విద్య నిర్బంధంగా ఉండాలి. సాంకేతిక మరియూ వృత్తి విద్య సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండాలి.

2. మానవ వ్యక్తిత్వ సమగ్ర వికాసానికి, మానవ హక్కుల, మౌలిక స్వేచ్ఛలపై గౌరవాన్ని బలోపేతం చేయటానికి విద్య నిర్దేశించబడాలి. దేశాల మధ్య, జాతి లేదా మత సంస్థల మధ్య అవగాహన, సహనం, స్నేహం పెంపొందించటానికి విద్య ఉపయోగపడాలి. ఇంకా, శాంతిని సమకూర్చటానికి, ఐరాస విద్యా కార్యకలాపాన్ని ముందుకు తీసుకుపోతుంది.

3. వారి పిల్లలకు ఏ రకమైన విద్యాబుద్ధులు నేర్పించాలో ఎన్నుకునే హక్కు ప్రథమంగా తల్లిదండ్రులకు ఉంటుంది.

ఆర్టికల్‌ 27 : 1. కళలను ఆనందించటానికి, శాస్త్ర విజ్ఞాన పురోగతి, దాని ప్రయోజనాలు పంచుకోవటానికి – సంఘం యొక్క సాంస్కృతిక కార్యకలాపాల్లో స్వేచ్ఛగా పాలుపంచుకొనే హక్కు ప్రతి వ్యక్తీ కలిగి ఉంటాడు.

2. తాను రచయితగా ఉన్న శాస్త్ర, సాహిత్య, కళల గురించిన పుస్తకాల యొక్క నైతిక మరియు భౌతిక విషయాలను రక్షించుకునే హక్కు ప్రతీ ఒక్కరూ కలిగి ఉంటారు.

ఆర్టికల్‌ 28 : ఈ ప్రకటనలో రూపొందించబడిన హక్కులూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలూ ఆవిష్కరించబడేటట్లుగా, సామాజిక మరియు అంతర్జాతీయ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ అర్హులవుతారు.

ఆర్టికల్‌ 29 : 1. స్వేచ్ఛాయుతమైన, సంపూర్ణమైన వ్యక్తి వికాసం ఎవరికైనా సంఘంలో మాత్రమే సాధ్యమవుతుంది. అట్టి సంఘం ఎడల ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి.

2. తమ హక్కులూ, స్వేచ్ఛలూ అందుకునేటప్పుడు – ప్రతి ఒక్కరూ కొన్ని పరిమితులకు లోబడి వుంటారు. ఇతరుల హక్కులూ, స్వేచ్ఛలూ గుర్తించటం మరియూ గౌరవించటం అనే ఏకైక ప్రయోజనం సాధించటానికి మరియూ న్యాయమైన నైతిక అవసరాలు, ప్రజా ఆదేశం, ప్రజాస్వామిక సమాజంలో సాధారణ సంక్షేమం – వీటిని తీర్చటానికి – ఆ పరిమితులు నిర్ణయించబడతాయి.

3. పై హక్కులూ, స్వేచ్ఛలూ ఎట్టి పరిస్థితులలోనూ ఐరాస సూత్రాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా వాడుకోబడగూడదు.

ఆర్టికల్‌ 30 : ఈ ప్రకటనలో ఏ భాగాన్నీ – ఒక దేశం, సమూహం లేదా వ్యక్తికి దీనిలో రూపొందించబడిన హక్కులూ, స్వేచ్ఛల నాశనానికి వీలు కల్పించే ఏ కార్యకలాపాలకూ ఎటువంటి హక్కునైనా కలుగజేస్తుందని అన్వయించరాదు.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.