అవును! పుత వ్యామోహం ఒక వ్యాధి – డాక్టర్‌ కత్తి పద్మారావు

అంతస్థులు పెరుగుతున్నాయి
అద్దాల కిటికీలు…
జింకను వేటాడుతున్న పులి బొమ్మ
ఆమె హాల్లో ఊగుతున్న ఊయలలో
కాళ్ళు ఆమె పెంపుడు కుక్క తలదాక వెళ్ళివస్తున్నాయి
వంట గదిలో మాంసం వేగుతోంది.
వంట మనిషి కుక్కలకి ఉడికీ ఉడకని మాంసం వేస్తుంది.
కుండీలో ఉన్న మొక్కలు వాడిపోతున్నాయి.

వారి ఉదరాలన్నీ పెరిగి ఉన్నాయి
వారెందుకు వికృతంగా ఉన్నారు
ఫ్రిజ్‌లో బీరు సీసాలతో పాటు
ఓడ్కా, విస్కీ మూలుగుతున్నాయి.
సిగరెట్లు తాగి తాగి వారి పెదాల్లో
ఉన్న ఎరుపు మాయమవుతోంది.
అవును! ఏ సంపద సృష్టించినా
పుత్రికా, పుత్రులకేగా!

సున్నితమైన భావాలన్నీ
ఎక్కడ ధ్వంసం అవుతున్నాయి?
అవును! ఆ పబ్బుల్లో ఎగిరి ఎగిరి
అర్ధరాత్రికి సోసబోయిన ఆ పిల్లను
డ్రైవర్‌ భుజం మీద వేసుకెళుతున్నాడు
మత్తులో కెళ్ళాక లింగభేదం ఏముంది?
అవును! ఎవరు వీరు!

వీరి తల్లిదండ్రులు కోట్లకు పడగలెత్తారు
బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టారు
ఎందరో పేదల భూములు ఆక్రమించారు
వీరి ఇళ్ళల్లో ఎనిమిది కారులుంటాయి
ఏ కారులో ఎవరెళతారో తెలియదు
లావాదేవీలన్నీ కార్లలోనే జరుగుతాయి
ఇంతకీ ఈ సంపాదించే ధనంతో వీరు ఏం సాధిస్తున్నారు
ఆ కింగ్‌ఫిషర్‌ అధినేత బ్యాంక్‌ మేనేజర్లను
మందు సముద్రాల్లో ముంచేసి వేలకోట్లు ఎగవేసి
దేశాలను దాటివెళ్లి దాక్కునాడు కదా!
కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం
ఇంత దోపిడీలు చేయాలా?
బ్రతికుండగానే మరణించాలా?

ఆ అడవులన్నీ ఎడారులవుతున్నాయి
సూర్యుడు భూమిని తాకుతున్నాడు
మనిషి తేమలేని కిరణాలను
భరించలేకపోతున్నాడు
నదులు ఎండిపోతున్నాయి
నేలపొరలు పెరపెరలాడుతున్నాయి
చంటి పిల్లలు తల్లి పొత్తిళ్ళలో
ఆహ్లాదాన్ని పొందలేకపోతున్నారు

పరీక్షలు రాసే విద్యార్థుల బెంచీలు కాలిపోతున్నాయి
పెన్ను ఇంక్‌ బాయిల్‌ అవుతుంది
విద్యార్థి దాహార్తి తీర్చే కూజా కూడా ఒట్టిపోయింది
అక్షరం ఓడిపోయింది
నిజాయితీ డొల్ల అవుతుంది, నీతికి చోటులేదు
అంకెల గారడీతో ర్యాంకులు…
బుర్రలేనివారి ఆధిపత్యం?
ఓడిన అమ్మాయి ఆత్మహత్య!

విద్యాధికారులు కార్పొరేట్‌లకు అమ్ముడవుతున్నారు
అక్షరాన్ని కుదువట్టు పెడుతున్నారు
పుత్రవ్యామోహం ఒక వ్యాధి
అవును! మనిషి మనిషిగా జీవించాల్సి ఉంది
చెట్టు ఏపుగా పెరగాల్సి ఉంది
నదులు అన్ని కాలాల్లో ప్రవహించాల్సి ఉంది
మానవత్వ పరిమళాలు గుభాళించాలి!
నీతి, నిజాయితిగా జీవించడమే ఉషస్సు..

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో