వర్తమానాలేఖ – శిలాలోలిత

ప్రియమైన బి.పద్మావతీ!

కుశలమేనా! నువ్వెప్పుడు గుర్తొ చ్చినా నీ కవిత ‘దాదర్‌ ఎక్స్‌ప్రెస్సే’ గుర్తొస్తుంది. చాలా పవర్‌ఫుల్‌, పెయిన్‌ ఫుల్‌ పోయమ్‌ అది. చదువుతున్నంతసేపూ నరాలు ఉద్రేకంతో వణికిపోతాయి. అప్పుడు జరిగిన సంఘటన, అంతమంది ముందు, కదులుతున్న రైల్లో ఆమెపై వాళ్ళు చేసిన పైశాచిక క్రీడను జుగుప్సతో, కోపంతో, భయంతో, ఆవేశంతో నువ్వు అక్షరాల ద్వారా అరిచిన అరుపులే ఆ కవిత. పద్మా! ఇంత కాలమైనా మర్చిపోలేకుండా ఉన్నాం. ‘నిర్భయ’ స్థితీ అంతే. ఏ రోజు, ఏ క్షణం స్త్రీలపై హింస లేదు చెప్పు. నిన్న మొన్న ‘మమత’ (పేరులోనే ఎంత మాధుర్య ముందో!) పై జరిగిన చర్య ఏమిటి చెప్పు. స్థనాలు, తల తెగనరికిన వాడిని ఏం చేస్తే తప్పులేదు చెప్పు. చుట్టూ ఉన్న మనుషులే కాక, వ్యవస్థ కూడా స్త్రీనే టార్గెట్‌ చేసుకుం టున్నది ఎంత వాస్తవమో చూస్తూనే

ఉన్నాం కదా!

నీ కవిత్వంలో తీవ్రత ఉంది. బలం ఉంది. బాధ ఉంది. వ్యక్తీకరణలో కొత్త కోణముంది. ఇన్నున్న నీకు బద్ధకం కూడా అదనంగా ఉంది. అందుకే నువ్వంటే నాకు కోపం. ఎందుకు రాయట్లే దిప్పుడు. కలిసిన ప్రతిసారీ ముల్లుగర్రతో పొడుస్తూనే ఉన్నాను కదా! ఓ చిరునవ్వు, ఓ కప్పదాటు మినహా మరేం లేదు. పద్మా! ‘నీలిమేఘాల్లో’ నువ్వన్న మాటలు గుర్తు న్నాయా? నీకు. ‘అన్ని మధ్యతరగతి కుటుంబాలలాగే ఆర్థిక సంక్షోభ జీవితం తోను, అలజడిలోను పుట్టి పెరగడమే నా నేపథ్యం. లోకాన్ని చూడటం తెలిశాక, మనుషుల మధ్య సంబంధాల విధ్వంసక శక్తికి మూలకారణం తెలిశాక, కవిత్వానికీ, జీవితానికీ ఒక దోవేర్పడింద నుకుంటా. విద్యార్థి ఉద్యమాలతోను, సాహిత్య

ఉద్యమాలతోను పరిమిత సంబంధమున్నా అది కొత్త చూపే. 1980ల తర్వాత వ్యాప్తి చెందుతున్న స్త్రీ వాద ఉద్యమం, దానితోటి సంబంధం మరో కొత్త కోణం. స్త్రీ వాద కవయిత్రులందరికి లాగా నా కవిత్వానికి ఒక తీవ్రత దీనివల్లే వచ్చింది. ఒక దృక్కోణమూ వచ్చింది. రాసింది తక్కువ, రాయాల్సింది ఎక్కువ. స్వప్నంలోంచి వాస్తవాన్ని, వాస్తవంలోంచి స్వప్నాన్నీ లాగటం కవిత్వానికి మూలమనుకుంటా’ – అని అన్నావు. నాకింకా గుర్తుంది.

పద్మా పేరుకిలాగే శిరీష కుసుమా నివి నువ్వు. నీతో నా తొలి పరిచయం రాజమండ్రిలోనే. అప్పట్లో యాకూబ్‌, నేనూ తెలుగు యూనివర్శిటీలో యం.ఫిల్‌ చేస్తు న్నాం. గౌతమీ లైబ్రరీ మనందరి కలల గూడు. అందులోని పుస్తకాలతో పాటూ నడుస్తున్న లైబ్రరీలాంటి ‘సన్నిధానం శర్మ’గారు మనందరికీ పెద్ద దిక్కు. ‘గౌతమీ’ ముందున్న పొన్న చెట్టు నీడన ఎన్నెన్ని స్నేహాలు, కవిత్వపు కబుర్లు, ఆత్మీయతలు. సిమ్మి రమేష్‌ బాబు, నామాడి శ్రీధర్‌, సజయ, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్‌ (తను లేడిప్పుడు. ఏదో ఒక లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పోయాడు). చాలా అమాయకంగా, నిర్మ లంగా, స్వచ్ఛ మైన పొగడపూలలాంటి మాటల్తో నువ్వుండే దానివి. అందమైన నీ చిర్నవ్వు నాకింకా గుర్తే. హైదరాబాద్‌కి నీ మకాంమార్చేక, ఇక్కడంతా కవులు, సాహిత్య వాతావరణం ఉంటుందని ముచ్చ టపడే దానివి. కానీ ఈ సముద్రంలో తిమింగలాలు, సొరచేపలు, గాజురాళ్ళు, ఫోజులు కొట్టేవాళ్ళే ఎక్కువగా కనబడ టంతో ఉక్కిరిబిక్కిరయ్యావు.

‘అంజన’ నీ చిట్టి చెల్లెలు కవిత కూడా ‘నీలిమేఘాల్లో’ వచ్చింది కదా! ‘అమ్మనూ నేనే/ బొమ్మనూ నేనే/’ అని చిన్ని చిన్ని మాటల్తోనే స్త్రీ స్థితినంతా చెప్పేసిన అద్భుతమైన కవిత. కానీ ఆ చిట్టితల్లి

ఉరికొయ్యకు వేళ్ళాడటం నాకెప్పటికీ ఆరని గాయమే. నాకే యింత దుఃఖముంటే నీకెంత ఉంటుందో అర్థం చేసుకోగలను. ఆ తర్వాత నీకు ప్రమోషన్‌, బెంగుళూరు వెళ్ళిపోవ డంతో కలుసుకోవడం తగ్గింది. రేడియో స్టేషన్‌లో ఇంజనీర్‌గా నీ ప్రతిభ నాకెప్పటికీ ముచ్చటే. సురేష్‌లాంటి సున్నిత మనస్కుడు, మంచి రచయిత నీ సహచరుడు కావడం, ఇద్దరు పిల్లలకు తల్లివి కావడం తర్వాత వచ్చిన మార్పులు. మళ్ళీ నా కంప్ల యింట్‌ మొదటికే వచ్చింది. ఉద్యోగానికీ, ఇంటికే పరిమితం కాకుండా రాయి తల్లీ! మా అమ్మగా! నువ్వు మర్చిపోయిన నీ కవిత్వ పాదాలు కొన్ని విన్పిస్తాను చూడు. ‘తల్లీ పనిముట్టు / పిల్లల్ని కనే, పడక ఎక్కే పనిముట్టూ / కొత్తగా గాయపడ్డ నా పనిముట్టూ / మా హృదయాన్నంటిన ఓ నెత్తుటి మరకా / కాలిపోతున్న, కూలి పోతున్న యౌవనాల మనశ్శరీరాల / పరాయీకరణల మధ్య ఈ రాక్షస రతికేళీ విలాపాలేపాటివి తల్లీ!’ అని ప్రశ్నించావు. పనిముట్టును అవసరానికి వాడుకోవటమే గానీ, దాని స్పందనలేమిటా అని విచా రించం. స్త్రీ కూడా పనిముట్టే అయినప్పుడు మానభంగం సాధారణ చర్య. పనిముట్టుగా ఒంటినిండా గాయాలతో బతికే స్త్రీకి ఇది మరొక గాయం అని తేలేసావ్‌. పద్మా! ఇప్పుడే విన్నాను. బాలమురళీకృష్ణ గొంతు మూగబోయిందని…

– శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.