ఆకాశం నల్లబడ్డది – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేను ప్రొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళడానికి తయారవుతున్నాను. ఇంతలో ముసుగు వేసుకుని శివనాథ్‌ సింహ్‌, చౌహాన్‌, బెనర్జీబాయి, ఇంకా లాల్‌ సింహ్‌ నాగర్‌తో పాటు వచ్చారు. ఆయన అన్నారు – ‘రైలీగఢాలో బర్డ్‌ కంపెనీలో పర్సనల్‌ ఆఫీసరు అయిన కె. సింహ్‌ని చంపేసారు. మా వెనక పోలీసులు పడ్డారు. గంగాధర మిశ్ర, ఓఝా, సీతారామ్‌ యాదవ్‌, భత్తు, ముండ అందరు పారిపోయారు. నిజానికి పోలీసుల అత్యాచారాలు ఎక్కువ అయ్యాయి. కొట్లాటలో రామ్‌ సాహెబ్‌ మేజిస్ట్రేట్‌ తలకి దెబ్బలు తగిలాయి. కాదరి దారోగా కాలు విరిగి పోయింది. కానీ కోనార్‌ సాహెబ్‌ని మేం అందరం రక్షించాం. గిద్దీ ఓ.పి. జమీందార్‌, పోలీసులు సాక్ష్యం. మేము ఎవరిని చంపలేదు. లేకపోతే అనర్థం జరిగి పోయేది. ఎందరో శవాలుగా మారేవారు. ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. యాజమాన్యం వారు బొగ్గుగనులకు తాళం వేసారు. పర్మనెంట్‌ శ్రామికులను అట్టే పెట్టుకున్నారు. దాదాపు 37 మంది పర్మనెంట్‌ శ్రామికులను వీళ్ళూ, నేతలు కూడా సస్పెండ్‌ చేసారు. పర్సనల్‌ ఆఫీసరు కె. సింహ్‌ చంపబడ్డాడు.”

ఆయన ఒకే శ్వాసలో అంతా చెప్పేసారు. నేను ఆలోచనలో పడ్డాను. ఇంకా ఇప్పటికీ కేదలా కేసు నుండి ముక్తి దొరకలేదు. పైగా ఇంకా ఇది రెండో మర్డర్‌ కేసు. ఆపదలు ముంచుకొస్తున్నాయి.

నేనడిగాను – ‘అసలు ఇదంతా ఎట్లా జరిగింది? లేబర్‌ ఆఫీసరు రాలేదా?” ఆయన అన్నారు – ‘ఆయన 18వ తారీఖున వచ్చేవారు. కాని యాజమాన్యం వారు కావాలనే 17న అల్లర్లు చేయించారు. ఎందుకంటే 18న లేబర్‌ ఆఫీసరు కార్మికులను ఎన్‌క్వయిరీ చేసి అసలు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు. ప్రణాళిక ప్రకారం అందరు సైడింగ్‌ దగ్గర నియమింపబడ్డారు. శ్రామికులు లోడింగ్‌ పూర్తిచేయలేదు. వాగన్‌కి డైమ్‌రేజ్‌ వేస్తున్నారు. దాదాపు ఏడు రోజుల నుండి వాగన్లు నిల్చునే ఉన్నాయి. భట్టీలను వెలిగించడం, ఆర్పేయకపోవడం… మా ప్రణాళికలో భాగాలు. ఇదే మా రణనీతి : కాంట్రాక్టర్ల ‘బలం ఉన్న వాడిదే పై చెయ్యి’ అన్న మనస్తత్వానికి వ్యతిరేకంగా రణనీతిని రూపొందించడమే మా

ఉద్దేశ్యం. నిజానికి ఇక తప్పదన్న పరిస్థితులలో ఇలా చేయాల్సి వచ్చేది. ఈ రణనీతి కాంట్రాక్టర్లు భయపెట్టి – బాధపెట్టే అస్త్రాలకి జవాబు చెప్పే పెద్ద అస్త్రం. మేము దీనిని అమలు పరిచి ఎన్నో సార్లు సఫలీకృతులయ్యాము. బర్డ్‌ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. కాని మా పట్టుదల, ధైర్యాలు కూడా తక్కువేమీ కావు.

ధన్‌బాద్‌ లేబర్‌ ఆఫీసరు 18వ తారీఖున ఒప్పందం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కాని యాజమాన్యం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుంటే ఎన్‌క్వయిరీ అయితే తీర్పు శ్రామికులవైపే వస్తుందని వాళ్ళ నమ్మకం. అందువలన యాజమాన్యం వారు, ధన్‌బాద్‌ నుండి బి.పి. సిన్హా ఆదివాసీ శ్రామికులను చంపించడానికి పఠానులను పంపించాడు. ఎ.డి. సింహ్‌ (బర్డ్‌ కంపెనీ పర్సనల్‌ ఆఫీసరు) బర్డ్‌ సౌందా నుండి కూలీలను రైలీగఢాలో పనిచేయడానికి పిలిపించారు. రైలీగఢా శ్రామికులు బర్డ్‌ సౌందా కూలీలతో సైడింగ్‌ దగ్గర పనిచేయవద్దని తమ పొట్టమీద కొట్టవద్దని ఎంతో వేడ్కొన్నారు. అందరూ శ్రామికులే కనక సౌందా కూలీలను తమకు సహకారాలు సహాయం చేయమని అడిగారు. సౌందా కార్మికులు పని చేయడానికి కొంత వెనుకంజ వేసారు. ఎ.డి. సింహ్‌ ఎన్ని వందల ప్రయత్నాలు చేసినప్పటికీ సౌందా కార్మికులు పనిచేయడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు తమని ఇక్కడికి తీసుకువచ్చిన ట్రక్కులలోనే వెనక్కి వెళ్ళిపోయారు. రైలీగఢా కార్మికులు యాజమాన్యం వారికి – హాజరు రిజిష్టరులో కూలీ ఇవ్వకపోయినా ఎటెండెన్స్‌లో వాళ్ళ హాజరీ వేయాలని వాళ్ళకే పనులు ఇవ్వాలని వేరేవాళ్ళకి ఇవ్వవద్దని చెప్పారు. వాళ్ళు యాజమాన్యం వాళ్ళకి ఏమైనా సరే బయట వాళ్ళకి పనులు ఇవ్వకూడదని ఖరాఖండీగా చెప్పారు. శ్రామికులు పోలీసులతో, మేజిస్ట్రేట్‌తో మాట్లాడారు. దీనికి వాళ్ళు సహాయపడాలి అన్న షరతు పెట్టారు. నిజానికి వాళ్ళు అన్నదాంట్లో ఎంతో న్యాయం ఉంది. అందుకే పోలీసులు, మేజిస్ట్రేట్‌ కూడా ఎటువంటి వాద వివాదాలు చేయలేదు. పోలీసులు మా నేతయైన ఓఝా, పాండే, గంగాధర్‌ మిశ్ర, సీతారామ్‌ యాదవ్‌ గార్లను సైడింగ్‌లోనే (వివాదాస్పద స్థలంలో) అరెస్ట్‌ చేసారు. ప్రణాళిక ప్రకారం మహిళా కార్మికులు వాగన్లను లోడింగ్‌ చేసే ప్లేస్‌లో పడుకున్నారు. ఎవరూ వాళ్ళని దాటి బయటి కార్మికులు వచ్చి వాగన్లను లోడింగ్‌ చేయకూడదని వాళ్ళ ఉద్దేశ్యం. ధన్‌బాద్‌ నుండి పిలిపింపబడ్డ పఠానులు ట్రక్‌లలో అక్కడికి చేరారు. కె. సింహ్‌ పర్సనల్‌ ఆఫీసరు వెళ్ళి ఒక మహిళా కూలీని అక్కడినుండి వెళ్ళి పొమ్మనమని అడిగాడు. ఆమె లేవలేదు. ఆమె చీరకొంగును లాగి లేపాలనుకున్నాడు. ఆదివాసీ మహిళలు కేవలం చీర మాత్రం కట్టుకుని ఉంటారు. లోపల లంగా వేసుకోరు. బ్లౌజు వేసుకోరు. చీర జారిపోయింది. ఆమె నగ్నంగా ఉండిపోయింది. అంతే మహిళలందరు బొగ్గులను విసరడం మొదలు పెట్టారు. ఆకాశం అంతా చల్లబడి పోయింది. ఎక్కడి నుండో ఒక బాణం దూసుకుపోయింది. ఇంక అంతే బాణాల వర్షం కురిసింది. మా యూనియన్‌లోని నేతలు ఇంతకు ముందే అరెస్టు అయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ కోహర్‌, గాయపడ్డ మెజిస్ట్రేట్‌ రాయ్‌ సాహెబ్‌ మేనేజ్‌మెంటు వాళ్ళ జీపులో ఎక్కి పారిపోయారు. ఎ.డి. సింహ్‌ సౌందా నుండి వచ్చిన ట్రక్‌లో ఎక్కి శ్రామికులు ముందుకు నడిచారు. కాని కె. సింహ్‌ వెళ్ళలేక పోయారు. బొగ్గు ముక్కలు తగలడం వలన సౌందా ట్రక్‌ వైపు పరుగెత్తారు. కాని కె. సింహ్‌ వెళ్ళలేక పోయారు. ట్రక్‌ ముందుకు వెళ్ళిపోయింది. అంతే ఆయనపై దెబ్బలు పడుతూనే

ఉన్నాయి. ఎవరైనా సరే అటునుండి వెళ్తుంటే కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు. రాళ్ళు-రప్పలు, బొగ్గులూ వాళ్ళమీద పడుతునే ఉన్నాయి. ఎంతో మంది పఠానులు గాయపడ్డారు. పోలీసులు మా నేతలతో రక్షించమని మొర పెట్టుకున్నారు. ఓఝా గారు, మిశ్రా గారు పోలీసులతో అన్నారు – ”మాకు మీరు సంకెళ్ళు వేసేసారు కదా! మేం మిమ్మల్ని ఎట్లా రక్షిస్తాం.”

చౌహాను గారు చెప్పారు – ”పోలీసులు ఆయన్ని వదిలివేసారు. మా వాళ్ళు కూడా సిపాయిలని, జమీందార్లని రక్షించి కూలీల ధండేలలో ఉంచాము. కె. సింహ్‌ చంపబడ్డాడు. మృతులైన పఠానులను నిప్పుల్లో పడేసారు. ఒకవైపు నుండి దాడి జరిగింది అని నిరూపించడానికి కొందరు పరుగెత్తుతున్న గాయపడ్డ పఠానులను గిద్దీశ్రామికులు పట్టుకుని కొత్త సరాయ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఎందుకంటే రెండు వైపుల నుండి దాడులు జరిగాయని నిరూపించడానికి. కాని మేనేజ్‌మెంట్‌ వారికి తెలిసాక వాళ్ళని అక్కడి నుండి మాయం చేసారు. మేం దాడి చేసామని నిరూపించడానికి ఇట్లా చేసారు.”

”మేనేజ్‌మెంటు వారు రాత్రికి రాత్రి హజారీబాగ్‌ నుండి లాయర్‌ని పిలిచారు. కాదరీ దారోగా లాయర్ల అభిప్రాయాలు తీసుకుని రాత్రి ఒంటిగంటకి ఎఫ్‌.ఐ.ఆర్‌. రాయించారు కాని అసలు సంఘటన సాయంత్రం ఐదు, ఆరు గంటల మధ్య జరిగింది. ఓఝా గారిని, మిశ్రా గారిని ఇంకా తక్కిన వాళ్ళని ఊరివాళ్ళు దాచి పెట్టారు. మా మీద వారంట్‌ ఉంది. అందువలన మేం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే కర్పూర్‌ గారి దగ్గరికి రండి. ఇది బర్డ్‌ కంపెనీ, మనం చస్తే విడుదల కాలేం”

వాళ్ళు భయపడ్డారు. నేను వాళ్ళకి అభయం ఇచ్చాను- ”పాట్నా నుండి నేతలందరు సోషలిస్ట్‌ పార్టీ సభలకి పూనా

వెళ్తున్నారు. మనం అందరం రేపు పొద్దునకల్లా పూనా వెళ్ళిపోతాం-”

పూనా ప్రస్థానం :

వాళ్ళందరు సామాన్లు, కొంత డబ్బు తేవడానికని వెళ్ళారు. రాత్రి శివరామసింహ్‌, ఝార్‌ఖండ్‌ బొగ్గు గనుల మేనేజర్‌ శ్రీ దత్తో  నా దగ్గరికి వచ్చారు – ”చూడండి గుప్తా గారూ! మీరు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపొండి. బర్డ్‌ కంపెనీ వాళ్ళు ఈ హత్య కేసులో మిమ్మల్ని ఇరికించారు. వాళ్ళు మిమ్మల్ని, బెనర్జీ, శివనాథ్‌ చౌహాన్‌ ఇంకా లాల్‌ సింహ్‌లని ఎబేటర్‌గా నిర్ణయించారు. సాధన్‌ గుప్తా లాగా మిమ్మల్ని కాలాపానీకి పంపేస్తారు. మీ పార్టీ వాళ్ళు గవర్నమెంటును ఫామ్‌ చేస్తున్నారు. వెంటనే వెళ్ళిపొండి లేకపోతే ఆలస్యం అవుతుంది.” అని అన్నారు.

నేనన్నాను : ”నా దగ్గర పైసలు లేవు. ఏ వెహికల్‌ లేదు. కేదలా వెళ్తే కానీ డబ్బులు దొరకవు”

ఆయన అన్నారు : ”వెహికల్‌ ఏర్పాటు చేసాను. మీరు కేదలా వెళ్ళి పైసలు తీసుకోండి. వాళ్ళకి కబురు అందించండి. పొద్దున వరకు తక్కిన వాళ్ళందరు రైలీ గఢాకి రండి. మీరు రోడరహ నుండి రాత్రి బాంబే మెయిల్‌ ఎక్కండి-”

”ఆ బండిలో నేను, వాజ్‌పాయి, కామ్‌దేవ్‌సింహ్‌ ఒక స్నేహితుడిని తీసుకుని రాత్రి కేదలాకి చేరాము. పన్నాబాయి, పటేల్‌రాయ్‌, బుధ్‌రామ్‌, తులారామ్‌ లను పిలిపించాము. ప్రస్తుతం ఉన్న స్థితి గురించి చెప్పాము. రాత్రికి రాత్రి చందా వసూలు అయింది. పళ్ళాలు, గ్లాసులు, మోతే సేఠ్‌ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాం. నేను మొగవాళ్ళ దుస్తులను ధరించాను. ఎవరూ నన్ను గుర్తుపట్ట కూడదని జీన్స్‌-షర్టు వేసుకున్నాను. పెద్ద నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను. పన్నాబాయి మాతో పాటు వచ్చింది. సాయంత్రం బెనర్జీ, తక్కినవాళ్ళు వచ్చారు. మేమందరం రోడ్‌రామ్‌ వెళ్ళి బాంబె మెయిల్‌ ఎక్కాము. అక్కడినుండి పూనా వెళ్ళాము. ఆ రోజుల్లో ఎస్‌.ఎమ్‌. జోషి సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవారు. బీహార్‌లో సంవిద్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు అయింది. కర్పూర్‌ గారు ముఖ్యమంత్రి, రామానంద తివారి గారు హోమ్‌ మంత్రిగానూ ఉండేవారు.

పన్నాబాయి ఇచ్చిన అత్యాచారాల వివరణ :

మేం అందరం సభలో పార్టిసిపేట్‌ చేసాము. రైలీగఢా కథ మొత్తం చెప్పాము. పన్నాభాయి స్టేజిపై నుండి సభను సంబోధిస్తూ రైలీగఢా, కేదలాలో జరిగిన రెండు మర్డర్‌ కేసులలో శ్రామికులను ఏ విధంగా ఇరికించారో, వాళ్ళమీద ఎంత ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయో వివరించింది. రెండు ముక్కులకు పుడకలు పెట్టుకుంది. తొమ్మిది గజాల చీర కట్టుకుంది. నడుంకి కొంగు బిగించింది. అక్షరాలా విలాసపురీ మహిళలా తయారయింది.
ఏమాత్రం జంకు-గొంకు లేకుండా ధైర్యంగా అంతా చెప్పింది. అసలు ఆమెకి 5 నిమిషాల టైమే ఇచ్చారు. కాని నేను నా సమయం కూడా ఇచ్చాను. ఆమె స్పీచ్‌ ప్రభావం అందరిపై పడ్డది. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరు వింటున్నారు –

కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు రైలీగఢా కార్మికుల గుండెల మీద ఎక్కి ఎగిరి ఎగిరి పడేవాళ్ళు. నేతలు, రమణికా గుప్తా, ఓఝాల అడ్రస్సులు అడిగేవారు. శ్రామికులు వాళ్ళ అడ్రస్సు చెప్పకపోతే ఇంకా ఎక్కువ హింస పెట్టేవాళ్ళు. మొత్తం బొగ్గుగనులను మూయించేసారు. రెండు వారాలు గడిచి పోయాయి. ఎవరి దగ్గరా ఒక్క దమ్మిడీ లేదు. చందాలు వసూలు చేసి గిద్దీ, సౌందా శ్రామికులు రొట్టెల పిండిని కొని పంపేవారు. ఒక వ్యక్తి వంతు ఒక పావు పిండి వచ్చేది. పిండిని నీళ్ళల్లో కలిపి వాళ్ళు తాగేవాళ్ళు. కాని తలవంచ లేదు. వాళ్ళ మనోబలం ముందు అందరు తలవంచాల్సిందే. కమలాచరణ్‌ ఉపాధ్యాయ్‌ శ్రామికుల నుండి బలవంతంగా ఇంటర్‌ యూనియన్‌ మెంబర్‌షిప్‌ కోసం రసీదులు రాసేవారు. పైసల కోసం చేతులు జాపేవారు. శ్రామికులు వాళ్ళ అరచేతులలో ఉమ్మేసే

వాళ్ళు. ఇప్పటిదాకా 150 మంది సస్పెండ్‌ అయ్యారు. మీరు నేతలందరు అక్కడికి పదండి. స్వయంగా చూడండి. కమలాచరణ్‌ ఉపాధ్యాయ్‌ చెప్పడం వలన కాదరీ దారోగా తప్పుడు కేసు డైరీని తయారు చేసాడు. మా వాళ్ళందరికీ ఉచ్చు బిగిస్తున్నారు. మేనేజ్‌మెంటు, ఇంటర్‌ యూనియన్‌ పోలీసులు ఈ ముగ్గురు చేతులు కలిపి మా వాళ్ళందరిని గొయ్యిలోకి తోసేస్తున్నారు. గిద్దీ జమాదర్‌ ఏ డైరీ అయితే రాసాడో అదే సరి అయినది. ఆ డైరీలో సంఘటన జరిగిన సమయంలో నేతలందరు పోలీసుల కస్టడీలో ఉన్నారు అని రాసి ఉంది. సంఘటన జరిగిన తరువాత గందరగోళం అయింది. పోలీసులు పారిపోయారు. అందువలన జమిందారులు, సిపాయిలు తమ రక్షణార్థం వాళ్ళని వదిలివేసారు. కె. సింహ్‌ గుంపు రాళ్ళు రువ్వుతున్నప్పుడు తగిలి చనిపోయాడు. అంతేకానీ ప్రత్యేకంగా ఆయనని ఎవరూ చంపలేదు. ఎవరూ ఆయనపై దాడీ చేయలేదు. బెనర్జీ, శివనాధ్‌ సింహ్‌, లాల్‌ సింహ్‌ ఈ సంఘటన తరువాత అక్కడికి చేరారు. బొగ్గు గనులని కంపెనీ వాళ్ళు మూసేసారు. దీనివలన పర్మనెంట్‌ కార్మికులు నిరుద్యోగులు అయ్యారు. వాళ్ళు మాకు సహాయం చేసే వాళ్ళు కానీ వాళ్ళకే పనిలేకుండా పోయింది. వాళ్ళకి, మాకు ఎవరు సహాయం చేసేది? మీరు కంపెనీని తెరిపించండి లేకపోతే శ్రామికులు తిండి తిప్పలు లేక మల మల మాడి చచ్చిపోతారు. లేకపోతే చేత రైఫిల్‌ని పట్టుకుంటారు-”

నేను నేతలందరికీ అసలు స్థితిగతుల గురించి చెప్పాను. ఈ సమయంలో సహాయం చేయకపోతే మేం అందరం నక్సలైట్స్‌గా మారుతాం అని చెప్పాను. ఆ రోజుల్లో నక్సలిజంపైన చాలా చర్చలు జరిగేవి. మేధావి వర్గం, యువతరం అందరూ దీనివైపు ఆకర్షితులవుతున్నారు. మా నేతలు గట్టి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నాకు ఏమాత్రం సంతోషం లేదు.

ఎస్‌.ఎమ్‌. జోషి ఇచ్చిన పిలుపు :

ఎస్‌.ఎమ్‌. జోషి ఇట్లా చెప్పారు – నేను మీతో పాటు రైలీగఢాకి వస్తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను.”

ఈ పిలుపు వినగానే అందరూ ‘జిందాబాద్‌’ అంటూ నినాదం చేసారు. రైలీగఢా వాళ్ళు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. నేతృత్వం వహించేవాళ్ళు కార్మికులకి గడ్డు రోజులలో అండగా నిలబడితే వాళ్ళల్లో ఆత్మబలం ఇంకా పెరుగుతుంది. అపజయాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తారు. వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగలదు. ఆకలి దప్పులను సైతం జయిస్తారు. నేతృత్వం సరిగా లభించకపోతే మోసపోయినట్టుగా వాళ్ళు బాధపడతారు. ‘శ్రీ ఎస్‌.ఎమ్‌. జోషి అఖిల భారతీయ సోషలిస్టు పార్టీ రైలీగఢా శ్రామికులకు న్యాయం చేకూర్చడానికి తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు-‘ ఈ వార్త అడవిలో నిప్పులా నలువైపులా దేశం మొత్తం వ్యాపించింది. రైలీగఢా ఒక దివిటీ అయింది. అందరికీ మార్గం చూపించింది. మొత్తం సోషలిస్టు పార్టీ వాళ్ళందరూ ఈ పోరాటంలో పాల్గొన్నారు. బీహారులో నేత కర్‌పూర్‌ ఠాకూర్‌ నేతృత్వం సోషలిస్ట్‌ పార్టీకి లభించింది. శ్రీ రామానంద తివారి పోలీసు డిపార్ట్‌మెంట్‌ మినిస్టర్‌గా ఉండేవారు. ఆయన తనకు తాను ఒక సిపాయిగా తలంచేవాడు. ఇంగ్లీషు వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనడం వలన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఆయన కాదరీ దారోగా స్థానాంతరీకరణకి ఒప్పుకోలేదు. రైలీగఢాలో గనులను తెరిపించడం, సస్పెండ్‌ అయిన శ్రామికులను తిరిగి పనులోకి తీసుకోవడం, సైడింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయించడంతోపాటు, కాదరీదారోగా స్థానాంతరీకరణ కూడా ఆయన ఉద్దేశ్యం. కాదరీ మేనేజ్‌మెంటు వాళ్ళ చెప్పుచేతలలో ఉన్నాడు. కార్మికులను, వాళ్ళ నేతలను హత్యల కేసులలో ఇరికించేవారు. రైలీగఢా చేరకముందు నేను, శ్రీ ఎస్‌.ఎమ్‌. జోషి పాట్నాకి వెళ్ళాము. రామానంద తివారి గారికి ముఖ్యంగా కాదరీ దారోగా స్థానాంతరీకరణ చేయాలని, కేసును ఐ.ఓ. కి బదులుగా మరెవరినైనా నియమించాలని, ఇట్లా చేస్తే నిష్పక్షపాతమైన ఎన్‌క్వైయిరీ జరుగుతుందని చెప్పారు. కాని తివారి గారు ఒప్పుకోలేదు. ఆయన తనను తను సోషలిస్టు పార్టీ నేతకంటే పోలీసుల నేత అనే అనుకునేవారు. జయప్రకాష్‌ నారాయణ్‌ గారి ద్వారా కూడా తివారీజీకి చెప్పించాము కాని ఏ లాభం లేకపోయింది. కర్పూర్‌ గారి మాట ఆయన వినలేదు. ముఖ్యమంత్రి పదవికి తనే తగిన వ్యక్తి అనే అభిప్రాయం ఏర్పరుచుకున్నారు. బీహారులో కర్పూర్‌ గారికి ఎంత గౌరవం లభించిందో ఈనాటి వరకు ఏ నేతలకు మళ్ళీ అటువంటి గౌరవం లభించలేదు. ఆయన త్యాగనిరతి కలవారు. నమ్రత కలవారు. వారిపై అందరికి నమ్మకం ఎక్కువ. వారికి సాటి ఆనాడే కాదు ఈనాడు కూడా ఎవరూ లేరు.

జోషీగారు రైలీగఢా వచ్చారు. బర్డ్‌ కంపెనీ చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసరు శ్రీఝా ఆయనని కలవడానికి వచ్చారు. రమణికా గుప్తాను కోల్‌ఫీల్డ్స్‌ దగ్గరికి రానీయవద్దని అప్పుడు ఈ సమస్య సమసి పోతుందని ఆయన జోషి గారికి చెప్పారు. ఈ ప్రస్తావన శ్రామికులు కాని జోషి గారు కాని ఒప్పుకోలేదు. రైలీగఢాలో జోషీ గారు నిరాహార దీక్షకి దిగారు. ప్రతీ రోజు ప్రొద్దున్న, సాయంత్రాలు మీటింగులు జరుగుతూనే ఉండేవి. పగలంతా కొంతమంది ఆయనతో పాటు కూర్చునే వారు. గ్రామస్థులు కూడా వచ్చేవారు తక్కిన బొగ్గు గనుల నుండి దూర దూరంగా ఉన్న ఊళ్ళ నుండి ఊరి వాళ్ళు, కార్మికులు రావడం మొదలు పెట్టారు. పోలీసు బలగం అంతటా ఉంది. కాని మేనేజుమెంటు వారు తలవంచలేదు. జోషీ గారు చాలా బలహీనులయ్యారు. 15 రోజులు గడిచిపోయాయి. నేషనల్‌ లెవల్‌ వార్తా పత్రికలలో దీనికి సంబంధించిన వార్తలు రాసాగాయి. నేను కర్పూర్‌ గారిని కలిసి చెప్పాను- ”మీరు ముఖ్యమంత్రి. అందరిని చూసే బాధ్యత మీదే. కానీ ఎస్‌.ఎమ్‌. జోషీ గారిని కూడా రక్షించడం తప్పదు. కార్మికులను ఆకలి నుండి రక్షించాలి. కూడూ, గుడ్డా, నీడ ఇవ్వాలి. మళ్ళీ పనులు అప్పగించాలి. ఇది కూడా తప్పదు. మీరు నేను చెప్పే ఫార్ములాను అమలులో పెట్టండి. మేనేజ్‌మెంటు వారు 24 గం||లలో కాళ్ళ బేరానికి వస్తారు. రమానంద్‌ తివారి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మీ ఆఫీసరుకి సూచన ఇవ్వండి. రైలీగఢా నుండి బర్డ్‌ కంపెనీ నుండి పోలీసు ఫోర్స్‌ని వెనక్కి పిలిపించమనండి. మేనేజుమెంటు వారికి లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వాళ్ళే పుట్టించారు. మేనేజ్‌మెంటు సరాసరి రమణికా గుప్తాతో మాట్లాడాలని కార్మికులతో కాదు అని రాసి పంపండి. మీరు ఈ ప్రకారం చేయకపోతే బర్డ్‌ కంపెనీ చస్తే దీనికి తలవంచదు.

రమణికా గుప్తా గారు చూసుకుంటారు :

బహుశ కర్పూర్‌ గారికి నేను చెప్పింది సరి అయినదే అని అనిపించింది. రెండు మూడు రోజుల తరువాత స్థానీయ ఆఫీసరు బర్డ్‌ కంపెనీకి చెందిన శ్రీఝాతో నాతో మాట్లాడమని, పోలీసు ఫోర్స్‌ని తిరిగి పంపేయమని సూచన ఇచ్చారు.

బర్డ్‌ కంపెనీకి తెలుసు పోలీసు ఫోర్స్‌ తిరిగి తీసుకోడ మంటే, రమణిక గారితో మాట్లాడటం అంటే అర్థం ఏమిటో! ఆయన జోషీ గారి దగ్గరికి వెంటనే వచ్చారు. ఇట్లా అన్నారు – ”మేం మీతో ఒప్పందం కుదుర్చుకుంటాము కాని రమణికా గుప్త మాత్రం ఈ ఒప్పందం విషయంలో జోక్యం చేసుకోకూడదు. మేం ఆమె సంతకాన్ని తీసుకోము.”

జోషి గారు నాకు, శ్రామికులకు మేనేజ్‌మెంటు వారి ప్రస్తావన గురించి చెప్పారు. కార్మికులు ఈ ప్రస్తావనను వ్యతిరేకించారు. కాని నేను ఒప్పుకున్నాను- ”ఫరవాలేదు. ఈ ఒప్పందం నా సంతకం లేకుండానే అవుతుందంటే కానీయండి.”

శ్రీ జోషీ గారితో 354 మంది కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, కోల్‌ఫీల్డ్స్‌ తెరవాలని, హత్య కేసులో ఇరుక్కున్న 37 మంది శ్రామికులను విడుదల చేయాలని, తక్కిన వాళ్ళపై సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని నిర్ణయించారు. లాక్‌అవుట్‌ ఎత్తేసారు. 37 మంది కార్మికుల కేసులను మళ్ళీ ఎన్‌క్వయిరీ చేయాలని తీర్పు ఇచ్చారు. మా యూనియన్‌ 354 మంది కార్మికుల సూచికను తయారు చేసి మేనేజుమెంట్‌ వారికి ఇచ్చారు. కాని కార్మికులు వాళ్ళ ఐక్యత బలం పైన చాలా వరకు అమలు పరిచారు. నిజానికి ఈ సూచికలో మేనేజ్‌మెంటు వాళ్ళు కమలాచరణ్‌ ఉపాధ్యాయవైపున ఉన్న కొందరి పేర్లను కూడా ఇరికించారు.

కార్మికుల బెయిల్‌ కోసం నడుం బిగించాము :

రైలీగఢాకి చెందిన ఎంతోమంది కార్మికులకు ఇంకా బెయిల్‌ దొరకలేదు. మేనేజుమెంటు వారు లాక్‌అవుట్‌ని ఎత్తేసారు. మా కొన్ని డిమాండ్స్‌ని ఒప్పుకున్నారు. కాని మా యూనియన్‌తో మాట్లాడటానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. సహాయక లేబర్‌ ఆఫీసరు దగ్గర కూడా 37 మంది కార్మికుల సస్పెన్షన్‌ వివాదం గురించి మేం అందరం ఒక టేబుల్‌ దగ్గర కూర్చుని మాట్లాడలేదు. ఆ ఆఫీసరు అందరితో విడివిడిగా మాట్లాడేవారు. కామన్‌ పాయింట్‌ వెతికి తన తరపు నుండి మధ్య మార్గం వెతికేవారు. కాని ఆయన సక్సెస్‌ కాలేక పోయారు. అటువైపు నుండి ఎన్‌.డి. సింహ్‌, ఇటువైపు నుండి నేను, మధ్యలో కేంద్రీయ శ్రమ విభాగం లేబర్‌ ఆఫీసరు ఎస్‌.బి. సింహ్‌.

హత్యల కేసులు పెట్టడంలో బర్డ్‌ కంపెనీ ఎంతో తెలివిగా ప్రవర్తించింది. వాళ్ళు నన్ను కూడా అందులో ఇరికించాలని పెద్ద వ్యూహమే పన్నారు. ఝార్‌ఖండ్‌కి చెందిన దత్తో సాహెబ్‌, నాకు దీనిని గురించి చెప్పారు. నేను కర్పూర్‌ గారికి చెప్పాను. ఒక రోజు ప్రొద్దున్న ముఖ్యమంత్రి కర్పూర్‌గారు నడుచుకుంటూ ఐ.జి. బంగళాకి వెళ్ళి ఆయనకి నిజాలు చెప్పారు- ”అసలు ఈ గొడవ జరిగిన రోజు రమణిక గుప్త పాట్నాలో ప్రొద్దున్న డా. ముఖోపాధ్యాయ దగ్గర ఉన్నారు. మధ్యాహ్నం విధాన సభలో ఆరోజే దారోగా రామ్‌ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం జరిగింది. ఆవిడ ఎగురుకుంటూ సాయంత్రం పూట రైలీగఢాకి చేరలేరు కదా?”

ఐ.జి. ఎస్‌.పికి టెలిఫోన్‌లో నా పేరు డైరీలోంచి తీసేయమని చెప్పారు. బర్డ్‌ కంపెనీ ఒక కుతంత్రం చేసి, వ్యూహ రచన చేయడంలో నేను మొట్టమొదటి దానిని అని నిరూపించడానికి ప్రయత్నం చేసింది.

హజారీబాగ్‌లోఎవరికీ జిల్లా జడ్జ్‌ బెయిల్‌ ఇవ్వడం లేదు. అందువలన మేము కేసు కోసం పాట్నాలో ఒక పేరున్న వకీలుని పెట్టుకున్నాము బర్డ్‌ కంపెనీ వాళ్ళు హజారీబాగ్‌ లాయర్లని కొనేసుకుంటారు అని కూడా తెలుసు. ఒకసారి రాయ్‌సాహెబ్‌ ఎస్‌.డి.వో. కుర్చీ మీద కూర్చుని కేసును పరిశీలిస్తున్నారు. ఆ సంఘటనలో ఆయన తల కూడా పగిలింది. అది ఆయనకి తెలుసు. ఆరోజు మేము కోర్టులో బెయిల్‌ కోసం బెయిల్‌ పిటీషన్‌ పెట్టాము. ఆయన ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి. ఎవరినైతే నేరస్థులని కేసులో ఇరికించారో వాళ్ళల్లో ఒకరు కూడా నేరస్థుడు కాడని తెలుసు. పైగా ఆరోజు వీళ్ళందరు వాళ్ళ అందరి మధ్య శాంతికోసం ప్రయత్నం చేసారు. రాయ్‌ సాహెబ్‌ పేరున్న వారందరికీ తన కోర్టులో బెయిల్‌ ఇచ్చారు. బహుశ ఇటువంటి నిర్ణయం ఎస్‌.డి.వో. లెవెల్‌లో కోర్టులో తీసుకోకూడదు. బర్డ్‌ కంపెనీ మేనేజ్‌మెంటుకి కోపం వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళకి గందరగోళం మొదలయింది. వాళ్ళు పై వాళ్ళ ఇన్‌ఫ్లుయన్స్‌తో, అర్థబలంతో జిల్లా జడ్జ్‌ దాకా వెళ్ళారు. జిల్లా జడ్జి పేరున్న వారికి బెయిల్‌ రద్దు చేసారు. కాని తక్కిన వాళ్ళని రద్దు చేయలేకపోయారు. మాలో సగంపైగా బయటపడ్డారు. మేం అందరం ఆనందంగా శ్వాస పీల్చుకున్నాం కాని జడ్జి రాయ్‌ సాహెబ్‌ మెజిస్ట్రేట్‌కి వ్యతిరేకంగా కఠోరంగా రాసాడు. దాని వలన ఆయన ప్రమోషన్‌ ఆగిపోయింది. అయినా ఆయన ఏమాత్రం నిరుత్సాహ పడలేదు.. ఆయన ఒక దళిత ఆఫీసరు. ఆయనకు నిజం ఏమిటో తెలుసు. తరువాత ఆయన కార్మికుల పక్షాన సాక్ష్యం ఇచ్చారు. దీనివలన కార్మికులందరు కేసుల నుండి బయటపడ్డారు. తాపేశ్వర్‌ ప్రసాద్‌ ఎస్‌.డి.వో రాయ్‌ సాహెబ్‌ మనోబలాన్ని పెంచారు. ఆయనకి విరుద్ధంగా జిల్లా కోర్టులో చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అయినా ఆయన ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు.

పేరు ఎంట్రీ అయిన వాళ్ళందరికి బెయిల్‌ ఇవ్వడానికి దాదాపు నాలుగైదు సంవత్సరాలు మేము తంటాలు పడ్డాం. లాయర్లకి బాగా ఫీజు ఇవ్వాలి. ఇంత డబ్బు ఇవ్వడానికి మాకు పెద్ద సమస్య. 1973 సం||లో రైలీగఢా నేషనలైజ్‌ అయింది. తరువాత రెండు మూడు సం||ల తరువాత ప్రేమదాసు, దీక్షిత్‌ బెయిల్‌ మీద బయటికి వచ్చారు. అప్పుడు మేము ఆయనని సి.ఎస్‌.ఎల్‌. లో ఉద్యోగం ఇవ్వాలని కేసు పంచాయితీ (ఆర్బిట్రేషన్‌) లో అర్జీ ఇచ్చాము. మేం సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్‌కి (సి.సి.ఎల్‌) అధికార ద్వయం శ్రీమూర్తి (డైరక్ట్‌ పర్సనల్‌), శ్రీ ఎ.డి. సింహ్‌ (జి.ఎమ్‌. పర్సనల్‌) లని పంచులుగా ఎంచి కేసుని వాళ్ళకి ఒప్ప చెప్పాము. మాతోటి వాళ్ళు ఇద్దరు బయట పడ్డారు. మేం అందరం 37 మంది సస్పెండ్‌ అయిన కార్మికులను (బర్డ్‌ కంపెనీ వీళ్ళపై హత్య కేసు పెట్టింది) విడిపించే ప్రయత్నంలో విజేతలయ్యాము. కంపెనీ జనరల్‌ శ్రీ అగ్రవాల్‌, పర్సనల్‌ ఆఫీసరు ఎ.డి. సింహ్‌కి అసలు సత్యం తెలుసు కాబట్టి మాకెంతో సహాయం చేసాడు. ఇప్పుడు బర్డ్‌ మేనేజ్‌మెంటులో కూడా పనిచేయడం లేదు. వాళ్ళిద్దరు సి.సి.ఎల్‌. అధికారులుగా ఉన్నారు. అయినా బి.డి.యల్‌ బడేరా, శ్రీ వర్మ రైలీగఢా విషయంలో ఈ ఇద్దరు అధికారులలో ఎప్పుడూ ఏదో గొడవ పడుతుండేవాళ్ళు. వీళ్ళిద్దరికి ప్రమోషన్లు లభించలేదు. ఇదంతా జరిగినా వాళ్ళిద్దరు మాకెంతో సహాయం చేసారు. వీటన్నింటి మూలంగా కార్మికులకు మా పట్ల నమ్మకం బాగా పెరిగింది. ఈనాటికి కూడా మా మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవు. శ్రీ ఎ.డి. సింహ్‌ పట్ల నాకెంతో గౌరవం పెరిగింది.

నేషనలైజేషన్‌ అయిన చాలా సంవత్సరాలకి మళ్ళీ కేసు తిరగతోడారు. శ్రీరామ్‌ సి.సి.యల్‌.లో జనరల్‌ మేనేజర్‌ అయ్యారు. ఆఫీసర్ల యూనియన్‌కి సెక్రటరీగా కూడా అయ్యారు. ఆయన తరువాత మాకు మిత్రులయ్యారు. మేనేజ్‌మెంటువారి ఒత్తిడి వలన అసత్యపు ఎఫ్‌.ఐ.ఆర్‌. రాసారు. కాదరీ దారోగా కార్మికులకు విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వలేదు. వీళ్ళే లేకపోతే రాయ్‌ సాహెబ్‌ జమీందారు, తాము బతికి ఉండేవాళ్ళం కాదని చెప్పారు. వీళ్ళే తమని రక్షించారని చెప్పారు. కోవార్‌ తన స్టేట్‌మెంటులో సంఘటన జరిగేముందు మేనేజరు జీపు ఎక్కి ఇంకా అదనపు పోలీసు ఫోర్స్‌ తీసుకు రావడానికి వెళ్ళారని ఎందుకంటే అక్కడ పోలీసు ఫోర్స్‌ తక్కువ ఉందని చెప్పారు. కింద కోర్టు మూడు సంవత్సరాల శిక్ష వేసారు. తరువాత జిల్లా కోర్టులో అపీలు చేసినపుడు అంతా రద్దయింది. అందరిని విడుదల చేసారు. కాని ఆ సమయంలో మేం అందరం ఎంతో భయంకరమైన సంఘర్షణకు లోనయ్యాము. తలుచుకుంటే ఇప్పటికీ గగుర్పాటు కలుగుతుంది. కాని కార్మికుల సంఘటిత శక్తికి జయం కలిగిందన్న ఆనందం పెల్లుబుకుతుంది. అటువంటి సమయంలో మనోబలం కావాలి అంతే. ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోవచ్చు.

రైలీగఢా విజయం వలన ఎన్‌.సి.డి.సి. లోని తక్కిన కోల్‌ ఫీల్డ్‌ ్సలో కూడా పాకిపోయింది. మా యూనియన్‌ బ్రాంచ్‌ని ఓపెన్‌ చేయమని అందరు అడిగారు. వాళ్ళల్లో సౌందాలోని గోరఖ్‌పూర్‌ శ్రామికుల నేత జగన్నాథ్‌ సింహ్‌ ఒకరు. వాళ్ళ బంధువులందరు కాంగ్రెస్‌లోనూ, ఇంటక్‌లోనూ ఉన్నారు. వాళ్ళందరు మాతో పాటు వచ్చారు. గోరఖ్‌పూర్‌ కాంప్‌లో సభ్యులు పెరిగారు. థాపర్‌లోని సైడింగ్‌ కార్మికులు కూడా మాతో వచ్చారు. ఎన్నికలలో తన సైకిల్‌ అమ్మి నాకోసం జగన్నాథ్‌ ప్రచారం చేసారు. నేషనలైజ్‌ అయ్యాక గోరఖ్‌పురి కాంప్‌లోని శ్రామికులకు ఉద్యోగాలు ఇప్పించడంలో జగన్నాథ్‌గారు చాలా సహాయం చేసారు. ఇంటక్‌లోని తక్కిన నేతలు గోరఖ్‌పూర్‌ శ్రామికులకు బదులుగా తమవాళ్ళ పేర్లను రాసారు. థాపర్‌ కంపెనీలో కాంప్‌ కమాండర్‌ దుర్వ్యవహారం నుండి కార్మికులను విముక్తం చేయడంలో మాకు ఎంతో సంఘర్షణ చేయాల్సి వచ్చింది.

(ఇంకావుంది)

 

 

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.