నా వీసా గోస – జూపాక సుభద్ర

నాకా మధ్య మోనాష్‌ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఆర్ట్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నుంచి ‘లిటరరీ కామన్స్‌’ ప్రోగ్రామ్‌కి రమ్మని ఒక మెయిలొచ్చింది. భారతదేశ మూలవాసులైన దళిత, ఆదివాసీ రచయితలకు, ఆస్ట్రేలియా మూలవాసుల రచయితలను కలిపి వారి సాహిత్య సారూప్యతల్ని కూడబోసుకోవడం ఆ ప్రాజెక్టు ఉద్దేశం. ఆ ఆహ్వానం అందగానే ఎగిరి గంతేసిన. ఆస్ట్రేలియా నా మూలవాస సోదరీ సోదరులకు నా సాహిత్య రాజకీయా లు కలిసి పంచుకోవచ్చు, వాల్లేమి రాస్తున్నారో తెల్సుకోవచ్చనుకున్నాను. అంతకంటే ముందు ఒక పగలంతా, ఒక రాత్రంతా ఆకాశంలో పక్షిలా ఎగురుకుంటా పోవచ్చు మజానే మజా… అయితే యిదే మొదటిసారి కాదు మేగాల మీద పయనం. మద్రాసు, డిల్లీకి ఒకటి రెండుసార్లు పోయిన. మొదటిసారి ఫ్లయిట్‌ ప్రయాణం చాలా ఎక్సయిటింగ్‌గా వుండె. చిన్నపుడు ఎగిరే విమానాల్ని మెడ తిరిగిపోయేటట్లు చూసేది. అది మబ్బుల్ల కనుమరుగయేదాకా కండ్లిరిగి పోయేటట్టు చూసేది. అట్లాంటిది ఫ్లయిట్‌ మొదటిసారి ఎక్కుతామనగా మబ్బుల్ని ముద్దుబెట్టొచ్చు ఆకాశంలోకి ఎగిరి కింద నన్ను భయపెట్టిన కొండల్ని, పర్వతాల్ని, దొర్కకుంటా వురికే నదుల్ని, గంబీరంగా అలలతోని కొట్టే సముద్రాల్ని దొంగ మొకాల్లర నన్ను భయపెడ్తారు, యిప్పుడు జూడుండ్రి మీమీదికెల్లి నేను ఎగురుకుంటా పోతున్న. మీరే చిన్నగ బుజ్జిగ కనబడ్తుండ్రు, యిప్పుడేమంటరు హహ్హహ్హ అని నవ్వుకో వచ్చు, వాటిని ఎక్కిరించొచ్చు ఏడిపించొచ్చు, భూమమ్మ పచ్చటి, ఎర్రటి, నల్లటి అందాల్ని చూడొచ్చు అని కన్నకలలు పూర్తిగా నిజం కాలే… ఎక్కిన గంట రెండు గంటల్లోనే ఆనందం ఆవిరయేది. మబ్బు పింజల నలుపు, తెలుపు తోటల్ల తిరిగిన సంబురమే తీరలే…

ఆస్ట్రేలియా బోయే పయనం ఒక పగలు, ఒక రాత్రి. వావ్‌ చిన్న ముచ్చటగాదు సందమామతోని షేక్‌హాండ్‌ తీసుకోవచ్చు, వెన్నెలను దుసుకొని లగేజి నిండ నింపి చీకటి కొప్పుల పెట్టొచ్చు, చుక్కమ్మలను చుట్టం జేసుకోవచ్చు అని ఏవేవో పగటి కలలు, రాత్రి కలలు ఎన్ని కన్నానో లెక్కలేదు.

కాని కలలు యిట్లావుంటే ఆ విమానమెక్కనీకి యమబాదలు బడ్డనో లెక్కలేదు. విమానమెక్కనీయని, ఆస్ట్రేలియా కు బొయి ‘లిటరరీ కామన్స్‌’ కార్యక్రమానికి బోనియ్యని అడ్డుగోడలు అడుగడుగున ఎదురుపడ్డయి. పాస్‌పోర్టు ఎట్లా తీసుకోవాలి? ఒక ఏజెంట్‌ని మాట్లాడిన. ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) కావాలి. దానికోసం నెల దిప్పిండ్రు. అందరు డిపార్ట్‌ మెంట్‌ దోస్తులే…. బాగా పలకరించినట్టే వుంటరు కాని లోపల ఏవో అసహనాలు పంజేసి సతాయించిండ్రు. సరే ఎన్‌ఓసి గట్టెక్కి పాస్‌పోర్టు వచ్చిందనుకుంటే… వీసా కోసం నా గోస మామూలుది గాదు.

ఒక ప్రభుత్వోద్యోగి వేరే దేశాల కెల్లాలంటే చానా గొల్లేలుంటయి. ఇఎల్‌ మాత్రమే పెట్టుకోవాలి. పోనీ అది తొందరగా మంజూరైతదాంటె, ముచ్చటే లేదు ఆస్ట్రేలియా ఇన్విటేషన్‌ని తిరగదోడి ‘అక్కడ బోజన సదుపాయాలు వాల్లే చూస్తున్నారు గనక అది ఫారెన్‌ కాంట్రిబ్యూషన్‌ యాక్ట్‌ కిందకు వస్తది. – అందుకని నువ్వు భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని క్లియరెన్స్‌ తెచ్చుకుంటేనే లీవు మంజూరు చేసి పర్మిషన్‌ యిస్తాము అని మెలిక బెట్టింది. యీ పర్మిషన్‌ ఉత్తర్వులు ప్రభుత్వము యిస్తేనే గాని ఒక గవర్నమెంట్‌ ఉద్యోగి వీసాకి అప్లయి చేసుకోనీకి లేదు. అదేందో మా సవర్ణ కులాలు పక్కూరికి బొయినంత వీజీగా వీసాకి అప్లయి చేసుకోనీకి లేదు. పోతుంటరొస్తుంటరు.

ఓర్నీ…. ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి భారత ప్రభుత్వానికి ఫారెన్‌ కాంట్రిబ్యూషన్‌ చట్టంకింద క్లియరెన్స్‌ కోసం దరఖాస్తు చేస్తే ఎప్పుడొచ్చేను నేను వీసా ఎప్పుడు తెచ్చుకునేను ఎప్పుడు పోయేను ఆస్ట్రేలియాకు? యీ ఫారెన్‌ ట్రిప్పులకు సంబంధించిన వీసా కతలు, పాస్‌పోర్టుల పరేషాండ్లు మా పర్యావరణం కుటుంబంలో ఎవ్వరికి తెలువది. మూన్నెల్లు ముప్పుతిప్పల బెట్టిండు డిపార్ట్‌మెంట్‌ పెద్ద. చివరికి పోరంగ పోరంగ పర్మిషన్‌ వచ్చింది. దీని కోసం తానా, ఆటాలకు పోయిన ప్రభుత్వ ఉద్యోగుల్ని, లాయర్స్‌ని, యింకా కొంతమంది మిత్రు ల్నించి సలహాలు తీసుకొని అనుమతి పొందే టాలకు టైమయి పోయింది. కరువుల అదిక మాసమని ఒక వీసా రెఫ్యూజ్‌ అయింది. పోనీలే మానుకుందాము టైము కూడా లేదనుకున్నం. మెంటల్‌గా గాయం గాయం గున్నా మనసును వొక్క చిత్తం జేస్కుంటుంటే మాకు తెల్సిన ఒక మిత్రుడు ‘వూరు వాడ దాటని బాంచజాతికి దేశందాటి పోవుడు చిన్న విషయమా, ఎన్ని అడ్డంకులు, ఎన్ని సాజిష్‌లు’ అనే మాటలు ఎట్లయినా పోవాలనే పట్టుదల పెరిగి యింకా 12 రోజులు కూడా లేదు నేను బైల్దేరడానికి. మార్చి 29 రాత్రికి బైల్దేరితేనే ఆస్ట్రేలియా ప్రోగ్రామ్‌కి అందుకో గలను. కాని 29 సా|| 6 గం|| దాకా కూడా వీసా రాలే. బాడీ, మైండ్‌ బద్దలయ్యే టెన్షన్‌. యిగొస్తదగొస్తదని అంగలార్చిన. చివరికి రాదని ఒక్క చిత్తం జేస్కుని గుండె దిటవు దింపుకొని స్వంత ఓదార్పుల్లో వుండగా 7.30 కి వీసా వచ్చిందని ఫోను. వావ్‌ గ్రహాలను తలదన్నే సంతోషం- ఎంత యుద్ధం జెయ్యాల్సి వచ్చింది- భారత మూలవాసీ సాహిత్యకారులు ఆస్ట్రేలియా మూలవాసీ సాహిత్యకారుల్ని కలవడానికి మద్య వీసాబెట్టిన గోస మరువలేనిది.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.