డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు సాధారణంగా పరస్పరాధారాలు అనుకున్నారు. దీనిని బట్టి తెలిసేదేమంటే ప్రజాస్వామ్యన్ని ప్రోత్సహించే న్యాయబద్ద ప్రభుత్వం వుంటే మాత్రమే విశ్వజనీన మానవ హక్కులను అధికారికంగా పొందే అవకాశం ఉంటుంది. భారతీయ వార్తా పత్రిక దినోత్సవంగా జనవరి 29వ తేది గుర్తింపు పొందింది. 1780 జనవరి 29న జేమ్స్ ఆగస్టస్ హక్కి మొట్టమొదటి వార పత్రికగా ”హిక్కిస్ బెంగాల్ గెజిట్” కలకత్తా జనరల్ ఎడ్వర్‌టైజర్‌గా వెలువడి ఈస్టిండియ కంపెనీ పాలనా కాలంలో భారతీయ తొలి పత్రిక ఆవిర్భావానికి శ్రీకారం చుట్ట్టింది. నాటి ఈస్టిండియ కంపెనీ పత్రికలపై ఆంక్షలు విధించింది కానీ పత్రిక స్వేచ్ఛకు దోహదం చేయలేదు. హిక్కిస్ తన పత్రికా లక్ష్యాన్ని నాడే స్పష్టం చేసి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్య్రానంతరం మనదేశంలో కూడా (1) పరిపాలనా యంత్రాంగం (2) శాసన సభా (3) న్యాయ వ్యవస్థ (4) పత్రికా రంగం నాల్గవ ఎస్టేట్‌గా గౌరవం పొందుతోంది. రాజ్యాంగంలోని 19(1) ఎ ఆర్టికల్ పౌరులందరికి భావ ప్రకటన స్వేచ్ఛ, మరోవైపు ఆర్టికల్ 19 (2), (3), (4) క్రింద పత్రికలపై కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు విధించింది. 1952 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్. రాజ్యాధ్యక్ష అధ్యక్షతన మొదటి భారత్ ప్రెస్ కమీషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో నైతికత, సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారం తప్పుకాదు. పత్రికతో పాటు ఇతర వ్యాపారాలు ప్రారంభించి వాటిలో జరిగే అక్రమాలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించడం విపరీత పరిణామమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు ఆరోపించడం మనం రోజూ వింటున్న మాటలే!
ప్రజాస్వామ్యనికి నాలుగవ స్తంభంగా పరిగణిస్తున్న పత్రికా రంగం ఉన్నత విలువలకు కట్టుబడి ప్రజల పక్షాన నిలబడి పౌర హక్కులను కాపాడేందుకు, సమాజ అభ్యున్నతికి పాటుపడుతు ప్రజాస్వామ్య సమాజంలో ప్రజాభిప్రాయం రుపొందాలంటే అలాంటి చర్యలకు చక్కటి వేదికలుగా ఉపయెగపడేది పత్రికలే. ప్రజాస్వామ్యంలో ప్రజల భావాలకూ అభిప్రాయలకే ప్రాధాన్యం ఉంటుంది కనుక వారి భావాలు సహేతుకమైనవిగా, సర్వుల ప్రయెజనాలకు ఉపకరించేవిగా ఉండాలంటే పత్రికలు స్వేచ్ఛగా చర్చలు, వాదోపవాదాలు నిర్వహించాలి. ఏ ప్రజాస్వామ్య సమాజంలో అయినా పత్రికలు నాలుగు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి, నిర్వర్తించాలి.
1. సమాజంలో జరుగుతున్న సంఘటనల, పరిణామాల తాలకు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందచేయలి. ఈ సమాచారం సాధారణంగా వార్తలకే పరిమితమైనది.
2. తమకు చేరిన సమాచారంపై భాష్యం చెప్పాలి, లేదా సమాచారం ప్రాధాన్యతను పత్రికలు విశ్లేషించాలి. పత్రికలు ఈ కర్తవ్యాన్ని సంపాదకీయల రూపంలో వ్యాసాల రూపంలో ‘ఫీచర్’ రచనల రూపంలో నిర్వహిస్తాయి.
3. ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. మనకు వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాల వారికి అందచేయలి. అంటే పాతతరం నుంచి మనకు సంక్రమించిన సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక సంప్రదాయలను, విలువలను, సత్రాలను, ఆచరణలను రానున్న తరం వారికి స్పష్టంగా తెలపాలి. ఫలానా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు ఫలానా రాష్ట్రపతి ఇలా స్పందించారనీ, ఫలానా రాజకీయ సంక్షోభం ఎదురైనప్పుడు కేంద్ర మంత్రి వర్గం ఇలా వ్యవహరించిందనీ, ఫలానా రాజ్యాంగ సమస్యపై సుప్రీం కోర్టు ఇలా తీర్పు చెప్పిందనీ, ఫలానా గవర్నర్ వ్యవహరించిన తీరుకు రాష్ట్ర హైకోర్టు ఇలా స్పందించిందనీ పత్రికలు స్పష్టంగా తెలపాలి.
4. పౌరులకు వినోదం కలిగించడం, నిరంతరం ఆలోచన లతో, ఆందోళనలతో, భావమథనంతో నిండిన మనసులకు కాసేపు వినోదం కలిగించడం అవసరం. మానసిక ఉధృతిని తగ్గించడానికి ఇది అవసరం.
మనది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మన ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులైనప్పటికీ ప్రభుత్వాన్ని తమకున్న ఓటు హక్కుతో గద్దెదించగల పాటి చైతన్యం, విచక్షణా జ్ఞానం ఉన్నవారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలు చాలా పటిష్టమైనవి. అందుకే చదువురాని వారి సంఖ్య ఎక్కువైనా, బహు భాషలకు, సంస్కృతులకు, సంప్రదాయలకు, ఆచారాలకు, అలవాట్లకు, జాతులకు ఆలవాలమైన దేశం అయినప్పటికీ ప్రజాస్వామ్య విలువ ఏమిటో ఈ మూగజనానికి తెలుసు. రాజ్యవ్యవస్థ నాలుగో అంగంగా భావించే పత్రికారంగం కూడా మన దేశంలో పటిష్టమైందీ, విస్తృతమైందీ, భయరహితమైందీ, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించ గలుగుతోంది అని అంటారు. న్యుయార్క్‌లోని ఫ్రీడం హైజ్ అన్న సంస్థ నిర్వహించిన ఒక సర్వే ఫలితాల ప్రకారం ప్రపంచంలోని దేశాలన్నింటికెల్లా ప్తత్రికా స్వేచ్ఛ దండిగా ఉన్న దేశాల సంఖ్య కేవలం 69. మరో 51 దేశాలలో పత్రికా స్వేచ్ఛ పాక్షికంగానే అమలవుతుంది. 66 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ మచ్చుకైనా లేదు. ఈ దృష్టితో చూస్తే మన పత్రికా స్వేచ్ఛను చూసి మురిసిపోవాల్సిందే. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
భారతరాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రస్ఫుటంగా వ్యక్తం చేయనప్పటికీ పౌరులకున్న భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛ అమలవుతుంది. అసాధారణ పరిస్థితులలో తప్ప మనదేశంలోని పత్రికల స్వేచ్ఛను హరించే చట్టపరమైన ఆంక్షలు కానీ, న్యాయస్థానాలు విధించే విధినిషేధాలు కానీ, పార్లమెంటో, ప్రభుత్వవె గీసే లక్ష్మణరేఖలు గానీ లేవు. లేదా వారు ప్రాతినిథ్యం వహించే పత్రికలకు ముప్పుతప్పడంలేదు. జర్నలిస్టులను వేధించడం, బెదిరించడం, కొట్టడం, కడకు హతవర్చడం కూడా చూస్తూనే ఉన్నాం. జర్నలిస్టులకు ఈ శిక్షలు విధించేది వివిధ వర్గాలు, నేర ముఠాలు, తీవ్రవాదులు, మతోన్మాదులు, జాతి దురహంకారం తలకెక్కినవారు, కొన్ని సందర్భాలలో చట్టాన్ని అమలు చేయవలసిన బృహత్తర బాధ్యత తలకెక్కిన పోలీసులు ఎవరైనా కావచ్చు.పత్రికా రచయితలు మరొక రకమైన వేధింపును, ఆంక్షను కూడా భరించవలసి వస్తోంది. ప్రజా సంక్షేమమే పత్రికల లక్ష్యం అన్న పరవెదాత్తమైన వటను కాదనే పత్రికాధిపతులు ఎవరు కనిపించరు. కనీసం బహిరంగంగా ప్రకటించే సాహసం చేయరు. కానీ అదే ప్రజాశ్రేయస్సు దృష్టితో రచయితలు ఎంతటి మహత్తరమైన పరిశోధనాత్మక రచన చేసినా అది కనుక తమ ప్రయెజనాలకో, తమ వర్గం ప్రయెజనాలకో, తాము బలపరిచే రాజకీయపార్టీ ప్రయెజనాలకో భంగం కలిగిస్తుందనుకుంటే పత్రికాధిపతులు అలాంటి వార్తలు వెలుగు చూడకుండా సునాయసంగా భ్రుణహత్యకు పాల్పడగలరు. ఎంతటి మహోన్నతమైన పరిశోధనాత్మక పత్రికా రచన అయినా ఈ సకలవిధ ప్రయెజనాల మీదే గురిపెడితే పత్రికా స్వేచ్ఛ ఆ మేరకు కురచబారక తప్పదు. దీన్ని బట్టి పత్రికా స్వేచ్ఛ నిర్భంధమైంది కాదనీ దానికీ అవసరమైన, అనవసరమైన పరిధులు, పరిమితులు ఉంటాయని అర్థం అవుతోంది. ఏ స్వేచ్ఛా హద్దులు లేకుండా ఉండదు. ఉండకూడదు కూడా. కానీ ఈ పరిధుల్ని నిర్ణయించే మూలసూత్రం ఏమిటి? వాటిని ఎవరు నిర్ణయిస్తారు. ఎవరి ప్రయెజనాల పరిరక్షణకు నిర్దేశిస్తారు?
ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టగలిగితే మన పత్రికారంగం, విస్తృతార్ధంలో మీడియ స్వరూప స్వభావాలు బయటపడుతాయి. ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందనీ, ఆ సమాచారాన్ని ఇతరులకు బట్వాడా చేసే హక్కు కూడా ఉందనీ రాజ్యాంగం గుర్తించింది. అయితే ఈ హక్కును వినియెగించుకోవడం సులభసాధ్యం ఏమీ కాదు. ఇది కష్టసాధ్యం అయినప్పుడు పత్రికా రచయితల సత్యాన్వేషణా క్రమం క్లిష్టమైనదిగా భావించవచ్చు. అందుకే పత్రికలు హద్దు మీరుతున్నాయనీ, తమ స్వేచ్ఛను దుర్వినియెగం చేస్తున్నాయనీ, పౌరులకున్న ”ప్రైవసీ” హక్కును అతిక్రమిస్తున్నాయని విమర్శలు చెలరేగుతున్నాయి. సాదాసీదా పద్ధ్దతుల్లో సమాచారం సేకరించడాన్ని అవతలి పక్షంవారు అసాధ్యం చేసినప్పుడు నిత్య సత్యాన్వేషణావ్రతులైన పత్రికా రచయితలు భేదాభిప్రాయల్ని అనుసరించడం అనివార్యం అవుతోంది. ఇంతకాలం మన మీడియ స్వయం నియంత్రిత నైతిక నియమావళినే అనుసరిస్తోంది. హద్దు దాటుతున్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు. కానీ నియంత్రణ బాధ్యతను ఇతరులకు, లేదా ఇతర వ్యవస్థలకు అప్పగించడమంటే పత్రికా స్వేచ్ఛకు, మరో మాటలో చెప్పాలంటే ప్రజలకున్న సమాచార హక్కుకు, భావప్రకటనా స్వేచ్ఛకు అరదండాలు వేయడానికి అంగీకరించడమే. ఏ నియంత్రణా లేనప్పటికీ అడపాదడపా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ”వార్తా పత్రికలు లేని ప్రభుత్వం ఉండాలా లేదా ప్రభుత్వం లేని పత్రికలు ఉండాలా అని గనుక నిర్ణయించుకోవాల్సివస్తే నేను రెండోదాన్నే ఎంచుకుంటాను” అన్న అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ పత్రికా రచయితలను ఎలా లొంగదీసుకున్నారో గమనించాలి. పై మాటలు చెప్పిన పెద్ద మనిషే కొంతకాలం తార్వత ”పత్రికల్లో వచ్చేదాన్ని దేనినీ నమ్మలేం” అని కూడా సెలవిచ్చారు. ”స్వేచ్ఛను దుర్వినియెగం చేసే ప్రమాదం ఉన్నప్పటికీ నియంత్రణకు, అణచివేతకు అవకాశం ఉన్న పత్రికా వ్యవస్థకన్న, సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన పత్రికా వ్యవస్థనే కోరుకుంటాను” అన్న నెహ్రూ సైతం టైమ్స్ ఆఫ్ ఇండియలో తనను అదే పనిగా విమర్శించే ఎ.డి.గోర్వాలా రచనలను ఆపివేయిస్తే కానీ నిద్రపోలేదు. అభ్యంతరకరమైన పత్రికా వ్యవహారాల బిల్లు, డిఫెన్స్ ఆఫ్ ఇండియ రల్స్ అన్నవి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలను పటిష్టం చేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన నెహ్రూ హయంలోనే అమలులోకి వచ్చాయన్న వాస్తవాన్ని విస్మరించలేదు.
మీడియకు సంబంధించినంత వరకు పాఠకులు లేదా శ్రోతలు అంటే ప్రజలు వినియెగదారుల కింద మారిపోయరు. రాజ్యానికి సంబంధించిన మేరకు వారు వోటర్లకిందే లెక్క. మీడియ సంస్థలు అనుమతించిన మేరకే పత్రికా స్వేచ్ఛను వినియెగించు కోగలుగుతున్నామన్నది కఠినసత్యం. అన్ని రంగాల లోటు పాట్లను ఎత్తిచూపడానికి కంకణం కట్టుకున్నామంటున్న మీడియ తన ఆత్మపరిశీలనకైనా సిద్ధ్దంగా లేదు. వ్యక్తుల, రాజకీయ నాయకుల, కంపెనీల, ప్రభుత్వాల, వివిధ వ్యవస్థల లోటుపాట్లను ఎత్తిొచూపే మీడియ తనదాక ొమాత్రం ఆ వ్యవహారాన్ని అసలే దరిజేరనివ్వదు. పాలగుమ్మ సాయినాథ్ కొంతకాలం నడిపిన ”కౌంటర్ మీడియ” వంటి పత్రికలే మీడియ ఆత్మపరిశీలనకు దోహదం చేస్తాయి. కానీ కొరతంతా వాటిదే.
లాభాలకోసం అన్వేషించే మీడియ వ్యవస్థలకు, సమాచారం కోసం పరితపించేలా పాఠకుల, శ్రోతల ఆశలకు మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి సయెధ్య అసాధ్యం. చట్ట సభల సభ్యుల హక్కులను క్రోడీకరించాలనే నియంత్రణను స్వచ్ఛందానైనా అక్షరాలా అమలు చేస్తోందా? ఆస్కార్‌వైల్డ్ చెప్పినట్లు ”పత్రికా రచన చదవదగిందిగా లేదు. సాహిత్యం చదవరు” అన్న పరిస్థితి ఉన్నంతకాలం పత్రికా స్వేచ్ఛ మేడిపండుగానే మిగిలిపోతుంది. పరిశోధనాత్మక పత్రిక రచన విలువలకు పూర్తిగా కట్టుబడితే తప్ప ప్రజా ప్రయెజనాలను పరిరక్షించడంతోపాటు గీత దాటామన్న అపవాదును తప్పించు కోవడం సాధ్యం కాదు. ఇది స్వచ్ఛందంగానే జరగాలి.