నీ కోసం కనులనిండా
ఆందోళనతో
కలవరపడే
అంతరంగంతో తపిస్తూ…
నీ జాడకై ప్రతిచోటా
ప్రతి పూటా
వెదికే క్రమాన
వెక్కి వెక్కి ఏడుస్తూ…
నీ కంటి బాసలను
గుండె ఊసులను
వెన్నపూసిన మాటలను
వెన్నెలంటి ఆశలను స్మరిస్తూ…
నీతో అల్లుకున్న మమతలను
ఆనందించిన క్షణాలను
పంచుకున్న ఊహలను
ఎంచుకున్న లక్ష్యాలను తలుస్తూ…
నే గడిపాక విలువైన
కాలమెంతో…
కమ్ముకున్న మేఘాలు
నమ్మకాన్ని వర్షిస్తే…
నాకు బాగా అర్థమయ్యింది
అర్థభాగమా!
బోధపడింది
ఆ జీవన నేస్తమా!
నిజానికి నువ్వెక్కడా
తప్పిపోలేదని…
నీ సొంత ప్రణాళికతోనే
తప్పుకున్నావని!